1. ఉదయానికల్లా నొప్పి తగ్గించిన బాబా
2. బాబా చేసిన సహాయం
ఉదయానికల్లా నొప్పి తగ్గించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా సాయినాథునికి నా హృదయపూర్వక ప్రణామాలు. సాయిబంధుకోటికి వందనాలు. నా పేరు అమరనాథ్. నా ఆరోగ్యం అంతగా బాగుండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ వుంటాను. ఈమధ్య తరచుగా నడుంనొప్పి వస్తుంది. ఒకసారి ఆ నొప్పి వచ్చిందంటే కనీసం 15రోజులు దానితో ఇబ్బందిపడాల్సిందే. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమేగానే శాశ్వత నివారణోపాయం దొరకలేదు. అసలే నేను ఉద్యోగరీత్యా ఎక్కువగా బయట ఉంటాను. ఆ సమయంలో నొప్పి వస్తే నరకం కనపడుతుంది. 2023, మే నెల మొదటి వారంలో ఆ నొప్పి వచ్చినప్పుడు నాకు చాలా భయమేసింది. నాకు ఏ బాధ కలిగినా నేను మొదట తలుచుకొనేది సాయిబాబానే. వెంటనే సాయినాథునికి నమస్కరించి, ఊదీ నొప్పి ఉన్న చోట రాసుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ పడుకొన్నాను. బాబా దయవల్ల ఉదయానికి నొప్పి లేదు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే దైవం బాబా. ఆయన మహిమను ప్రత్యక్షంగా అనుభవించాను.
ఒకరోజు మా అబ్బాయి యుఎస్ఏ నుండి ఫోన్ చేసి, "ఇక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరకడం లేదు" అని చాలా బాధగా మాట్లాడాడు. నేను వాడితో, "బాబాని స్మరించి, ఉద్యోగం వెతుక్కో" అని చెప్పాను. అంతే! బాబా రెండు రోజుల్లో ఒక మంచి షాపులో తనకి ఉద్యోగం చూపించారు. ఇప్పుడు వాడు చాలా సంతోషంగా ఉదోగ్యం చేసుకుంటున్నాడు. "శతకోటి వందనాలు తండ్రీ. మా పిల్లల చదువుల గురించి కొన్ని కోరికలు మీతో వినిపించుకున్నాను. వాటిని త్వరగా అనుగ్రహించు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజ పరభ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
బాబా చేసిన సహాయం
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రేవతి. బాబా నాకు చేసిన సహాయం చెప్తాను. మేము ఎప్పటినుండో మందపల్లి వెళ్ళాలనుకుంటున్నాము. కానీ ఏదో ఒక కారణంతో వెళ్లడానికి కుదర్లేదు. 2023, మే 26న వెళ్దామనుకుంటే రెండు రోజుల ముందు నాకు బాగా జలుబు చేసి, కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. మందపల్లిలో శనీశ్వరుని పూజకు కనీసం గంటన్నర సమయం పడుతుంది. అది కూడా తలకు స్నానం చేసి, తడి బట్టలతో పూజ చేయాలి. పూజయ్యాక మళ్ళీ స్నానం చేసి బట్టలు అక్కడ వదిలేయాలి. 'జలుబు, జ్వరంతో అసలు అవన్నీ చేయగలనా?' అని నాకు భయమేసింది. మావారు కూడా, "ఈ పరిస్థితుల్లో వెళ్ళడమెందుకు? ఇంకోసారి వెళ్దాం" అన్నారు. నాకేమో స్కూళ్లు తెరిచాక వెళ్లడం అంటే ఎప్పటికీ కుదురుతుందో ఏమోననిపించి పరిస్థితి బాబాకి చెప్పుకొని, 'వెళ్లాలా?', 'వద్దా?' అని అడిగాను. 'ఊదీ సేవించి వెళ్ళు' అని బాబా సమాధానం వచ్చింది. దాంతో నేను మావారిని వెళ్లడానికి ఒప్పించాను. హఠాత్తుగా ప్రయాణమవడం వల్ల రిజర్వేషన్ చేయడానికి కుదర్లేదు. కానీ బాబాని ప్రార్థిస్తే జరగనిది ఉంటుందా? మాకు ట్రైన్‌లో సీట్లు దొరకడమే కాదు, రిజర్వేషన్ చేయించినట్లు పడుకోవడానికి బెర్త్ కూడా దొరికింది. అంతేకాదు, అప్పటివరకు నాకున్న జలుబు తగ్గింది. కాకపోతే, ట్రైన్‌లో మా పాపకి బాగా జలుబు చేసింది. బాబాని ప్రార్థిస్తే 10 నిమిషాల్లో తగ్గిపోయింది. ఆ సాయి దయవల్ల మందపల్లిలో పూజ చక్కగా జరిగింది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, మరే విధమైన ఇబ్బందులు గానీ లేకుండా మే 27 రాత్రి తిరిగి మేము మా ఇంటికి చేరుకున్నాము. బాబా పదేళ్లుగా నాకున్న గ్యాస్ట్రిక్ సమస్యను, ఈమధ్య వారం రోజుల పాటు ఉన్న తలనొప్పిని కేవలం ఊదీ నీళ్లతో తగ్గించారు(గతంలో ఆ అనుభవాలు ఈ 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకున్నాను). ఇప్పుడు జలుబు కూడా అలాగే తగ్గించారు. ఇలా బాబా నా ఆరోగ్య సమస్యలకి ఊదీ సేవించమని తెలియజేసి మరీ నాకు నయం చేస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. నా ఆరోగ్యం గురించి నాకన్నా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్న మిమ్మల్ని ఎలా అభినందించాలి? ప్రతి జన్మలోనూ నేను మీ భక్తురాలుగానే ఉండే భాగ్యం నాకు ప్రసాదిస్తారని ఆశిస్తూ.. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba please be with us.with your blessings we are reaching to Siridi.To take your darshan and blessings.om sai ram.we are traveling in car take care of all us.
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba mammalli siridi eppudu tesukuni velathavu arogyam prasadichu manasanthini prasadinchu om sai Sri sai jeya jeya sai
ReplyDeleteOm sai Sri sai
ReplyDeleteOm sai om sai om sai om sai om sai om sai om sai om sai om sai om sai omsai
ReplyDeleteॐ श्री साई राम 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete