1. సాయితండ్రిని వేడుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు
2. పాస్ అవుతానని నమ్మకం లేకపోయినా పాస్ చేసిన బాబా
సాయితండ్రిని వేడుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. ఒకసారి నా భార్య ఆఫీసు నుండి తిరిగి వచ్చే సమయంలో మెట్లు దిగుతుండగా కాలు జారి పడిపోయింది. ఆ ఘటనలో తన నడుముకి బలంగా దెబ్బ తగిలి వాపు వచ్చి పైకి లేవడానికి చాలా ఇబ్బందిపడింది. మేము ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరుని కలిశాము. డాక్టర్ అంతా చెక్ చేసి ఇంజెక్షన్ వేసి, కొన్ని మందులిచ్చి, "ఇప్పుడు ఇంటికి వెళ్లి రేపు ఉదయం మళ్లీ వచ్చి ఎక్స్-రే తీయించి ఆర్థో డాక్టరుని కలవండి" అని చెప్పారు. నేను బాబాని తలచుకొని, "బాబా! ఇది పెద్ద గాయం కాకూడదు. తొందరగా నొప్పి తగ్గిపోవాలి. ఎక్స్-రే రిపోర్టు నార్మల్ వచ్చి నా భార్య తొందరగా కోలుకోవాలి" అని బాబాను ప్రార్థించాను. ఆ తండ్రి దయవల్ల మరుసటిరోజు ఉదయానికి నొప్పి చాలావరకు తగ్గిపోయింది. ఎక్స్-రే రిపోర్టు కూడా నార్మల్ వచ్చింది. డాక్టరు చెక్ చేసి మందులిచ్చి పంపారు. ఆ తండ్రిని వేడుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు.
మాకు ఒక బాబు ఉన్నాడు. రోజూ చక్కగా నిద్రపోయే తనకి ఐదు నెలలప్పుడు 2023, ఫిబ్రవరి 2న 10 నిమిషాలు నిద్రపోవడం, లేవడం చేశాడు. పొద్దుపోయిన తర్వాత కూడా ఏడుస్తూ నిద్రపోలేదు. నేను రాత్రి 8 వరకు చూసి ఇక లాభం లేదని, "బాబా! ఒక అరగంటలో బాబు నిద్రపోవాలి" అని బాబాను ప్రార్థించాను. ఇక బాబా అద్భుతం చూడండి. ఐదు నిమిషాల్లో, అంటే 8.05 కల్లా బాబు నిద్రపోయాడు.
తరువాత బాబుకి ఎనిమిదో నెలప్పుడు 2023, మే 3 ఉదయం మలవిసర్జన చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. కొద్దిగానే మలవిసర్జన జరగడంతో తను కడుపునొప్పితో అసౌకర్యానికి గురవుతూ శబ్దాలు చేయసాగాడు. నేను తనకి తినిపించేటప్పుడు కూడా తను కడుపు పట్టుకుని శబ్దాలు చేస్తున్నప్పటికీ మలవిసర్జనకాక మెలికలు తిరిగాడు. నేను వెంటనే తనని తీసుకెళ్లి బాబా ఫోటోకి తాకించి, ఊదీ తన నుదుటన పెట్టి, కొంచెం నోట్లో వేసి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరిస్తూ ఇంగువ కూడా కొంచెం తన కడుపుకి పూశాను. తరువాత నేను మార్కెట్‌కి వెళ్లొచ్చి ఇంటి తలుపు దగ్గరే నిలబడి, "బాబా! బాబు చక్కగా మలవిసర్జన చేసి నొప్పిలేకుండా తను సౌకర్యవంతంగా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, మరుక్షణంలో బాబుకి చక్కగా మలవిసర్జన జరిగింది. దాంతో శబ్దాలు చేయడం మానేశాడు. ఇదంతా బాబా అనుగ్రహం కాకపోతే ఇంకేమిటి? తమని నమ్ముకున్నవాళ్ల చేయిని బాబా ఎప్పుడూ వదలరు. "ధన్యవాదాలు బాబా. నా భార్య, బిడ్డ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా కరుణించు తండ్రీ. అలాగే సాయిబంధువులందరికీ తోడుగా ఉండి చల్లగా చూడు తండ్రీ".
సచ్చిదానందా సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
పాస్ అవుతానని నమ్మకం లేకపోయినా పాస్ చేసిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేనొక సాయిభక్తురాలిని. మాది తెలంగాణ. ముందుగా బాబాకు నా నమస్కారాలు. మా అమ్మాయి మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు 2023, ఫిబ్రవరిలో పరీక్షలు జరిగాయి. ఒక సబ్జెక్టులో ఇరవై ఛాప్టర్లు ఉంటే తను నాలుగైదు ఛాప్టర్లు మాత్రమే బాగా చదువుకొని, మిగిలిన ఛాప్టర్లు సరిగా చదవకుండా పరీక్షకి వెళ్ళింది. ఆరోజు నేను బాబా ముందు కూర్చుని, దణ్ణం పెట్టుకొని, "బాబా! అమ్మాయి సరిగా చదవలేదు. మీరే ఈరోజు పరీక్ష వ్రాయండి బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. పరీక్షలు అయిపోయాయి. మా అమ్మాయి పాస్ అవుతానని అంత నమ్మకంగా ఉండేది కాదు. అందువల్ల నేను ఫలితాలు వచ్చేవరకు గుర్తువచ్చినప్పుడల్లా, "అమ్మాయిని పాస్ చేయి బాబా" అని మనసులో బాబాతో చెప్పుకుంటూ ఉండేదాన్ని. అలా చెప్పుకోకుండా ఉండలేకపోయేదాన్ని. కారణం, బాబాకు చెప్పుకోవడం ఒక ఆనందం. చివరికి 2023, మే 4న ఫలితాలు వచ్చాయి. బాబా దయవల్ల మా అమ్మాయి పాస్ అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబాకు తన బిడ్డలంటే ఎంత ప్రేమో! మనలను నిరంతరం కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు. "ధన్యవాదాలు బాబా!".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOmesrisairam
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo unna problem solve cheyandi pl adi sai house pl
ReplyDelete