1. మా ఫ్యామిలీ డాక్టరు సాయి కృపతో 11నెలల సమస్య పరిష్కారం
2. చెప్పుకున్నంతనే రూమ్ చూపిన సాయితండ్రి
మా ఫ్యామిలీ డాక్టరు సాయి కృపతో 11నెలల సమస్య పరిష్కారం
అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. నేను బాబాను మనందరిపై తమ అనుగ్రహాన్ని కురుపించమని ప్రార్థిస్తూ చాలాకాలం తర్వాత బాబా నాపై వర్షించిన అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నా చిన్నప్పటి నుండి నేను ఏ సమస్యను ఎదుర్కోలేదు. అలాంటిది హఠాత్తుగా 2022, మార్చి నుండి నేను నెలసరి సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ నెల నాకు 21 రోజులకే నెలసరి వచ్చింది. 'ఒత్తిడి కారణంగా ఈ నెలలో ఇలా జరిగి ఉండొచ్చ'ని అనుకున్నాను. కానీ అది కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇలా ఉండగా (గత సంవత్సరం) మేము ఇండియా వచ్చినప్పుడు నేను గైనకాలజిస్ట్‌ని సంప్రదించాను. ఆమె, "అంతా బాగానే ఉంది. ఆందోళన చెందాల్సినవసరం లేద"ని ఒకరకమైన టాబ్లెట్స్ ఇచ్చి, "రోజూ ఒక టాబ్లెట్ వేసుకో. ఒకవేళ ఏదైనా చిన్న సమస్య ఉంటే అది సెట్ అయిపోతుంది" అని చెప్పారు. నేను ఆ టాబ్లెట్లు వేసుకుంటూ అంతా నార్మల్ అవుతుందని భావించాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. తర్వాత కూడా నేను అదే సమస్యను ఎదుర్కొన్నాను. సాధారణంగా నా రోజు బాబా ముందు దీపం పెట్టడంతో మొదలవుతుంది. ఆ తర్వాతే నేను నా ఇంటి పనుల చేసుకుంటాను. కానీ 21 రోజులకే నెలసరి రావడం, అది 7 రోజులపాటు కొనసాగడం, దాని వల్ల పూజ చేసుకోలేకపోవడం, అందువల్ల ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవడంతో నేను చాలా కలత చెందుతూ చిరాకు పడుతూ ఉండేదాన్ని. దాదాపు 11 నెలలు గడిచాక ఒకరోజు నా భర్త, "ఇలా ఎంతకాలం ఈ సమస్యను ఎదుర్కొంటావు? డాక్టర్ దగ్గరకి వెళదాం పదా" అన్నారు. కానీ నేను చాలా మొండిగా డాక్టర్ దగ్గరకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే, నేను అదివరకే మా ఫ్యామిలీ డాక్టర్ అయిన సాయికి నా సమస్య చెప్పుకున్నాను. తరువాత ఒకరోజు నేను బాబాని ప్రార్థించి, "నా ఈ సమస్యను ఎలా అధిగమించాలి?" అని అడిగాను. 'సాయిని మనస్పూర్తిగా ప్రార్థించు. కొబ్బరికాయ సమర్పించు. మీ సమస్య పరిష్కారమవుతుంది' అని సమాధానం వచ్చింది. నేను వెంటనే ఆలస్యం చేయకుండా బాబాకు ఒక కొబ్బరికాయ సమర్పించాను. ఆరోజు మహాశివరాత్రి(2023) పర్వదినం. కారణం తెలీదుగానీ కొబ్బరికాయ సమర్పించినంతనే నాకు చాలా ఉపశమనంగా, సంతోషంగా అనిపించింది. తొందరలోనే నా సమస్య తీరిపోతుందని అనుకున్నాను. మన సాయి లీలలు మనకు అర్థం కావు. నేను అనుకున్నట్లే అదే నెలలో నా సమస్య పరిష్కరమైంది. మళ్ళీ మునుపటిలా 28 రోజులకు నెలసరి వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. తదుపరి నెలల్లో కూడా నా నెలసరి సక్రమంగా వస్తూ ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేవు. నేను ఈ అనుగ్రహాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటానని సాయికి మాటిచ్చాను. నిజానికి ఆయన మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునేలా చేస్తారు. ఎందుకంటే, ఆయన మన అనుభవాల ద్వారా ఇంకొకరి ప్రార్థనలకు సమాధానమిస్తారు, వాటిని పరిష్కరిస్తారు. "ధన్యవాదాలు సాయి. నేను ఎంతో ఆదరించే మన కుటుంబ పుస్తకానికి(బ్లాగు) మీ మరో అనుగ్రహాన్ని జోడింపజేశారు. దయచేసి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోనే మనోబలాన్ని, హృదయాన్ని ఇవ్వండి. నేను ఇండియాకి వస్తున్నాను. మీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాను. దయచేసి నా ప్రయాణం సాఫీగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి".
చెప్పుకున్నంతనే రూమ్ చూపిన సాయితండ్రి
అందరికీ నమస్కారాలు. నా పేరు మమత. 2023, జనవరి లేదా ఫిబ్రవరిలో నాకు ఈ బ్లాగు గురించి తెలిసింది. నేను మొదట 'సాయిభక్తుల అనుభవాలు' వినాలని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని తరువాత ఎందుకో ఒకసారి గూగుల్‌లో కూడా సెర్చ్ చేద్దామని చేస్తే ఈ బ్లాగు గురించి తెలిసింది. అప్పటినుండి ఈ బ్లాగులో సాయిభక్తులు పంచుకుంటున్న అనుభవాలు చదువుతున్న నేను ఈరోజు నా మొదటి అనుభవం పంచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాయికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ చేసిన తరువాత నేను హైదరాబాద్ వెళ్లి బాబా అనుమతితో హాస్టల్లో జాయినయ్యాను. అయితే నాకు హాస్టల్ ఫుడ్ పడలేదు. కారణం నాకు అల్సర్ సమస్య ఉంది. అది కాస్త ఎక్కువగానే ఉంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేచురల్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కారం తక్కువ ఉండే పదార్థాలు, పెరుగు తినేదాన్ని. కాని హాస్టల్‌కి వెళ్ళాక కారం, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినవలసి వచ్చింది. అదికాక నేను మాములుగా ఆహారం తీసుకొనే సమయం, హాస్టల్ వాళ్ళు ఫుడ్ పెట్టె టైమింగ్స్ వేరుగా ఉండటం మరియు నేను టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల మళ్లీ అల్సర్ ఎక్కువైపోయింది. దాంతో నేను నా సామాను హాస్టల్లోనే ఉంచి ఇంటికి వెళ్లాను. తరువాత ఒకరోజు హైదరాబాదులో నేను ఉండే హాస్టల్‌కి దగ్గర్లో రూమ్‌లో ఉండే నా ఫ్రెండ్ ఒకామె నాకు ఫోన్ చేసి, "నేను రూమ్ నుండి హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాను" అంది. నేను వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తను వినకుండా హాస్టల్‌కి వెళ్ళింది. దాంతో నాకు ఫుడ్ సమస్య గనక వంట వండుకొని తినొచ్చని హాస్టల్‌కి వెళ్ళిపోయినా నా ఫ్రెండ్ రూమ్‌కి నేను వెళ్లాను. ఒక నెల రోజులు బాగానే గడించింది. తర్వాత నా ఫ్రెండ్ తన రూమ్ తనకి కావాలని అంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థంకాక చాలా ఏడ్చాను. ఎందుకంటే, నాకు హాస్టల్ ఫుడ్ పడదు, వేరే రూమ్ చూసుకుందామంటే రూమ్స్ దొరకని పరిస్థితి, పోనీ అదే రూమ్‌లో కొనసాగుదామంటే అది చిన్న గది, ముగ్గురికి(నేను, నా ఫ్రెండ్ కాక మరో అమ్మాయికి) సరిపోదు. అందువల్ల నేను సాయితండ్రి దగ్గరకి వెళ్లి, "తండ్రీ! మీ దయతో నాకు రూమ్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. ఆయన దయతో నాకు రూమ్ దొరికింది. "థాంక్యూ సాయితండ్రీ. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు తండ్రీ. ఇలాగే నా పెళ్లి, ఉద్యోగ విషయాలలో పరిష్కారం చూపు తండ్రీ. నేను ఏం చేయాలో నాకు తెలియజేయు తండ్రి ప్లీజ్".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sai nathaya namaha...
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOmesairam🙏🙏🙏
ReplyDeleteOmsairam
ReplyDeleteOm sai ram
ReplyDelete