1. బాబా అనుగ్రహంతో స్కూల్లో అడ్మిషన్2. బాబా రక్షణ
బాబా అనుగ్రహంతో స్కూల్లో అడ్మిషన్
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శివకుమార్. నేను హైదరాబాద్ వాసిని. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మా బాబుకి కాలు ఫ్రాక్చర్ అయింది. బాబా దయవల్ల ఇప్పుడు తనకి బాగుంది. అయితే కాలు ఫ్రాక్చర్ వల్ల బాబు గత సంవత్సరమంతా స్కూలుకి వెళ్ళలేదు. అందువల్ల నేను స్కూలు ఫీజు చెల్లించలేదు. అది మంచి పేరున్న ఇంటర్నేషనల్ స్కూలు. నేను ఫీజు కట్టని కారణంగా స్కూలువాళ్ళు బలవంతంగా మా బాబుకి టీసీ ఇచ్చి, "మీరు వచ్చే ఏడాది మళ్ళీ కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలి. సీట్లు అందుబాటులో ఉంటే మొదటి ప్రాధాన్యత మీ బాబుకి ఇస్తాము" అని చెప్పారు. కానీ ఈ సంవత్సరం నేను మా బాబు అడ్మిషన్ కోసం వెళితే, వాళ్ళు ప్రతిసారీ సీట్లు లేవని చెప్పసాగారు. నాకు ఏం చేయలో అర్థంకాని పరిస్థితిలో బాబాని దృఢంగా ఒక్కటే కోరుకున్నాను, "నేను వేరే ఏ దేవుణ్ణీ సీటు ఇప్పించమని అడగను. నేను నిన్నే నమ్ముతున్నాను". ఎలాగైనా మా బాబుకి అదే స్కూల్లో సీటు ఇప్పించండి. బాబుకి సీట్ కన్ఫర్మ్ అయితే మీ అనుగ్రహాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని. తరువాత నేను స్కూలుకి వెళ్లిన ప్రతిసారీ, "సీటు రావడానికి నేను ఏమి చెయ్యాలో అది నాతో చేయించు" అని బాబాను ప్రార్థిస్తూ వెళ్ళేవాడిని. కానీ ఎన్నిసార్లు వెళ్లినా లాభం లేకపోయింది. చివరికి ఒకరోజు బాబాను గట్టిగా తలచుకుని, నాకు తెలిసిన ఒక స్థానిక రాజకీయనాయకుడి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాను. అతను స్కూలు కరస్పాండెంట్‌తో మాట్లాడి, "నువ్వు వెళ్లి అతణ్ణి కలిస్తే సీటు ఇస్తాడు" అని నాతో చెప్పారు. నేను వెళ్లి కరస్పాండెంట్‌ని కలిస్తే ఒక వారంరోజుల తరువాత రమ్మన్నారు. అలా మరో రెండు, మూడుసార్లు జరిగాక సీటు ఇస్తామన్నారు. బాబా దయవల్ల సీటు కన్ఫర్మ్ అయిందనుకున్నాను. కానీ మరో సమస్య వచ్చిపడింది. స్కూలు యాజమాన్యం ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులకి స్కూల్ ఫీజు 20,000 రూపాయలు పెంచి పాత విద్యార్థులకి పాత ఫీజే ఉంచారు. మా బాబు గత సంవత్సరం అదే స్కూలులో చదివాడు కాబట్టి తనని పాత విద్యార్థిగా పరిగణించాల్సి ఉన్నప్పటికీ, "మళ్ళీ కొత్తగా అడ్మిట్ చేసుకుంటున్నాం కాబట్టి కొత్త ఫీజు చెల్లించాల"ని మేనేజ్‌మెంట్‌వాళ్ళు అన్నారు. అప్పుడు నేను, "బాబా! నేను కోరుకున్నట్లే సీటు ఇప్పించావు. అలాగే పాత స్టూడెంట్ అయిన మా బాబుకి పాత విద్యార్థులకు ఎంత ఫీజు ఉంటుందో అంతే ఫీజు తీసుకొనేలా చూడు బాబా" అని గట్టిగా బాబాని వేడుకొని మేనేజ్‌మెంట్‌వాళ్ళని, "మీ స్కూలు యాజమాన్యమే కదా మా బాబుకి బలవంతంగా టీసీ ఇచ్చింది. అలాగని మా బాబు గత సంవత్సరం వేరే స్కూల్లో చదువుకొని రాలేదు. అందుచేత వాడి మునుపటి స్కూలు ఇదే అవుతుంది. దయచేసి పాత ఫీజే వసూలు చేయండి" అని ఎంతగానో అభ్యర్థించాను. దానికి వాళ్ళు, "కొన్ని రోజులు సమయమివ్వండి. ఏదో ఒకటి నిర్ధారిస్తాము" అన్నారు. తరువాత రోజులు గడుస్తున్నా, నేను ఎన్నిసార్లు ఫాలో అప్ చేస్తున్నా వాళ్ళు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకోవైపు కొత్త అడ్మిషన్లు చాలా జరుగుతున్నాయి. ఇంక నేను, 'ఫీజు తగ్గించమని అడిగినందువల్ల సీటు ఇవ్వరేమో!' అని టెన్షన్ పడుతూ, "బాబా! ఎలాగైనా పాత ఫీజుతో బాబుకి సీటు ఇప్పించు తండ్రీ. అడ్మిషన్ అయ్యాక మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకొని మీ భక్తులందరికీ మీరున్నారని తెలియజేస్తాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్ని రోజులకి స్కూల్ మేనేజ్‌మెంట్‌వాళ్ళు కాల్ చేసి, "పాత ఫీజే చెల్లించండి" అని చెప్పారు. బాబా అనుగ్రహమనుకొని వెంటనే స్కూల్ ఫీజు కట్టి బాబుని స్కూల్లో అడ్మిట్ చేశాను. "ధన్యవాదాలు బాబా. కొంచెం ఆలస్యంగా మీ అనుగ్రహాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".
బాబా రక్షణ
సాయిభక్తులకు వందనాలు. నా పేరు ధనలక్ష్మి. సాయిదేవుడు కరుణించిన తర్వాత కొంచెం ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2023, మార్చి నెలలో ఒకరోజు మా అమ్మాయి తన కడుపు బాగా నొప్పిపెడుతుందని, మంటగా కూడా ఉందని చెప్పింది. నేను గ్యాస్ట్రిక్ సమస్య అయుండొచ్చని అందుకు సంబంధించిన మాత్రలు ఇచ్చాను. అయితే మూడు రోజులైనా పాపకి కొంచెం కూడా నొప్పి తగ్గలేదు. అప్పుడు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్స్ చూసి, 'గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ ఉండి ఉండొచ్చు లేదా ఇన్ఫెక్షన్ అయుండొచ్చు. అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కాన్ చేయాలి" అని అన్నారు. అది విన్న నా బాధ చెప్పనలవి కాదు. కారణం నాకు ఒక్కతే అమ్మాయి. "బాబా! ఏంటి నాకు ఈ పరీక్ష? అమ్మాయికి ఏ సమస్యా లేకుండా వుండాలి తండ్రీ. నార్మల్ రిపోర్టు వస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి కన్నీళ్లు పెట్టుకుంటూనే పాపను స్కాన్ చేయించడానికి తీసుకెళ్ళాను. మీరు నమ్ముతారో, లేదోగానీ బాబా నా సమస్యను వెంటనే పరిష్కరించారు. స్కాన్ రిపోర్టులో అది కేవలం గ్యాస్ట్రిక్ సమస్య అని వచ్చింది. డాక్టరు, "ఒక 14 రోజులు మందులు తీసుకుంటే తగ్గిపోతుంది" అని చెప్పారు. "బాబా! నేను కోరుకున్నట్లే అనుగ్రహించావు తండ్రీ. మీకు శతకోటి వందనాలు సాయిదేవా".
2023, ఏప్రిల్ 28 రాత్రి నేను డ్యూటీ ముంగించుకొని నా ఫ్రెండ్స్‌తో కలసి కారులో ఇంటికి వస్తుండగా బేగంపేట్ ఫ్లైఓవర్ మీద హఠాత్తుగా నా కారుకి ఏదో తగిలిన శబ్దం వచ్చింది. వెంటనే నేను సడన్ బ్రేక్ వేశాను. అంతే, వెనుకనున్న కారు నా కారుని బలంగా గుద్దింది. వాళ్ళు కారు దిగొచ్చి నాతో గొడవకి సిద్ధమయ్యారు. నేను వాళ్లతో మాట్లాడుతూనే బాబాని తలచుకున్నాను. అప్పుడే నా ముందు నుండి సాయితండ్రి ఫోటో ఉన్న ఒక కారు వెళ్ళింది. బాబాని చూస్తూనే నా తండ్రి నాకు పెద్ద ప్రమాదం కాకుండా కాపాడారనుకున్నాను. తరువాత కూడా బాబా ఫోటో ఉన్న మరో రెండు, మూడు కార్లు నా కంటపడ్డాయి. బాబాతండ్రి నా ప్రతి అడుగులో ఉంటూ తమ చేత్తో నన్ను నడిపిస్తున్నారు. "నాకు కొన్ని సమస్యలున్నాయి తండ్రీ. వాటికి పరిష్కర మార్గం చూపుతావని ఆశిస్తున్నాను".
సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram be with me always.om Sai ram
ReplyDeletePl.stop our loved one student moved from our school forced by someone Baba !! Pl.Stop her Baba !!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete