1. బాబా దయవల్ల ప్రయత్నం సఫలం
2. సాయి దయతో సమస్య పరిష్కారం
బాబా దయవల్ల ప్రయత్నం సఫలం
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
సాయిభక్తులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయినాథుని ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆయన అనంతుడు, ఆనంద నిధి, తల్లి, తండ్రి, గురువు మరియు సర్వం. పిల్లలు కొన్నిసార్లు చెప్పేది వినరు. స్వతహా ఉపాధ్యాయురాలినైన నేను కొన్ని పరిస్థితుల్లో పిల్లలికి బోధించడానికి లేదా హెచ్చరించడానికి లేదా కొట్టడానికి ప్రయత్నిస్తాము. అలాగే మన సద్గురువైన సాయి మనం సరైన దారిలో వెళ్లని కొన్ని సందర్భాలలో కాస్త భయపెట్టైనా సరే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. అందుకే నేను, 'ఆయన కరుణే రక్షణ, శిక్షణ, పర్యవేక్షణ' అని అనుకుంటూ ఉంటాను. ఇక అసలు విషయానికి వస్తే..
మా నాలుగేళ్ళ బాబు 'సాయి తాత' అంటూ బాబా తన సొంతం అనుకుంటూ ఉంటాడు. ఎంతైనా వాడు సాయి ఆశీర్వాదం మరి. 2023, జనవరి నుండి మేము మా బాబుని ఒక కొత్త స్కూలుకి పంపుతున్నాము. వాడు చాలా అల్లరి చేసినప్పటికీ కొంచెం గట్టిగా చెప్తే వింటాడు. కానీ స్కూల్లో టీచర్స్ చాలా కఠినంగా వుంటూ ప్రతి చిన్నదానికీ వద్దని చెప్పడం, రూల్స్ ఫాలో అవ్వడం లేదని హెచ్చరిస్తుండటం వల్ల ఒక నెల రోజులకి మాకు తెలియకుండానే బాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. వాడు చాలా మొండిగా తయారయ్యాడు. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చేమో కానీ, నాకు చాలా ఆందోళనగా అనిపించింది. నేను బాబుకి ఏ సమస్య వచ్చినా బాబాకి మొక్కుకొని 3 వారాలు బాబుకి ఊదీ పెడుతుంటాను. ఇప్పుడు కూడా, "అంతా బాగుండాల"ని బాబాకి మొక్కుకుని ఊదీ పెట్టడం మొదలుపెట్టాను. బాబా మీద భారమేసి ఇంట్లో ఉన్నప్పుడు పదేపదే బాబుకి నచ్చజెప్తూ మా ప్రయత్నం మేము చేస్తూండేవాళ్ళము. కానీ ఎందుకో ప్రతి గురువారం ఏదో ఒక ఫిర్యాదు వస్తుండేది. చివరికి బాబా నాకేదైనా నేర్పించటానికి ఇలా సమస్య ఇస్తున్నారేమోనని నాకనిపించింది. సహజంగా నేను ఎవరినీ విమర్శించను, ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోను. కానీ మా బాబు పుట్టడానికి ముందు నా స్నేహితురాలి కొడుకు విషయంలో చనువుతో అనవసరమైన సలహాలిస్తుండేదాన్ని. మావారు కూడా ఆ బాబు అల్లరికి విసుక్కునేవారు. పిల్లలు భగవంతుడితో సమానమని వూరికే అంటారా? ఇప్పుడు అవన్నీ మేము మా బాబు విషయంలో పడుతున్నాం. బాబా కరుణామయులు కదా! ఆ భారం తగ్గించి చిన్నగా అనుభవించేలా చేస్తున్నారు.
సరే, ఒక బుధవారం మా బాబు స్కూల్లో టీచరుని బాగా విసిగిస్తే, ఆవిడ వాడిని ప్రిన్సిపాల్ దగ్గరకి పంపింది. ప్రిన్సిపాల్ అడిగిన ప్రశ్నలు మావాడికి అర్ధంకాక వాడు అన్ని ప్రశ్నలకు వ్యతిరేఖంగా సమాధానం ఇచ్చాడు. దాంతో ప్రిన్సిపాల్‌కి కోపమొచ్చి మావారికి ఫిర్యాదు చేసి, "మీ పిల్లాడికి ఏదైనా సమస్య ఉంటే బిహేవియర్ థెరపిస్ట్‌కి చూపించండి" అని చెప్పారు. 4 ఏళ్లు బాబు గురించి అలా అనేసరికి మావారికి చాలా కోపం వచ్చి, "మీ స్కూలు రూల్స్ వల్లే మావాడు ఒత్తిడికి గురి అవుతున్నాడేమో!" అని అన్నారు. స్కూల్ గురించి అలా అనేసరికి ప్రిన్సిపాల్, "మీకు అలా అనిపిస్తే, ఈ స్కూలు మీవాడికి సరైనది కాదేమో! మీ నిర్ణయం మీరు తీసుకోండి" అని అన్నారు. ఇంటికి వచ్చాక నాకు విషయమంతా తెలిసి దిగులు పట్టుకుంది. ఎందుకంటే, నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగస్థులం. అదికాక అమెరికాలో ఇతరుల సహాయం అందదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వేరే స్కూలు దొరకడం కష్టం. అందువల్ల నేను బాబా మీద భారం వేసి, "ఈ సమస్య నుండి బయటపడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. మరుసటిరోజు నేను స్కూలుకి వెళ్లి, "నేను బాబుకి ఎలా వుండాలో నేర్పిస్తాను" అని సర్ది చెప్పాను. బాబా దయవల్ల నా ప్రయత్నం సఫలమైంది. ఆ సమయమంతా నేను బాబాని 'దారి చూపమ'ని తలుచుకుంటూ ఉన్నాను. ఆయనే మార్గదర్శి కదా! ఇప్పుడు బాబు కొంచెం కొంచెంగా వింటూ ఉన్నాడు. ఫిర్యాదులు కూడా కొంచెం తగ్గాయి. బాబా దయవల్ల వాడికి మంచి టీచర్ దొరికితే, క్రమంగా వాడు మంచి నడవడిలోకి వస్తాడు అని నా ఆశ. బాబా దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు అని నా నమ్మకం. చిన్న విషయాన్ని చాలా పెద్దగా వ్రాసినందుకు క్షమించండి. కానీ పరిస్థితి అలాంటిది. "కృతజ్ఞతలు సాయితండ్రి".
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!
సాయి దయతో సమస్య పరిష్కారం
తోటి సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు రజనీకాంత్. ఈమధ్య నేను పని చేస్తున్న కంపెనీలో ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. నేను ఎంత కరెక్ట్‌గా ఆ టాస్క్ చేసినా అవుట్‌ఫుట్‌లో ఏదో ఎర్రర్ వస్తుండేది. అలా ఎందుకు వస్తుందో నాకు అర్దం కాలేదు. చాలా ప్రయత్నించాను కానీ సమస్య ఏమిటో తెలియలేదు. అప్పుడు, "బాబా! ఆ టాస్క్ సరిగా వచ్చేలా చేయండి. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, బాబా దయవల్ల సమస్య ఏమిటో తెలిసి టాస్క్ పూర్తైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించు తండ్రీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam 🙏🏻💐🙏🏻
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOM SAI RAM
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOooo m Sai ram
ReplyDelete