1. సాయి ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనటానికి ఆయన అనుగ్రహమే నిదర్శనం
2. బాబా దయతో మంజూరైన పెన్షన్
సాయి ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనటానికి ఆయన అనుగ్రహమే నిదర్శనం
ఓం సాయినాథాయ నమః!!! ముందుగా సాయితండ్రికి నా శతకోటి వందనాలు. నా పేరు హరిత. నేను సాయిభక్తురాలిని. మా కుటుంబమంతా కలిసి శ్రీరామనవమికి భద్రాచలం వెళదామనుకున్నాము. నేను ఒకపక్క వెళ్లడానికి సిద్ధమవుతూనే మరోపక్క 'దర్శనం ఎలా జరుగుతుందో, బాగా జనం ఉంటారేమో, ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి' అని భయపడుతూ మనసులో, "సాయీ! నువ్వు ఉండగా నేను అంత భయపడటం ఎందుకు? మీ దయతో మంచిగా దర్శనం జరిగి, కళ్యాణం చూసి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఇంకేముంది, బాబా దయవల్ల భద్రాచలం వెళ్లి అంత జనంలోనూ చాలా అంటే చాలా దగ్గరగా రాములవారి కళ్యాణం చూశాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఒక పోలీస్ అంకుల్ దగ్గరుండి మరీ మాకు దర్శనం చేయించారు. సాయియే అతని రూపంలో మాకు దర్శనం చేయించారని నాకనిపించింది. బాబా దయతో చాలా చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. మరుసటివారం మేము మళ్ళీ భద్రాచలం వెళ్ళాము. అప్పుడు కూడా నేను, "మా ట్రిప్ బాగా జరిగితే బ్లాగులో పంచుకుంటాను సాయీ" అని అనుకున్నాను. అంతా సంతోషంగా జరిగింది. ఆ ట్రిప్‌లో మేము బాగా ఎంజాయ్ చేశాము. అంతా సాయి దయ.
ఈమధ్య మా అన్నయ్య జుపిటర్ బైక్ లాక్ పడింది. ఆ లాక్‌కి ఉండే హోల్ సరిగా లేకపోవడం వల్ల దాదాపు ఒక వారం రోజులు ఎంతలా ప్రయత్నించినా లాక్ ఓపెన్ కాలేదు. లాక్ ఓపెన్ చేసేవాళ్ళని అడిగితే చాలా డబ్బులు అడిగారు. తెలిసినవాళ్ళు, "అదే బైక్ ఉన్నవాళ్ళ బైక్ 'కీ'తో అయితే తొందరగా ఓపెన్ అవుతుంద"న్నారు. మా డాడీ ఒక అంకుల్‌తో విషయం చెప్తే ఆయన, "నా బైక్ అదే. ఈ కీ ట్రై చేయండి" అని కీ ఇచ్చారు. నేను, "బాబా! ఏ నష్టం కలగకుండా ఎలా అయినా లాక్ ఓపెన్ అయ్యేటట్లు చూడండి. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుంటూ డాడీ ఓపెన్ చేస్తున్నారు కదా అని బయటికి వెళితే, "అప్పటికే లాక్ ఓపెన్ అయ్యింద"ని డాడీ చెప్పారు. ఒక్కోసారి మనం కోరుకునేలోపే సాయి ఆ సమస్యను తీర్చేస్తారు. సాయి ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనటానికి ఇలానే చాలా జరుగుతుంటాయి. "ధన్యవాదాలు బాబా".
బాబా దయతో మంజూరైన పెన్షన్
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
సాయిబంధువులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీవిరమణ చేశాను. అనంతరం నాకు రావలసిన పెన్షన్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆఫీసులో అడిగితే, "మీ పెన్షన్ పెండింగ్‌లో ఉంది. రావడానికి ఆలస్యమవుతుంద"ని అన్నారు. ఎవరి ద్వారా పని జరుగుతుందో నాకు తెలియలేదు. ఒకటిన్నర సంవత్సరం గడిచినా నాకు పెన్షన్ మంజూరు కాలేదు. నా జీవనాధారమైన పెన్షన్ రాక నేను చాలా మానసిక ఆందోళనకు గురై బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి 2023, మార్చిలో నాకు పెన్షన్ మంజూరు అయింది. బాబా దయవలనే నా పెన్షన్ నాకు మంజూరు అయిందని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా. ఇంకా కొన్ని ఆఫీస్ పనులున్నాయి. వాటిని కూడా దగ్గరుండి చేసిపెట్టండి. అలాగే నాకున్న ఆరోగ్య సమస్యలను పోగొట్టి సదా నాకు తోడునీడగా ఉండండి బాబా".
సర్వేజనాః సుఖినోభవంతు!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
OM SAI RAM 🙏🙏
Delete