1. 'నేను ఇక్కడే ఉన్నాను, చూసుకుంటాను' అని నిదర్శనమిచ్చిన బాబా2. నమ్ముకున్నవారి సమస్యలను తొలగించే బాబా
'నేను ఇక్కడే ఉన్నాను, చూసుకుంటాను' అని నిదర్శనమిచ్చిన బాబా
నా పేరు మానస. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాబా దయతో నాకు పండంటి మగబిడ్డని ప్రసాదించారు. బాబు పుట్టడానికి నాలుగు రోజులు ముందు మావారికి మంచి జీతంతో వేరే దేశంలో చక్కటి ఉద్యోగానికి సంబంధించి ఆఫర్ లెటర్ వచ్చింది. అందులో మూడు నెలలో జాయిన్ అవ్వాలని ఉంది. మావారు అప్పటికి పనిచేస్తున్న కంపెనీలో 45 రోజులు పనిచేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మా బాబుకి రెండున్నర నెలల వయసున్నప్పుడు వేరే దేశం వెళ్లి కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తరువాత బాబు అన్నప్రాసనకి మావారు ఇండియా వచ్చి అన్నప్రాసన అయ్యాక నన్ను, బాబుని ఆ దేశానికి తీసుకెళ్లారు. మావారు రోజూ ఉదయం ఆఫీసుకి వెళితే వచ్చేటప్పటికీ రాత్రి అయ్యేది. అందువల్ల ఒక్కదాన్నే బాబుని చూసుకోవడం నాకు చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉండేది. తను లేచినప్పటి నుండి పడుకునేవరకు పూర్తిగా నాతోనే ఉండేవాడు. చిన్న చిన్న పనులు కూడా చేసుకోనిచ్చేవాడు కాదు. తనకి స్నానం చేయించాలంటే తను ఎక్కడ పడతాడో, ఏమైనా తగులుతాయో అని నాకు చాలా భయమేసేది. తను చాలాసార్లు ఇంట్లో ఆడుతూ ఆడుతూ హఠాత్తుగా కిందపడి చాలా దెబ్బలు తగిలించుకుంటుండేవాడు. అందువల్ల నేను బాబాని, "ప్లీజ్ బాబా! నువ్వే నాతో మా ఇంట్లో ఉండు. బాబు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో" అని వేడుకుంటూండేదాన్ని. అలా చాలాసార్లు వేడుకున్నాక 2023, ఉగాది మరుసటిరోజు గురువారంనాడు మా ఇంట్లో గోడపై బాబా రూపం నాకు దర్శనమిచ్చింది. 'నేను ఇక్కడే ఉన్నాను, చూసుకుంటాను' అని బాబా చెప్తున్నట్లుగా నాకు అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకరోజు మా బాబుకి మా ఇంట్లో ఒక ఎయిర్ స్ప్రే దొరికింది. వాడు దానితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. నేను వాడు దేనితో అందుకుంటున్నదీ సరిగా గమనించక ఏదో క్లిప్‌తో ఆడుతున్నాడనుకున్నాను. కొద్దిసేపటికి హఠాత్తుగా ఏదో ఘాటు వాసన వచ్చింది. చూస్తే, ఎక్కడా ఏమీ కనపడలేదు. చివరికి బాబు దగ్గరుంది ఎయిర్ స్ప్రే అని అర్థమైంది. వాడు దాన్ని తన నోట్లో పెట్టుకున్నందువల్ల నోట్లో స్ప్రే చేసుకున్నాడేమో అని చాలా భయమేసింది. వెంటనే, "బాబా! నా కొడుకు దాన్ని తన నోట్లో స్ప్రే చేసుకోకుండా ఉండి, తనకి ఏమీ కాకుండా క్షేమంగా ఉండేలా చూడండి" అని వేడుకున్నాను. సాయి దయవల్ల బాబు యాక్టివ్‌గా ఉన్నాడు. మా చెల్లి డాక్టర్. తనని అడిగితే, "బాబు యాక్టివ్‌గా, సంతోషంగా ఆడుకుంటున్నాడు కాబట్టి వాడు తన నోట్లో స్ప్రే చేసుకొని ఉండడు" అని చెప్పింది. అది విని నాకు ఉపశమనంగా అనిపించింది. బాబు బాగున్నాడు. "థాంక్యూ బాబా".
నా భర్త ఆఫీసులో ఒక వార్షిక ఫంక్షన్ జరిగినప్పుడు చాలా లక్కీ డిప్స్ పెట్టి 2000 మంది నుండి గెలిచిన 300 మందికి చాలా బహుమతులు మరియు డబ్బులు బహుకరించే ఏర్పాటు చేసారు. ఆ సమయంలో నేను, "ప్లీజ్ బాబా! లక్కీ డ్రాలో మాకు బహుమతి వచ్చేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మాకు 20,000 రూపాయలు లక్కీ డ్రాలో వచ్చాయి.
నమ్ముకున్నవారి సమస్యలను తొలగించే బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు ఇందిర. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇటీవల నాకు నెలసరి వచ్చినప్పుడు నా ఎడమ రొమ్ము చాలా దురద పెట్టడంతోపాటు దాని పరిమాణం పెరిగినట్టనిపించి భయమేసింది. నేను నా అలవాటు ప్రకారం నెట్‌లో సెర్చ్ చేస్తే, 'హార్మోన్ల అసమతుల్యత వల్ల లేదా మరేదైనా తీవ్రమైన సమస్య వల్ల అలా జరగొచ్చు' అని వుంది. అది చదివాక నాకు మరింత భయమేసింది. నేను ఊరికే భయపడుతున్నానో, లేక నిజంగా ఏదైనా మార్పు వస్తుందో నాకు అర్థం కాలేదు. వెంటనే నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఈ భయం నుండి నాకు విముక్తి కలిగించు. నాకెందుకు ఇలా అనిపిస్తుందో అర్దం కావట్లేదు. ప్లీజ్ బాబా, వచ్చే గురువారం కల్లా నా భయం పోయేలా దురద, పరిమాణం రెండూ నార్మల్‌కి వచ్చేలా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల భయం పోవడమే కాదు, నా రొమ్ము పరిమాణం కూడా నార్మల్‌గా అనిపించింది. "ధన్యవాదాలు బాబా. నాలో ఈ ధైర్యాన్ని ఎప్పుడూ ఇలాగే వుండేలా చూడు, దేన్నైనా తట్టుకునే శక్తిని ప్రసాదించు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SAI RAM
ReplyDeleteOm Sri sairaam
ReplyDeleteOm sai ram
ReplyDeleteOhm sainadhaya namaha
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya sai
Om sai ram. Om sai ram. Om sai ram. Om sai ram. Om sai ram
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteOM SRI SAI
ReplyDeleteOm sai ram 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteom sai ram
ReplyDeleteOm sai nadhaya namaha
ReplyDeleteOm sai ram
ReplyDeleteJai sairam
ReplyDeleteO'm sri sai ram
ReplyDeleteOm sai Ram. Baba is always with us
Deleteశ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః 🙏🙏🙏🙏
ఓం శ్రీ సాయి రక్షక శరణం దేవ 🙏🙏🙏🙏