సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1529వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రార్థనలు విని బాధలు తీర్చిన బాబా
2. చైన్ కనపడేలా దయచూపిన బాబా

ప్రార్థనలు విని బాధలు తీర్చిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయితండ్రికి సాష్టాంగ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. మావారు స్కూలు టీచర్. ఈ వేసవిలో ఆయనకి మాకు దగ్గరలో కాకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలులో సమ్మర్ క్యాంపు పడింది. రోజూ అంతదూరం వెళ్లి రావడం కుదరదు. ఆయన లేకపోతే ఇద్దరు పిల్లలతో నాకు కష్టంగా ఉంటుంది. అందువల్ల సాయిని ప్రార్థించి 2023, ఏప్రిల్ 22, శనివారంనాడు పైఅధికారితో మాట్లాడి క్యాంపుని దగ్గరలో ఉన్న స్కూల్లో వేయించుకోవాలని మావారు అనుకున్నారు. కానీ ఆరోజు రంజాన్ కావడం వలన పైఅధికారి ఫోన్ ఎత్తలేదు. దాంతో మావారు చాలా నిరాశ చెంది తనకి క్యాంపు పడిన స్కూలుకి వెళ్లి రిపోర్టు చేసి సోమవారం వస్తానని వెళ్లారు. కానీ, ఆదివారమే వచ్చి మరోసారి పైఅధికారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడు నేను, "సాయీ! తను లేకపోతే మేము ఒక్కళ్ళమే ఉండలేము. అలా అని తనతో వెళ్లే అవకాశం కూడా లేదు. కనుక తనకి దగ్గర్లో ఉన్న స్కూలుకి క్యాంపు మార్చేలా చూడండి. అలా మారిస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకొని, వరుసగా మూడు రోజులు స్తవనమంజరి పఠిస్తాను" అని బాబాను వేడుకున్నాను. బాబా ఈసారి నా ప్రార్థనను మన్నించారు. పైఅధికారి ఫోన్ ఎత్తి దగ్గరలోని క్యాంపుకి ఓకే చెప్పారు. "థాంక్యూ సాయితండ్రీ. మీకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే బ్లాగుకు మీ అనుగ్రహాన్ని పంపాను. సదా మీ సేవలో ఉండేలా మమ్మల్ని దీవించు తండ్రీ".


ఈమధ్య మా పెద్దపాపకు పీరియడ్స్ మొదలయ్యాయి. అప్పటినుండి తను ప్రతినెలా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేది. 2023, ఏప్రిల్ నెలలో ఆ బాధ మరింత ఎక్కువైంది. ఎంతలా అంటే, స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్ వ్రాయలేక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. ఆరోజు తన బాధను చూసిన నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "సాయితండ్రీ! పాపకి కడుపునొప్పి తగ్గితే గురువారంనాడు తనని మీ మందిరానికి తీసుకొచ్చి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని 108 సార్లు వ్రాయిస్తాను" అని మ్రొక్కుకొని ఊదీ కలిపిన నీటిని పాపచేత త్రాగించాను. బాబా దయవల్ల నిదానంగా తన కడుపునొప్పి తగ్గింది. ఆ మరుసటి గురువారం పాపని గుడికి తీసుకెళ్ళి, తనచేత 108 సార్లు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' వ్రాయించాను. మరుసటి నెలలో ముందునుండి, "సాయితండ్రీ! ఈనెల పాపకి కడుపునొప్పి రాకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుంటూ పీరియడ్స్ రావడానికి రెండు రోజుల ముందు నుండి పాపకి రోజూ ఊదీనీళ్లు ఇచ్చాను. బాబా దయవల్ల ఈసారి పాప కడుపునొప్పని అస్సలు అనలేదు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంతా ఆ తండ్రి దయ. బాబా నా ప్రార్థనలు విని ఆ బాధ నుంచి గట్టెక్కించినందుకు చాలా ఆనందం కలిగింది. "థాంక్యూ సో మచ్ సాయీ. ఇలాగే ఆ కడుపునొప్పి నుంచి పాపకు శాశ్వతంగా విముక్తి కలిగించు తండ్రీ". 


చైన్ కనపడేలా దయచూపిన బాబా


నేనొక సాయిభక్తురాలిని. ఒకరోజు నేను నా నల్లపూసల చైన్ వేసుకుందామని దాన్ని ఎప్పుడూ ఉంచే బాక్స్‌లో చూస్తే, అది అందులో లేదు. తరువాత వేరే పని విషయంగా సమయం అయిపోతుందని బయటకి వెళ్ళాను. కానీ మనసులో చైన్ ఏమైందా అని ఆలోచిస్తూ, "బాబా ప్లీజ్! ఎలాగైనా నా చైన్ నా కంటపడేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. కానీ ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత అంతకుముందు చూసిన చోట చూస్తే, చైన్ అక్కడే ఉంది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. పెద్ద టెన్షన్ నుంచి కాపాడావు తండ్రీ. దయచేసి ప్రతి ఒక్కరిపైనా మీ ప్రేమను వర్షించండి తండ్రీ. మీరు ప్రసాదించిన అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు క్షమించండి బాబా".


ఓం సాయి రక్షక శరణం దేవా!!!


10 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయి తండ్రి నా వెంట ఉండు దేవా.నాకు అంతా అయోమయంగ వుంది.నాకు అర్థం అయ్యే లాగా సహాయం చేయి తండ్రి.ఓం సాయి రామ్

    ReplyDelete
  4. అపార్థం తొలగించు తండ్రి.ఓం సాయి రామ్ నీ కు వందనాలు

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om sai ram 🙏🙏🙏

    ReplyDelete
  7. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  8. Om Sairam. Prati anuvulo neevu vunnavu tandri. Prastutam na biddalu badha padutunna aapada nunchi vallanuv kapadu tandri 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Arogyanni prasadinchu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo