సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1536వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యం కుదుటపడేలా అనుగ్రహించిన బాబా
2. ఎల్లవేళలా కాపాడే బాబా

ఆరోగ్యం కుదుటపడేలా అనుగ్రహించిన బాబా

ప్రియమైన బాబా భక్తులకు నమస్కారం. నేనొక సాయిభక్తుడిని. 2023, ఏప్రిల్ నెలాఖరులో 78 సంవత్సరాల వయసున్న మా అమ్మ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించసాగింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చింది. దాంతో పాటు తీవ్రమైన చేయినొప్పి కూడా ఉంది. ఆ కారణంగా అమ్మ ఎవరితోనూ మాట్లాడలేకపోయింది. మేము చాలా ఆందోళన చెంది ఎవరైనా డాక్టరుని ఇంటికి తీసుకొచ్చి అమ్మని చూపించాలని ఒక డాక్టరుని తీసుకొచ్చాము. ఆ డాక్టరు ప్రాథమిక పరీక్షలు చేసి, "హాస్పిటల్లో అడ్మిట్ చేయాల"ని చెప్పారు. అయితే అతని హాస్పిటల్ చిన్నదైనందున "మేము అలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక గంటలోపు కాల్ చేస్తాము. మీరు అంబులెన్స్‌ పంపండి" అని చెప్పి ఆ డాక్టర్ని పంపించేశాము. తరువాత మేము అపోలో వంటి ఏదైనా పెద్ద హాస్పిటల్లో అమ్మని చేర్పించాలని అనుకున్నాము. కానీ నాకు ఒక ఆలోచన వచ్చి, ముందుగా మా అమ్మ ఆరోగ్యం గురించి బాగా తెలిసిన మా ఫ్యామిలీ డాక్టరుతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామనుకున్నాము. అయితే ఆమెతో మాట్లాడే ముందు, "బాబా! సహాయం చేయండి. డాక్టరు చెప్పే నిర్ణయాన్ని మీ నిర్ణయంగా మేము భావిస్తాము. ప్రతిదీ సరిగ్గా జరిగి సానుకూల ఫలితం వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత నేను మా ఫ్యామిలీ డాక్టరుకి ఫోన్ చేస్తే, ఆమె నాతో, నా భార్యతో మాట్లాడుతూ అమ్మ గురించి కొన్ని వివరాలు అడిగిన మీదట, "మీరు కంగారుపడకండి. ప్రస్తుతానికి కొన్ని మందులు సెలైన్‌లో కలిపి అమ్మకి ఎక్కించి రేపు ఆసుపత్రికి తీసుకొని రండి" అని చెప్పారు. మేము ఒక నర్సుని పిలిచి డాక్టరు చెప్పినట్లు అమ్మకి సెలైన్ ఎక్కించాము. అమ్మ ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతూ సాయంత్రం బాగా పొద్దుపోయే సమయానికి బాగానే ఉంది. మరుసటిరోజు ఉదయం హాస్పిటల్‌కి చేరుకునే సమయానికి అమ్మ పూర్తిగా కోలుకుంది. డాక్టరు అమ్మని చూసి, "మీరు ఎందుకు వచ్చారు?" అని సరదాగా అడిగారు. తరువాత అమ్మ ఆరోగ్యo పూర్తిగా వృద్ధి చెందడానికి కొన్ని హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చారు. మేము ఆనందంగా హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాము. ఇదంతా బాబా ఆశీర్వాదం వల్ల జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఎల్లవేళలా కాపాడే బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగ్ మనందరికీ శ్రీసాయినాథుని ఆశీర్వాదం. నా పేరు అపర్ణ. 2005లో మేము కొన్న పంటపొలం యొక్క వెబ్ ల్యాండ్ వివరాలు మా పేరు మీద కాకుండా దాన్ని మాకు అమ్మినవారి పేరు మీద ఉన్నట్లు మేము ఈమధ్య గమనించాము. వెంటనే మేము వెబ్ ల్యాండ్‌లో మా పేరు నమోదు చేయించుకోవాలని అనుకున్నాము. ఆ పని మీద మేము గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్తూ, "బాబా! పని త్వరగా జరిగేలా ఆశీర్వదించండి. పని పూర్తైనంతనే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని శ్రీసాయినాథుని ప్రార్థించాను. బాబా దయవల్ల పని సులువుగా పూర్తైంది.


2023, ఏప్రిల్ నెల చివరిలో ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే మావారు కంగారుగా, "చాలా పెద్ద మొత్తంలో మనకి నష్టం జరిగేలా ఉంది" అని అన్నారు. విషయమేమిటంటే, షేర్ మార్కెట్ వీక్లీ ఎక్స్పైరీలో మాకు నష్టం చాలా పెద్ద మొత్తంలో వచ్చేలా ఉంది. అది విన్న నేను యథాప్రకారంగా 'నా బాబానే నాకు దిక్కు' అనుకొని శాంతంగా, "బాబా! మమ్మల్ని ఈ నష్టం నుండి కాపాడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఉదయాన్నే గుడికి వచ్చి ఆరతి, అభిషేకంలో పాల్గొంటాను" అని అనుకున్నాను. బాబా చాలా చిన్న పెనాల్టీతో ఆ కష్టం తీర్చారు. ఇలా శ్రీసాయినాథులు నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంటారు. నా జీవితంలోని ప్రతిక్షణం వారి ఆశీర్వచనమే. "బాబా! దగ్గరుండి నన్ను నడిపించే మీ ప్రేమకి ధన్యవాదాలు అనేది చాలా చిన్న మాట. మీ భక్తులందరూ మీ బోధనలను నిత్యం అకుంఠితదీక్షతో అనుసరిస్తూ మీరు చూపిన దారిలో నడిచేలా ఆశీర్వచండి బాబా".



8 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sai ram,om Sai ram,om Sai ram

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om sai Sri Sai Jai jai sai

    ReplyDelete
  6. Om Sri Sai Rakshak Saranam🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo