1. మీటరు కాలిపోయినా కరెంటు వచ్చేలా అనుగ్రహించిన బాబా
2. ఎంతకీ పూర్తికాని వర్క్‌ని పూర్తిచేయించిన బాబా
మీటరు కాలిపోయినా కరెంటు వచ్చేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. మేము హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నాము. మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పటినుండి కరెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నాము. 2023, మే 9న, రాత్రి గం.2.30ని.ల సమయంలో కరెంట్ పోయింది. బయటకి వెళ్లి చూస్తే అందరికీ కరెంటు ఉంది, సమీపంలో ఉన్న మూడు స్ట్రీట్ లైట్లు కూడా వెలుగుతున్నాయి. అంటే, మాకు మాత్రమే కరెంటు లేదు. కిందకి వెళ్లి చూస్తే, మా మీటర్ కాలిపోయి ఉంది. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. మండు వేసవిలో కరెంటు పోతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా! నేను అదే ఆలోచిస్తూ, "బాబా! ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు. కరెంట్ వచ్చేలా చేయండి. ఇది అసాధ్యం అని తెలుసు తండ్రీ. అయినా సాధ్యం చేయండి బాబా. మీరు నేను కోరింది చేస్తే మాటలు రాని మా బాబుకి మాటలు వస్తాయని మీరు మాకు అభయం ఇచ్చినట్లే బాబా! ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం మీ వల్ల అవుతుంది బాబా" అని బాబాను వేడుకున్నాను. ఒక గంట తర్వాత మావారు, "ఇలా కాదు. పిల్లల్ని తీసుకొని మా చెల్లివాళ్ళింటికి వెళదాం" అన్నారు. నేను, "నాలుగున్నర అయింది. ఇప్పుడు నేను రాను. మంచినీళ్లు వస్తాయి. అవి పట్టి పెట్టాలి. అసలే మోటార్ కూడా రాదు. నీళ్లకి ఇబ్బంది అవుతుంది" అని వెళ్ళలేదు. మావారు మా బాబుని తీసుకొని వెళ్లారు. వాళ్ళు వెళ్లిన పది నిమిషాలకి అంతటా కరెంట్ పోయి చీకటి అయిపోయింది. కొద్దిసేపటికి మాకు మాత్రమే కరెంట్ వచ్చి, తరువాత అందరికీ వచ్చింది. అసలు అదెలా సాధ్యమైందో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే, 'మీటర్ కాలిపోయింది, ఇక కరెంటు రాద'ని మేము ఆశలు వదిలేసుకున్నాం. కానీ బాబా మా బాధను అర్థం చేసుకొని కరెంటు వచ్చేలా చేశారు. బాబా దయకి నా కళ్ళనుండి నీళ్ళొచ్చాయి. మావారికి ఫోన్ చేసి, "కరెంటు వచ్చింద"ని చెపితే, "అలా ఎలా వచ్చింది?" అన్నారు. నేను నా మనసులో, "అంతా బాబా దయ" అనుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ఇంత చక్కని అనుభవం వ్రాయడానికి రెండు రోజులు ఆలస్యమైంది. అందుకు నన్ను క్షమించండి బాబా".
నేను ఒకరోజు ఈ బ్లాగులో 'మా ఇంట్లోకి పాము వచ్చింద'ని ఒక భక్తుని అనుభవంలో చదివాను. అది చదివిన కొద్దిసేపటికి మా పెద్దమ్మ ఫోన్ చేసి, "మీ ఇంట్లోకి పాము దూరింద"ని మా అమ్మతో చెప్పింది. అప్పటికి రెండు రోజుల ముందే మా అమ్మ మా ఇంటికి వచ్చింది. అమ్మ ఆ విషయం నాకు చెప్పగానే ఆశ్చర్యంతో 'ఇప్పుడే కదా అదే విషయం గురించి బ్లాగులో చదివాను. ఇంతలోనే మా ఇంట్లో పాము దూరడం చిత్రంగా ఉంది' అనుకొని, "ఆ పాముని వెళ్లగొట్టమ"ని బాబాను వేడుకొని భారం ఆయన మీద వేశాము. తరువాత ఒకరోజు ఇంట్లో వెతికిస్తే, పాము ఎక్కడా కనిపించలేదు. అంత బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓం సద్గురు సాయినాథాయ నమః!!!
ఎంతకీ పూర్తికాని వర్క్‌ని పూర్తిచేయించిన బాబా
శిరిడీ సాయి భక్తులకు నమస్కారం. నా పేరు ఆశాదీప్తి. నేను హైదరాబాదులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఈమధ్యనే ఆ కంపెనీకి మారాను. కొత్త ఉద్యోగం, పని ఎలా ఉంటుందో? నేను నిలబడగలనో, లేదో అని ఎంతో భయపడ్డప్పటికీ అన్నింటికీ ఆ సాయి మీద భారమేసి నేను ముందుకు కదిలాను. బాబా అనుగ్రహంతో నేను ఆశించినట్లు అంతా సవ్యంగా సాగింది. అలా అంతా బాగా జరుగుతున్న సమయంలో మా టీమ్‌కి కొన్ని ఫీచర్స్ డెవలప్ చేయమని ఇచ్చారు. వాటిలోనుండి నేను ఒక ఫీచర్ తీసుకుని బాబా దయతో ఏ ఇబ్బందీ లేకుండా విజయవంతంగా పూర్తిచేశాను. అయితే, వేరే టీమ్‌వాళ్ళు తీసుకున్న ఇంకో ఫీచర్ విషయంలో వాళ్ళు పెద్దగా ముందుకు సాగలేకపోయారు. నేను తీసుకున్న ఫీచర్ పూర్తికావడంతో నన్ను ఆ ఫీచర్ చేయమని అన్నారు. అది నాకు కూడా కొత్త కావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలాకాలం సెలవులు, నిద్ర లేకుండా అందరం కష్టపడ్డాం. అయినా అనుకున్న ఫలితం కనబడలేదు. చివరికి నేను, "ఈ ఫీచర్ పూర్తిచేయించండి" అని ఆ సాయినాథుని వేడుకున్నాను. తరువాత బాబా అనుగ్రహంతో మేము ఆ ఫీచర్ విషయంలో చకచకా ముందుకు సాగుతూ ఎన్నో అనుకోని కష్టనష్టాలను అధిగమించి దానిని 2023, మే మూడో వారంలో పూర్తిచేయగలిగాం. ఆ కష్టసమయంలో మమ్మల్ని ఆదుకున్న మన సాయి ప్రేమను భక్తులతో పంచుకునే చిరు ప్రయత్నమే నా ఈ అనుభవం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai Sri Sai Jai jai sai
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram
ReplyDeleteOm Sai Ram 🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteGprasadaraju
ReplyDeleteOm Sai ram