సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1530వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి రక్షణ - మధురమైన జ్ఞాపకం

నా పేరు సాయి సృజన. మేము జర్మనీ దేశంలో నివసిస్తున్నాము. ఇటీవల ఈస్టర్ సెలవుల్లో నేను, నా భర్త కలిసి గ్రీస్ దేశానికి విహారయాత్రకు వెళ్ళాము. అందులో భాగంగా మూడురోజులు ఏథెన్స్ నగరంలోనూ, ఏడురోజులు ఐలాండ్స్‌లోనూ గడపాలని అనుకున్నాము. పదిరోజుల విహారయాత్ర కాబట్టి రెండు పెద్ద బ్యాగులు, ఒక క్యాబిన్ బ్యాగు తీసుకొని మేము ముందుగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరం చేరుకున్నాము. అక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్‌కి మెట్రో రైలులో బయలుదేరాము. దారిలో ఎవరో నా భర్త పర్సు దొంగిలించారు. ఆ విషయం మేము ట్రైన్ దిగాక గమనించాము. ఆ పర్సులో మా క్రెడిట్ కార్డులు, బ్యాంక్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, ఐడి కార్డులు, ఇంకా అత్యంత ముఖ్యమైన మా ఇద్దరి వీసా కార్డులు ఉన్నాయి. దాంతో నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. వెంటనే, "మమ్మల్ని ఈ కష్ట పరిస్థితి నుండి కాపాడండి" అని బాబాను వేడుకున్నాను. ఏథెన్స్‌లో మూడు రోజులు తిరగడానికి మావద్ద ట్రైన్ టిక్కెట్లు, ఇంకా మా అదృష్టం కొద్దీ ప్రయాణ ఖర్చుల కోసం నగదు రూపంలో పెట్టుకున్న 75% డబ్బు మా బ్యాగులో ఉంది. కానీ మేము గ్రీస్ దేశం నుండి బయటపడి తిరిగి జర్మనీ వెళ్లాలంటే ఖచ్చితంగా మా వీసా కార్డులు మాకు కావాలి. అవి లేకుంటే మేము ఇండియా వచ్చేయడమో లేదా వీసా వచ్చేదాక గ్రీస్ దేశంలో ఉండటమో చేయాలి. జర్మనీకి మాత్రం తిరిగి వెళ్ళలేము. బాబాని మనసులో తల్చుకుంటూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసి, ఫిర్యాదు ఇచ్చినట్లు రిసీప్ట్ తీసుకున్నాం. వాళ్ళు మమ్మల్ని, "జర్మన్ ఎంబసీకి వెళ్ళండి. అప్పుడే మీకు వీసా వస్తుంది" అన్నారు. అప్పటికి మా చేతిలో డబ్బులున్నప్పటికీ, అవి అయిపోతే మా చేతికి డబ్బులొచ్చే మార్గమేదీ లేదు. ఎందుకంటే, మా వర్చువల్ బ్యాంక్ కార్డులతో సహా అన్నీ బ్లాక్ చేశాం. కాబట్టి ఎవరన్నా మాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినా మేము వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి.


మేము మరుసటిరోజు రాయబార కార్యాలయానికి వెళ్లి మా సమస్య వాళ్లకి చెప్పాము. వాళ్ళు మరుసటిరోజుకి మాకు అపాయింట్‌మెంట్ బుక్ చేసి, "మీరు ఏథెన్స్ నగరంలోనే ఉండాలి. వీసా లేకుండా ఐలాండ్స్‌కి వెళ్ళడానికి కుదరదు" అని చెప్పారు. మేము, "మాకు రూమ్ బుకింగ్ 3 రోజుల వరకే ఉంద"ని చెప్పినా వాళ్ళు, "మేము ఏమీ చెయ్యలేం. మీరు జర్మనీలో మీరుండే సిటీ ఆఫీసుని కాంటాక్ట్ అయి మీరు జర్మనీలో ఉంటున్నారన్న ప్రూఫ్‌ని 'జర్మన్ ఎంబసీ ఆఫ్ గ్రీస్‌'కి పంపమనండి. అప్పుడు మేము మీకు తాత్కాలిక వీసా ఇస్తాము" అని చెప్పారు. అసలు మాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే, జర్మనీలో మేము ఉండే ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ ఆఫీసువాళ్ళు సరిగ్గా సమయానికి పనిచేయరు. అయినా అయిందేదో అయిందని మేము ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీసుకి ఫోన్లు చేయడం, ఈ-మెయిల్స్ పెట్టడం మొదలుపెట్టాం. ఏదో వింత జరిగినట్లు వాళ్ళ నుండి వెంటనే మాకు రిప్లై మెయిల్ వచ్చింది. అద్భుతమేమిటంటే, మామూలుగా గురువారంనాడు మేముండే చోట ఇమ్మిగ్రేషన్ ఆఫీసులు పనిచేయవు. కానీ మా మెయిల్‌కి రిప్లై వచ్చింది. అది సాయినాథుడు చేసిన అద్భుతం. ఆ మెయిల్ రూపంలో కనీసం ఒక భరోసా అయితే లభించిందని మేము ఆనందపడ్డాం. మా పేపర్స్ అన్నీ ప్రాసెస్ చేసి, అన్ని ప్రూఫ్స్‌తో సబ్మిట్ చేశాము. మరుసటిరోజు శుక్రవారమే మాకు వీసా వచ్చిందని వీసా ఆఫీసు నుంచి మాకు ఫోన్ వచ్చింది. మేము మా అప్లికేషన్ ప్రాసెస్ చేసిన వ్యక్తికి మెయిల్ ద్వారా థాంక్స్ చెప్పాము. ఆ వ్యక్తి (శుక్రవారం) మేము మా వీసా తీసుకోగానే ఈస్టర్ సెలవులకి వెళ్ళిపోయారు. అప్పుడు నేను 'బాబానే మా అప్లికేషన్ ప్రాసెస్ చేశారు' అనుకున్నాను. అంతా బాబా చేసిన అద్భుతమే. ఎందుకంటే, ఏ గవర్నమెంట్ ఆఫీసువాళ్ళూ శుక్రవారంనాడు సరిగా పనిచేయాలని అనుకోరు. దానికితోడు వాళ్ళు ఆరోజు రోజులో సగభాగమే పనిచేస్తారు. ఒకవేళ శుక్రవారం మాకు వీసా రాకపోతే మేము శని, ఆదివారాలు ఉండటానికి రూమ్ కూడా లేక ఏథెన్స్ నగరంలో ఇరుక్కుపోయేవాళ్ళము. తదుపరి మా ప్రణాళిక అంతా కూడా గందరగోళం అయిపోయేది. కానీ ఏథెన్స్‌లో ఉన్న ఆఖరిరోజైన శుక్రవారమే మాకు వీసాలు వచ్చేయడం వల్ల మేము ముందుగా అనుకున్నట్లు మా విహారయాత్ర అంతా చాలా సాఫీగా సాగిపోయింది. సాయి దయ కాకపోతే మా పర్సు పోయినా మా దగ్గర డబ్బులు ఉండటమేంటి? వీసా పోయిన సమయానికి ఎప్పుడూ రిప్లై ఇవ్వని అధికారులు రిప్లై ఇచ్చి, 'మేము ఉన్నాము, కంగారుపడకండ'ని ధైర్యం చెప్పడమేంటి? కేవలం మాకోసమే పనిచేసినట్టు ఆఫీసర్ మా అప్లికేషన్‌ని ప్రాసెస్ చేసి అదేరోజు సెలవు మీద వెళ్లిపోవడమేంటి? ఇదంతా బాబా మహిమే అని నా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Very nice experience of sai baba om Sai ram

    ReplyDelete
  4. When we trust him with love he will show his Leela. when we remember sai he will take care of his devotees.om Sai ram

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo