ఈ భాగంలో అనుభవాలు:
1. ఇంటి సమస్యల నుండి బయటపడేసిన బాబా
2. డిస్మిస్ కాకుండా కరుణ చూపిన బాబా
ఇంటి సమస్యల నుండి బయటపడేసిన బాబా
ఓం నమో శ్రీసాయినాథాయ నమః!!!
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు భారతి. నేను పాతిక సంవత్సరాలుగా బాబా సేవ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఏ పని విషయంలోనైనా 'ఆ పని చేయాలా? వద్దా?' అని నిర్ణయించుకోలేకపోయినప్పుడు బాబా దగ్గర రెండు చీటీలు వేసి, చిన్న పిల్లలతో తీయించి అందులో వచ్చిన దాన్నే బాబా నిర్ణయంగా భావించి చేస్తాను. అయితే ఈమధ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను బాబాను అడగటం మర్చిపోయాను. అదేమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితం మేము ఒక ఇల్లు కొన్నాము. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. సమస్య వచ్చిన ప్రతిసారీ, "బాబా! ఎందుకిలా నాకు పరీక్షలు పెడుతున్నావు?" అని ఎంతో బాధపడుతూ చివరికి కొద్దిరోజుల తర్వాత ఇల్లు అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆపై చాలాసార్లు, "ఇల్లు త్వరగా అమ్ముడైపోవాల"ని బాబాను వేడుకున్నాను కానీ, అసలు 'ఇల్లు అమ్మాలా, వద్దా' అని బాబాను అడగడం మర్చిపోయాను. కొద్దిరోజులకు ఒక వ్యక్తి ఇల్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇల్లు అమ్మాలా, వద్దా అని తీవ్రంగా ఆలోచించాము. కనీసం అప్పుడైనా నేను బాబా సలహా తీసుకుని ఉండాల్సింది. కానీ అడగకుండా మళ్ళీ పొరపాటు చేశాను. తీరా ఆ వ్యక్తికే అమ్మాలని నిర్ణయించుకుంటే అతను మాకు సగం డబ్బులిచ్చి మిగతా సగం డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టాడు. మేము తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాం. చివరికి నేను బాబాను శరణుజొచ్చి ఆయననే ధ్యానిస్తూ కూర్చున్నాను. అప్పుడు ఆ వ్యక్తి, "రేపు రిజిస్ట్రేషన్ చేయించుకుందాము. డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను" అంటే, సరేనన్నాను. కానీ ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మళ్ళీ ఇబ్బందులకు గురిచేశాడు. నేను మరుసటిరోజు ఉదయాన్నే 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపు ఓపెన్ చేస్తే, అక్కడ అనుభవమాలికలో ఒక భక్తురాలు తనకు వచ్చిన కష్టాన్ని బాబా ఏ విధంగా పరిష్కరించింది పంచుకున్నారు. అది చదివిన నాకు అది దాదాపు నా సమస్యలానే ఉందనిపించి అప్పటినుంచి నేను ప్రతిక్షణం బాబానే ధ్యానిస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి ఆంజనేయస్వామివారి ఆపదామపహర్తారం శ్లోకం చదవమని నన్ను ఎవరో ప్రేరేపిస్తున్నట్లు అనిపించింది. అలా ప్రేరేపిస్తుంది ఎవరో కాదు బాబానే అనిపించి ఆ శ్లోకం చదువుతూ ఆంజనేయస్వామి ఫోటో ముందు కూర్చుండిపోయాను. ఒక అర్ధగంటలో ఆ వ్యక్తి ఫోన్ చేసి, "మీ సొమ్ము అంతా మీకు చెల్లిస్తాను. రిజిస్ట్రేషన్‌కి వెళ్ళిపోదాము" అని చెప్పి, ఆ మాట మీదే నిలబడి సొమ్ము అంతా మాకు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాడు. నేను అడగకపోయినా బాబా నిరంతరం నా వెంట ఉండి నన్ను నడిపించారని, అలాగే ఇకపై ఎప్పుడూ బాబాను అడగకుండా ఏదీ చేయకూడదని ఈ అనుభవం ద్వారా తెలుసుకుని బాబాకు సర్వస్య శరణాగతి వేడుతున్నాను.
ఓం నమో శ్రీసాయినాథాయ నమః!!!
డిస్మిస్ కాకుండా కరుణ చూపిన బాబా
నా పేరు ఉమ. మేము ప్రస్తుతం యుఎస్ఏలో ఉంటున్నాము. మా బాబు 11 గ్రేడ్ చదువుతున్నాడు. తనకి 2022, డిసెంబరు 24 నుంచి 2023, జనవరి 10 వరకు క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. మా కుటుంబమంతా డిసెంబర్ 24న యుఎస్ఏలో బయల్దేరి హైదరాబాద్ వచ్చాము. 2023, జనవరి 17న ఇండియా నుండి తిరుగు ప్రయాణమయ్యాము. ఆరోజు మేము బయలుదేరేముందు మా బాబు స్కూలు నుండి, "5 రోజుల సెలవు పూర్తైనందున బాబుని డిస్మిస్ చేస్తామ"ని మాకు ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, స్కూలు సెలవులు మరియు శని, అది వారాలు మినహాయిస్తే మా బాబు మొత్తం 6 రోజులు స్కూలుకి సెలవు పెట్టాడు. స్కూలు రూల్స్ ప్రకారం 5 రోజులకి మించి సెలవు పెట్టకూడదన్న విషయం మాకు తెలియదు. నాకు ఏమి చేయాలో తోచక బాబాని తలుచుకొని, "బాబా! డిస్మిస్ చేస్తే బాబుకి ఒక సంవత్సరం చదువు వేస్ట్ అయిపోతుంది. ఒక్కరోజే అదనంగా సెలవు పెట్టినందుకు బాబుని డిస్మిస్ చేయకూడదు. తనని స్కూలువాళ్ళు క్లాసులకి అనుమతించాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. మేము జనవరి 19వ తేదీ ఉదయానికి యుఎస్ఏ చేరుకున్నాము. బాబు స్కూలుకి వెళ్లి మా ట్రావెల్ టికెట్లన్నీ చూపిస్తే, వాళ్ళు తనని స్కూల్లోకి అనుమతించారు. ఇది బాబా కరుణ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. "వేల నమస్కారాలు బాబా".
ఓం సాయి రామ్ ఈ రోజు నా కూతురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు దాని కి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఆశీస్సులు అందచేయండి.ఏ లో ఒక రూపంలో దానికి దర్శణం యియ్యవలెను
ReplyDeleteSai ram..
ReplyDeleteJai shirdi ssi ram...plz help me to recover my amount
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Om Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteనమ్మిన వారిని బాబా ఆదుకుంటామని అందరికీ అనుభవం గా గుర్తు ఉంటుంది
ReplyDeleteBaba please recover my health om sai Sri Sai Jaya jeya sai
ReplyDeleteॐ श्री साई राम 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete