సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1532వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రేమ అపారం
2. చెప్పుకున్నంతనే బాధని తగ్గించిన బాబా

బాబా ప్రేమ అపారం


సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తుడిని. నా పేరు రవికుమార్. బాబాను నమ్మింది మొదలు ఆయన నాకు ఇచ్చిన అనుభవాలు ఎన్నో. నా ఆరోగ్యం విషయంలో ఊదీ ప్రసాదంతో నేను పొందిన అనుభవాలు అనేకం. ప్రతి చిన్న విషయంలో తలచుకోవడమే తరువాయి అన్నట్లు నా యందు వుండి నన్ను నడిపిస్తున్న నా తండ్రికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. ఆయనకి తన భక్తుల పట్ల అపారమైన ప్రేమ. అదే నేనిప్పుడు ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోదలిచాను. అప్పుడు నా పెద్దకూతురికి రెండు సంవత్సరాల ఐదు నెలల వయసు అనుకుంటా. ఒకరోజు రాత్రి 8 గంటలకి మేము డిన్నర్ చేస్తుండగా గదిలో మంచం మీద అటుఇటు నడుస్తూ ఆడుకుంటున్న పాప మంచం చివరికి వెళ్లి హఠాత్తుగా జారి పడిపోయింది. అది చూసిన నేను భయంతో 'బాబా' అని పెద్దగా అరిచాను. అయితే క్రింద పడ్డ పాప ఏడవలేదు. నేను పరుగున వెళ్లి, "దెబ్బ తగిలిందామ్మా?" అని అడిగితే, "లేదు నాన్నా, నేను పడుతుంటే ఆ ఫోటోలో ఉన్న తాత నన్ను పట్టుకున్నారు" అని బాబా ఫోటో చూపించింది. అంతే, మా గుండె ఝల్లుమంది. అది నేను నా జీవితంలో మరచిపోలేని గొప్ప సంఘటన.


2016లో రెండోసారి నా భార్య గర్భందాల్చినప్పటినుండి తనకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. 4వ నెలలో స్కానింగ్ చేసేటప్పుడు రేడియాలజిస్ట్ చెప్పేవరకు నా భార్య గర్భంలో ట్విన్స్ ఉన్నారని మాకు తెలియదు. నా భార్యకు ట్రీట్మెంట్ ఇస్తున్న లేడీ డాక్టర్ అప్పటివరకు ఆ విషయం గుర్తించలేదు. ఆమె రిస్క్ ఉందని మాత్రమే మాతో చెప్పి, గ్యారంటీ కూడా ఇవ్వలేదు. తరువాత బాబా దయతో మాకు వేరే లేడీ డాక్టర్ రిఫరెన్స్ దొరికి ఆమెని సంప్రదించాము. అదృష్టవశాత్తూ ఆమె బాబా భక్తురాలు. ఆమె మాకు ఎంతో ధైర్యాన్ని, నైతిక మద్దతు, గ్యారంటీ ఇచ్చారు. అయితే నా భార్య గర్భసంచిలో ఉన్న ఏదో లోపం కారణంగా 7వ నెల చివరిరోజు, అంటే 2016, ఆగష్టు 16 నుంచి ఫ్లూయిడ్(ఉమ్మనీరు) లీక్ అవడం మొదలైంది. నేను చాలా టెన్షన్‌తో తనని హాస్పిటల్‌లో చేర్చాను. ఆ సమయంలో దగ్గర ఎవరూ లేరు. "బాబా! నువ్వే దిక్కు" అని బాబాను వేడుకున్నాను. డాక్టరు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. రెండు రోజులు అతి కష్టం మీద గడిచాయి. 8వ నెల వచ్చిన రెండవరోజున పరిస్థితి విషమించి, "సిజేరియన్ చేయాలి. పిల్లల పరిస్థితి, వాళ్ల లంగ్స్ కెపాసిటీ ఎలా వుందో చూసి NICUలో ఉంచాలి. ఒక బేబీకి రోజుకి 25,000/- అవుతుంది" అని చెప్పారు. అది విని జీతం మీద ఆధారపడే నా గుండె జారిపోయింది. తక్షణం నా దైవం, నా తండ్రి, రక్షకుడు అయిన నా బాబాను శరణువేడాను. గొప్ప అద్భుతం! "ఇద్దరూ నాన్-ఐడెంటికల్ ఆడపిల్లలే, లంగ్స్ డెవలప్‌మెంట్ చాలావరకు బాగుంది, వెంటిలేటర్స్ అవసరం లేద"ని డాక్టర్స్ చెప్పిన మాట నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే ప్రీ-మెచ్యూర్ బేబీస్ అయినందున లంగ్స్ పూర్తి స్థాయిలో వృద్ధిచెందని కారణంగా పిల్లల్ని NICUలో 27 రోజులు ఉంచవలసి వచ్చింది. మొదటి వారం 25,000 రూపాయలు ఛార్జ్ చేసినప్పటికీ రెండో వారం 15,000 రూపాయలు, ఆపై 11,000 రూపాయలు ఛార్జ్ చేశారు. బాబా దయతో రోజురోజుకీ పిల్లల ఆరోగ్యం తొందరగా మెరుగుపడింది. నా భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అది బాబా నా పట్ల చూపిన ప్రేమ. డబ్బులు విషయానికి వస్తే కొంత మా నాన్నగారు, మిగిలిన డబ్బులు నా సహోద్యోగులు, మిత్రులు సమయానికి సర్దుబాటు చేశారు. నిజానికి నేను వాళ్లెవరినీ అడగలేదు. విషయం తెలిసి వాళ్లే సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తరువాత కొంచెం కొంచెంగా నేను ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి ఇచ్చాను. ఏదేమైనా దయతో బాబా ఆయా రూపాల్లో నా కష్టం గట్టెక్కించారు. అందుకు నేను వారికి సదా కృతజ్ఞుడనై ఉంటాను. ఇప్పుడు నా పిల్లలకి 7 సంవత్సరాలు. ఇప్పటికీ అప్పుడు జరిగినవి తలచుకుంటే ప్రతిదీ బాబా మిరకిల్ అని, ఆయన నాకోసం ప్రణాళికతో అన్నీ ఏర్పాట్లు చేశారని స్పష్టంగా తెలుస్తుంది. "ధన్యోస్మి సాయితండ్రీ".


చెప్పుకున్నంతనే బాధని తగ్గించిన బాబా


ముందుగా సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. మా ఊరు నాగార్జునసాగర్ దగ్గర హాలియా. బాబా దీవెనలతో ఒక సంవత్సరం క్రిందట మా బాబుకు ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే వాళ్ళ టీమ్ లీడర్ బాబుని చాలా బాధపెట్టేవాడు. ఆ విషయం బాబు నాతో చెప్పుకొని బాధపడేవాడు. నేను తనతో, "బాధపడకు. బాబా ఉన్నారు" అని చెప్పేదాన్ని. ఏదైనా చెప్పటం చాలా సులభం, కానీ భరించేవాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది కదా! ఒకరోజు బాబు, "నా వల్ల కాదమ్మా, నేనిక ఉద్యోగం చేయలేను. పని ఎంతైనా చేస్తానుగానీ మాట పడలేను" అని నా దగ్గర చాలా ఏడ్చాడు. నేను, వాళ్ళ నాన్న, "ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం కష్టం. ఎవరికోసమో నీ ఉద్యోగం ఎందుకు మానుకోవాలి?" అని చాలా చెప్పాము. కానీ మా మనసుకు చాలా బాధేసింది. నేను బాబాని, "బాబా! బాబు బాధని తొలగించండి. మీ కృపను మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అప్పటినుండి బాబు బాధ కొంత తగ్గింది. చివరికి 2023, ఏప్రిల్ 27, గురువారం బాబుని వేరే టీమ్‌కి మార్చారు. మాకు చాలా సంతోషమేసింది. "ధన్యవాదాలు బాబా".


10 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Sai

    ReplyDelete
  5. Om sai ram 🌺🌹🌷👏🙏🙏🙏

    ReplyDelete
  6. Om Sai Sri Sai jai jai Sai, om Sai Sri Sai jai jai Sai, om Sai Sri Sai jai jai Sai 🙏

    ReplyDelete
  7. Akilandakoti brahmadanayaka rajaadi raja yogi raja parabrahma Sri Satchidanandan sadguru sai Nath maharaja ki jai🙏

    ReplyDelete
  8. om sree Sai Ram ki Jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo