సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1534వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మొరపెట్టుకున్నంతనే సమస్యల నుండి గట్టెక్కించిన సాయి
2. కనపడకుండా పోయిన వస్తువు దొరికేలా చేసి ఎంతో సహాయం చేసిన సాయి

మొరపెట్టుకున్నంతనే సమస్యల నుండి గట్టెక్కించిన సాయి


అందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. 2012 వరకు నాకు బాబా అంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు. ఆ సంవత్సరం నేను బాబా మందిరంలో సప్తాహ భజన చేస్తున్న సమయంలో ఒక రోజంతా కారులో వెళ్లిన మా బాబు ఫోను కలవలేదు. మాకు చాలా కంగారుగా అనిపించింది. అప్పుడు నేను బాబా ముందర కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఆయన్ని ప్రార్థించాను. తెల్లవారేసరికి మా బాబు ఫోన్ చేసి, "అమ్మా! ఫోను స్విచ్ ఆఫ్ అయింది. కారులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుకాలేదు" అన్నాడు. అప్పటినుంచి నాకు బాబాపై నమ్మకం ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి ఒక సాయిబంధువు నన్ను బాబా భక్తుల గ్రూపులో చేర్చారు. అప్పటినుంచి నేను ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను.


2023, జనవరిలో మేము ఒక కారు కొన్నాము. తర్వాత మాకు ఆ కారు అమ్మినవాళ్ళ వద్దనుంచి ఒక పెద్ద సమస్య వచ్చి పోలీసు కేసు అయింది. నేను బాబాని, "ఈ సమస్య నుంచి బయటపడితే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. మేము ఆ సమస్య పరిష్కారానికి ఎన్నో రోజులు పడుతుందనుకున్నప్పటికీ బాబా దయవల్ల రెండు రోజుల్లోనే ఆ సమస్య సమసిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను. ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".


2010లో మావారికి బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. 2023, జనవరి వరకు ఆయన బాగానే ఉన్నారు. కానీ తరువాత తల కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారు. నేను, "హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోండి" అంటే వెళ్లకుండా మూడునెలలపాటు ఇబ్బందిపడుతూనే ఉన్నారు. నేను, "బాబా! మావారు హాస్పటల్‌కి వెళ్ళి చూపించుకోవాలి. ఇంకా మీ దయవల్ల ఇంట్లో కొన్ని సమస్యలు తీరాలి" అని బాబాతో చెప్పుకొని సచ్చరిత్ర సప్తాహపారాయణ చేశాను. వెంటనే మావారు, "నేను హాస్పటల్‌కి వెళ్ళి చూపించుకుంటాను" అని వెళ్లారు. హాస్పిటల్లో మావారికి సీటీ స్కాన్ చేశారు. నేను, "బాబా! లోగడ తన తలలో ట్యూబ్స్ వేశారు. లోపల అంతా చక్కగా ఉండి ట్యూబ్స్ బాగుండాలి. ఏ సమస్యా ఉండకూడదు. రిపోర్టులన్నీ ఏ సమస్యా లేకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ చక్కగా వచ్చాయి. డాక్టరు మావారికి ఏ ప్రాబ్లం లేదన్నారు. "ఈ సమస్య నుండి గట్టెక్కించినందుకు శతకోటి వందనాలు బాబా".


కనపడకుండా పోయిన వస్తువు దొరికేలా చేసి ఎంతో సహాయం చేసిన సాయి


అందరికీ నమస్కారం. నా పేరు శివప్రియ. నేను తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 'లా' చదువుతున్నాను. 2023, మే 7న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను కాలేజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. ఒకరోజు నా స్నేహితురాలు తన బంగారు చెవికమ్మలు దాచిపెట్టమని నాకిచ్చింది. నేను వాటిని నా పర్సులో ఉంచాను. రెండురోజుల తర్వాత నా స్నేహితురాలు ఆ చెవికమ్మలు తిరిగి ఇవ్వమని అడిగింది. అప్పుడు నేను నా పర్సు తీసి చూస్తే అందులో ఒక కమ్మ మాత్రమే ఉంది. దాంతో కొంచెం టెన్షన్‌కి గురైన నేను పర్సులో ఎంత వెతికినా రెండో కమ్మ దొరకలేదు. దాంతో ఇక అది దొరకదన్న ఆలోచన వచ్చి, "ఇతరుల దృష్టిలో నేను ఒక దొంగలా ఉండకూడద"ని బాబాని వేడుకొని ఎంతో బాధపడ్డాను. చాలాసేపటి తర్వాత అనుకోకుండా ఆ కమ్మ నా బట్టల బ్యాగు కింద నాకు దొరికింది. అదక్కడెలా ఉందో అర్థంకాక నేను కొంచెం షాకయ్యను. అదే సమయంలో బాబా కృపకు ఆనందంతో ఏం మాట్లాడలేకపోయాను. అసలు అది ఇక దొరకదన్న పూర్తి నమ్మకంతో ఉన్న నాకు అనూహ్యరీతిన బాబా ఇంత సహాయం చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను".



10 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. OM SRI SAIRAM 🙏🙏🙏🏻🙏🙏🏻🙏🏻

    ReplyDelete
  5. Om sai sri sai jaya jaya sai

    ReplyDelete
  6. Mo Sai Sri Sai jeya jeya sai

    ReplyDelete
  7. Om Sai Sri Sai jaya jaya Sai

    ReplyDelete
  8. Om sai ram ram krishan hari

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo