1. ధర్మబద్ధమైన కోరికల్ని ఆలస్యమైన సరే ఖచ్చితంగా తీరుస్తారు బాబా
2. సాయిని ప్రార్థించిన తక్షణం తీరిన సమస్య3. బాబా కృపతో చేకూరిన ఆరోగ్యం
సాయిబాబాకి, సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వీణ. మాది హైదరాబాద్. మా పెద్దబాబుకి 12 సంవత్సరాల వయస్సు. తను పుట్టినప్పుడు ఏడవలేదు, ఉలుకూపలుకు లేకుండా సైలెంట్‌గా ఉన్నాడు. డాక్టర్ ఉమ్మనీరు మింగి ఉంటాడేమో అని అన్ని టెస్టులు చేసి, "అన్నీ బాగానే ఉన్నాయి" అని చెప్పారు. కానీ బాబు సైలెంట్‌గా ఉండేవాడు. ఐదు సంవత్సరాల తర్వాత ఒక రోజు హఠాత్తుగా తను కింద పడిపోయి ఎంత పిలిచినా పలకలేదు. వెంటనే తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ నేను సాయిబాబా నామస్మరణ చేశాను. పది నిమిషాల తర్వాత బాబు ఏడ్చాడు. హాస్పిటల్‌కి చేరుకున్నాక డాక్టర్ చూసి బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అన్ని టెస్టులు చేసి మాకు ఏం చెప్పకుండా, "అంతా బాగానే ఉంద"ని రెండు రోజులు తరువాత డిశ్చార్జ్ చేశారు. తర్వాత బాబుకి పది సంవత్సరాలు ఉన్నప్పుడు టివి చూస్తూ మునపటిలాగే హఠాత్తుగా పడిపోయి రెండు నిమిషాల తరువాత లేచాడు. మరుసటిరోజు బాబుని కిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి తను పుట్టినప్పటినుండి ఎలా ఉన్నది చెప్పాం. డాక్టర్ కొన్ని టెస్టులు వ్రాస్తే చేయించాము. ఆ రిపోర్టులు చూసి డాక్టర్, "బాబుకి ఫిట్స్ సమస్య ఉంది. ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి సైలెంట్‌గా తనకి ఫిట్స్ వస్తాయి" అని చెప్పి టాబ్లెట్స్ వ్రాసి ఇచ్చారు. మేము బాబాపై భారమేసి ఆ టాబ్లెట్స్ వాడి ఆరు నెలల తర్వాత మళ్లీ హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టరు మళ్ళీ అవే టెస్టులు చేయించమన్నారు. నేను బాబుకి ఆ టెస్టులు చేయించేటప్పుడు తన పక్కనే ఉండి బాబా నామస్మరణ చేస్తూ, "బాబా! టెస్టు రిపోర్టులు నార్మల్ అని రావాలి. అలా వస్తే నా ఆనందాన్ని, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. టెస్టులు పూర్తయ్యాక రిపోర్టులు తీసుకొని డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. మేడం చూసి, "చాలావరకు తగ్గింది. వెరీ గుడ్" అని అన్నారు. "చాలా సంతోషం బాబా. ఎప్పటికీ నేను మీ పాదాల చెంత మా భారాన్ని వేసి మీ నామస్మరణ చేస్తూ ఉంటాను తండ్రి. మమ్మల్ని చల్లగా చూడండి".
మేము మా అపార్ట్మెంట్ అమ్మకానికి పెట్టి సాయిబాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! అనుకున్న ధరకి అపార్ట్మెంట్ అమ్ముడైతే శిరిడీలో అన్నదానానికి కట్టి, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆరు నెలలకి మేము అనుకున్న ధరకి మా అపార్ట్మెంట్ అమ్ముడైయింది. ఇలా బాబా మేము అడిగిన ధర్మబద్ధమైన కోరికల్ని ఆలస్యమైన సరే ఖచ్చితంగా ఇప్పటివరకు ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".
సాయిని ప్రార్థించిన తక్షణం తీరిన సమస్య
సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మురళి. కొన్ని నెలలుగా మా అమ్మాయికి నెలసరి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మందులు వాడినా ప్రయోజనం కనపడక మళ్లీ మళ్లీ అదే సమస్య రిపీట్ అవుతూ ఉంది. ఇక చేసేదిలేక నేను సాయినాథుని హృదయపూర్వకంగా శరణువేడి 2023, ఏప్రిల్ ఉదయం పది గంటలకు కొద్దిగా ఊదీ మా పాప నుదుటన పెట్టి, మరికొంత ఊదీ నీటిలో కలిపి ఇచ్చి, "ఇంకా నీ దయ బాబా" అని బాబాతో చెప్పుకొని ఆఫీసుకి వెళ్ళాను. రెండు గంటల తరువాత మా పాప నాకు ఫోన్ చేసి, "నెలసరి వచ్చింది" అని చెప్పింది. అది విని నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజంగా బాబా చేసిన అద్భుతం. ఆయన రెండు నెలలుగా రాని నెలసరి ఊదీ పెట్టిన రెండు గంటల్లో వచ్చేలా చేశారు. "ధన్యవాదాలు బాబా. భక్తుల బాధలు తొలగించే మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడూ ఇలాగే మా అందరి మీద కృపాదృష్టి వుంచు సాయినాథా. తొందరగా శిరిడీ దర్శన భాగ్యం కల్పించు బాబా. అలాగే నాకు స్థిరమైన ఉద్యోగం ప్రసాదించి ఆ అనుభవాలను కూడా బ్లాగులో పంచుకునే అదృష్టం నాకు ఇవ్వమని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను తండ్రి".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బాబా కృపతో చేకూరిన ఆరోగ్యం
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు మూర్తి. 2023, ఏప్రిల్ నెల మూడో వారంలో మా ఇంట్లో మా అబ్బాయికి, నాకు, నా భార్యకి ఒకేసారి జ్వరం, జలుబు, తుమ్ములు చాలా ఎక్కువగా వచ్చాయి. వాటితోపాటు నాకు దగ్గు కూడా ఎక్కువగా ఉండింది. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకుంటే మందులు వ్రాశారు. ఆ మందులు వాడినా కూడా పూర్తిగా తగ్గలేదు. అప్పుడు నేను, "ఈ దగ్గు, జ్వరం, జలుబు అన్నీ పూర్తిగా తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయినాథునికి నమస్కరించుకున్నాను. రెండు రోజులకు దాదాపు అన్ని పూర్తిగా తగ్గిపోయాయి. కొద్దిగా దగ్గు ఉంది. అది కూడా పూర్తిగా తగ్గిపోతుందని నాకు నమ్మకముంది. సాయి మహరాజ్ కు ధన్యవాదాలు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDelete