సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1524వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం
2. బాబా దయతో తగ్గిన రుతుస్రావ సమస్య

బాబా అనుగ్రహం


నాపేరు స్వాతి. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా సాయి బంధువులతో పంచుకోవాలని ఇలా వచ్చాను. 2023, ఏప్రిల్ 15న మేము గుడిలో అమ్మవారికి వడిబియ్యం పొద్దామనుకున్నాము. అదేరోజు తలపాగాలు ఇవ్వడానికి బాబా గుడికి కూడా వెళ్లాల్సి ఉంది. అందువల్ల ఇంట్లో దీపం పెట్టడానికి సమయం కుదరక బాబా గుడిలో దీపం పెట్టాలనుకున్నాను. అయితే గుడికి వెళ్ళాక నేను ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాను. ఆ గుడి మేనేజర్ వచ్చి "బాబా దగ్గర దీపాలు వెలిగించండి" అని చెప్పాకగాని గుడిలో దీపాలు వెలిగిద్దామని ఇంట్లో అనుకున్న విషయం నాకు గుర్తుకు రాలేదు. "ఎంత అద్భుతo బాబా మీ లీల?".


ఒకరోజు నేను పుస్తకం కవర్ పేజీ మీద ఉన్న బాబా పాదాలు ఒత్తుతూ సాయి చాలీసా చదివాను. ఆశ్చర్యంగా రోజూ బాగా లాగే నా కాళ్ళు ఆరోజు అస్సలు లాగలేదు. నేను ఆ రోజు రాత్రి ఆ విషయం గుర్తించి ఆశ్చర్యంతో బాబా అనుగ్రహానికి దాసోహమయ్యాను.


ఒకప్పుడు మా అపార్ట్మెంట్‍లో ఉండే మా స్నేహితురాళ్ల మధ్య మనస్పర్థలొచ్చి మేమంతా దూరమయ్యాము. ఆ విషయంగా నాకు రోజూ చాలా బాధగా ఉండేది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! మా స్నేహితురాళ్లు మధ్య మనస్పర్థలు తొలగి అంతా బాగుంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజుల్లో అన్ని అపార్థాలు తొలగిపోయి అందరం కలుసుకున్నాము. అలాగే మా అన్నలతో, మా అత్తింటివాళ్లతో సంబంధాలు కూడా మెరుగుపరిచారు బాబా. ఇంకా నా చిన్ననాటి నుండి ఎంతో సఖ్యంగా ఉన్న ఆంటీతో వచ్చిన మనస్పర్థలు తొలగించి మమ్మల్ని కలిపారు. మా బంధాన్ని మునుపటిలా పటిష్ట పరచమని బాబాను కోరుకుంటున్నాను.


ఒకసారి పన్ను నొప్పి వస్తే నిర్లక్ష్యం చేశాను. అది తగ్గినట్లే తగ్గి మళ్ళీ మొదలైంది. అప్పుడు నేను, "బాబా! ఫిల్లింగ్‌తో సమస్య తొలగిపోతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే డాక్టరు, "ఫిల్లింగ్ చేస్తాను. కొన్ని రోజులు చూద్దాం" అని ఫిల్లింగ్ చేసారు. బాబా దయతో ఫిల్లింగ్తో సమస్య తొలగిపోయింది. నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

 

ఒకసారి మా అన్న వదిన పుట్టినరోజు సందర్భంగా, "మేము హైదరాబాద్ వస్తాము. అందరం కలిసి ఒక రోజంతా బయట గడుపుదాం" అన్నారు. నేను సరే అన్నాను. కానీ హఠాత్తుగా ముందురోజు రాత్రి నుండి నా నడుము పట్టేసి విపరీతమైన నొప్పితో  కదలలేనంతగా అయింది నా పరిస్థితి. అప్పుడు బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! అన్నావాళ్ళు వచ్చేసరికి నొప్పి తగ్గించండి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత మావారు టాబ్లెట్లు తెచ్చారు. వాటితోపాటు కాపడం పట్టుకుంటే బాబా దయవల్ల మధ్యాహ్నం అన్నావాళ్ళు వచ్చేసరికి 60 శాతo నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. సదా మా అందరిపై మీ ప్రేమను ఇలానే కురిపించండి. ఏమైనా అనుభవాలు పంచుకోవడం మర్చిపోయుంటే క్షమించండి బాబా. దయచేసి నాన్న ఆరోగ్యం బాగుపరచండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను".


బాబా దయతో తగ్గిన రుతుస్రావ సమస్య


ఆ సాయినాథునికి శిరసా ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు విజయ. నేను ఒక సాయి భక్తురాలీని. నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకునే అవకాశమిచ్చిన సాయినాథునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. గత కొంతకాలంగా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. అదేమిటంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి నాకు నెలసరి వస్తూ పది రోజుల వరకు రుతుస్రావం అవుతుండేది. ఐదు రోజులు విరామం ఇచ్చి మళ్లీ నెలసరి రావడం, పది రోజుల వరకు రుతుస్రావం అవ్వడం జరుగుతుండేది. అలా ఆరు నెలలపాటు నేను మానసికంగా, శారీరకంగా చాలా నరకం అనుభవిస్తూ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాను. డాక్టర్స్ గర్భసంచి తీసేయాలని చెప్పారు. అప్పుడు నేను, "నా సమస్యకు పరిష్కారం చూపించు సాయినాథా" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఎవరో, "హోమియోపతి మందులు వాడితే తగ్గుతుంద"ని చెప్తే ఆ మందులు వాడటం మొదలుపెట్టాను. అప్పుడు కూడా మూడు నెలలు అదే పరిస్థితి కొనసాగి 2023, జనవరి 13, భోగి రోజున నాకు నెలసరి వచ్చింది. నేను ఐదు రోజులు దేవుడికి దీపం పెట్టాలన్నా కోరికతో, "బాబా! నా సమస్యను తగ్గించు. తగ్గిస్తే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మనస్పూర్తిగా బాబాను వేడుకున్నాను. ఆయన దయతో సంక్రాంతి రోజుకు నాకు ఎలాంటి సమస్య లేకుండా చేశారు. నేను చాలా సంతోషంగా సంక్రాంతి జరుపుకున్నాను. ఇప్పుడు నాకు నెలసరి సక్రమంగా వస్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. "ధన్యవాదాలు సాయినాథా! మా సమస్యలు పరిష్కరించి ఎల్లవేళలా మమ్ము కాపాడుతూ ఉండు సాయి దయామయ".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


6 comments:

  1. Please baba you remove confusion in every thing. I am feeling tension and anxiety. Please remove both and help me. Om sai ram🙏🙏🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Baba ma vishnu ki jab evvu baba🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Sri sai jaya sai jaya jaya sai 🙏🙏

    ReplyDelete
  5. Om sai sri sai jaya jaya sai

    ReplyDelete
  6. Sai dhaya vunte manam korukunna prathidi neeveeuthadhi adhi nijam, Sai chese maayalu thelusu kovali ante mana meedha aa karunamayudu dhaya kooda vundali 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo