సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1047వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దివ్యప్రేమ
2. శ్రీసాయి చల్లని అనుగ్రహం
3. 8 ఏళ్లనాటి కంటి సమస్యను వారం రోజుల్లో నయం చేసిన బాబా

బాబా దివ్యప్రేమ


సాయిభక్తులందరికీ, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము విదేశాల్లో ఉంటున్నాము. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. నేను ఈమధ్య మా పిల్లల సంతోషం కోసం మా ఇంట్లో బతుకమ్మ పండుగ సంబరాలు చేయ సంకల్పించాను. అయితే అతిథులందరూ వచ్చేసరికి చాలారోజుల నుండి కరోనా కారణంగా ఎవరినీ కలవట్లేనందున మా పాప ఒక్కసారిగా బాగా ఏడ్చి అస్సలు కిందకి దిగలేదు. దాంతో నేను, "పిల్లల సంతోషం కోసం ఇదంతా ఏర్పాటు చేస్తే ఇలా అయిందేంటి బాబా?" అని చాలా బాధపడ్డాను. బాబా ఫోటో వైపు చూస్తూ, "ప్లీజ్ బాబా, పాప ఇబ్బందిపడకుండా మంచిగా ఉండేలా చేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాను అడిగిన కొద్దిసేపటికి పాప మంచిగా ఉంది. అంతా బాబా దయ.


కార్తీకమాసంలో పౌర్ణమిరోజు మేము మా ఇంట్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేయాలని నిశ్చయించి అతిథులను ఆహ్వానించాము. ఆరోజు మధ్యాహ్నం వరకు దేవుడికోసం నైవేద్యం, వంట తదితర పనులన్నీ పూర్తిచేసి, పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసరికి నేను బాగా అలసిపోయాను. అప్పటికి అతిథులు కూడా వచ్చారు. ఒంట్లో అదోరకంగా ఉంటే డోలో 650 టాబ్లెట్ వేసుకుని పూజలో కూర్చున్నాను. కొద్దిసేపటికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించి పక్కనే ఉన్న బాబా ఫోటోని చూస్తూ, "బాబా! నావల్ల కావట్లేదు. ప్లీజ్, నాకు బాగుండేలా చేయండి బాబా. అంతా మంచిగా జరిగేలా చేయి తండ్రి" అని మనసులో అనుకున్నాను. బాబా దయవలన పూజ, అతిథుల భోజనాలు మంచిగా జరిగాయి. అందరూ వెళ్ళిపోయాక విశ్రాంతి తీసుకుందామని పడుకుంటే నిద్రపట్టక, లేచి సాయంత్రం పూజకి దీపాలు సిద్ధం చేసుకుని పూజ చేసుకున్నాను. అలా విశ్రాంతి లేకుండా రోజంతా పనులు చేసుకునే శక్తిని బాబా నాకు ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".


2021, డిసెంబర్ 19న మా బాబు పుట్టినరోజు. ఆరోజు ఉదయం నిద్రలేచి పూజ చేస్తూ అగరుబత్తి వెలిగిస్తే ఆ పొగ బాబా ఫోటో దగ్గరకు వెళ్లి రింగులుగా తిరుగుతూ పైకి వెళ్తుంది. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. 'రోజూ మామూలుగా పొగ వెళ్ళేది కదా, ఈరోజు ఏంటి ఇలా ప్రత్యేకంగా!' అనుకుని పూజ పూర్తిచేశాను. తరువాత నా నిత్య పారాయణకోసం నా టేబుల్ దగ్గరకి వెళ్లి మళ్ళీ చూస్తే, పొగ నిటారుగా పైకి వెళ్తుంది. బాబా తన ఉనికిని  చూపిస్తున్నారని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆ రోజు పని ఎక్కువై నాకు ఇబ్బందిగా ఉంటే బాబా ఫోటో ముందుకు వెళ్లి, "బాబా ప్లీజ్.. నాకు శక్తిని ఇవ్వండి. ఇబ్బందిని తొలగించండి ప్లీజ్. పార్టీ బాగా జరిగేలా చేయండి" అని ప్రార్ధించాను. బాబా దయవల్ల ఆరోజు పుట్టిరోజు వేడుక చాలా బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా! మీకు మాటిచ్చినట్లు పై అనుభవాలను పంచుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి".


నాకు సెర్వికల్ స్పాండియాలసిస్ ఉండటం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, ఎడమ చేయినొప్పి తరచుగా వస్తూ ఉంటాయి. ఈమధ్య ఆ నొప్పులతో కొన్నిరోజులు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో బాబా ఊదీ రాసుకుని, ఊదీ నీళ్లు త్రాగి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుని, "బాబా! నొప్పిని తగ్గించండి. మీ దయతో నొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఒక భక్తుని ద్వారా వచ్చిన బాబా సందేశాన్ని అనుసరించి అనథ శరణాలయంలో గోధుమపిండి ఇప్పించాను, మా అన్నయ్య చేత ధునిలో కొబ్బరికాయ వేయించాను. ఇంకా వాట్సాప్ స్టేటస్ ఆధారంగా ఒక భక్తుడు శిరిడిలో ఉన్నట్టు తెలిసి తనని, "శిరిడీలో అన్నదానానికి ఒక వెయ్యి రూపాయలు వ్రాయించండి. నేను మీకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుతాను" అని అడిగాను. తను సరేనన్నారు. తర్వాత నేను, "బాబా! శిరిడీలో అన్నదానానికి వ్రాయిస్తున్నాను. నా కర్మను తీసేసి, నాకున్న ఈ అనారోగ్య సమస్య నుండి నన్ను కాపాడండి" అని బాబాను వేడుకున్నాను. అంతే! అప్పటినుండి ఇప్పటివరకు ఏ నొప్పీ లేదు. "బాబా! మీ దయకు, దివ్యప్రేమకు శతకోటి వందనాలు దేవా".


శ్రీసాయి చల్లని అనుగ్రహం


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మా పాపకి పుట్టినప్పటి నుంచి డబ్బాపాలు ఇస్తున్నాము. అయితే 'ఎక్కువగా డబ్బాపాలు ఇవ్వడం మంచిది కాద'ని తెలిసినవాళ్ళు చెప్పడం వల్ల ఈమధ్య పాపకి నెలన్నర వయస్సు వచ్చాక మూడు రోజులు డబ్బాపాలు ఇవ్వడం అపి తరువాత మళ్లీ ఇచ్చాను. ఆరోజు పాప వాంతులు చేసుకుంటూ నిద్రపోలేదు. దాంతో నాకు టెన్షన్‍గా అనిపించి నా దగ్గర ఉన్న ఒక మెడిసిన్ పాపకి వేసాను. అయితే ఆ మెడిసిన్ వేశాక, 'అయ్యో! పాపాయి నిద్రపోవట్లేదని అనవసరంగా మెడిసిన్ వేసానా?' అనిపించింది. వెంటనే బాబా గుర్తొచ్చి, బాబాను ప్రార్ధించి పాపకి ఊదీ పెట్టాను. అంతే 15 నిమిషాలలో పాప హాయిగా నిద్రపోయింది. నిజంగా బాబాని మనస్పూర్తిగా అడిగితే, నెరవేరనిదంటూ ఏమీ ఉండదు.


గర్భవతిగా ఉన్నందువల్ల, తరువాత చిన్నపాప ఉన్నందువల్ల నేను దాదాపు ఒక సంవత్సర కాలంగా గుడికి వెళ్ళడం లేదు. అందువలన వీలును బట్టి బాబాని ప్రార్థిస్తూ ఉండటం, కొన్నిసార్లు నామం, కొన్నిసార్లు పారాయణ చేస్తూ ఉండేదాన్ని. కానీ నా మనసుకి శాంతి ఉండేది కాదు. బాబాకు ఏం చేయలేకపోతున్నానని దిగులుగా ఉంటుందేది. ఇలా ఉండగా 2021, డిసెంబరు 23 నుంచి 7రోజులపాటు మళ్లీ పారాయణ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే, ఎలా వీలుంటే అలా చదవాలనుకున్నాను. అంటే పడుకుని పాపకి పాలిస్తూ, తింటూ... అలా ఎందుకంటున్నానంటే నెలల బిడ్డతో నాకు అస్సలు సరిగా నిద్ర ఉండట్లేదు. కాబట్టి వీలు దొరికినప్పుడు నిద్ర, పని చేస్తున్నప్పుడు పారాయణ చేద్దామనుకున్నాను. అనుకున్నట్లే డిసెంబర్ 23న పారాయణ మొదలుపెట్టి డిసెంబర్ 29 నాటికి పూర్తి చేశాను. అది బాబా దయవల్లే సాధ్యం అయింది. నిజానికి నేను పడుకుని చదువుతున్నందుకు బాధపడ్డాను. కానీ ఈసారి బాబా లీలలు చదివేటప్పుడు ఆయా కథలలో బాగా నిమగ్నమవ్వగలిగాను. అందువల్ల ఆయా లీలలు నా కళ్ళ ఎదుటే జరుగుతున్నట్లు అనిపించేది. బాబా దయవల్ల అంతలా నిమగ్నమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "థాంక్యూ బాబా".


2021, డిసెంబరు 29న నా 7రోజుల పారాయణ పూర్తి అయ్యాక కూడా నాకు ఇంకా ఇంకా బాబాకోసం ఏదో ఒకటి చేయాలనిపించి అమెజాన్‍లో 'సాయికోటి' బుక్ ఆర్డరు చేశాను. తర్వాత కొత్త సంవత్సరంలో ఏమి చేయాలని నేను, మావారు మాట్లాడుకుంటూ బుక్ ఎప్పుడు వస్తుందోనని చూస్తే, అది జనవరి 1న డెలివరీ అవుతుందని వచ్చింది. దాంతో ఏదో యథాలాపంగా ఎటువంటి ప్రణాళిక లేకుండా బుక్ ఆర్డరు పెట్టిన నాకు బాబా దయతో కొత్త సంవత్సర కానుకగా 'సాయికోటి'ని ఇస్తున్నారని అనిపించింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. దయచేసి నా బిడ్డను చక్కటి ఆరోగ్యంతో చిరకాలం వర్ధిల్లేలా ఆశీర్వదించండి బాబా".


ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


8 ఏళ్లనాటి కంటి సమస్యను వారం రోజుల్లో నయం చేసిన బాబా.


శ్రీ'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు వందనం. నా పేరు నరసింహం. నా వయస్సు 55 సంవత్సరాలు. నేను బెంగుళూరు నివాసిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. ఎనిమిది సంవత్సరాల క్రితం నా రెండు కళ్ళకి గ్లుకోమా అని డాక్టర్లు నిర్ధారించారు. కుడికన్ను 80%, ఎడమకన్ను 70% ఎఫెక్ట్ అయ్యాయి. వాటికోసం నేను ఐ డ్రాప్స్ వాడుతూ ఉండేవాడిని. గత సంవత్సరం జనవరిలో కుడి కంటికి ఆపరేషన్ జరిగింది. కానీ ఫలితం శూన్యం. చూపు సమస్య ఇంకా ఎక్కువైంది. నేను చాలా భయపడ్డాను. నాలుగు హాస్పిటల్స్‌ను సంప్రదించాను కానీ, ప్రయోజనం లేకపోయింది. నేను శిరిడీసాయి భక్తుణ్ని. నా కుమారులిద్దరికీ సాయి నామం కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నాను. అయితే నాకు బాబాపై విశ్వాసం తక్కువ. అయినప్పటికీ కంటినొప్పి కారణంగా 2021, డిసెంబర్ నెల చివరిలో బాబాయందు శ్రద్ధ, సబూరీ ఉంచి ఐ డ్రాప్స్ వాడడం మానేసి, ఊదీ ధారణ చేస్తూ, ఊదీ కలిపిన నీళ్లు వాడుతూ, రాత్రుళ్ళు నా తలగడ కింద ఊదీ పొట్లం ఉంచుకోవడం మొదలుపెట్టాను. వారం రోజుల్లో మంచి ఫలితం కనిపించింది. ఇప్పుడు నాకు ఏ సమస్యా లేదు. అందుకే బాబా భక్తులందరూ ఆయనపట్ల శ్రద్ద, సబూరి కలిగి ఉండాలి. బాబాపట్ల అఖండ విశ్వాసంతో ఖండాంతరాలలో ఆయన ఖ్యాతిని నిలుపుదాం. "ధన్యవాదాలు బాబా".



12 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. BABA BLESS ME MY HUSBAND HEALTH.. 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

    ReplyDelete
  5. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🤗🌼🥰🌸😀🌹👪💕

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయినాథయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo