1. బాబా అద్భుత అనుగ్రహం
2. అనుకున్నదే తడవుగా ఆపదల నుండి కాపాడుతారు సాయితండ్రి
3. చిన్న చిన్న విషయాలలో సైతం అందుతున్న బాబా సహాయం
బాబా అద్భుత అనుగ్రహం
ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. మేము మా పాప పుట్టిన తర్వాత మూడో నెలలో బారసాల జరపదలచాము. 'అందుకు 2022, జనవరి 9న బాగుందని, అదే మంచి ముహూర్తమని, అయినప్పటికీ ఏవన్నా అడ్డంకులు వస్తే ముహూర్తం మారుద్దాం' అని పెద్దలు అన్నారు. నేను, మావారు 'అసలే మన పాపకి గుండె సమస్య ఉంది. కాబట్టి మంచి ముహూర్తమంటున్న ఈ ముహూర్తానికే బారసాల జరిపించేద్దాం' అనుకున్నాం. అయితే అది నాకు నెలసరి సమయం. నెలసరి రాకుండా టాబ్లెట్లు వేసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, బేబీకి పాలు ఇస్తున్నందువల్ల ఆ టాబ్లెట్లు వేసుకోకూడదు. ఇట్టి స్థితిలో నేను 'నా బాబా ఉండగా మాకు ఏం భయం లేద'ని, "బాబా! నాకు నెలసరి రాకుండా చేసి బారసాల వేడుక బాగా జరిగేలా అనుగ్రహించండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఏ ఆటంకమూ లేకుండా మా పాప బారసాల చాలా చక్కగా జరిగింది. పాపకి 'సాయి' అని వచ్చేట్టు పేరు పెట్టుకున్నాము.
అర్థరాత్రిళ్లు మా పాప పాలకోసం నిద్రలేస్తుంది. 2022, జనవరి 10న కూడా రాత్రి ఒంటిగంటకి లేచింది. తను లేవడానికి ముందు నాకు చెడు కలలు వచ్చాయి. అప్పుడు నేను 'నేను బాబాని పూజిస్తాను కదా! నాకు ఎందుకలా కల వచ్చింది?' అని అనుకున్నాను. అంతలో పాప లేవడంతో లైట్ వేసి పాపకి పాలిస్తూ బాబాను ప్రార్థించసాగాను. అంతలో నాకు ఎక్కడన్నా బాబా ప్రతిమ కనిపిస్తే బాగుండు అనిపించింది. అంతే, అద్భుతం జరిగింది. అల్మరా మీద బాబా కనిపించారు. నిజానికి అక్కడున్నది ఏదో మామూలు డిజైన్. అందులో బాబా నాకు స్పష్టంగా కనిపించారు. బాబాను చూస్తూనే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మా పాప కూడా బాబా కనిపిస్తున్న అల్మరా వైపు చూస్తూ బాగా నవ్వుతుంది. నిజానికి తను నవ్వడమన్నది చాలా తక్కువ. అలాంటిది తను చాలాసేపు బాబా కనపడుతున్న వైపు చూస్తూ నవ్వుతుంటే టెస్టు చేద్దామని పాప ముఖాన్ని పక్కకి తిప్పాను. అయినా పాప దృష్టి బాబా మీదే ఉంది. "బాబా! ఎంత పెద్ద అద్భుతాన్ని చూపించారు మీరు. బాబా.. బాబా.. నేను ఇప్పుడే ఇంత అద్భుతాన్ని చూస్తున్నాను. ఇంకా నా రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉన్నాయి. ధన్యవాదాలు బాబా. మీరు నాతోనే, నా కుటుంబంతోనే ఉన్నారు. నాకింకా భయం లేదు".
ఇకపోతే మా పాప సరిగా నిద్రపోకపాయినా, మలవిసర్జన చేయకపోయినా, పాలు త్రాగకపోయినా, ఇంకా ఏ సమస్య వచ్చినా బాబాని ప్రార్ధించి, పాపకి ఊదీ పెట్టినంతనే బాబా దయవల్ల అన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి. ఇంకో విషయం మూడు నెలలు వచ్చినప్పటి నుండి పాపకి పాలు సరిపోవడం లేదు. ఊదీ పెట్టి, బాబాను ప్రార్థిస్తే పాలు పాపకి సరిపోతున్నాయి. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే నా పాప సమస్యని తొలగించండి. ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కాపాడండి బాబా. నా కుటుంబాన్ని రక్షించు తండ్రి. సదా మీ సేవలో ఉండేట్టు మమ్మల్ని దీవించు. మా కోరికలన్నీ నెరవేర్చు. నా మొక్కులు తీర్చుకోనందుకు నన్ను క్షమించండి బాబా. తొందరలోనే వాటిని తీర్చుకునే శక్తిని ప్రసాదించండి బాబా. దయచేసి నా పుట్టింటి మరియు అత్తింటి కుటుంబాన్ని కాపాడండి బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
అనుకున్నదే తడవుగా ఆపదల నుండి కాపాడుతారు సాయితండ్రి
ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథునికి వేలవేల పాదాభివందనాలు. నా పేరు మల్లేశ్వరి. నేను ఇంతకుముందు సాయిబంధువులతో మూడుసార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. మన తండ్రి సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకి ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. ఈమధ్య మా నాన్నగారికి చేయి నొప్పి బాగా వస్తుంది. పెద్దాయన ఏ మందులు వాడినా నొప్పి తగ్గలేదు. దాంతో ఆయన, 'నాకు ఈ నొప్పి తగ్గదేమో! నా చేయి చచ్చుబడిపోతుందేమోన'ని భయపడ్డారు. నాకు నిద్రపోయే సమయంలో సాయిభక్తుల అనుభవాలు చదవడం అలవాటు. అలాగే ఆరోజు రాత్రి చదివినప్పుడు ఊదీ గురించి వచ్చింది. అది నాకోసమే వచ్చిందనిపించి ఊదీ తీసుకెళ్లి మా నాన్న చేతికి రాశాను. తెల్లారి నిద్రలేచి, "నాన్నా! చేయినొప్పి ఎలా ఉంది?" అని అడిగితే, "కొంచెం పరవాలేదు" అని చెప్పారు నాన్న. అప్పటివరకూ ఏ మందులు వాడినా ప్రయోజనం కానరానిది ఒక్కసారి ఊదీ రాసినంతనే కొంచం తగ్గింది. ఊదీ రాయడం నేను ముందే చేసి ఉండొచ్చు కానీ పెద్దవాళ్లు నాది చాదస్తం అనుకుంటారని అనుకున్నాను. నమ్మినవారికి ఆ సాయినాథుడు ఏదైనా చేస్తారు. అందుకు శ్రద్ధ, సబూరీ ఉండాలి. "ధన్యవాదాలు బాబా. తొందరగా నాన్నకి పూర్తిగా తగ్గాలని కోరుకుంటున్నాను తండ్రి".
మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. తను అక్కడ ఐదుగురుతో కలిసి ఉంటున్నాడు. మేము తనకి ఫిబ్రవరి 6న పెళ్లి నిశ్చయం చేశాం. ఇంతలో తన రూములో ఉన్న ఇద్దరికీ కరోనా వచ్చింది. దాంతో మా అబ్బాయితో సహా అందరూ కరోనా టెస్టుకి వెళ్లారు. అప్పుడు నేను, "బాబా! మా అబ్బాయికి నెగిటివ్ రావాలి. అలా వస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా మనల్ని ఆపదల నుండి కాపాడుతారు మన సాయితండ్రి. ఆయన నా బిడ్డను చల్లగా చూశారు. ఇక అన్నీ సక్రమంగా జరిగేలా చూసి అబ్బాయి పెళ్లి సవ్యంగా జరిపించాలి. ఆ తండ్రి దయ ఉంటే మనం ఏమైనా చేయగలం. "సాయినాథా తండ్రీ! ఎన్నో చెప్పాలని ఉంది. మీకు తెలియని సమస్యలు కాదు. అసాధ్యాన్ని సాధ్యం అయ్యేలా చూడు తండ్రి. తప్పులు ఉంటే మన్నించండి బాబా"
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
చిన్న చిన్న విషయాలలో సైతం అందుతున్న బాబా సహాయం
సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వాళ్లకు చాలా ధన్యవాదాలు. నేను రోజూ ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ బాబా ప్రేమను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. నేను ఇప్పుడు కొన్ని చిన్న చిన్న అనుభవాలు మీతో పంచుకుంటాను. ఇటీవల ఒకసారి మా నాన్నగారికి జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. ఆ లక్షణాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆందోళనగా ఉంటుంది. కాబట్టి నేను, "అవి కరోనా లక్షణాలు కాకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆ సాయినాథునికి చెప్పుకున్నాను. బాబా దయవల్ల నాన్నకి కరోనా కాదని, టైఫాయిడ్ అని తెలిసింది. ఇంకోసారి మా పెద్దబ్బాయికి వాళ్ళ నాన్నగారు వైర్లెస్ మౌస్ కానుకగా ఇచ్చారు. దానిలో ఉండే ఒక సిమ్ లాంటి భాగం ఇల్లు శుభ్రపరుస్తుంటే ఎక్కడో పడిపోయింది. మొత్తం అంతా వెతికాము కానీ, కనబడలేదు. నాకు సాయి మీద చాలా నమ్మకం. ఆ నమ్మకంతో 'అది ఎక్కడికి పోయుండదు. ఇంట్లోనే ఉంటుంది. దొరుకుతుందిలే" అని అనుకున్నాను. నా నమ్మకం వమ్ముకాలేదు. ఒక నెల రోజుల తర్వాత అది ఇంట్లోనే కనిపించింది. అలాగే ఒకరోజు రాత్రి నాకు తలనొప్పిగా ఉంటే, "బాబా! ఈ తలనొప్పి ఉదయనికల్లా తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఇలా చాలా చిన్న చిన్న విషయాలలో కూడా ఆ సాయినాథుడు నాకు సహాయం చేస్తున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఈ అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram ��
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness in the future Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee