1. ప్రసాదం విషయంలో నిర్లక్ష్యం కూడదని తెలియజేసిన బాబా
2. బాబా ఉండగా మనకు భయమేల?
3. సాయి కృపతో ఏదైనా సంభవమే!
ప్రసాదం విషయంలో నిర్లక్ష్యం కూడదని తెలియజేసిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. నేను 8వ సారి నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను. నాకు ఈ అవకాశమిచ్చిన బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. ఈమధ్య ఎవరో శబరిమలై వెళ్లొచ్చి మాకు ప్రసాదం ఇచ్చారు. మామూలుగా ఎవరైనా ప్రసాదమిస్తే పూజగదిలో బాబాకి నివేదించిన తరువాత మేము తీసుకుంటాము. అయితే ఆరోజు వెంటనే బాబాకి నివేదించకుండా ప్రసాదాన్ని ఒక బౌల్‍లో పెట్టి పూజగది దగ్గర ఉంచాను. అంతలో మా ఇంటికి రోజూ వచ్చే రాజు(శునకం. కుక్క అనడం నాకు ఇష్టముండదు) ఇంటి లోపలికి వచ్చి ఆ ప్రసాదం ప్యాకెట్ తీసుకుని పారిపోయింది. నేను అరుస్తున్నా ఆగలేదు. నేను, "పాపం బాగా ఆకలితో ఉందేమో, నేను ఆహారం పెట్టేవరకు ఆగలేకపోయింది. పోనిలే తిననీ" అనుకున్నాను. తరువాత నేను బయటకి వెళ్లి రాజు తినడం చూస్తుండగానే ఒక పురుగు నా చెవి లోపలికి వెళ్తుండటం నాకు తెలుస్తుంది. చిన్నప్పుడు ఒకసారి ఇలాగే నా చెవిలో పురుగు దూరి చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈమధ్య కూడా ఒకసారి చిన్నచీమ చెవి లోపలికి వెళ్ళింది. వెంటనే నేను బాబాని తలుచుకున్నాను. ఆయన దయవల్ల ఆ చీమ బయటకు వచ్చేసింది. ఆ అనుభవాన్ని ఇదివరకు బ్లాగులో పంచుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పురుగు చెవిలో దూరేసరికి, "ప్రతిసారీ నాకెందుకిలా అవుతుంది బాబా?" అని బాబాను తలుచుకున్నాను. ఇంకా "నేను ఏదైనా తప్పు చేసానా బాబా?" అని మనసులోనే బాబాను అడిగాను. తరువాత కొద్దిగా నీళ్లు చెవిలో పోస్తూ బయటికి వంపేయడం చేయసాగాను. అంతలో నాకు ఒక్కసారిగా ఒక సంఘటన గుర్తొచ్చింది. ముందురోజు నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు బాబా సందేశం కోసం ఒక చీటీ తీసాను. అందులో "చేసిన తప్పుకి లెంపలు వేసుకో. పంచభక్ష్య పరమాన్నాలను నివేదించు" అని వచ్చింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని లెంపలు వేసుకున్నాను. కానీ నా తప్పేంటో గ్రహించలేక బాబా స్పష్టంగా చెప్తే బాగుండేది అనుకున్నాను. మళ్ళీ అంతలోనే, "నేను ఈ జన్మలోనే ఎన్నో తప్పులు చేసాను. గత జన్మలో ఇంకెన్ని చేసి ఉంటానో! దాని గురించి బాబాని అడగడం ఎందుకు? ఆయన లెంపలు వేసుకోమన్నారు. వేసుకున్నాను, అంతే" అని వదిలేసాను. ఇదంతా గుర్తొచ్చాక "ప్రసాదాన్ని అలా వదిలేయడం తప్పేమో!" అనిపించింది. మళ్ళీ అంతలోనే "అది తప్పు ఎలా అవుతుంది? పాపమది ఆకలితో ఉందనిపించినందువల్ల దానిని నేను ఏమీ అనలేదు" అని అనుకున్నాను. కాని ఎందుకనో "అయ్యప్పస్వామికి కోపం వచ్చింది. లెంపలు వేసుకో" అని బాబా చెప్తున్నట్లు నా మనసుకి అనిపించింది. దాంతో, "ఇంకెప్పుడూ ఇలా చేయను. నన్ను క్షమించండి" అని అయ్యప్పస్వామికి, బాబాకి క్షమాపణ చెప్పుకున్నాను. తరువాత ఊదీ కలిపిన నీళ్లు నా చెవిలో పోసాను. ఊదీ మహిమ వలన ఒకసారి పోయగానే ఎలా వెళ్లిందో, అలానే ఆ పురుగు బయటకి వచ్చేసింది. ఇది చిన్న విషయంలా ఎవరికైనా అనిపించవచ్చు. కాని నా చిన్నప్పుడు చెవిలో పురుగు దూరినందువల్ల హాస్పిటల్‍కి వెళితేగాని నేను ఆ కష్టం నుండి బయటపడలేదు. అంతలా ఇబ్బందిపడ్డాను గనుకే నాకు చాలా భయం.
ఏదైనా గురువుకి సమర్పించాకే మనం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రసాదం విషయంలో నిర్లక్ష్యం కూడదని బాబా నాకు అర్థమయ్యేలా తెలియజేసారు. ఎందుకంటే, మనకి సమస్తమూ ఇచ్చేది ఆయనే. ఈ విషయం నాకు నెమ్మదిగా అర్థమై శబరిమలై ప్రసాదాన్ని బాబాకి పెట్టకుండా అలా ఎలా చేసానని అనిపించింది. ఏమైనా తెలియక చేసాను కాబట్టి బాబా నన్ను క్షమించి నా తప్పుని నాకు అర్ధమయ్యేలా చేసారు అనుకుంటున్నాను. ఆయనెప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. కాబట్టే మరుసటిరోజు జరగబోయే తప్పిదానికి ఏం చెయ్యాలో ముందే తమ సందేశం ద్వారా తెలియపరిచారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. మీ భక్తులందరినీ ఆశీర్వదించండి".
బాబా ఉండగా మనకు భయమేల?
సాయి భక్తులకు నమస్కారాలు. సాయి భక్తుల అనుభవాల బ్లాగు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లత. మాది హైదరాబాద్. నేను ఇంతకుముందు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మా బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడి చదువు గురించి నేను చాలా ఆందోళనపడ్డాను. ఎందుకంటే, క్లాసులన్నీ ఆన్లైన్లోనే జరిగినందువల్ల బాబుకు ఎంత మాత్రమూ కాన్సన్ట్రేషన్ కుదరక చాలా ఇబ్బందిపడ్డాడు. అందువల్ల నాకు బాబు పాస్ అవుతాడా, లేదా అని చాలా భయమేసి బాబా మీదే నమ్మకం ఉంచాను. బాబు ఎక్కువగా కష్టపడకపోయినప్పటికీ 87శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అది కేవలం బాబా దయవల్లే సాధ్యమైంది.
ఒకసారి మా పిల్లలు ఇద్దరు కర్ణాటక టూర్ వెళ్తామన్నారు. కరోనా రోజుల్లో వాళ్ళని పంపించడం ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ, రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎటూ వెళ్లక ఇంట్లోనే ఉంటూ చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే బాబా మీద నమ్మకం ఉంచి అంతా ఆయన చూసుకుంటారని వాళ్ళిద్దర్ని పంపించాను. వాళ్ళు టూర్‍లో ఉన్నప్పుడు ఒకరోజు చిన్నబాబుకి జలుబు చేసింది. ఆ విషయం తెలిసి నాకు భయమేసి బాబాతో, "బాబా! మీ ఊదీ బాబు నోట్లో వేస్తున్నట్లు భావించి నా నోట్లో వేసుకుంటున్నాను. రేపు ఉదయానికి బాబుకి బాగుందని నాకు తెలియాలి" అని చెప్పుకుని బాబా ఊదీ నా నోట్లో వేసుకున్నాను. మరుసటిరోజు ఉదయాన్నే మా అక్క ఫోన్ చేసి, "బాబుకి తగ్గింది, బాగానే ఉన్నాడు. కంగారుపడవలసిన అవసరం లేద"ని చెప్పింది. బాబా దయవల్ల పిల్లలు పదిరోజులు అక్కడ ఆనందంగా గడిపి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. మా అక్కవాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని బాబాను కోరుకుంటున్నాను. బాబా దయవల్ల ప్రస్తుతం మావారి షుగర్ కాస్త అదుపులో ఉంటుంది. బాబా ఉండగా మనకు భయమేల? మీరందరూ బాబా మీద నమ్మకం ఉంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. దయార్దహృదయులైన బాబా కృపవలన అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.
సాయి కృపతో ఏదైనా సంభవమే!
నా పేరు విజయ. మేము ఢిల్లీలో నివాసం ఉంటున్నాము. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ బ్లాగులోని సాయిలీలను చదివిన తర్వాతే నా రోజు ప్రారంభిస్తాను. అనుభవాలను పంపినా, చదివినా బాబాతో ఆనందాన్ని పంచుకుంటున్న అనుభూతి కలుగుతుంది. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. అయితే ఆలస్యంగా పంచుకుంటున్నందుకు చింతిస్తున్నాను. నా కొడుకు పవన్ చైతన్య 10వ తరగతి చదువుతున్నాడు. తను తన ఇంటర్నల్ మార్కులకోసం ప్రాజెక్ట్‌లు సమర్పించాల్సి ఉండగా తను కష్టపడి ప్రాజెక్ట్‌లు తయారుచేసి స్కూళ్ళో సబ్మిట్ చేశాడు. తన టీచరు ప్రాజెక్ట్‌లో స్వల్ప మార్పులని సూచించి, వాటిని మార్చి మరుసటిరోజు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పారు. అయితే అదే ప్రాజెక్ట్ సబ్మిషన్‍కి చివరి రోజు. అందువల్ల మా అబ్బాయి ఆరోజు అర్థరాత్రి వరకు టీచరు సూచించిన అన్ని మార్పులు చేసి పడుకున్నాడు. మరుసటిరోజు భారీ వర్షం పడుతుండగా మా అబ్బాయి, వాళ్ళ నాన్నగారు గొడుగు తీసుకుని ఇంటి నుండి బయలుదేరారు. భారీ వర్షంలో వాళ్ళు ఆటోలను అపుతుంటే, ఎవరూ బాబుని స్కూలుకి తీసుకెళ్లేందుకు సిద్ధపడలేదు. నేను లోపలికి వెళ్లి బాబా ముందు కన్నీళ్లు పెట్టుకుని, "బాబా! దయచేసి సహాయం చేయండి. ఈరోజే చివరిరోజు. వర్షం నిలిచిపోయేలా చూసి బాబు సమయానికి స్కూలుకు చేరుకునేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. అంతే, బాబా దయవల్ల అంత జోరు వానలో ఒక ఆటో బాబు ముందు ఆగి, "రా! నేను నిన్ను స్కూలు వద్ద దించుతాను" అని అన్నాడట. ఈ విషయం నా భర్త ఇంటికి తిరిగొచ్చి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఆ క్షణాన నేను పొందిన సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాను. అసంభవాన్ని సాయి మాత్రమే సంభవం చేయగలరు. మాకు ఏ అవసరం వచ్చినా మేము మనస్పూర్తిగా బాబాను ప్రార్థిస్తాము. ఆయన మా ప్రార్థనను విని మాకు సహాయం చేస్తారు. "ధన్యవాదాలు సాయి". నేను ఇంకా మూడు విషయాల గురించి బాబాను ప్రార్థించాను. అవి నెరవేరితే మీ అందరితో పంచుకుంటాను.
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba Na personal issues resolve ayyetattu Chudu Sai
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🙂❤😊🌹😃🌺🥰🌸😀🌼🤗💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete