సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1043వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దేవుడు - ఆయన దయవలన చేకూరిన ఆరోగ్యం
2. అడిగినంతనే ఎటువంటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా
3. మనం నమ్ముకున్న సాయి మనల్ని బాధపెట్టరు

బాబా దేవుడు - ఆయన దయవలన చేకూరిన ఆరోగ్యం


శ్రీ శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు సాయి రాజ్ కుమార్. మాది వరంగల్. నేను చాలాకాలంగా సాయిబాబా భక్తుడిని. శిరిడి సాయినాథుడు నాపై కురిపించిన గొప్ప గొప్ప అద్భుతమైన ఆశీస్సులు చాలా ఉన్నాయి. అందులో నుండి ఈ మధ్య జరిగిన ఒక మహిమాన్వితమైన వరం గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. రెండు నెలల క్రితం నేను కాస్త జ్వరంతో అనారోగ్యం పాలయ్యాను. రెండు, మూడు రోజుల్లోనే ఆ జ్వరం కాస్త చాలా ఇబ్బందికరంగా మారి నా ప్రాణాలు పోతాయేమోనన్నంత భయాన్ని కలిగించాయి. అర్ధరాత్రి నా ఛాతీ, కడుపు, నడుము వంటి వివిధ భాగాలలో నొప్పిగా అనిపించి ఆయాసంతో భరించలేనంత ఇబ్బంది కలిగింది. వెంటనే కన్నీటితో శిరిడీ సాయినాథుని, "ఈ బాధల నుంచి నాకు విముక్తిని ప్రసాదించండి" అని ప్రార్థించాను. సచ్చరిత్ర చదువుతూ "ఈ రాత్రి ఎప్పుడు తెల్లారుతుంది బాబా?" అని బాధతో విలపించాను. కాసేపటికి సాయిభక్తులకు దివ్యవరమైన సాయి సచరిత్రను పక్కలో పెట్టుకుని పడుకున్నాను. సచ్చరిత్ర మహిమ వలన నాకు ఆ రాత్రి నిద్రపట్టింది. తెల్లవారుతూనే నిద్రలేచి బాబాను ప్రార్థించి  ఆసుపత్రికి బయలుదేరాను. కారులో వెళ్తూ సచ్చరిత్రను నా పక్కనే పెట్టుకుని వెళ్తున్నంతసేపు మనసులో సాయిబాబాను కన్నీటితో, "ఆసుపత్రిలో డాక్టరు చేసే వైద్య పరీక్షల ఫలితాల్లో ఎలాంటి ఇబ్బందికర వ్యాధులు లేవని రావాలి. డాక్టరు వ్రాసే చిన్న మందు గోలీలతో నా అనారోగ్యం పూర్తిగా తగ్గిపోవాలి. నా ఆరోగ్యం పూర్తిగా బాగుపడాలి" అని వేడుకున్నాను. నేను ఆసుపత్రికి చేరాక నాకు ఈసీజీ పరీక్ష చేస్తుంటే, 'సాయిబాబా పాదాలు నా ఛాతిలో ఉన్నట్లు, తళుక్కున మెరిసినట్లు, ఇంకా నా కళ్ళల్లో బాబా ప్రత్యక్షమైనట్లు' అనిపించి కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా పరీక్ష చేస్తున్న వైద్యుడు కనిపించాడు. నేను ఆయనతో, "మీరు సాయినాథుని రూపంలో కనిపించారండి" అని చెప్పాను. అందుకు ఆయన నవ్వి, "నీకు ఏమీ కాదు, అంతా బాగుంటుంది. ధైర్యంగా ఉండు" అని చెప్పారు. ఆ తర్వాత జాండీస్ పరీక్షలు, థైరాయిడ్ పరీక్ష, కొన్ని స్కానింగ్లు చేశారు. అప్పుడు కూడా సాయినాథుని బంగారు దివ్య పాదాలు నామీద ఉన్నట్లుగా నా మనో నేత్రాల్లో తళుక్కున మెరిసాయి. ఆ విషయం వైద్యులందరికీ చెప్పాను. వాళ్ళు, "చాలా సంతోషం. నీకు ఎలాంటి వ్యాధి లేదు. అన్ని రిపోర్టులు బాగున్నాయి. కేవలం కొద్దిపాటి జాండీస్ మాత్రం ఉంది. మందులు వాడితే తగ్గిపోతుంద"ని చెప్పారు.


తరువాత ఒకరోజు నేను సాయిబాబా మందిరంలో కూర్చుని బాబాను ప్రార్థిస్తుండగా అనుకోకుండా నా సెల్ ఫోన్‍లో భీమాజీపాటిల్ స్టోరీ ప్రత్యక్షం అయింది. అది పూర్తిగా చదివిన నాకు 'భీమాజీ పాటిల్ కొచ్చిన క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలించిన విధంగానే జాండీస్ వలన నాకిచ్చిన అనారోగ్యాన్ని తొలగిస్తామ'ని బాబా చెప్పకనే చెప్తున్నట్లు అనిపించింది. అప్పటినుంచి నేను ధైర్యంగా ఉన్నాను. 28 రోజులు మందులు వాడాక నాకు జాండీస్ పూర్తిగా తగ్గిపోయి నాలో నూతన ఉత్తేజం సంతరించుకుంది. తర్వాత నేను ప్రతివారం సాయినాథుని గుడికి వెళుతూ విశ్రాంతి తీసుకున్నాను. ఇప్పుడు జ్వరం పూర్తిగా తగ్గిపోయి నేను చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను. బాబా దేవుడు. సాయినాథుని దయవలనే నా ఆరోగ్యం బాగైంది. ఆయన ఆశీస్సులతో నేను నాకొచ్చిన కష్టం నుండి బయటపడ్డాను. నా కుటుంబం, స్నేహితులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అనుభవం ద్వారా నాకు బాబా మీద మరింత ధృఢమైన విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ, సబూరీలు ఏర్పడ్డాయి. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. నా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చు తండ్రి. తెలిసీతెలియక ఏమైన తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించి కరుణించండి సాయినాథా".


అడిగినంతనే ఎటువంటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా


ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. బ్లాగు ద్వారా సాయిభక్తులకు తమ అనుభవాలను పంచుకునే చక్కటి అవకాశం కల్పిస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నాపేరు హరిత. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా ఎల్లప్పుడూ నాకు తోడుగా వుంటూ ఎంతటి సమస్యనైనా చాలా చిన్న సమస్యగా చేసి పరిష్కరిస్తున్నారు. నేను ఇదివరకు నా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకసారి నేను, మా అన్నయ్య బండి మీద వెళ్ళాము. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు పెట్టి ఉన్నారు. అసలు ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా నేరుగా వెళ్లే మా అన్నయ్య ఆరోజు బారికేడ్ల మధ్యగుండా వెళ్ళాడు. మా ముందు చాలామంది ఉన్నారు. వాళ్ళనెవరినీ పోలీసులు ఆపలేదు. కానీ మేము సరిగ్గా వాళ్ళని సమీపించేసరికి మమ్మల్ని ఆపి ఫోటోలు తీశారు. మేము వాళ్ళని బ్రతిమిలాడితే, "మీరు ఇలా వెళ్ళకూడదు. యినా జరిమానా పడదు. కానీ మీ ఫోటోలు పేపరులో వేస్తాము" అన్నారు. నాకు చాలా భయమేసి బాబాని తలుచుకుని మా డాడీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. తరువాత 'పోలీసులు ఫోటోలు డిలీట్ చేస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు ఫోటోలు డిలీట్ చేశారు.


నాకు పిసిఒడి సమస్య వల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తుంటాయి. ఈమధ్య ఒకసారి నేను, "బాబా! తొందరగా ఈ గురువారంలోపు నాకు పీరియడ్స్ వచ్చేలా చేయండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. అంతే! మూడురోజుల్లో నాకు పీరియడ్స్ వచ్చాయి. "థాంక్యూ బాబా. రెగ్యులర్‍గా నాకు పీరియడ్స్ వచ్చేలా అనుగ్రహించండి బాబా".


ఇటీవల నాతో ఎక్కువగా ఫోన్‍లో మాట్లాడుతుండే మా మామయ్యగారి అమ్మాయి హఠాత్తుగా మాట్లాడటం మానేసింది. నేను ఎన్నిసార్లు తనకి ఫోన్ చేసినా కట్ చేస్తుండేది. నాకు ఎంతో బాధగా అనిపించి, "బాబా! తను నా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేలా చూడండి. నాకు చాలా బాధగా ఉంటుంది" అని బాబాతో చెప్పుకుని తనకి ఫోన్ చేస్తే, తను నాతో మాట్లాడింది. అప్పుడు నా మనసంతా చాలా తేలికపడింది.


ఇటీవల ఒకసారి మా ఇద్దరి అన్నయ్యల మధ్య చిన్న చిన్న మాటల విషయంలో తేడా వచ్చి పెద్ద గొడవగా మారింది. అప్పుడు నేను మనసులో బాబాని తలుచుకుని, "బాబా! ఈ గొడవ ఆగిపోయేలా చూడండి. అలా జరిగితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల కొద్దిసేపట్లో ఆ గొడవ సద్దమణిగింది. "థాంక్యూ బాబా. ఇలానే నా జీవితానికి సంబంధించిన అతిపెద్ద సమస్యను పరిష్కరించి తొందరలోనే ఆ అనుభవాన్ని పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఎప్పటికీ మీరు నాకు తోడుగా ఉంటూ మార్గనిర్దేశం చేయండి". బాబాకిచ్చిన మాటప్రకారం నా అనుభవాలను బ్లాగులో పంచుకోవడం నాకు చాలా అనందంగా ఉంది. మనకి ఎప్పుడు, ఏది, ఎలా ఇవ్వాలో బాబాకు తెలుసు. ఆయన ఉండబట్టే మనం ఎంతటి కష్టాన్నైనా నొప్పి తెలియకుండా భరించగలుగుతున్నాము.


సర్వం సాయిమయం!!!


మనం నమ్ముకున్న సాయి మనల్ని బాధపెట్టరు


అందరికీ నమస్కారం. నా పేరు సాయిలక్ష్మి. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. నేను ఎప్పటినుండో కోరుతున్న కోరిక విషయంలో బాబా అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నా వివాహం 2021, డిసెంబరు 9న జరిగింది. ఆరోజు గురువారం అవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అయితే ఆరోజు ఉదయం వర్షం పడటంతో పెళ్లికోసం చాలా ఘనంగా చేసిన ఏర్పాట్లన్నీ పాడైపోతాయేమోనని అందరూ భయపడ్డారు. నేను మాత్రం చాలా ధైర్యంగా ఉండి, "బాబా! వర్షం తగ్గి పెళ్లి వైభవంగా జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయికి మ్రొక్కుకున్నాను. మనం నమ్ముకున్న సాయి మనల్ని బాధపెట్టరు కదా! వర్షం తగ్గడమే కాకుండా చాలా ఎండ కాసింది. బాబా దయవల్ల మేము అనుకున్న దానికంటే పెళ్లి చాలా వైభవంగా జరిగింది. శ్రద్ధ, సబూరీలు ఉంటే మనం కోరిన కోరికలు బాబా తప్పక తీరుస్తారని మరోసారి ఋజువైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



10 comments:

  1. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om sai ram please baba bless my family with health baba.Give long life baba to my husband and children sai.sai please save from health issues.

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalu tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  7. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  8. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🙂❤😊🌹😃🌺🥰🌸😀🌼🤗💝💕

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo