సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1038వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయిబాబా అనుగ్రహం
2. బాబా ఆశీస్సులు
3. పిలిచినంతనే పలికే దైవం

శ్రీసాయిబాబా అనుగ్రహం


"నాపై మీ అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు బాబా". నేను ఒక సాయిభక్తురాలిని. మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. అందరికీ నమస్తే. ఈ బ్లాగు వారికి కృతజ్ఞతలు. నేను ఏడోసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఈ బ్లాగు గురించి తెలియకముందే బాబా నా జీవితంలోకి వచ్చారు. ఆయన ఎవరూ నమ్మలేని విధంగా నా జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో అనుభవాలు ప్రసాదించి, తమ ఉనికిని చాలా స్పష్టంగా నాకు చూపించారు. అవన్నీ చెప్పడానికి ఒక రోజు సరిపోదు. వాటిని ఒక పుస్తక రూపంలో గానీ, ఏదైనా మ్యాగజైన్‍లో గానీ, ఏదైనా బాబా భక్తుల యూట్యూబ్ ఛానెల్లో గానీ పంచుకోవాలని నా మనసులో ఉండేది. కానీ ఇలా బ్లాగులో పంచుకునే అవకాశం దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ బ్లాగులోని తర్ఖడ్ కుటుంబ అనుభవాలు చదివినప్పటి నుంచి అలా బాబా ప్రసాదించిన అనుభవాలన్నీ ఒక సీరీస్‍లా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. అలా చేయడం వల్ల ఒక అనుభవానికి, మరో అనుభవానికి ఉన్న కనెక్షన్ మన సాయి కుటుంబంలోని అందరికీ అర్థమవుతుంది. ఉదాహరణకు సాయిసచ్చరిత్రలోని బాబా పాదాల చెంత పులి సద్గతి పొందే కథనం చదివేటప్పుడు నాకు చాలా సందేహాలు వచ్చేవి. తర్ఖడ్ అనుభవాలు చదివాక నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. బాబా తర్ఖడ్‍తో ఆ పులి బాధను భరించలేక మరణాన్ని ప్రసాదించమని కోరుకుందని చెప్పడం, బాబా పాదాల చెంత చనిపోవడం వల్ల ఆ పులికి ఉత్తమ జన్మ లభించిందని తర్ఖడ్ కుటుంబం అనుభవాలలో చదివాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాక బాబా గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారి చరిత్రలోని అంశాలను అపార్థం చేసుకుంటున్నానని నాకు అర్థమైంది.


ఇకపోతే ఈ బ్లాగులో పంచుకుంటానని ముందుగా సంకల్పించుకున్న రెండు అనుభవాలను ఇప్పుడు పంచుకుంటాను. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా ఇవ్వడం వల్ల ఈమధ్య మా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన కొంత మొత్తం రాలేదు. దానిగురించి మా కుటుంబసభ్యులు టెన్షన్ పడుతుంటే నేను బాబాను, "బాబా! ఎలాగైనా మాకు రావాల్సిన డబ్బులు మాకు వచ్చేలా చేయండి" అని ప్రార్థించాను. కొన్నిరోజుల ప్రయత్నంతో మాలో ఎవరి డబ్బులు వాళ్లకి వచ్చేలా బాబా అనుగ్రహించారు


ఇటీవల వాతావరణ మార్పు వల్ల మేము రోజూ ఆందోళనగా ఉండేవాళ్ళము. ఎందుకంటే, వర్షాలు లేదా తుఫాన్ల వల్ల పంటంతా వ్యర్ధమైపోతుంది. అట్టి స్థితిలో నేను బాబాను, "ఎలాగైనా కొన్ని రోజులపాటు ప్రకృతి మాకు సహకరించేలా చూడండి బాబా" అని అర్థించాను. బాబా నేను కోరుకున్నట్లే సహాయం చేసి ఎలాంటి పంట నష్టం జరగకుండా కాపాడారు. "థాంక్యూ బాబా".


బాబా ఆశీస్సులు


నాపేరు వనిత. నేను సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా అమ్మ సజీవులుగా ఉన్నప్పటి నుండి అంటే గత 20 సంవత్సరాలుగా మేము నా సోదరుడి కోసం ఒక ఇల్లు కొనాలని వెతుకుతున్నాము. మూడు సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోయింది. నా సోదరుడు చిన్నచిన్న సమస్యల కారణంగా తన భార్యతో విడిపోయి కొంతకాలం మా ఇంట్లో, కొంతకాలం మా సిస్టర్స్ ఇంట్లో ఉంటున్నాడు. 2021, అక్టోబర్ నెలలో తను హైదరాబాదులోని మా ఇంటికి వచ్చాడు. మరుసటి వారం తను నవగురువార వ్రతం మొదలుపెట్టగా నేను తనికి సహాయం చేయసాగాను. బాబా దయవల్ల 4 వారాల వ్రతం పూర్తయిన తర్వాత మేము తనకోసం ఒక అపార్ట్‌మెంట్ తీసుకోగలిగాము. ఇటీవల బాబా ఆశీస్సులతో గృహప్రవేశం కూడా చేసాము.


2021, నవంబరు నెల చివరిలో ఒకరోజు వేడినీళ్ళు తీస్తుండగా అనుకోకుండా చాలా వేడిగా ఉన్న నీళ్ళు నా చేతుల మీద పడ్డాయి. వెంటనే నేను బాబా ఊదీ కొబ్బరినూనెలో కలిపి చేతులకి రాసుకున్నాను. అలా చేయడంతో బాబా అనుగ్రహం వల్ల నా చేతులు బొబ్బలు ఎక్కలేదు. అయితే చాలా నొప్పిగా ఉండేది. కానీ సాయిని ప్రార్థిస్తూ ఉండటం వల్ల నెమ్మదిగా నాకు ఉపశమనం లభించి నా పనులు నేను చేసుకోగలిగాను.


రెండు సంవత్సరాల తరువాత ఇటీవల నేను నా పిల్లల్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ లో మా స్వగ్రామానికి తీసుకువెళ్ళాను. బాబా దయవలన రానుపోను మాకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. మేము సంతోషంగా మా ప్రయాణాన్ని ముగించాం.


పిలిచినంతనే పలికే దైవం


నేను ఒక సాయిభక్తురాలిని. నేను 1983 నుంచి బాబాను సేవిస్తున్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను పిలిచినంతనే వచ్చి నా సమస్యను పరిష్కరిస్తున్నారు బాబా. అందువలన నాకు బాబాతో చాలా అనుభవాలున్నాయి. వాటిలోనుండి ఈమధ్య జరిగిన ఒక అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మా అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆరు సంవత్సరాలైనా జీతంలో పెద్దగా మార్పులేనందున మా అబ్బాయి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి క్రొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అయితే తనని ఇంటర్వ్యూ చేసిన ఏ ఒక్క కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేయడానికి ముందుకు రాలేదు. కారణం ఏమిటో మాకు తెలియలేదు. చివరకి ఒక గురువారంనాడు నేను బాబా పూజలో కూర్చొని మధ్యాహ్నం 12 గంటలప్పుడు మా అబ్బాయి ఉద్యోగ విషయంలో బాబాతో పోట్లాడాను. పూజ ముగించి వచ్చిన మరుక్షణం 'తనకి ఉద్యోగం వచ్చింద'ని మా అబ్బాయి నుండి ఫోన్ వచ్చింది. బాబా అనుగ్రహం వల్ల జీతం కూడా చాలా ఎక్కువ. బాబాకు నేను సదా ఋణపడి ఉంటాను. "ధన్యవాదాలు బాబా".


సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


8 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  6. Om sai ram save my son's family tandri.mother,and son effected with fever.cold please cure them.be with them.bless them with health

    ReplyDelete
  7. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri tondarga please

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo