1. ఏ సమస్యనైనా తొలగించే దయామయుడు సాయి
2. ఎప్పుడు, ఎలా ఆశీర్వదించాలో బాబాకి తెలుసు
3. బాబా ఊదీ అనుగ్రహం
ఏ సమస్యనైనా తొలగించే దయామయుడు సాయి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి. సాయే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, రక్షకుడు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నేను 45 రోజులపాటు వినాయకునికి 108 ప్రదక్షిణలు చేయాలని సంకల్పించాను. తదనుసారం 2021, అక్టోబరులో నేను ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాను. ఇంకా వారం రోజులు ప్రదక్షిణలు చేయాల్సి ఉందనగా నా నెలసరి సమయం వచ్చింది. అప్పుడు నేను సాయిని, "సాయీ! ఈ వారం రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రదక్షిణలు పూర్తి అయ్యేలా అనుగ్రహించండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల 45 రోజుల ప్రదక్షిణలు దిగ్విజయంగా పూర్తి చేశాను. నా ప్రదక్షిణలు పూర్తి అయిన మరుసటిరోజు నాకు నెలసరి వచ్చింది. అది బాబా ఆశీర్వాదం.
2021, డిసెంబర్ 31న హాస్టల్లో ఉన్న మా పాప ఎగురుతూ కిందపడి నొప్పితో నడవలేకపోయింది. ఇంకా టాబ్లెట్ వేసుకుని ఆ రాత్రి పడుకుంది. ఉదయం లేచాక బాత్రూంకి వెళ్ళడం తనకి కష్టం అయింది. దాంతో 'కాలుకు ఏమైందో, ఒకవేళ ఫ్రాక్చర్ అయితే తన చదువు ఆగిపోతుంద'ని నాకు చాలా భయమేసింది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో నేను "ఇప్పుడు ఎలా సాయీ? నువ్వే మాకు దిక్కు. ఎలాగైనా తన కాలు నొప్పి తగ్గేలా అనుగ్రహించండి బాబా" అని బాబాను ప్రార్థించాను. ఆ కరుణామయుడు గురించి చెప్పనవసరం లేదు. ఆయన దయవల్ల 12 గంటలకి మా పాప ఫోన్ చేసి, "ఎటువంటి నొప్పీ లేదు, సంతోషంగా ఉన్నాను" అని చెప్పింది. ఆ మాట విని చాలా సంతోషంగా అనిపించింది. ఎనిమిది గంటలకు నడవలేని పాప 12 గంటలకల్లా ఏ నొప్పీ లేదంటే అదంతా సాయి దయ, ఆయన అనుగ్రహం.
నా భర్త ప్రమోషన్ కొరకు ఒక పరీక్ష వ్రాయాల్సి ఉంది. ఆ పరీక్ష ఇంట్లోనే లాప్టాప్‍లో వ్రాయాలి. అయితే ఇదివరకు రెండుసార్లు ఆ పరీక్ష వ్రాసినప్పుడు ఒకసారి కెమెరా సరిగా లేకపోవడం వల్ల, మరోసారి కరెంటు లేకపోవడం వలన ఆయన పరీక్ష పాస్ కాలేదు. ఈమధ్య మూడోసారి వ్రాసినప్పుడు కూడా కెమెరా ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఈసారైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మావారిని పాస్ చేసే భారం మీదే తండ్రి" అని బాబాను ప్రార్థించాను. అలా నేను బాబాను ప్రార్థించినప్పటినుండి ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. బాబా దయవల్ల మావారు ఆ పరీక్ష వ్రాసి పాసయ్యారు. బాబా పిలిస్తే పలికే దైవం. ఆయనను నమ్మడం మన పూర్వజన్మ సుకృతం. "ధన్యవాదాలు బాబా. మీ కరుణ, దయ మా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి. దయతో నాకున్న ఆరోగ్యసమస్యలను తొలగించండి బాబా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బాబా ఊదీ అనుగ్రహం
శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు రవి. నేను సాయిభక్తుడిని. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను మన బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి నా భార్య తనకి తలలో మంటగా ఉంటుందంటే డాక్టరుని సంప్రదించాము. డాక్టరు చెక్ చేసి మందులిచ్చారు. కానీ ఆ మందులతో నా భార్యకు తలలో మంట తగ్గలేదు. అప్పుడు నేను బాబాను తలుచుకుని కొద్దిగా ఊదీ నా భార్య నుదుటన పెట్టి, మరికొంత ఊదీ ఆమె నోటిలో వేసి, "బాబా! మీ కృపతో నా భార్యకి తలలో మంట తగ్గితే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. కాసేపట్లో నా భార్యకి మంట తగ్గి, మళ్లీ రాలేదు.
ఇంకోసారి నాకు జలుబు చేసి తుమ్మేటప్పుడు వెనక నరం పట్టేసి చాలా బాధపడ్డాను. అప్పుడు బాబా ఊదీ నోట్లో వేసుకుని, "నరం పట్టేసిన ఈ నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నాకొచ్చిన ఆ కష్టం తగ్గిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలున్నాయి. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి. నేను రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. నాయందు దయుంచి నా కోరికను ఈ కొత్త సంవత్సరంలో తీర్చమని వేడుకుంటున్నాను బాబా". బాబా కృపతో నా కోరిక నెరవేరిన తరువాత ఆ అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🙂❤😊🌹😃🌺🥰🌸😀🌼🤗💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete