1. బాబా దర్శనం - తిరిగి నా దగ్గరకు చేరిన బాబా
2. పిలిచిన వెంటనే కరుణించే దైవం బాబా
బాబా దర్శనం - తిరిగి నా దగ్గరకు చేరిన బాబా
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రమాకాంత్. మాది హైదరాబాద్. సాయి నాపై కురిపించిన కృపాకటాక్షాలను మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను బి.ఎస్.యెన్.ఎల్‌లో పని చేసేటప్పుడు బదిలీ మీద 2010-12 మధ్యకాలంలో నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్‌లో ఉన్నాను. ఆ ఊరు వెళ్ళేటప్పుడు నేను నా సామానుతోపాటు శిరిడీ సంస్థాన్ ప్రచురించిన సాయి సచ్చరిత్ర, లలితసహస్రనామ పుస్తకాలను తీసుకుని వెళ్లాను. నా స్నేహితుడొకాయన, "నేనొకసారి సచ్చరిత్ర పారాయణ చేసి బాబాను తమ దర్శనాన్ని అనుగ్రహించమని కోరాను. నా పారాయణ పూర్తవ్వగానే ఒక భిక్షకుని రూపంలో బాబా మా ఇంటికి వచ్చారు" అని తన అనుభవాన్ని చెప్పాడు. అది విన్న నాకు ఎంతో కుతూహలం కలిగి, "బాబా! నేను కూడా మీ చరిత్ర పారాయణ చేస్తాను. నాకు మీ దర్శనం కావాలి. మీరు కనపడినంతనే నేను మీకు పదకొండు రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని సంకల్పం చేసుకున్నాను. అంత చిన్న దక్షిణకు ఆయన దర్శనం కావాలిట నాకు. కానీ నేను శ్రద్ధగా సచ్చరిత్ర పారాయణ చేశాను. ఆ ఊరిలో బిచ్చగాళ్ళు ఇళ్లకు రారు, అసలు ఉండరు కూడా. కానీ ఆశ్చర్యం! నా పారాయణ పూర్తయిన రోజు అప్పుడే వర్షమొచ్చి తగ్గింది(వర్షం పడినట్లు నాకు తెలియదు). రెండవ అంతస్తులో ఉంటున్న నాకు కింద ఎవరు వచ్చినా కిటికిలోంచి కనపడుతుంది. కింద జంగమ దేవర వేషధారణలో ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించిన ఒక భిక్షగాడు వచ్చి, 'బాబా' అని అరిచాడు. నా ఒళ్ళు రోమాంచితమైంది. నాకు నోట మాటరాలేదు. ఆయన్ని కిటికీలోంచి చూసిన నేను గబాగబా పదకొండు రూపాయలకోసం వెదికాను. నా దురదృష్టం, నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి. ఇంకో రూపాయి కోసం వెదకగా వెదకగా చివరకి దొరికింది. ఆ డబ్బులు పట్టుకుని పరుగున క్రిందకి వెళ్ళాను. అక్కడ బాబా లేరు. నేలంతా చెమ్మగా ఉంది. కానీ చిత్రంగా బాబా నుంచున్న చోట ఆయన పాదముద్రలు లేవు. అక్కడ ఒకావిడ బట్టలు ఆరేసుకుంటోంది. నేను ఆమెను హిందీలో, "ఇక్కడ బాబా అని అరిచిన ఒకాయన ఉండాలి. మీరు చూసారా?" అని అడిగాను. దానికి ఆమె, "నేను ఇక్కడ గంట నుంచి ఉన్నాను. ఇక్కడికి ఎవరూ రాలేదు" అని చెప్పింది. బహుశా ఆమె ఆయన్ని చూడలేదేమో అనుకుని సమీప సందులు, రోడ్లు వెతికాను. కానీ ఆయన జాడ కనిపించపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాను.
దిమాపూర్‌లో నా సర్వీసు పూర్తయిన తర్వాత నాకు తిరిగి హైదరాబాద్‌కి బదిలీ అయింది. 2012 జూన్‌లో నా తిరుగు ప్రయాణానికి ముందు 'మోకొక్చుంగ్' అనే ప్రాంతంలో నా స్నేహితుణ్ని చూసి, అక్కడనుంచి గౌహతి వెళ్ళడానికి దిమాపూర్ నుంచి ఒక బస్సులో సాయంత్రం బయలుదేరాను. డబ్బులున్న సూటుకేసు నేను కూర్చున్న వైపు సీటు మీదున్న రాక్‌పై పెట్టుకున్నాను. బట్టలు, సాయి చరిత్ర పుస్తకం ఉన్న సూటుకేసు పక్కనున్న సీటు మీదున్న రాక్ పై పెట్టాను. ఆ సీటులో బనియన్, నిక్కరు వేసుకుని బీడీ త్రాగుతున్న ఒక స్థానిక నాగాలాండ్ వ్యక్తి కూర్చున్నాడు. రాత్రి ఒంటిగంట అయ్యేసరికి నాకు బాగా నిద్రవస్తోంది. అంతా చీకటిగా ఉంది. మసక వెలుతురులో నా ప్రక్కన ఉన్న నాగాలాండ్ వ్యక్తి నిల్చొని తలను కిటికీలోంచి బయటకు పెట్టి ఉన్నట్టు నాకు కనిపించింది. నేను పెద్దగా పట్టించుకోకుండా డబ్బులున్న నా సూటుకేసును చూస్తూ పడుకున్నాను. బాబా పుస్తకమున్న విలువైన సూటుకేసును కనీసం చూడనైనాలేదు. ఎంత నిర్లక్ష్యమో చూసారా! ఒక మూడు నిమిషాల్లో బస్సు ఆగింది. డ్రైవరు లైట్స్ వేసాడు. నేను మెల్లిగా కళ్ళు తెరిచి ప్రక్కన ఉండే వ్యక్తి వైపు చూస్తే, అతనక్కడ లేడు. పైకి చూస్తే నా సూటుకేసు కూడా లేదు. అంతే, నాకు నిద్ర వదిలిపోయింది. బస్సు అంతా చూసిన తరువాత బయటకు వెళ్లి చూసాను. నా సూటుకేసు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు డ్రైవరుని అరా తీస్తే, "ఎవడో పట్టుకుపోయి ఉంటాడు" అన్నాడు. బయటంతా చిమ్మచీకటిగా ఉన్నందున ఆ వ్యక్తికోసం గాలించినా లాభం లేకపోయింది. ఇక చేసేదిలేక నా సూటుకేసును ఆ నాగాలాండ్ వ్యక్తే పట్టుకుపోయాడని ఏడుస్తూ బస్సు ఎక్కి కూర్చున్నాను. తెల్లవారింది, ఆరుగంటలకు 'మోకొక్చుంగ్' చేరుకున్నాను. నా స్నేహితుడిని కలిసి విషయం చెప్పాను. అందరూ, "డబ్బులున్న సూటుకేసు క్షేమంగా ఉంది, అదృష్టం" అన్నారు. నాకు మాత్రం బాబా పారాయణ పుస్తకంతోపాటు లలితాసహస్రనామ పుస్తకం, నా బట్టలన్నీ పోవడం చాలా బాధించింది. నేను బాబాను, "మీ దర్శనమిచ్చినట్టే ఇచ్చి, ఇప్పుడు పూర్తిగా అదృశ్యమయ్యావా? ఇక నిన్ను ధ్యానించకుండా చేసావా?" అంటూ అడిగాను. ఇక బాబా మహత్యం చూడండి...
పదిగంటల ప్రాంతంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. అది 'శర్మ ట్రావెల్స్' నుంచి శర్మ అనే ఆయనది. పోయిన నా సూటుకేసులో నా చిరునామా లేదుగానీ సూటుకేసు క్రింద భాగంలో నా పేరు, మొబైల్ నెంబర్ ఉన్న పాత స్టికర్ ఒకటి ఉంది. అది చూసి శర్మగారు నాకు ఫోన్ చేసారు. అసలు నా సూటుకేసు ఆయన దగ్గరకి ఎలా చేరిందో ఇప్పుడు చెప్తాను. రాత్రి బస్టాప్ వస్తుందనగా నాగాలాండ్ వ్యక్తి నా సూటుకేసుని కిటికీలోంచి రోడ్డు ప్రక్కన ఉన్న డివైడర్ మీదకు విసిరాడు. బస్సు ఆగిన వెంటనే దాన్ని తీసుకుని పారిపోదామన్నది అతని ఉద్దేశ్యం. కానీ బాబా వాడి ఆటలు సాగనివ్వలేదు. వాడు విసిరిన నా సూటుకేసు డివైడర్ దాటి ప్రక్క రోడ్డు మీదకి వెళ్లి పడింది. సరిగ్గా అదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న 'శర్మ ట్రావెల్స్' వాళ్ళు బస్సు ఆపి, మా బస్సులోంచే ఆ సూటుకేసు పడిపోయి ఉంటుందని సూటుకేసు తీసుకుని వెళ్లారు. ఆ ట్రావెల్స్‌వాళ్ళు నేను ఉన్న ఊరికి ముందు ఉన్న ఊరిలో ఆగారు. నేను ఆ ఊరు నుంచేే సాయంత్రం ట్రైన్‌లో గౌహతి వెళ్ళాల్సి ఉంది. ఆ ఊరిలో మా బి.ఎస్.యెన్.ఎల్‌లో పనిచేసే మిత్రులు కొందరు ఉన్నారు. వాళ్ళు నా సూటుకేసుని ట్రావెల్స్ వాళ్ల వద్ద నుంచి తీసుకుని నేను ఎక్కే ట్రైన్ వద్దకి వచ్చి నాకు అందించారు. సూటుకేసుకి వేసిన తాళం వేసినట్లే ఉంది. సూటుకేసు ఓపెన్ చేసి చూస్తే, సచ్చరిత్ర పారాయణ పుస్తక రూపంలో బాబా దర్శనం ఇచ్చారు. ఆయన్ని చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా".
చివరిగా ఒక మాట: భక్తులారా! "మనం బాబాని పరీక్షించేంత గొప్ప వాళ్ళము కాము". ఆయన అనుగ్రహం మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ... నమస్కారం.
పిలిచిన వెంటనే కరుణించే దైవం బాబా
సాయిబందువులకు నమస్కారం. నాపేరు మహేష్. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా నా ఛాతిలో నొప్పి వచ్చి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు బాబాను ప్రార్ధించి ఊదీ ధరించి, మరికొంత ఊదీ ఛాతిపై నొప్పి ఉన్న ప్రదేశంలో రాసుకుని, "నొప్పి తగ్గాల"ని వేడుకున్నాను. అలా బాబాకి వేడుకున్న కొద్దిసేపటికే నొప్పి తగ్గనారభించింది. ఆ విధంగా ప్రార్ధించిన వెంటనే ఆదుకున్నారు బాబా.
ఇంకోరోజు సాయంత్రం ఉన్నట్టుండి నా గొంతులో బాగా నొప్పి వచ్చింది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి రాత్రి నిద్రపోయాను. ఉదయం నిద్రలేచేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.
కొన్నిసార్లు నేను బైక్ మీద బయటకు వెళ్ళినప్పుడు మధ్యలో రిపేర్ వచ్చి బైక్ ఆగిపోయేది. ఆయా సందర్భాలలో నేను బాబాను వేడుకోగానే నా బైక్ స్టార్ట్ అయ్యేది.
నా మొబైల్ ఫోన్ చాలా పాతదైపోయినందువల్ల బ్యాటరీ, ఇతరత్రా కొన్ని పార్టులు పాడయ్యాయి. దాంతో ఛార్జింగ్ పెట్టినా ఫోన్ ఆన్ అవ్వలేదు. ఎన్ని చార్జర్‌లు మార్చినా ఫలితం లేకపోయింది. పోనీ కొత్త ఫోన్ తీసుకుందామంటే నా దగ్గర డబ్బులు లేక బాబాని "కొత్త మొబైల్ ప్రసాదించమ"ని అడిగాను. అద్భుతం! బాబా దయవల్ల సమయానికి డబ్బులు నా చేతికొచ్చాయి. వాటితో కొత్త మొబైల్ తీసుకున్నాను. తరువాత పాత మొబైల్లో ఉన్న చాలా కాంటాక్ట్ నెంబర్లు మరియు ఉపయోగకరమైన డేటాకోసం 15 రోజులు తరువాత నేను నా మనసులో, "బాబా ఏదైనా చేసి పాత మొబైల్లోని ముఖ్యమైన కాంటాక్ట్ నెంబర్లు, డేటా కొత్త మొబైల్లో సేవ్ చేసుకునేంతవరకు ఈ పాత మొబైల్‌ని ఆన్ అయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్ధించి ఛార్జింగ్ పెట్టాను. అద్భుతం! బాబాను ప్రార్ధించి ఛార్జింగ్ పెట్టగానే అన్నిరోజులుగా ఆన్ కాని పాత మొబైల్ ఆన్ అయింది. త్వరత్వరగా పాత మొబైల్‌లోని సమాచారాన్ని కొత్త మొబైైల్‌లో పొందుపరుచుకున్నాను. అయితే పాత ఫోన్‌లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయాను. కొత్త మొబైల్లో ఇన్స్టాగ్రామ్ వేద్దామని ఎంత ప్రయత్నించినా పాస్వర్డ్ గుర్తుకు రాలేదు. అప్పుడు బాబాను వేడుకోగా, ఆయన మార్గనిర్ధేశం చేసి కొత్త మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయించారు. ఈవిధంగా చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా మన బాబాను వేడుకుంటే, ఆయన తప్పకుండ కరుణిస్తారు. ఆయన పిలిచిన వెంటనే కరుణించే దైవం. నేను ఆయన భక్తుడనైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు బాబా. "మీ దయతో వ్యాపారం మొదలుపెడదామనుకుంటున్నాను. అంతా సక్రమంగా జరిగేలా చూడండి. మిమ్మల్నే నమ్ముకుని శ్రద్ధ, సబూరిలతో ఉన్నాను బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram ��
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba plz save my husband
ReplyDeleteరమాకాంత్ గారూ మీకు కలిగిన బాబాగారి లీలా దర్శనం గుఱించిన మీ అద్భుత స్వానుభవ కథనం ఆశ్చర్య పరిచింది. భగవంతునిపై విశ్వాసమే భక్తుడి బలం. భక్తుడికి అదే ఆజన్మాంత జీవనాధారం కూడాను.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram baba amma arogyam bagundali thandri sainatha
ReplyDelete