1. నాపై శ్రీసాయి అనుగ్రహం
2. తలచినంతనే భక్తుల వెన్నంట నిలిచే బాబా
3. చెప్పుకున్నంతనే లభించిన బాబా అనుగ్రహం
నాపై శ్రీసాయి అనుగ్రహం
నా పేరు సంహిత. నేను ఒక కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాను. పోలీసు ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. క్షణం తీరిక ఉండదు, సెలవులు ఉండవు. అయినప్పటికీ 2019లో 5 సార్లు, ఈ సంవత్సరం నాలుగుసార్లు (2021, ఫిబ్రవరి 28 - మార్చ్ 1; అక్టోబర్ 16, 17; నవంబర్ 27, 28, 29; డిసెంబర్ 26, 27, 28) శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకునే భాగ్యం నాకు దక్కింది. వరుసగా మూడు నెలలు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నానంటే అది బాబా కృపే.
2021, నవంబరులో నేను శిరిడీ వెళ్ళడానికి ముందు మా అమ్మ ఆరోగ్యం బాగాలేకుంటే టెస్టులు చేయించేటప్పుడు, "బాబా! రిపోర్టులు నార్మల్ అని వస్తే శిరిడీ రాగలను, లేకపోతే రాలేన"ని బాబాతో చెప్పుకున్నాను. అప్పుడు ఈ క్రింది రెండు మెసేజ్లు వచ్చాయి.
"నేను నీకోసం శిరిడీలో వేచి ఉన్నాను. వచ్చి, నన్ను దర్శించుకో. అల్లా మాలిక్".
ఆ రాత్రి టెస్టు రిపోర్టులు నార్మల్‍గా వచ్చాయి. డాక్టర్, "సమస్య ఏమీ లేదు. కేవలం నీరసం వల్ల అలా ఉంద"ని చెప్పారు. దాంతో సంతోషంగా శిరిడీ వెళ్లి వచ్చాను.
2021, డిసెంబరులో శిరిడీ వెళ్ళాలని ముందు నేను 17 సోమవారాలు శివాలయానికి వెళతానని, 17వ సోమవారం శ్రీశైలం వెళ్లి శివునికి అభిషేకం చేస్తానని మ్రొక్కుకున్నాను. కానీ 17వ సోమవారం నాటికి నేను శ్రీశైలం వెళ్లకుండా అనుకోకుండా బాబా దర్శనానికి శిరిడీ ప్రయాణమయ్యాను. ఆరోజు నా శిరిడీ ప్రయాణానికి ఒక గంట ముందు నేను మా ఇంట్లోని పూజగదిలో, "బాబా! నేను శిరిడీ వస్తున్నాను. ఈసారి మీరు నాకు ఏ మెసేజ్ ఇవ్వలేదు" అని అనుకున్నాను. తరువాత పూజగది నుండి బయటకి వచ్చి ఇన్స్టాగ్రామ్ తెరవగానే ఈ క్రింది మెసేజ్ వచ్చింది."
తరువాత నేను శిరిడీ వెళ్తున్నప్పుడు ట్రైన్‌లో నాకు ఏదో భయంగా అనిపించింది, ఇంకా 'శివయ్యకి అభిషేకమెలా చేయాలి?' అని అనుకున్నాను. తరువాత బ్లాగు ఓపెన్ చేస్తే, ఈ క్రింది బాబా సందేశం వచ్చింది.
తలచినంతనే భక్తుల వెన్నంట నిలిచే బాబా
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బాబాను తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు ఇలా ఏ విధంగా భావిస్తే ఆ విధంగా ఆయన మన భావానికి తగినట్లు మనపై ప్రేమను చూపిస్తారు. ఈ లౌకిక ప్రపంచంలో మనకు ఏ కష్టమొచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆర్తితో మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుండి 'బాబా' అని పిలిస్తే చాలు, తన బిడ్డలను కాపాడటానికి సదా సిద్ధంగా ఉంటారు బాబా. నా పేరు శ్రీదేవి. ఇంతకుముందు ఎన్నో అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకునే అవకాశం నాకు కల్పించిన ఆ సాయినాథునికి వేలవేల ప్రణామాలు తెలుపుకుంటూ మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2021, డిసెంబరు 31న మా అమ్మగారి ఆరోగ్యరిత్యా మేము ఆమెను విజయవాడలోని న్యూరాలజీ డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్ళాము. అక్కడ అమ్మకి MRI స్కాన్ చేయాలని, దానిలో ఏదైనా సమస్య ఉందనిపిస్తే బ్రెయిన్‍కి సంబందించి వేరే టెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. తరువాత అమ్మను MRT స్కాన్‍కి తీసుకుని వెళ్ళేటప్పటి నుండి టెస్టు రిజల్ట్స్ వచ్చి, డాక్టరును కలిసేవరకు నేను బాబా నామాన్ని, మా గురువుగారి నామాన్ని ఆపకుండా జపించాను. బాబా తండ్రి దయవల్ల స్కానింగ్‍లో పెద్ద సమస్య ఏమీ లేదని వచ్చింది. దాంతో మందులతో అమ్మకి తగ్గిపోవచ్చని చెప్పారు. అప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో నేను చెప్పలేను. నా తండ్రి సాయి మా మీద చూపించిన ప్రేమను ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు. స్కాన్ రిపోర్టు నార్మల్ అని వస్తే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటానని అనుకున్న ప్రకారం ఆ సాయితండ్రి అనుగ్రహాన్ని మీ అందరితో ఇలా పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
నేను ఈ బ్లాగులోని అనుభవాలను, నా సాయితండ్రి చేసే లీలలను నా స్నేహితులతో, నా బంధువులతో పంచుకుంటూ ఉంటాను. తద్వారా వాళ్ళకి ఆసక్తి కలిగి ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుండటం వల్ల బాబా మీద నమ్మకమేర్పడి సాయిభక్తులుగా మారారు మా అక్కయ్య కుటుంబీకులు. ఈమధ్య మా అక్క కూతురు అమెరికా వెళ్ళింది. ఆ విషయంలో మా అక్క తన కూతురుకి వీసా వచ్చి, తను అమెరికా చేరేవరకు ఎలాంటి సమస్య లేకుండా ఉంటే ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకుంది. బాబా దయవల్ల అమ్మాయి క్షేమంగా అమెరికా చేరుకుంది.
మా ఇంకొక అక్కయ్య కొడుకు కూడా వీసాకి అప్లై చేసుకున్నాడు. అయితే మొదటిసారి తన వీసా తిరస్కరింపబడింది. దాంతో బాబు చాలా నిరాశచెందాడు. అప్పుడు తను గురుచరిత్ర పారాయణ చేస్తూ, "వీసా వస్తే, ఈ బ్లాగులో తన అనుభవాన్ని పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాడు. అలా చెప్పుకోగానే చాలా ఆశ్చర్యంగా స్లాట్స్ బుక్ చేసుకోవడానికే ఎంతో బిజీగా ఉన్న సమయంలో తనకు వీసా రావటం, 2022, జనవరి 9న అమెరికా ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. అంతా చాలా అద్భుతంగా జరిగింది. ఇదంతా బాబా దయేనని మా అక్క అంటుంది. తలచినంతనే భక్తుల వెన్నంటుండి కాపాడే మన సాయితండ్రి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చెప్పుకున్నంతనే లభించిన బాబా అనుగ్రహం
అందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలతో మీ ముందుకు వచ్చాను. ఇటీవల నేను పని చేసే చోట కొన్ని డాక్యుమెంట్స్ కనిపించలేదు. దాంతో చాలా ఆందోళన చెంది, "బాబా! డాక్యుమెంట్స్ దొరికితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఆ డాక్యుమెంట్స్ వెతికాను. ఆశ్చర్యం! వెంటనే ఆ డాక్యుమెంట్స్ దొరికాయి. అలానే ఒకసారి నా స్నేహితురాలి ముఖ్యమైన వస్తువు ఒకటి కనిపించలేదు. అప్పుడు కూడా, "బాబా! ఆ వస్తువు దొరికితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని అదే మంత్రాన్ని జపిస్తూ వెతికాను. వెంటనే ఆ వస్తువు దొరికింది.
ఇటీవల మా ఆఫీసులో ఆడిట్ వంటి ఒక ప్రక్రియ కొన్నిరోజుల్లో జరగాల్సి ఉందనగా చాలా వర్క్ పెండింగ్‌లో ఉండిపోయింది. దానిని ఎలా పూర్తి చేయాలో అని నాకు కంగారుగా అనిపించి బాబాని తలుచుకుని భారం ఆయనపై వేసాను. ఆయన దయవల్ల సమయానికి మొత్తం వర్క్ పూర్తి అయ్యింది. తరువాత ఒక ఆఫీసరు వచ్చి అన్ని ఫైల్స్ చెక్ చేస్తుంటే, "బాబా! అంతా సవ్యంగా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అంతా సజావుగా సాగిపోయింది. ఇలా ఎన్నో అనుభవాలున్నాయి. సాయిని నమ్ముకున్నవారికి ఆనందకరమైన జీవితం లభిస్తుంది. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteVery nice experiences... Om sai ram ��
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani tondarga teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete