సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1044వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'తోడుగా ఉన్నాను' అంటూ మళ్లీ చేయి పట్టుకున్న బాబా
2. అకౌంటు టాలీ అయ్యేలా అనుగ్రహించిన బాబా
3. బాబా ఊదీతో తగ్గిన గడ్డ

'తోడుగా ఉన్నాను' అంటూ మళ్లీ చేయి పట్టుకున్న బాబా


అందరికి నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా కృపవల్ల 2021, డిసెంబర్ 20న నాకు జరిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. "బాబా! ఎలా మొదలుపెట్టాలో అర్ధం కావడం లేదు. మీరే నాతో ఈ అనుభవాన్ని వ్రాయించండి. తప్పులు ఉంటే క్షమించండి బాబా".


నాది లేట్ మ్యారేజ్. తెలిసినవాళ్ళు, చుట్టాలు, అందరూ నాకు అసలు పెళ్లి అవ్వదన్న నిర్ణయానికి వచ్చేసినా మేము మాత్రం బాబానే నమ్ముకున్నాము. బాబా అనుగ్రహించి నా పెళ్లి గురుపౌర్ణమిరోజు, అది కూడా శిరిడీలో జరిగేలా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా నా వివాహన్ని జరిపించారు. అలా బాబా కృపతో, ఆశీస్సులతో వివాహమై నా వైవాహిక జీవితం మొదలైంది. "బాబా! ఆ సమయంలో మా కుటుంబమంతా పడిన వేదన ఇంకే అమ్మాయి పడకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నాను".


బాబా చేసిన పెళ్లి కాబట్టి నా కష్టాలు తీరిపోయాయనుకున్నాను కానీ, అప్పుడే మొదలయ్యాయని నాకు అర్ధమవ్వడానికి కాస్త సమయం పట్టింది. ఆ సమయంలో నేను ఎలాంటి గందరగోళంలో ఉన్నానంటే, నా భర్తకి నాతో ఇష్టంలేని పెళ్లి అనేలా ఉండేది పరిస్థితి. అలా అనుకుంటే బాబాని అనుమానించడమే. కానీ కళ్ల ఎదుట కనబడేది వేరు. అలాంటి అయోమయ పరిస్థితుల మధ్య నేను బాబాకి దూరంగా జరిగాను. నెమ్మదిగా నా భర్తలో మార్పు వచ్చి నన్ను ప్రేమగా చూసుకుంటున్నా కూడా, మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తుండేవి. వాటిని అతని తల్లితండ్రులు పెద్దవి చేస్తుండేవాళ్ళు. వాళ్లకు తగ్గట్టే ప్రతిసారీ పరిస్థితులు అనుకూలంగా మారిపోయేవి. మావారికి తప్పు తన తల్లిదండ్రులదని తెలిసినప్పటికీ వాళ్ళు మాత్రం సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్ళు. చిత్రమేమిటంటే, వాళ్ళు కూడా బాబా భక్తులు. నేను సర్దుకుపోవడం, బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. నా పెళ్లి గురించి నా తల్లిదండ్రులు పడిన బాధని చూసినదాన్ని కాబట్టి మళ్లీ వాళ్ళని బాధపెట్టడం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయేదాన్ని. "ఏంటి బాబా ఇలా?" అనుకునేదాన్ని. క్రమంగా అలాంటి పరిస్థితులు చూస్తూ చూస్తూ నాకు బాబా మీద కోపం, అసహనం పెరిగిపోయాయి. ఒప్పుని ఒప్పని, తప్పుని తప్పని అనాలి. కానీ ప్రతిసారీ బాబా వాళ్లకి సహాయం చేయడంతో నేను బాబాని ప్రార్థించడం, అసలు ఆయనతో మాట్లాడడమే మానేసాను.


ఇలా 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మావారు పిల్లల గురించి ఎలాంటి ఆసక్తి చూపించేవారు కాదు. మాట్లాడితే పిల్లలు కావాలని ఉందనేవారు కాని, ఆ విషయాన్ని సీరియస్‍గా తీసుకునేవారు కాదు. వాళ్ళ తల్లిదండ్రులైతే అసలు పట్టించుకునేవారు కాదు. నా తల్లిదండ్రులు మాత్రం కనీసం మాకు ఒక పాపో, బాబో పుడితేనన్నా మా జీవితాలు మారుతాయేమోనని ఆశపడేవారు. ఒకసారి మా నాన్నగారు మావారి నాన్నగారితో వీళ్ళిద్దరిని ఒకసారి డాక్టరు వద్దకు తీసుకునివెళ్దాం అని అన్నారు. బాబా దయవల్ల అందుకతను సానుకూలంగా స్పందించాడు. కానీ మావారు పెద్ద గొడవ చేసారు. అయితే తన తల్లిదండ్రులు చెప్పినందువల్ల హాస్పిటల్‍కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అలా బాబా దయతో మేము హాస్పిటల్‍కి వెళ్ళాము. డాక్టరు అన్ని టెస్టులు రాశారు. నా రిపోర్ట్లు వెంటనే అదేరోజు వచ్చాయి. బాబా దయవల్ల అన్ని రిపోర్టులు నార్మల్‍గా వున్నాయి. డాక్టర్ నన్ను నెలసరి వచ్చాక రమ్మని చెప్పారు. మావారి రిపోర్టులు మాత్రం అదేరోజు రావని చెప్పినట్లుగానే మరుసటిరోజు వచ్చాయి. అందులో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా నాకు అర్ధం అయ్యింది. కానీ డాక్టరు నెలసరి తరువాత రమ్మన్నందున నేను ఆ సమయం కోసం ఎదురుచూసాను. కానీ నెలసరి సమయం దాటినా నాకు నెలసరి రాలేదు. వెంటనే నేను బాబాని ప్రార్ధించి రెండురోజులు చూసాను. కానీ లాభం లేకపోయింది. ఒక 5, 6 సంవత్సరాల క్రితం నాకు నెలసరి సక్రమంగా వచ్చేది కాదు. ఆ సమస్య ఇప్పుడు మళ్లీ వచ్చిందా అని నాకు భయమేసి, 'ఇంత గొడవై, హాస్పిటల్‍కి వెళ్లిన తరువాత ఇప్పుడు నెలసరి రాకుంటే ఎలా? మావారికి నేను ఏం చెప్పాలి?' అని చాలా కంగారుపడ్డాను. "బాబా! మీరు మళ్లీ పరిస్థితిని మావారికి అనుకూలంగా మారుస్తున్నారా?" అని ఏడ్చాను. "దయ చూపమ"ని బాబాను ఎంతో ప్రాధేయపడ్డాను. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. అప్పుడు నేను, "బాబా! మీరు నాపై దయ చూపితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. సప్తాహ పారాయణ చేస్తాను బాబా" అని బాబాకి మాటిచ్చాను. నాకు 'తోడుగా ఉన్నాను' అంటూ బాబా నా చేయి మళ్లీ పట్టుకున్నారు. అద్భుతం! ఆ మరుసటిరోజు నాకు నెలసరి వచ్చింది. ఇది చదివే వాళ్లకి చిన్న సమస్యే అనిపించవచ్చు కానీ, నేను ఉన్న పరిస్థితి, నా చుట్టు ఉన్న మనుష్యుల దృష్ట్యా నాకు అది చాలా పెద్ద సమస్య. ఆ పదిరోజులు నేను పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేను. "బాబా! థాంక్యూ సో మచ్. కోటి కోటి వందనాలు. అనేక కృతజ్ఞతలు. అనుగ్రహాన్ని పొందిన వెంటనే అంటే అదేరోజు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవాలని నాకు గుర్తుచేసినందుకు మీకు మరొక్కమారు థాంక్యూ బాబా".


అకౌంటు టాలీ అయ్యేలా అనుగ్రహించిన బాబా



సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నా పేరు లక్ష్మి. నేను యు.ఎస్.ఏలో నివాసముంటున్నాను. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగులో ప్రచురితమవుతున్న సాయిభక్తుల అనుభవాలు చదువుతున్న కొలది సాయిపై భక్తి, ప్రేమలు అధికమవుతున్నాయి. నా జీవితంలో సాయికి సంబంధించిన అనుభవాలు చాలా ఉన్నాయి. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం మూడునెలల క్రిందట జరిగింది. నేను ఇటీవల బ్యాంకు ఉద్యోగంలో జాయిన్ అయి టెల్లర్‍గా పని చేస్తున్నాను. నా వృత్తిలో భాగంగా ప్రతిరోజూ విత్ డ్రాలు, క్రెడిట్లు టాలీ అవ్వాలి. అయితే ఒకరోజు 200 డాలర్లు తేడా వచ్చి నా అకౌంటు టాలీ కాలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడ తప్పు చేశానో నాకు అర్ధం కాలేదు. చివరికి సాయి మీద భారం వేసి ఇంటికి వచ్చేసి నిరంతరాయంగా సాయిని ప్రార్థించసాగాను. మరునాడు నాకు సెలవు దినం అయినందున నేను ఇంట్లోనే ఉన్నాను. నా సహోద్యోగి నాకు ఫోన్ చేసి, "నీ అకౌంటు టాలీ అయ్యింది" అని చెప్పింది. అసలు విషయమేమిటంటే, మేము 20$, 50$, 100$లను వేర్వేరుగా పెట్టి మెషిన్ కౌంటు చేస్తాము. అయితే మెషిన్ 20$ కౌంట్ చేసేటప్పుడు అందులో పొరపాటున 50$ ఉన్నా అది దాన్ని 20$ కింద కౌంట్ చేస్తుంది. ఆరోజు 20$ కట్టలో నాలుగు 50 డాలర్లు ఉన్నాయి. మెషిన్ ఆ నాలుగు 50 డాలర్లను కూడా 20 డాలర్ల కింద లెక్కించడం వలన అకౌంటు టాలీ అవ్వలేదు. ఏదేమైనా సమస్యను సాయి పరిష్కరించారు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో చాలా ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా". 2021, డిసెంబర్ 25న నాకు ఇంకో సమస్య వచ్చింది. దాన్ని కూడా సాయి పరిష్కరిస్తారని నమ్మకంతో ఉన్నాను.


బాబా ఊదీతో తగ్గిన గడ్డ


నేను ఒక సాయిభక్తురాలిని. ప్రస్తుతం ఈటీవిలో ప్రసారమవుతున్న 'సద్గురు సాయి' సీరియల్ చూసి నేను సాయిభక్తురాలినయ్యాను. ఆ సీరియల్ చూస్తుంటే ప్రతి సన్నివేశంలో సాక్షాత్తు సాయిబాబా మన ముందుకొచ్చి కష్టాలు తీరుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నేను అందరి అనుభవాలు చదువుతూ నా అనుభవం కూడా వ్రాద్దామనుకున్నాను. కానీ ఎలా వ్రాయాలో తెలియలేదు. ఈరోజు(2021, డిసెంబర్ 23) బ్లాగులో నాకు జరిగిన అనుభవం లాంటి అనుభవమే పబ్లిష్ అయ్యింది. అది చదివాక నా అనుభవం గుర్తొచ్చి వ్రాస్తున్నాను. "మర్చిపోయినందుకు నన్ను క్షమించండి సాయి". ఇక నా అనుభవానికి వస్తే...  ఒకరోజు నా కుడి చేతి దగ్గర బాగా నొప్పి వచ్చింది. ఆ ప్రాంతంలో చిన్న గడ్డలా కూడా ఉండేసరికి నాకు చాలా భయమేసింది. మావారితో చెప్తే, ఆయన కూడా భయపడతారని చెప్పకుండా సాయికి నమస్కరించి ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల మూడు, నాలుగు రోజుల్లో ఆ గడ్డ తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మా భారమంతా మీపై వేస్తున్నాము. మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి సాయి".



10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  3. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours.jaisairam

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha please

    ReplyDelete
  8. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🙂❤😊🌹😃🌺🥰🌸😀🌼🤗💝💕

    ReplyDelete
  9. Samardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo