1. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే బాబా తండ్రి
2. బాబా చల్లని కరుణ
అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే బాబా తండ్రి
"అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ మహాప్రభూ మీకు కోటానుకోట్ల పాదాభివందనాలు. అనుదినం, ప్రతీ అడుగూ మీ సహాయంతో వేసే భక్తులం మేము నాయనా. ఒక్క క్షణం కూడా మీ కృపావీక్షణాలు మాపై నుండి మరల్చవద్దు. మమ్మల్ని మాయ శిక్షించకుండా కాపాడు తండ్రి". నేను సాయి భక్తురాలిని. ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహించడం ద్వారా ఆ సాయినాథుని కృపాకటాక్ష వీక్షణాలు మా అందరిపై ప్రసరింపజేయుచున్న సాయికి కృతజ్ఞతలు. మీ వల్ల, ఈ బ్లాగు వల్ల మేము ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ ఆ సాయినాథుని మనసారా కొలుచుకుంటున్నాము. ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాల ద్వారా మా సమస్యలకు సమాధానాలు లభిస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. ఇక నా అనుభవాలలోకి వెళదాం.
నేను, నాతోపాటు మరో ఇద్దరు టీచర్లం దూరప్రాంతంలో పని చేస్తూ ప్రతీరోజూ బస్సులో ప్రయాణం చేస్తుంటాము. రోజూ బస్సు ప్రయాణమంటే విసుగుపుట్టి ఒకరోజు నేను, "బాబా! కారు ఏదైనా పంపొచ్చు కదా. మీ దయవల్ల సుఖంగా వెళ్లిపోతాం" అనుకున్నాను. సరిగ్గా అలా అనుకున్న 3 నిమిషాల్లో మా ముందుగా ఒక కారు స్లో చేస్తున్నట్లు అనిపిస్తే, ఆపి "మమ్మల్ని వైజాగ్‍లో దింపాలి" అని అడిగాము. వెంటనే ఆ కారు నడుపుతున్న అతను, "తప్పకుండా! నేను కూడా వైజాగ్ వెళ్తున్నాను. రండమ్మా!" అని మాకు లిఫ్ట్ ఇచ్చారు. అంతేకాదు ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. దారిలో మాతో ఉన్న నివేదిత అనే ఆర్.సి.ఎమ్ చర్చికి వెళ్లే క్రిస్టియన్ టీచరు నా దగ్గర సాయి సచ్చరిత్ర చదివింది. అందులోని విషయాల గురించి మేము చర్చించుకున్నాము. అది విన్న కారు నడుపుతున్న అతను, 'సాయి సచ్చరిత్ర పఠనం, అది చేయడం వల్ల కలిగే సాయి అనుగ్రహం గురించి' మాకు చాలా విపులంగా చెప్పారు. దీనినిబట్టి నిజంగా బాబాయే ఆ కారుని పంపారనడంలో నాకు ఏ సందేహమూ లేదు.
అప్పట్లో నేను రోజూ నా బ్యాగులో సాయినాథుని జీవితచరిత్ర పుస్తకాన్ని పెట్టుకుని ప్రయాణంలో చదువుకుంటుండేదాన్ని. అది చూసిన నా సహోపాధ్యాయిని, "ఆ పుస్తకం ఏమిటి?" అని అడుగగా నేను ఆమెతో సాయినాథుని గూర్చి చెప్పాను. ఆమె సంతానం లేక ఎన్నో దెప్పిపొడుపులకు గురవుతూ ఎంతో బాధని అనుభవిస్తుంది. అటువంటి తనకి నేను బాబా గురించి పదేపదే చెప్పడం వల్ల మరియు మా స్కూలులో పనిచేస్తున్న పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావుగారి శిష్యులు కూడా పదేపదే బాబా గొప్పతనం గురించి ఆమెతో చెప్పడం వల్ల ఆమె బాబాని కొలవడం మొదలుపెట్టింది. సంతాన విషయంగా వాళ్ల ప్రయత్నాలు వృధా అవుతుంటే ఒకరోజు నేను ఆమెతో, "సంతానం కలిగే వరకూ మీకిష్టమైన పదార్థాన్ని తినడం మానేస్తానని మ్రొక్కుకొమ్మ"ని సలహా ఇచ్చాను. ఆమె వెంటనే, "నా కోరిక తీరితే, శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకునేంత వరకు మాంసాహారం ముట్టన"ని బాబాకి ప్రమాణం చేసింది. అంతే, అత్యంత విచిత్ర రీతిలో ఆమె ఇంట పండంటి బాబు తిరుగాడేలా బాబా ఆశీర్వదించారు. నిజంగా అది ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిందో చెప్పడం నా వల్ల కాదు, ఆ సర్వాంతర్యామికే ఎఱుక. నేను ఆయన లీలకు ఆశ్చర్యపోతూ ఆయనపట్ల మరింత భక్తిని ధృడపరచుకున్నాను.
ఉద్యోగస్థురాలినైన నేను అన్ని సమయానికి అందుబాటులో ఉండాలని పాత రెఫ్రిజిరేటర్ ఇచ్చేసి సైడ్ బై సైడ్ డోర్స్ ఉండే పెద్ద రెఫ్రిజిరేటర్ తీసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల నా కోరిక సంవత్సరంపాటు వాయిదాపడుతూ వచ్చింది. చివరికి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించగా 2021, డిసెంబర్ 30న కొత్త రెఫ్రిజిరేటర్ మా ఇంటికి వచ్చింది. అయితే నా సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రెఫ్రెజిటర్ను వంటగదిలోకి తీసుకు వెళ్తుంటే ఒక ఆర్చి అడ్డం వచ్చింది. దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, "వంటగదిలో ఫ్రిడ్జ్ పెట్టాల్సిన చోట కొత్త రెఫ్రెజిటర్ పెట్టడం అసాధ్యమ"ని చెప్పేశారు. దాంతో, "ఇప్పుడు ఎలా? దీన్ని హాల్లో పెట్టుకోలేము. ముందు వెనుకా చూసుకోవా? ఇవ్వన్నీ ఆలోచించవా?" అని మావారి కోపం. నాకు ఏం చేయ్యాలో తోచలేదు. షాపు అతనికి ఫోన్ చేస్తే, "డోర్స్ విడదీసి, ఫ్రిడ్జ్ ను వంటగదిలోకి తీసుకెళ్లిన తరువాత తిరిగి బిగించొచ్చు" అని చెప్పి డిసెంబర్ 31న ఎల్.జి కంపెనీ టెక్నీషియన్‍ని పంపారు. ఆ టెక్నీషియన్ ఒక డోర్ విప్పినా రెఫ్రిజిరేటర్ వంటగదిలోకి వెళ్ళలేదు. దాంతో అతను కూడా "ఇది మీ వంటగదిలోకి వెళ్లడం అసాధ్యం" అని చెప్పి వెళ్లిపోయాడు. నాకు 'అసాధ్యాలను సుసాధ్యం చేసే మన సాయినాథుడు ఉండగా వేరే వాళ్లని నేను ఎందుకు అడగాలి?' అనిపించి బాబాకి పాద నమస్కారం చేసుకుని, "టెన్షన్ పెట్టకండి బాబా. రెఫ్రెజిటర్ ఎలాగైనా దాని స్థానానికి వెళ్లేలా చేయండి. అది జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని ఆదివారం అని కూడా చూడకుండా షాపు అతనికి మళ్ళీ ఫోన్ చేశాను. అతను ఏసీ సర్వీసింగ్ చేసే ఇద్దరు టెక్నిషియన్‍లను పంపారు. ఈలోపు నేను బాబా ఊదీ ఫ్రిడ్జ్ లోపల, బయట వ్రాసి సచ్చరిత్ర పుస్తకాన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టి చాలా గట్టిగా బాబాను ప్రార్ధించి, 'శ్రీసాయి మార్గబాంధవే నమః' అనే నామం చెప్పుకున్నాను. ఆశ్చర్యం! వచ్చిన టెక్నీషియన్‍లు 20 నిమిషాల్లో ఫ్రిడ్జ్ రెండు తలుపులు విప్పి, దాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి డోర్స్ మళ్ళీ బిగించి దాని స్థానంలో దాన్ని నిలిపి వెళ్లిపోయారు. అంతే మూడు రోజుల నా టెన్షన్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. అది నా సాయినాథుని మహిమ. ముందు రెండు రోజుల్లో వచ్చిన వారంతా అసాధ్యమని చెప్పి వెళ్లిపోయినా బాబా ఊదీ రాసి, మనసారా ప్రార్థిస్తే మార్గం చూపి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు బాబా తండ్రి. "మీకు శతకోటి పాదాభివందనాలు బాబా. గుర్తొచ్చినవన్నీ ఈసారి బ్లాగులో వ్రాయాలని అనుకుంటూ ఉంటాను. కానీ చిన్నా, పెద్దా ఎన్ని అనుభవాలని వ్రాయగలం తండ్రీ? నన్ను వేధిస్తున్న సమస్యలకు సమాధానం చూపి మరలా నా అనుభవాలు బ్లాగులో పంచుకునేలా ఆశీర్వదించు తండ్రి".
బాబా చల్లని కరుణ
శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలలను భక్తులకు అందజేస్తున్న బ్లాగు నిర్వాహక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నాకు పెళ్ళై సంవత్సరంన్నర అవుతుంది. ఒకసారి నా భార్య గర్భవతి అయిన మూడవ నెలలో గర్భం పోయింది. ఆ తరువాత చాలా నెలల వరకు తను గర్భం దాల్చలేదు. నేను శిరిడీ వెళదామని అనుకున్నప్పటికీ కరోనా వల్ల వెళ్లలేకపోయాను. కనీసం బాబా ఊదీ అయినా దొరికితే బాగుండేదని మనసులో అనుకున్నాను. సరిగా అదే సమయంలో నాకు పరిచయమున్న ఒకతను శిరిడీ వెళ్లొచ్చి నేను అడగకుండానే నాకు బాబా ఊదీ ఇచ్చారు. మనసులో అనుకున్నంతనే ఊదీ ప్రసాదించిన ఆ సాయినాథుని కరుణకు చాలా సంతోషించాను. ఆ ఊదీని ఇంటికి తీసుకెళ్లి సాయినాథుని తలుచుకుని నేను పెట్టుకుని, నా భార్యకి కూడా పెట్టాను. ఆ నెల నా భార్యకు రావాల్సిన నెలసరి రాలేదు. టెస్ట్ చేయిస్తే, ఆ సాయి భగవానుని అనుగ్రహం వల్ల ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయించాము. డాక్టరు నా భార్య ప్రెగ్నెంట్ అని నిర్థిరించారు. కాని బేబీ వీక్‍గా ఉందని, హర్ట్ బీట్ కూడా తెలియట్లేదని కొన్ని మందులు రాసి, వాటిని వాడి 15 రోజుల తరువాత రమ్మన్నారు. మేము ప్రతిరోజూ బాబాని తలుచుకుంటూ ఆ 15 రోజులు గడిపాము. 15 రోజుల తరువాత సాయినాథునికి నమస్కరించి హాస్పిటల్‍కి వెళ్ళాం. డాక్టరుని కలిసాక, ఆవిడ "స్కానింగ్ చేయాలి. ఒకవేళ బేబీ గ్రోత్ ఉంటే పర్వాలేదు, లేదంటే కష్టం" అని అన్నారు. వెంటనే నేను సాయిబాబాకి నమస్కరించి, "రిపోర్టు సానుకూలంగా వస్తే, మీ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. నమ్మిన వారిని బాబా ఎల్లప్పుడూ కంటికి రెప్పల కాపాడుతుంటారు కదా! ఆ తండ్రి దయవల్ల బేబీ గుండె స్పందన తెలిసింది. అప్పుడు డాక్టరు "అంతా బాగుంది" అని చెప్పగానే మేము ఊపిరి పీల్చుకున్నాం. కానీ, "స్కానింగ్‍లో చిన్న సిస్ట్ కనిపించింది. 3 ఇంజెక్షన్స్ వేస్తే, అది నయమైపోతుంది. కంగారుపడాల్సిందేమీ లేదు" అని డాక్టర్ చెప్పారు. తరువాత 2022, జనవరి నెల చివరి వారంలో మేము సాయి భగవానుని ప్రార్థించి మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్ళాం. డాక్టరు స్కాన్ చేసి, "సిస్ట్ చాలావరకు నయమైంది. బిడ్డ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. ఈసారి వచ్చినప్పుడు బిడ్డ పరిస్థితిని చూద్దాం. బాగుంటే ఇంజెక్షన్ అవసరం ఉండదు" అని చెప్పారు. ఇదంతా సాయిబాబా మా మీద చూపించిన ప్రేమ. బాబా దయవల్ల ఈసారి డాక్టరుని సంప్రదించినప్పటికీ ఆ సమస్య పూర్తిగా సమసిపోవాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే, బ్లాగులో పంచుకుంటాను. ఆ సాయినాథుని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Baba na husband eye problem cure cheye tandri.. Niney namukunanu.. Ne midaney na baram vestunna.. Kapadu tandri... Apadbandavaya namaha.. Arogya kshema dayakaya namaha.. Please bless me baba... 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయినాథాయ నమః
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOm sai ram baba amma arogyam na arogyam bagundali thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete