1. బాబా అనుగ్రహంతో యు.కే.లో అడ్మిషన్
2. బాబాకి మాటిచ్చి అలక్ష్యం చేయకూడదు3. సాయి భగవానుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యల నుండైనా కాపాడుతారు
బాబా అనుగ్రహంతో యు.కే.లో అడ్మిషన్
ముందుగా సాయిభక్తులకు నమస్కారం. నా పేరు ఆదిత్య. నా వయసు 31 సంవత్సరాలు. నేను చిన్నప్పటినుండి బాబాని ఆరాధిస్తున్నాను. బాబా ఎప్పుడూ నాతో ఉన్నారని నేను నమ్ముతాను. ఆయన నాకు ఎన్నో మహిమలు చూపించారు, ప్రతి విషయంలోనూ ముందుండి నన్ను నడిపించారు. నేను యు.కే. వెళ్లి అక్కడ చదువుకోవాలనుకుని అందుకు కావాల్సిన ప్రయత్నాలను 2021, జూలైలో మొదలుపెట్టాను. నా ప్రయత్నాలు ఫలించి అక్టోబరులో నేను యు.కే. వెళ్ళవలసి ఉండగా అనుకోకుండా కొన్ని కారణాల వలన యూనివర్సిటీలో నా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యింది. దాంతో నేను చాలా నిరాశ చెందాను. కానీ 'బాబా నాకు మంచి చేస్తార'ని నాకు ఆయన మీద నమ్మకం ఉన్నందువల్ల మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈసారి చాలా కన్సల్టెన్సీలను సంప్రదించి ఎక్కువ యూనివర్సిటీలకు అప్లై చేశాను. అనుకోకుండా ఒకరోజు నాకు ఒక కన్సల్టెన్సీ నుండి కాల్ వచ్చింది. నిజానికి నేను ఆ కన్సల్టెన్సీని అదివరకెప్పుడూ నేరుగా కలవలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. అందువల్ల నేను వాళ్ళని, "నా నెంబర్ మీ దగ్గరకి ఎలా వచ్చింది?" అని అడిగాను. అందుకువాళ్ళు, "మీరు యు.కే.లో స్టడీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు తెలిసి మీకు కాల్ చేసాము" అన్నారు. అది విన్న నాకు బాబాయే వాళ్లకి నా నెంబర్ ఇచ్చుంటారు అనిపించింది. వాళ్లతో మాట్లాడిన తరువాత వాళ్లు చెప్పిన యూనివర్సిటీకి అప్లై చేశాను. నేను అంతకుముందు అప్లై చేసిన ఏ యూనివర్సిటీ నుండి సరైన స్పందన రాకపోయినా బాబా చూపించిన ఆ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది. బాబా అనుగ్రహంగా ముందుకు ప్రొసీడ్ అయిపోయాను. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. వీసాకి అప్లై చేసి, "ఏ ఇబ్బందీ లేకుండా వీసా వచ్చేలా చూడమ"ని బాబాను వేడుకున్నాను. బాబా చూపించిన దారిలోనే నేను వెళ్తున్నాని నాకు అర్థమయ్యేలా వీసా వచ్చింది. ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. 2022, జనవరి 23న యు.కేకి నా ప్రయాణం. ఇలా ఎన్నని చెప్పాలి? నా ఈ జీవితం అంతా బాబా మహిమలతో నిండి ఉంది. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ నాతో ఉంటూ నన్ను మంచి మార్గంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను తండ్రి". బాబా కృపాదృష్టి ఎల్లవేళలా మా మీద, భక్తులందరీ మీద ఉండాలి, ఉంటుందని నా నమ్మకం.
బాబాకి మాటిచ్చి అలక్ష్యం చేయకూడదు
సాయిభక్తులందరికీ నమస్తే. బాబా భక్తురాలినైన నా పేరు సునీత. మేము వైజాగ్ నివాసస్థులం. నేను ఒక బ్యూటీషియన్‌ని. నేను సొంతంగా ఒక బ్యూటీపార్లర్ నడుపుతున్నాను. ఒకరోజు నేను ఒక క్లయింట్‌కి ఫేషియల్ చేస్తుంటే, తన చెవిరింగు కనిపించలేదు. వెంటనే షాపు అంతా వెతికాము కానీ, ఆ రింగు కనిపించలేదు. దాంతో ఆ క్లయింట్ బాగా నిరాశ చెందింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "సహాయం చేయండి బాబా. క్లయింట్ చెవిరింగు దొరికితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. ఈ విధంగా చాలామంది తమ వస్తువులు దొరికితే బ్లాగులో పంచుకుంటామని అనుకుంటే వాళ్ళవాళ్ళ వస్తువులు దొరుకుతున్నాయి కదా! అలాగే మాకు చెవిరింగు దొరికేటట్టు చేయండి బాబా. మీ అనుగ్రహాన్ని పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన వెంటనే ఆ చెవిరింగు దొరికింది. దాంతో క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను కూడా చాలా సంతోషించాను. అయితే ఏ రోజుకారోజు నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపిస్తాను అనుకుంటూ వారం రోజులపాటు అలక్ష్యం చేశాను. అప్పటికీ నేను 'ఇలా పంచుకుంటానని చెప్పి నిర్లక్ష్యం చేస్తే, బాబా ఊరుకోరు' అని అనుకుంటూనే ఉన్నాను. అంతలో 2022, జనవరి 11న ఒక క్లయింట్ ముక్కుపుడక షాపులో ఎక్కడో పడిపోయింది. తను ఎంత వెతికినా అది దొరకకపోవడంతో నేను కూడా 'బాబా బాబా' అనుకుంటూ వెతకడం మొదలుపెట్టాను. మాతోపాటు షాపుకి వచ్చిన క్లయింట్లు అందరూ వెతకసాగారు. అలా చాలాసేపు వెతికాముకానీ ముక్కుపుడక దొరకలేదు. దాంతో ముక్కుపుడక పోగొట్టుకున్న ఆ క్లయింట్ చాలా నిరాశకు గురైంది. అప్పుడు నేను, "బాబా! మొన్న ఇలాగే జరిగితే, నా అనుభవం పంచుకుంటానని మీతో చెప్పుకుని పంచుకోకుండా నిర్లక్ష్యం చేశాను. కానీ ఈరోజు వెంటనే ముక్కుపుడక దొరికినట్లైతే, ఆలస్యం చేయకుండా రెండు అనుభవాలూ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుంటూ ఉన్నాను. అంతలోనే అద్భుతం జరిగినట్లు ఆ ముక్కుపుడక దొరికింది. ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని మళ్ళీ అలక్ష్యం చేయకుండా నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయి భగవానుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యల నుండైనా కాపాడుతారు
సాయి భక్తులకు నమస్కారం. నా పేరు శారద చంద్రశేఖర్. నేను సాయిభక్తురాలిని. సాయి భగవానుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యల నుండైనా కాపాడుతారు. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఒకసారి నేను, మా పాప విజయవాడ నుండి బయలుదేరి 2022, జనవరి 8, ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాము. బస్సు దిగి ఆటోలో ఇంటికి వెళ్ళాము. మూడుగంటల తరువాత మాకు ఆటో వెనక భాగంలో పెట్టిన బ్యాగును ఆటోలోనే మరిచిపోయామని గుర్తు వచ్చింది. ఆ బ్యాగులో రెండు లాప్టాప్‌లు, సెల్‌ఫోన్ చార్జర్లు, మా పాప కాలేజీ ఐడి కార్డు ఉన్నాయి. వెంటనే మా పాప, వాళ్ళ నాన్న ఆటో నెంబర్ కోసం సి.సి. కెమెరాలో చూశారు. కానీ అందులో ఆటో నెంబర్ కనిపించలేదు. సరేనని, మేము వచ్చిన దారిలో ఉన్న సి.సి. కెమెరాలలో చూద్దామని ప్రయత్నించారు కానీ అవేవీ పనిచేయడం లేదు. చివరికి మేము ఆటో ఎక్కిన చోట ఉన్న కెమెరాలో చూద్దామని పోలీసు స్టేషన్‌లో అడిగితే, "ఆ కెమెరాలు పదిరోజుల నుండి పనిచేయటం లేద"ని చెప్పి, "బ్యాగు మీ ఇంటి దగ్గర పోయినట్టు కాబట్టి, ఆ పరిధి పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేయండి" అని అన్నారు. దాంతో మా ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే, "ఆటో నెంబర్ తెలియదు కనుక ఏమీ చేయలేము" అన్నారు. ఇక చేసేదిలేక నేను, "సాయీ! ఇక మీదే భారం" అని చెప్పుకున్నాను. కొద్దిసేపటికి మా పరిచయస్తులు కొందరు వాళ్లకి తెలిసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని, కొంతమంది ఆటో యూనియన్ లీడర్లని సంప్రదించారు. వాళ్ల సలహా మేరకు మరునాడు ఉదయం ముందురోజు మేము ఆటో ఎక్కిన చోటికి వెళ్ళాము. అక్కడ కొంతమంది ఆటోడ్రైవర్లను కలిసి విషయం తెలిపితే, వెంటనే అక్కడే ఉన్న ఒకరు, "అవును, నా ఆటోలోనే మీరు మరచిపోయారు. రేపు మీరు వస్తారని వాటిని నా ఇంటిలోనే ఉంచాను. ఒకవేళ మీరు రాకపోతే పోలీస్ స్టేషన్‌లో అప్పగిద్దామని అనుకున్నాను" అని చెప్పారు. వెంటనే తన ఆటోలో మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లి, మా బ్యాగు మాకిచ్చి, తిరిగి ఆటో స్టాండుకి చేర్చారు. అంత తేలికగా మా బ్యాగు మాకు తిరిగి దొరుకుతుందని మేము అస్సలు ఊహించలేదు. అంతా సాయి కృప అని అనిపించింది. వెంటనే సాయి మందిరానికి వెళ్ళి, బాబా దర్శనం చేసుకుని వచ్చాము. "ధన్యవాదాలు బాబా".
జై సాయినాథ్!!!
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram baba ma arogyalu bagucheyandi thandri
ReplyDelete