సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1042వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కర్మను నాశనం చేయకపోయినా అనుభవించే శక్తినిస్తున్న బాబా
2. సాయిబాబాతో నా అనుభవం
3. దత్తజయంతినాడు బాబా అనుగ్రహం

కర్మను నాశనం చేయకపోయినా అనుభవించే శక్తినిస్తున్న బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః.!!!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


నేనొక సాయి భక్తురాలిని. నాకు ఈ 'సాయి మహారాజ్ సన్నిధే' శిరిడీ. 'సాయి మహారాజ్ సన్నిధి'లో ఏ విషయం చెప్పుకున్నా అది శిరిడీలో బాబా ముందు చెప్పుకున్నట్లే ఉంటుంది. సంతోషమైనా, భాధైనా స్వయంగా బాబాతో విన్నవించుకున్న అనుభూతి కలుగుతుంది. అంతెందుకు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుని చూస్తే, బాబానే చూసినంత సంతోషంగా ఉంటుంది. ఇందులో లీలలను నేను ప్రతిరోజూ చదువుతూ, తరువాత లీలల గురించి మరుసటిరోజు ఉదయం వరకు నిరీక్షిస్తూ ఉంటాను. ఇక నా అనుభవం విషయానికి వస్తే... 


ఒక మనిషి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ నా జీవితంలో జరిగాయి. ఒక ఆడపిల్లకి పెళ్ళైన తరువాత మంచి కుటుంబం దొరకకపోతే ఎలా ఉంటుందో అన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. 21 సంవత్సరాలుగా నేను మానసికంగా, శారీరకంగా చాలా చాలా అలసిపోయాను. అలసిపోయానని చెప్పడం కూడా చాలా చిన్న మాట. ఎందుకంటే నా జీవితంలో ఈ 20 సంవత్సరాలలో ప్రతి నిమిషం ఒక పోరాటమే. ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఈ పోరాటంలో బాబా నాతోనే ఉన్నారు. బాబా నా సమస్యలను పరిష్కరించలేదు కానీ, నాకు పోరాడే శక్తినిస్తున్నారు. ఇకపోతే 20 సంవత్సరాలుగా నేను నా బిడ్డను బాబాకే అప్పగించాను. ఆ ప్రేమమూర్తి నా బిడ్డను ఒక తల్లిలా చూసుకుంటున్నారు. తన అవసరాలన్నీ తీరుస్తూ మంచి చదువుతో సహా తనకు కావాల్సిన అన్నీ ఇచ్చారు బాబా. ప్రస్తుతం తన చదువు పూర్తి కాగానే మేము అనుకున్న దానికంటే మంచి జీతంతో మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు ఆ తండ్రి. ఆ ప్రక్రియలో జాబ్ నోటిఫికేషన్ చూడటం మొదలు అన్నీ బాబా కృపావిశేషంగా గురువారమే జరిగేలా అనుగ్రహించారు. "బాబా! మీ అనుగ్రహం గురించి నేను ఏమని చెప్పాలి! మీరు ఎంతో ప్రేమను, సహాయాన్ని అందిస్తున్నారు. మీకు అనేక వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. నా బిడ్డ మిగతా జీవితం కూడా మీరే చూసుకోవాలి బాబా. మా విషయంలో మీ సహాయం మాకెప్పుడూ కావాలి. ఎందుకంటే, 20 సంవత్సరాల నా జీవితంలో ఎంతలా విసిగిపోయానో, ఎంత బాధను అనుభవించానో(ఇంకా అనుభవిస్తున్నాను) మీకు మాత్రమే తెలుసు. మీరు సర్వాంతర్యామి. 20 సంవత్సరాలుగా నన్ను కాపాడుతున్నారు. నా పూర్వ జన్మ కర్మ వల్లే అదంతా అని తెలుసు. కానీ ఇక నా వల్ల కావట్లేదు బాబా. దయచేసి నా కర్మను 10 జన్మలకు బదలాయించండి బాబా. చెప్పుకోవడానికి మాకు మీరు తప్ప ఎవరూ లేరు. దయచేసి కృప చూపండి. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇకనైనా నాకు, నా బిడ్డకు మంచి రోజులు వచ్చేలా చూడు తండ్రి. ప్లీజ్ బాబా... ప్లీజ్. మీకు అనేక వేల కోట్లకోట్ల నమస్కారాలు సాయి".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయిబాబాతో నా అనుభవం


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు గాయత్రి సౌజన్య. నేను నా చిన్న వయస్సు నుంచి సాయిని ఎంతగానో పూజిస్తున్నాను. సాయిబాబాతో నాకు చాలా అనుభవాలున్నాయి. కానీ ఎప్పుడూ నా అనుభవాలను పంచుకునే అవకాశం కలగలేదు. ఇన్నాళ్లకు ఆ అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భాగ్యాన్ని ప్రసాదించిన సాయినాథునికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను పది సంవత్సరాలపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం చేశాను. నా మేనేజర్ తన మాటలతో నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడు. అందువల్ల నేను వేరే ఉద్యోగం చూసుకోకుండానే బాబా మీద పూర్తి భారం వేసి 2020, ఆగష్టు 21వ తేదీన ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. నాకు ఉద్యోగం చాలా అవసరమైనందున బాబా మీద భారం వేసి మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. అప్పుడు ఒక రోజు నేను, మా పిన్ని బాబా గుడికి వెళ్లి, బాబా దర్శనం చేసుకుని ఆయనకి ఎదురుగా కూర్చున్నాము. అప్పుడు మా పిన్ని, "బాబా మీద భారం వేసి తొమ్మిది గురువారాల వ్రతం చెయ్యి" అని సలహా ఇచ్చింది. నాకు బాబానే మా పిన్ని చేత తమ సన్నిధిలో అలా చెప్పిస్తున్నారనిపించింది. దాంతో సాయి మీద పూర్తి నమ్మకం ఉంచి నా ఉద్యోగ ప్రయత్నాలు నేను చేస్తూ మరోపక్క తొమ్మిది గురువారాల వ్రతం మొదలుపెట్టాను. బాబా దయవలన ఎటువంటి విఘ్నాలు ఎదురు అవ్వకుండా తొమ్మిది గురువారాల వ్రతం పూర్తి అయ్యింది. చివరి గురువారం వ్రతం పూర్తయిన తర్వాత నాకు మూడు కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో ఒకటి సాఫ్ట్ వేర్ కంపెనీ. నేను ఆ మూడు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. సాఫ్ట్ వేర్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన వాటికి నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. అయినా బాబా మీద విశ్వాసం కోల్పోకుండా ఆయా కంపెనీల నుండి తదుపరి కాల్ కోసం ఎదురుచూసాను. బాబా దయవల్ల నేను ఏ సాఫ్ట్ వేర్ ఇంటర్వ్యూలో అయితే సరిగా సమాధానాలు చెప్పలేకపోయానో అదే కంపెనీ నుంచి నేను సెలెక్ట్ అయ్యానని నాకు ఫోన్ వచ్చింది. నేను ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మొదట కంపెనీవాళ్ళు నన్ను కాంట్రాక్ట్ ఉద్యోగిగా తీసుకుని నా ప్రతిభ ఆధారంగా ఆరునెలల తరువాత పర్మినెంట్ చేస్తామని చెప్పారు. నేను సాయిబాబా మీద భారం వేసి 2021, జనవరి 27న ఆ ఉద్యోగంలో చేరాను. బాబా దయవలన 2021, సెప్టెంబర్ 27న కంపెనీవాళ్ళు నన్ను పర్మినెంట్ చేసారు. ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని బాధలు వచ్చినా ఆపకుండా సాయినాథుని స్మరణలో పరిపూర్ణంగా గడపండి. ఆయనే మనకి ఒక మంచి మార్గం చూపిస్తారు. ఇది సత్యం.


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


దత్తజయంతినాడు బాబా అనుగ్రహం


సాయిభక్తులందరికీ నమస్తే. నా పేరు మౌనిక. నా చెల్లి పేరు దేవికారాణి. మాది విశాఖపట్టణం. దత్తజయంతినాడు బాబా మాకు ప్రసాదించిన ఒక మంచి అనుభవం నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు నేను, నా చెల్లి గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాము. బాబా చక్కటి దర్శనాన్ని మాకు ప్రసాదించారు. మేము చాలాసేపు బాబా సమక్షంలో కూర్చున్నాము. ఆ సమయంలో ఎందుచేతనో నా మనసు బాగోలేక బాబాను ప్రార్డించి, ఆయన పాదాల చెంత రెండు రూపాయలు దక్షిణ పెట్టిన తరువాత మేము బయటకు వచ్చాము. గుడి మెట్ల మీద సుమారు 90 సంవత్సరాల వయసున్న ఒక ముసలావిడ ఉంది. నేను ఆమెకి 10 రూపాయలిచ్చాను. ఆమె, "అమ్మా! నేను ఎవ్వరి దగ్గర బిచ్చం తీసుకోను. నేను అస్సలు ఎవరినీ అడగను. ఎందుకో నీ దగ్గర తీసుకోవాలనిపిస్తుంది" అని అన్నారు. నేను ఆమెకి డబ్బులిచ్చి నమస్కరించి, ఆమెకి కాళ్ళకి కూడా దణ్ణం పెట్టుకున్నాను. ఆమె, "అంతా బాగుంటుంద"ని నన్ను దీవించింది. నిజానికి ఆవిడని చూస్తుంటే, బాబా నా ముందున్నట్లే అనిపించింది. తరవాత నేను, చెల్లి ఇంటికి బయలుదేరాము. మధ్య దారిలో నాకు, "అయ్యో.. ఆ ముసలావిడకి భోజనం పెట్టి ఉంటే బాగుండేది" అని అనిపించింది. ఇంటికి వచ్చాక నేను బాబా ముందు కూర్చుని పారాయణ వింటూ, "ఎప్పుడు తండ్రి, నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయి?" అని బాధపడ్డాను. అంతలో నాకు ఫోన్ వచ్చి బయటకి వెళ్ళాను. అప్పుడు రాత్రి 7గంటలు అయింది. కాలభైరవుడు(కుక్క) ఇంటి ముందు నిల్చొని ఉన్నాడు. ఆ కాలభైరవుని కళ్ళలో ఏదో తెలియని ప్రకాశం కనిపించింది. నేను ఫోన్ హడావిడిలో ఉండి నా చెల్లిని పిలిచాను. తను కాలభైరవుడికి ఆహారం పెట్టింది. ఆ ఆహారం తిన్నాక కూడా కాలభైరవుడు అక్కడే నిలబడి చూస్తుంటే, మా చెల్లి కొంచం అన్నం పెడతాను అంది. నేను సరే పెట్టు అని చెప్పాను. దత్తజయంతినాడు అనుకోకుండా మా ఇంట్లో బాబాకి ఇష్టమైన వంకాయ, చిక్కుడుకాయ కూర వండటం, వాటిని కాలభైరవుని రూపంలో బాబా మా ఇంటికొచ్చి ఆరగించారనిపించి నాకు, మా చెల్లికి చాలా ఆనందంగా అనిపించింది. మాటల్లో చెప్పలేని సంతోషమది. "ధన్యవాదాలు బాబా".



8 comments:

  1. OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. జై సాయి రామ్ జై జై సాయి రామ్ ప్లీజ్ బ్లెస్ మీ బాబా.. నా ఆరోగ్యాన్ని రక్షించి.. నాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు దేవా.. అప్పుడప్పుడు చాలా బాధ కలుగుతుంది బాబా.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అపోహలను తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య దేవా మమ్ము కరుణించి కాపాడు సాయినాథ.. నీవు తలుచుకుంటే భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని దర్శనం మాత్రం చేతనే చిటికెలో మాయం చేసిన గొప్ప దేవుడా .. మా అనారోగ్యాన్ని ఇప్పటికిప్పుడు రూపుమాపి లేకుండా చేయండి సాయినాధ.. నీవే కలవు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో సాయినాథ... కరుణాంతరంగ కృపా సాగర దయాకర సాయి శ్వర షిరిడి సాయినాథ్.. సాయిబాబా కి జై

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri pleaseeee

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo