సాయి వచనం:-
'నీవు నా వద్ద ఊరకే కూర్చో! చేయవలసినదంతా నేనే చేస్తాను!'

'బాబా ఉన్నారు. బాబా తప్పక మేలు చేస్తారు. బాబా చూసుకుంటారు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1037వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిబాబా ముందు చెప్పుకుంటే, పనులు సులభంగా అవుతాయి
2. చెప్పుకుంటే సమస్యలను తీరుస్తారు బాబా
3. సాయికృపతో నెరవేరిన కోరికలు

సాయిబాబా ముందు చెప్పుకుంటే, పనులు సులభంగా అవుతాయి

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. శిరిడీసాయి బంధువులందరికీ నమస్కారాలు. సాయితో తమ అనుభవాలను పంచుకుంటున్న భక్తులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా పేరు ముసానపల్లె నిరంజన్‌రెడ్డి. 2021, డిసెంబర్ 15న ఆ సాయినాథుడు నాకు చేసిన సహాయానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా బాబాకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నేను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తుండేవాడిని. ఇంకా ఒక నెల రోజులు డ్యూటీ చేయాల్సి ఉండగా ఎడమకాలి నొప్పితో బాధపడుతున్న కారణంగా నేను 2021, సెప్టెంబర్ 14వ తేదీన నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఫీల్డ్ ఆఫీసరుకు రాజీనామా పత్రం ఇచ్చాను. అతను ఆ పత్రంపై సంతకం చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. సరేనని నేను రెండు రోజులు డ్యూటీకి వెళ్లాను. కానీ, కాలినొప్పిని తట్టుకోలేక ఇక నేను డ్యూటీకి రాలేనని మా ఫీల్డ్ ఆఫీసరుకి ఫోన్ చేసి చెప్పాను. అతను నా బాధ అర్థం చేసుకుని, "సరే రెడ్డీ" అని అన్నాడు. రెండునెలల తరువాత రాజీనామా పత్రం యొక్క జిరాక్స్ కాపీ తీసుకుని పి.ఎఫ్ సంబంధిత ఆఫీసరుకు ఇవ్వాలని ఆఫీసుకు వెళ్లాను. కానీ ఫీల్డ్ ఆఫీసర్, "ఫైలులో పెట్టిన రాజీనామా పత్రం దొరకడం లేదు, మరోసారి రాజీనామా పత్రం వ్రాసి ఇవ్వండి. నేను సెప్టెంబర్ 14వ తేదీ వేసి సంతకం చేసి ఇస్తాను" అని చెప్పారు. నేను, "సరే సార్" అని చెప్పి మరోసారి రాజీనామా పత్రం వ్రాసి ఇచ్చాను. అప్పుడు అతను సంతకం చేసి నాకు ఇచ్చారు. నేను అతనితో, "దీన్ని పి.ఎఫ్ ఆఫీసులో ఇవ్వాలి కదా" అన్నాను. అందుకు అతను, "లేదు. దాన్ని నీ దగ్గరే పెట్టుకో. రెండునెలల తరువాత సైబర్ కేర్‌లో పి.ఎఫ్‍కి అప్లై చేసుకోవచ్చు" అని చెప్పడంతో వచ్చేశాను. నెలరోజుల తరువాత నేను మా సెక్యూరిటీ ఆఫీసుకు వెళ్ళి, రిసెప్షన్‍లో నా రాజీనామా పత్రం చూపించాను. అక్కడ ఉన్న సార్ సిస్టమ్‍లో చెక్ చేసి, "డిసెంబర్ 15 తరువాత పి.ఎఫ్‍కి అప్లై చేసుకోవచ్చు" అని చెప్పారు. కానీ, లెక్కప్రకారమైతే నా రాజీనామా లెటర్ అకౌంట్&పి.ఎఫ్ సెక్షన్‌వాళ్లకి ఇస్తే, వాళ్ళు 'exit date' ఇవ్వాలి. నా ఫ్రెండ్స్ కూడా అదే మాట అన్నారు. నేను చాలా టెన్షన్ పడి ప్రతిరోజూ సాయిబాబా ఫోటో ముందు పి.ఎఫ్ అమౌంట్ గురించి చెప్పుకుని, "బాబా! నువ్వే నాకు దిక్కు" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. 2021, డిసెంబర్ 15, బుధవారం మధ్యాహ్నం 1గంటకు exit date ఇచ్చి ఉండాలి. 'రక్ష రక్ష శ్రీసాయి రక్ష' అనుకుంటూ సైబర్ కేర్‌కు వెళ్లాను. అక్కడ కే.వై.సి పాస్‍వర్డ్ ఇచ్చి, సిస్టమ్‍లో 'exit date' వచ్చిందో, లేదో చూడమని అడిగాను. వాళ్ళు 'exit date' ఇచ్చారని చెప్పారు. సంతోషంగా మనసులోనే బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. తరువాత పి.ఎఫ్‍కి అప్లై చేశాను. వాళ్ళు 15, 20 రోజుల్లో అమౌంట్ వస్తుందని చెప్తే, ఇంటికి వచ్చేసాను. కొన్ని పనులలో మనకు అనుమానం ఉంటే సాయిబాబా ముందు చెప్పుకుంటే, మన పనులు సులభంగా అవుతాయి. సాయిబాబాపట్ల మనం భక్తితో ఉండాలి. బాబా మన వెంట ఉంటారు. "బాబా! ఇలాగే మీ భక్తులందరికీ మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను".

సర్వజనాః సుఖినోభవంతు!!!

చెప్పుకుంటే సమస్యలను తీరుస్తారు బాబా

సాయి మహరాజ్ భక్తులకు నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. ఒకసారి మా ఇంట్లో విలువైన వస్తువొకటి కనిపించలేదు. దానికోసం ఎంత వెతికినా అది కనపడలేదు. నేను వెంటనే బాబాతో, "బాబా! వస్తువు కనిపించేలా చేయండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి ఆ వస్తువు కనిపించింది. బాబాతో ఏ విషయం గురించి చెప్పుకున్నా ఇలాగే ఏదో ఒక విధంగా ఆ సమస్యలను తీర్చేస్తారు. ఇలా బాబా నన్ను చాలా విషయాల్లో రక్షించారు. నాకున్న ఆరోగ్య సమస్యను కూడా ఊదీ సహాయంతో బాబా పూర్తిగా నయం చేశారు. సరైన జీవనోపాధి కూడా లేని మమ్మల్ని మా బాబా ఎప్పటికప్పుడు అన్ని సమస్యల నుంచి బయటపడేస్తూ అనుక్షణమూ కాపాడుతూ ఉన్నారు. మేము ఈమాత్రం జీవిస్తున్నామంటే అది బాబా దయ మాత్రమే. ఆయనే కాపాడకపోతే నేను ఏమైపోతానో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. "చాలా సంతోషం బాబా. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం తండ్రీ? కేవలం మీ నామస్మరణతో మా జీవితాలు తరించేలా అనుగ్రహించండి. మీ నీడలో తృప్తిగా బ్రతికితే అదే చాలు తండ్రీ. నా పిల్లల భారం కూడా మీపై వేసి, పూర్తిగా మీపై ఆధారపడి ఉన్నాము తండ్రి. దయతో అందరినీ చల్లగా చూడండి బాబా. థాంక్యూ బాబా".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సాయికృపతో నెరవేరిన కోరికలు


ఓం సద్గురు సాయినాథాయ నమః!!! నాపేరు శారద. నేను ఒక సాయిభక్తురాలిని. ఇటివల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను సాయి దివ్య పాదాలకు నమస్కరిస్తూ తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా నాన్నగారు చాలా అనారోగ్యం పాలయ్యారు. ఆ కారణంగా ఆయన తన రోజువారీ పనులు చేసుకోలేకపోవడమే కాదు, భోజనం కూడా చేయలేకపోయేవారు. 'ఆయన మళ్ళీ మామూలుగా అవుతారా?' అన్న ప్రశ్న మా అందరిలో చాలా భయాన్ని కలిగించింది. మేమంతా చాలా డిప్రెషన్‌కి లోనయ్యాము. నాన్న కోలుకుంటారని మేము అస్సలు ఊహించలేదు. అట్టి స్థితిలో రోజూ సాయినాథుని స్మరిస్తూ ఉండే నేను, "సాయి తండ్రీ! నాన్నకి మునుపటిలా ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి" అని బాబాను ప్రార్థించాను. ఆ సాయినాథుని దయవలన నాన్న ఇప్పుడు మామూలుగా తిరగ గలుగుతున్నారు. ఇకపోతే మూడు సంవత్సరాలపాటు నేను చేతులు నొప్పి, తిమ్మిర్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఆ విషయంలో కూడా నేను సాయినాథుని ప్రార్థించాను. ఆయన ప్రేమతో నాకు ఒక మార్గాన్ని చూపించారు. దాంతో నా ఆరోగ్యం కుదుటపడింది. మా అన్నయ్య కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కొందామని చూస్తుంటే, ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతుండేది. చివరికి నేను, "అన్నయ్య సొంతింటి కల నెరవేరేలా చేయండి తండ్రి" అని బాబాను ప్రార్ధించాను. తరువాత బాబా ఆశీస్సులతో ఆ కోరిక నెరవేరింది. ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను.



7 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sai ram baba amma Arogyam bagundali thandri pleaseeee sainatha

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo