సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1040వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనం పట్టుకున్నదానికంటే వందరెట్లు బలంగా బాబా మనల్ని పట్టుకుంటారు
2. బాబా అనుగ్రహం
3. బాబా ప్రసాదించిన ఉద్యోగం

మనం పట్టుకున్నదానికంటే వందరెట్లు బలంగా బాబా మనల్ని పట్టుకుంటారు


సాయిబంధువులకి నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నేను ఇదివరకు మా నాన్నకి బైపాస్ సర్జరీ సమయంలో బాబా అడుగడుగునా మమ్మల్ని ఆదుకున్న అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. నాన్న శస్త్రచికిత్స అనంతరం నేను దుబాయి తిరిగి వెళ్ళేలోపు, నాకు నెలసరి వచ్చేముందు నా బ్రెస్టులో ఒక తిత్తిలా వచ్చి నొప్పిగా అనిపించింది. నేను దాని గురించి ఇంటర్నెట్‍‍లో చూసి, 'నెలసరి అయిపోయాక ఆ తిత్తి తగ్గిపోతుంద'నుకున్నాను. అయితే, అది కొంచెం పరిమాణం తగ్గి, పూర్తిగా తగ్గక అలాగే ఉండిపోయింది. మరోసారి నెలసరి వచ్చినప్పుడు తగ్గిపోతుందేమోనని చూశానుకానీ అప్పుడు కూడా తగ్గక అలాగే ఉంది. దాంతో నేను హాస్పిటల్‍కి వెళ్తే డాక్టరు చూసి, "సిస్టిక్‍లా ఉంది, స్కాన్ తీయిద్దాం. ఒకవేళ తేడా ఉంటే మెమోగ్రఫీ, బయాప్సీ చేయిద్దాం" అన్నారు. అంతేకాకుండా ఆమె, "మీ కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా?" అని అడిగారు. అందుకు నేను "మా పెదనాన్నగారి అమ్మాయికి వచ్చింది" అని చెప్పాను. ఆమె సరేనని స్కాన్ చేయించమని రాసింది. నేను ఆదివారం చెకప్‍కి వెళ్తే, మరుసటి ఆదివారం స్కాన్ చేస్తామన్నారు. ఈ వారంలో నేను చాలా మానసిక బాధను అనుభవించాను. బాబా ముందు చాలా ఏడ్చాను. కరుణగల సాయిమాత తన అద్భుతం మొదలుపెట్టారు. బాబా ఇచ్చిన ప్రేరణతో నేను గురువారం సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి ఆదివారంలోగా పూర్తిచేయాలని పూర్తిగా పారాయణలో లీనమైపోయాను. ఆ సమయంలో ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక చిన్నపాప నా దగ్గర పాలు తాగుతున్నట్లు కనిపించింది. ఆ కల ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదుగానీ మరుసటిరోజు స్కాన్ అనగా నాలో తెలియని టెన్షన్ మొదలైంది. నా భర్త, "నీకు ఏం కాదు" అని అంటున్నా నేను మనసును అదుపు చేసుకోలేకపోయాను. "బాబానే నా బాధ తీర్చాలి, ఆయనదే భారం" అని నిద్రపోయేముందు నా రోజువారీ అలవాటు ప్రకారం బాబా సందేశం కోసం చూస్తే, ఈ క్రింది సందేశం వచ్చింది.

మరుసటిరోజు ఇంటినుండి బయలుదేరేముందు బాబా ఇచ్చిన మరో సందేశం:

హాస్పిటల్‍కి చేరుకున్నాక నన్ను స్కాన్‍కి పిలిచేవరకు నేను సాయిగాయత్రి వింటూ గడిపాను. తరువాత నన్ను స్కాన్‍‍కి పిలవగానే నేను బాబాను తలచుకుని ఆయన సందేశం కోసం చూశాను. అప్పుడు ఈక్రింది సందేశం వచ్చింది.
ఇలా అడుగడుగునా బాబా తమ సందేశాలతో నన్ను నడిపిస్తూ నాకు స్కాన్ చేయించారు. నన్ను స్కాన్ చేసిన డాక్టరు, "అది తిత్తి కాదు. అది fibro సిస్టిక్. పిరియడ్స్ సమయంలో అలా వచ్చి, పోతాయి. కొన్నిసార్లు అలాగే ఉండిపోతాయి" అని చెప్పారు. కానీ రిపోర్టు వెంటనే ఇవ్వలేదు. అయితే మరుసటిరోజు ఉదయం బాబా పైన చెప్పిన విధంగానే నేను ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను. డాక్టరు రిపోర్టు చూసి, "అంతా నార్మల్‍గా ఉంది. మందులు అవసరం లేదు" అన్నారు. ఇక నా ఆనందాన్ని ఏమని చెప్పను? బాబాను మనం ఎంత బలంగా పట్టుకుంటామో, అంతకు వందరెట్లు బలంగా బాబా మనల్ని పట్టుకుంటారు. ఆయన కడవరకు మనకు తోడుగా ఉండి నడిపిస్తారు. ప్రస్తుతం నేను రోజూ ఒక అధ్యాయం పారాయణ చేయాలని నియమం పెట్టుకుని, అది నా దినచర్యలో భాగమైపోవాలని బాబాను వేడుకుంటున్నాను. "బాబా! అందరినీ మరియు ఈ ప్రపంచాన్ని చల్లగా చూడు తండ్రి".

జై సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబా అనుగ్రహం


నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను నా గత అనుభవంలో మా తమ్ముడు ఒక ప్రభుత్వ సంస్థకి సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని పంచుకున్నాను. తరువాత ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫైనల్ ఎగ్జాం పెట్టారు. అప్పుడు నేను, "బాబా! ఈ పరీక్షలో కూడా తమ్ముడు ఉత్తీర్ణుడై తనకి ఉద్యోగం రావాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీ ఋణం ఏ జన్మలోనూ తీర్చుకోలేనిది".


నాకు పూల మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం. బాబా దయవలన మా ఇంటి మేడ మీద చిన్న తోటలా మొక్కలు నాటాను. హఠాత్తుగా ఒకరోజు అన్ని మొక్కలకు పురుగులు పట్టి ఆకులు తినేశాయి. పురుగుల మందు స్ప్రే చేసినా ఆ పురుగులు పోలేదు. దాంతో నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఎలాగైనా పురుగులు పోయేలా చేసి నా మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో పురుగులన్నీ వెళ్లిపోయాయి. "థాంక్యూ సో మచ్ బాబా".


నేను గత రెండు సంవత్సరాలుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాను. కరోనా కారణంగా దాని తీవ్రత మరికొంచెం ఎక్కువ అయింది. నేను భయపడి బాబాకి నమస్కరించుకుని, "నా కష్టం తీరిపోవాల"ని ప్రార్థించాను. బాబా దయవలన నా సమస్య 90% నయం అయింది. "ధన్యవాదాలు బాబా. ఈ సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడేలా చెయ్యండి సాయి".


బాబా ప్రసాదించిన ఉద్యోగం


నేను సాయిభక్తురాలిని. నేను డిగ్రీ పూర్తి చేశాను. తరువాత మూడేళ్లపాటు చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. చాలా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యాను. ఒకటి, రెండు ఉద్యోగాలలో జాయిన్ అయినా కూడా వాటివల్ల నాకు అస్సలు సంతృప్తి ఉండేది కాదు, చాలా బాధపడేదాన్ని. అందరూ 'నీకేం రాదు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు' అని కామెంట్ చేస్తూ చాలా చులకనగా చూసేవారు. నాకు బాబా మీద చాలా నమ్మకం, విశ్వాసం. ఆయన ముందు చాలా బాధపడేదాన్ని. కొంతమంది పెళ్లి చేసేయండి అని పిచ్చిపిచ్చి సంబంధాలు తీసుకొచ్చేవారు. ప్రతిసారీ నేను బాబా ముందు, "బాబా! నాకు నచ్చలేదు" అని ఏడుస్తూ నా బాధని చెప్పుకునేదాన్ని. చివరికి బాబా ముందు కూర్చొని చాలా గట్టిగా ప్రార్ధించి, "నాకు మంచి ఉద్యోగం రావాలి" అని చెప్పుకుని పారాయణ మొదలుపెట్టాను. బాబా అపార అనుగ్రహం వల్ల పారాయణ మొదలుపెట్టిన రెండోరోజే నాకు ఉద్యోగం(నైట్ షిఫ్ట్) వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా. కానీ త్వరగా డే షిఫ్ట్ జాబ్ ఇప్పించండి బాబా".



5 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🙂❤😀🌺😊🌼🤗🌸😃🌹👪💝💕

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo