- మొబైల్ పోవడం ద్వారా మంచి చేసిన బాబా
- ఆందోళనను తొలగించిన బాబా
మొబైల్ పోవడం ద్వారా మంచి చేసిన బాబా
నేను ఒక సాయి బిడ్డను. నేను బెంగుళూరులోని ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. ఒకరోజు స్కూలు వార్షికోత్సవం జరపదలచి స్కూలుకి దగ్గరగా ఉన్న ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. నేను సబ్జెక్ట్ టీచరునే కాక క్లాసు టీచరుని కూడా అయినందున పిల్లల పూర్తి బాధ్యత నాపైన ఉంటుంది. అందువల్ల నేను నా పనులు చేసుకుంటూనే స్టూడెంట్స్‌పై పూర్తి శ్రద్ధ పెట్టాను. సమయం సాయంత్రం 6:30 అవుతోంది. నా మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోవస్తోంది. “ఫంక్షన్ పూర్తికావడానికి ఆలస్యమవుతుంద"ని కనీసం ఇంట్లోవాళ్ళకైనా చెప్పాలంటే ఫోనులో ఛార్జింగ్ ఉండాలని, ఒక రూములో మొబైల్ ఛార్జింగ్ పెట్టి, అక్కడున్న పిల్లలను "జాగ్రత్తగా చూసుకోమ"ని చెప్పాను. తరవాత నేను మా స్టూడెంట్స్‌తోపాటు హాలులో ఉన్నాను. అది పెద్ద ఫంక్షన్. చాలామంది వస్తూ పోతూ ఉన్నందున పిల్లలను జాగ్రత్తగా చూసుకొంటూ నా మొబైల్ సంగతి మర్చిపోయాను. ఇరవై నిమిషాల తరువాత వెళ్లి చూస్తే మొబైల్ కనిపించలేదు. ఎవరినడిగినా 'మాకు తెలియదు' అని అన్నారు. విషయం మా పైఅధికారులకు, మా సహోద్యుగులకు చెప్పాను. వాళ్లంతా వెతికారు, కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రయిపోతోంది. అంత పెద్ద సిటీలో మొబైల్ లేకుండా ఆ సమయంలో ఇంటికి చేరుకోవడం కూడా కష్టమే, అయినా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎలాగోలా క్షేమంగా ఇల్లు చేరుకున్నాను.
తరువాత నాతోపాటు పనిచేసే టీచర్లు, "ఇక మొబైల్ గురించి మర్చిపోండి. అది దొరికే అవకాశం లేదు. అంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఎవరు తీసివుంటారో ఎలా తెలుస్తుంది? కాబట్టి వదిలేయండి" అని అన్నారు. నేను కూడా ఫోన్ మీద ఆశ వదులుకొని వేరే మంచి మొబైల్ కొనుక్కున్నాను. కానీ, "నీ బిడ్డ క్షేమాన్ని చూసుకోవలసిన బాధ్యత నీదే కదా!" అని బాబాను నిందించి, "నా మొబైల్ నాకు దొరికేలా చేయి" అని బాధపడ్డాను. తరువాత పదిరోజులకు నేను క్లాసులో ఉండగా ఒక విద్యార్థి నాతో, "మేడం, మీ మొబైల్ తీసింది ఒక అన్న" అని ఒక స్టూడెంట్ పేరు చెప్పాడు. నేను మా పైఅధికారులకు ఈ విషయం తెలిపాను. ఆ అబ్బాయిని పిలిచి విచారిస్తే, మొదట 'నాకేమీ తెలియదు' అంటూ చాలా మొండిగా వాదించాడు. నిజానికి మొబైల్ తీసింది తానే అయినప్పటికీ ఆ సమయంలో అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత ఆ అబ్బాయి తల్లి వచ్చి, నాకు క్షమాపణలు చెప్పి, కొత్త మొబైల్ తీసిచ్చింది. అప్పుడు నా సహోద్యోగులందరూ 'నిజంగా ఇది బాబా చేసిన లీల' అని అన్నారు.
ఒకరకంగా చెప్పాలంటే నా మొబైల్ పోవడం మంచిదే. ఎందుకంటే, ఆ కారణంగా నేను మంచి మొబైల్ తీసుకున్నాను. అది లాక్ డౌన్ సమయం. ఆ కారణంగా మొబైల్లోనే క్లాసెస్ చెప్పాల్సి వచ్చింది. పాత మొబైల్లో అయితే క్లాసులు చెప్పడం చాలా కష్టమయ్యేది. బాబాకి భవిష్యత్తు తెలుసు గనకనే మొబైల్ పోయేలా చేసి నాకు చాలా సహాయం చేశారు. ఆయన ప్రేమను వర్ణించడం అసాధ్యం. బాబా చివరివరకు కూడా మనల్ని పరీక్షిస్తారు. కానీ మనకు అంతిమంగా విజయాన్నే చేకూరుస్తారు. మనకు కావలసింది శ్రద్ధ, సబూరీ.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఆందోళనను తొలగించిన బాబా
ఓం సాయిరామ్! ప్రియమైన సాయిబంధువులందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేనిప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. జీవితంలో నాకు మార్గనిర్దేశం చేస్తూ రక్షణగా ఉన్నామని ఎన్నో అనుభవాల ద్వారా బాబా నాకు నిరూపణ ఇస్తున్నారు. ఇటీవల మా అమ్మాయికి తీవ్రంగా జలుబు, దగ్గు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి కారణంగా నేను చాలా భయపడ్డాను. ఇంచుమించు అదే సమయంలో మేము నా భర్త సోదరి ఇంటిని సందర్శించాము. రెండురోజుల తరువాత ఆమె కుమార్తెకి కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు మాకు తెలిసింది. దాంతో నేను చాలా ఆందోళనచెంది నిరంతరం బాబాను ప్రార్థించసాగాను. వాళ్ళ కుటుంబమంతా మళ్ళీ కోవిడ్ పరీక్షకోసం వెళ్లారు. మేము అంతా మంచే జరుగుతుందని ఆశించి, "అలా జరిగితే, 5 వారాల సాయి వ్రతం చేస్తాన"ని బాబాను ప్రార్థించాను. మూడవరోజు శుభవార్త వచ్చింది. వాళ్లందరికీ నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. మా అమ్మాయికి కూడా నయమైంది. తన జలుబు తగ్గిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సహాయం చేసినందుకు బాబాకు నేను కృతజ్ఞురాలినై ఉంటాను. "థాంక్యూ సో మచ్ బాబా".
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram
ReplyDeleteBaba, ఎ ప్పు డు మా అందరినీ మీ మార్గo లో నడి పించండి.
ReplyDeleteYes,what u said is correct,baba will test us till the end,and finally he will bless us with great success,tq so much sai deva,love u with all my heart and soul,pls bless me with Sai Sannidhi book deva,love u so much.
ReplyDelete*By your beti*
Baba na pyna daya chupinchu na korika neraverchu thandri sai
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏