సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 538వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  1. రక్షణనిచ్చే బాబా
  2. హృదయపూర్వకమైన ప్రార్థనకు బాబా వచ్చారు

రక్షణనిచ్చే బాబా

యు.ఎస్. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

అందరికీ నమస్తే! నేను మన ప్రియమైన బాబాకు చిన్న భక్తురాలిని. నన్ను నేను ఆయన కూతురిగా సంబోధించుకుంటాను.

మొదటి అనుభవం:

కొన్ని రోజుల క్రితం మా నాన్న ఆరోగ్యం బాగాలేదని, జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. వెంటనే నేను, "బాబా! నాన్నకు జ్వరం తగ్గేలా అనుగ్రహించండి. అన్ని కష్టాలను ఎదుర్కొనే శక్తిని తనకి ప్రసాదించండి" అని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించాను. మళ్ళీ నేను మా అమ్మకు ఫోన్ చేస్తే, "మీ నాన్నకు జ్వరం తగ్గింది. ఇప్పుడాయన తనంతట తను నడుస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నార"ని చెప్పింది. "బాబా! చాలా ధన్యవాదాలు. మీకు తెలుసు బాబా, అమ్మానాన్నకు మేము నలుగురు కుమార్తెలం, వాళ్ళకి దూరంగా ఉన్నాము. వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో చాలా కష్టపడుతున్నారు. దయచేసి మీ ఆశీస్సులు వారిపై ఎప్పుడూ ఉంచి, వారికి రక్షణనివ్వండి. వాళ్ళకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ సహాయాన్ని అందించండి".

రెండవ అనుభవం:

మాకొక చిన్న వ్యాపారం ఉంది. మేము ప్రతి సంవత్సరం కార్మికుల నష్టపరిహారానికి సంబంధించి భీమా ఆడిట్లను సమర్పించాలి. ఒకసారి ఏ కారణం చేతనో మేము ఆడిట్ పంపించడంలో నిర్లక్ష్యం చేశాము. అందుకు కంపెనీ భారీ మొత్తంలో జరిమానా విధించింది. "ఈ జరిమానా నుండి మమ్మల్ని రక్షించండ"ని నేను నా బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాను. నా రక్షకుడైన బాబా మా ప్రార్థనలను విన్నారు. మాపై వేసిన జరిమానాను మాఫీ చేస్తూ, ఆడిట్ సమర్పించడానికి గడువు పెంచుతూ కంపెనీ నుండి మాకు ఒక ఇ-మెయిల్ వచ్చింది. బాబా ఎంత పెద్ద ఉపశమనాన్ని ఇచ్చారో నేను మాటల్లో చెప్పలేను. ఆయన చూపిన అద్భుతానికి మేము చాలా సంతోషించాము. "బాబా! మీకు చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో మేము మరింత జాగ్రత్తగా ఉంటామని నేను మీకు మాట ఇస్తున్నాను. మరొక్కసారి మీరు చేసిన సహాయానికి నా గుండె లోతుల నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాబా".


హృదయపూర్వకమైన ప్రార్థనకు బాబా వచ్చారు

సాయిభక్తుడు సుధీర్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

2010, జనవరి 26, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నేను సాయిబాబాకు సంబంధించిన ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. అందులో, "మీరు నన్ను తలచుకున్న మరుక్షణం నేను మీ ముందు వ్యక్తమవుతాను" అన్న బాబా వాగ్దానాన్ని చదివాను. స్వచ్ఛమైన హృదయంతో బాబాని పిలిస్తే అది నిజమవుతుందని అక్కడ వ్రాసి ఉంది. అది చదివాక నేను హృదయపూర్వకంగా బాబాను నా ముందుకి రావాలని కోరుకుని చదవడం కొనసాగించాను. 1918, అక్టోబరు 15, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకి బాబా మహాసమాధి చెందారని మనందరికీ తెలుసు. అదే మంగళవారం, ఇంచుమించు అదే సమయంలో నేను బాబాని వేడుకున్నాను. అరగంట తరువాత బయటనుండి బాబా పాటలు వినిపించాయి. వెంటనే బయటకు వెళ్లి చూసి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. మా ఇంటి మీదుగా బాబా పల్లకి ఊరేగింపు వెళ్తోంది. భక్తులు బాబా పాటలు సామూహికంగా పాడుకుంటూ ఆనందోత్సాహాలతో ముందుకు సాగుతున్నారు. నేను ఎంతటి ఆనందాన్ని పొంది ఉంటానో మీరు ఊహించవచ్చు. బాబా నాకు దగ్గరగా ఉన్నానని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. ఆయన సర్వవ్యాపకుడు. ఆయన మనకోసం ఖచ్చితంగా ఉన్నారు. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. "బాబా! మీరు నాపై కురిపించే ప్రేమకు చాలా చాలా ధన్యవాదాలు. ఎల్లప్పుడూ నేను మీకు కృతజ్ఞుడనై ఉంటాను. నేను మీ బానిసను. భవిష్యత్ జన్మలలో నేను మీకు సన్నిహితంగా ఉంటూ, మిమ్మల్ని సేవించుకుంటూ మీ నివాసానికి చేరుకుంటాను".

- సుధీర్ కుమార్.


7 comments:

  1. ఓం సాయిరాం 🙏🌺🙏

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Baba na korika teerchu thandri

    ReplyDelete
  4. 🌸Om Sairam 🙏🙏🙏🙏🌺

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo