సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 528వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఏదో ఒక మాధ్యమం ద్వారా సమాధానాలు ఇస్తుంటారు బాబా
  2. కరోనా సోకకుండా క్షేమంగా చూసుకున్న బాబా

ఏదో ఒక మాధ్యమం ద్వారా సమాధానాలు ఇస్తుంటారు బాబా

సాయిభక్తురాలు భారతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

జై సాయిరాం! సాయిబంధువులకు నమస్సుమాంజలి. నా పేరు భారతి. సాయిలీలలను మాకు అందించే ప్రయత్నంలో మీరు సాయిని మాకు మరింత దగ్గర చేస్తున్నారు అన్నది అక్షరసత్యం. సాయి మీ అందరికీ కలకాలం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. సాయిలీలలు ఎంత చెప్పినా తరగవు. సాయి గురించి ఎంత చెప్పినా, ఎంత చదివినా, ఎంత విన్నా తక్కువే. అడుగడుగునా సాయి మన జీవితాలను నిర్ణయించి మనకు తోడుగా, రక్షగా నిలుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘సాయి లేనిదే జీవితం లేదు’ అనటం అతిశయోక్తి కాదు.

దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, మేముండే ఊరిలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో మాకు వేరే ఊరికి బదిలీ అయినప్పటికీ బాబా మా వెంట ఉండి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చారు. ఊరికి వెళ్ళేముందు మేము మా స్వంత ఇంటికి to-let బోర్డు పెట్టలేదు. కేవలం, “బాబా! ఇంటిని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నా” అని చెప్పి వచ్చాను. మూడు వారాలలోనే మా ఇంటి గురించి ఎవరో తెలుసుకుని మమ్మల్ని సంప్రదించారు. మేము అనుకున్నట్లు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేవాళ్ళనే టెనెంట్స్ గా బాబా కుదిర్చారు అనుకున్నాం కానీ వాళ్ళు మళ్ళీ రాలేదు. సాయి లీల ఏమిటో వేచి చూడాలి. ఏదేమైనా నేను ఇంటి బాధ్యత బాబాకి అప్పగించాను. ఆయన అనుగ్రహం త్వరలోనే తప్పక లభిస్తుందని ఆశీస్తున్నాను. ఇకపోతే బాబా ప్రసాదించిన మరో చిన్న అనుభవం గురించి మీతో పంచుకోవాలి.

ఈమధ్య మా బంధువొకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను తన ఆరోగ్యం కోసం బాబాను ప్రార్థించి, క్వశ్చన్&ఆన్సర్ సైట్ లో చూస్తే, “తనకు 21 రోజుల్లో నయం అవుతుంద"ని వచ్చింది. బాబా దయతో తనకి ప్లాస్మా అరేంజ్ చేశారు. దాంతో చెప్పినట్లుగానే తనకు 21 రోజుల్లో నయం చేశారు బాబా. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక మాధ్యమం ద్వారా బాబా నా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఆవిధంగా ఆయన రోజూ నాతో కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది అక్షరసత్యం. ఒకరోజు నేను బాధగా ఉంటే, “రాత్రంతా నీ గురించే ఆలోచించాను” అని బాబా సందేశమిచ్చారు. మరోసారి నాకు ఆరోగ్యం బాగలేకపోతే, “పూర్వజన్మ ఫలితం అనుభవించాలి” అనీ, “సాయం చేస్తాను” అనీ బాబా సందేశమిచ్చారు. అలా ప్రతిరోజూ నన్ను, సాయిబంధువులని కాపాడుతున్న సాయికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను.

బాబా పిలిస్తే పలికే దైవం. ఆయన ప్రతి ఒక్కరి సందేహాలకు ఏదో ఒక మాధ్యమం ద్వారా సమాధానాలు ఇస్తూనే ఉంటారు. అవి గ్రహించడంలో మనమే తడబడుతుంటాం. అర్థం చేసుకోలేక బాబా మనల్ని పట్టించుకోవడం లేదని, సమాధానం ఇవ్వడం లేదని ఆయన్ని నిందిస్తాం. అలా చేయటం సరికాదు. పొరపాటు ఎప్పుడూ మన వైపే ఉంటుందని గుర్తుంచుకోవాలి. బాబా అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.

జై సాయిరాం!

కరోనా సోకకుండా క్షేమంగా చూసుకున్న బాబా

సాయిభక్తురాలు శ్రీమతి పద్మావతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! సాయిబంధువులకు నా నమస్కారం. బాబా అనుగ్రహంతో నాకు కలిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు వెరికోస్ వెయిన్స్ (ఉబ్బిన నరాలు) ఉన్నాయి. అవి ఈమధ్య నన్ను చాలా ఇబ్బందిపెట్టాయి. డాక్టరుకి చూపించుకుందామంటే ఈ కోవిడ్ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళాలంటే భయమేసి ఊరుకున్నాను. కానీ మా అమ్మాయి తన ఫ్రెండుకి తెలిసిన డాక్టర్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారని ఆ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంది. నాకేమో హాస్పిటల్‌కి వెళ్ళాలంటే భయం, వెళ్ళకపోతే నా కాలు ఏమవుతుందో అని ఆందోళన. చివరికి, ‘డాక్టర్ని కలవాలా, వద్దా’ అని బాబా దగ్గర చీటీలు వేస్తే ‘డాక్టరుని కలవమ’ని బాబా సమాధానం వచ్చింది. దాంతో బాబా పైన భారం వేసి కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్ని కలిస్తే, ‘స్కానింగ్ చేస్తే గానీ ఏ సంగతీ చెప్పలేను’ అన్నారు. వెంటనే స్కానింగ్ చేయించుకుందామని వెళ్తే అక్కడ చాలా క్యూ ఉంది. అయినా అక్కడే నాలుగు గంటలు వేచివుండి, స్కానింగ్ చేయించుకుని, రిపోర్టు తీసుకుని డాక్టర్ని కలిశాను. స్కానింగ్ రిపోర్టు చూసిన డాక్టర్, "వెంటనే కాకపోయినా ఒకటి రెండు నెలల్లో లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకోమ"ని సలహా ఇచ్చారు. ఇంటికి తిరిగి వచ్చాక, “బాబా! హాస్పిటల్లో దాదాపు 5 గంటలు ఉన్నాను, నాకు కరోనా రాకుండా కాపాడండి” అని బాబాను వేడుకున్నాను. కరోనా నుండి కాపాడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో కరోనా సోకకుండా క్షేమంగా ఉన్నాను. బాబాకు మాట ఇచ్చినట్లుగానే ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. బాబా అనుగ్రహంతో లేజర్ ట్రీట్‌మెంట్ కూడా సవ్యంగా జరిగితే ఆ అనుభవాన్ని పంచుకునేందుకు మళ్ళీ మీ ముందుకు వస్తాను.


9 comments:

  1. Sai Ram
    Naa koduku nannu vadili velli 485 day avutundi
    neenu yemi cheyali sai

    ReplyDelete
  2. 🌷🌷 Om Sairam 🌷🌷🙏🙏🙏

    ReplyDelete
  3. Baba please baba ma problems ni solve cheyandi thandri sai

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo