సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 530వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. అడిగేవాటికి, అడగనివాటికి సమాధానమిచ్చే ప్రేమమూర్తి శ్రీసాయి
  2. “నేను ఉండగా నీకు భయమెందుకు? అంతా నేను చూసుకుంటాను”

అడిగేవాటికి, అడగనివాటికి సమాధానమిచ్చే ప్రేమమూర్తి శ్రీసాయి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

అందరికీ సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వాహకులకు ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే, నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను, నా ఆలోచనలను, అభిప్రాయలను మీతో పంచుకున్నాను. ప్రతిసారీ ఒకటే సందేహం, ‘నేను నా భావాలను సరిగా వ్యక్తం చేయగలిగానా?’ అని. తీరా నా అనుభవాలు బ్లాగులో ప్రచురించాక చూస్తే నేను అనుకున్నదానికంటే చాలా బాగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సాయీ!

ఇక ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం ఈమధ్యనే (19.08.2020) జరిగింది. నా సంతోషాన్ని మీ అందరితో ఖచ్చితంగా పంచుకోవాలి. ఎందుకంటే, నా సంతోషానికి కారణం ఈ బ్లాగులోని అనుభవాలే! ఆరోజు ఉదయం నుంచి ఎందుకో నా మనసు బాగలేదు. సాయి నామజపం చేస్తూనే ఉన్నాను. బాబానేనున్నాను!అని సందేశం కూడా ఇచ్చారు. అయినా ఇంకా కొంచెం ఆందోళనగానే ఉంది. నా మనసు అలా ఉన్న సమయంలోనే ఆ సాయంత్రం మా బంధువుల గురించి ఒక దుర్వార్త విన్నాను. మళ్లీ మనసంతా డిస్టర్బ్ అయిపోయింది. సాయి నామజపం చేస్తూ ఉండగా ఉన్నట్టుండి, “రేపు గురువారం కదా, సాయిలీలామృతం పారాయణ మొదలుపెడదామ”ని అనిపించింది. వెంటనే బాబాకు నమస్కారం చేసుకుని, “పారాయణ ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా అనుగ్రహించు బాబా!” అని ప్రార్థించాను. ఆ తర్వాత అనిపించింది, “నేను రేపు మొదలుపెట్టబోయే పారాయణ బాబాకి సమ్మతమేనా?” అని. ‘అది పిచ్చి ఆలోచన’ అని కూడా నాకప్పుడు అనిపించలేదు. ‘బాబా గురించి మనం ఏమి చేసినా ఆయనకు అంగీకారమే’ అని కూడా తోచలేదు. బహుశా నేను డిస్టర్బ్ అయివుండటం వల్లనేమో! కానీ ఈ విషయం గురించి నేను బాబాను అడగలేదు. నేను అడగకపోయినా, నా పిచ్చి సందేహానికి కూడా బాబా జవాబు ఇచ్చారు. అది ఎలాగో చూడండి..

నేను ప్రతిరోజూ బ్లాగులో అనుభవాలు పోస్ట్ చేసిన వెంటనే చదువుతాను. ఒకవేళ ఎప్పుడైనా వీలుకాకపోతే వాటిని సేవ్ చేసుకుని తర్వాత చదువుతాను. అలాగే ఆరోజు కూడా బ్లాగులో పోస్ట్ చేసినవాటిలో కొన్ని వెంటనే చదివాను. ఇంకొకటి మాత్రం తరువాత చదువుదామని సేవ్ చేసుకున్నాను. రాత్రి 10.30కి ఆ అనుభవం చదువుదామని ఓపెన్ చేశాను. ఆ సమయంలో నాకు తెలీదు, బాబా సమాధానం దాన్లో ఉందని. ఆ అనుభవంలో ఒక బాబా భక్తుడు తనకు జరిగిన బాబా లీల షేర్ చేశారు. ఆయనకు తన స్నేహితుడు ‘సాయిలీలామృతం’ పారాయణ చేయమని ఇచ్చారని, పారాయణ మొదలుపెట్టాక వారికి ఎప్పటినుంచో జరగని పని బాబా అనుగ్రహం వల్ల జరిగిందని అందులో చెప్పారు. చూసారా సాయిలీల! ‘నేను పారాయణ చేయటం బాబాకి ఇష్టమేనా?’ అని మనసులో అనుకున్నదానికి బాబా ఎలా సమాధానం ఇచ్చారో! నేను ప్రతిరోజూ బ్లాగులో పోస్ట్ చేయగానే చదువుతాను. మరి ఆరోజు ఆ ఒక్క పోస్టుని ఎందుకు రాత్రి వరకు చదవలేదు? నేను పారాయణ చేస్తానని అనుకున్న తర్వాతే ఎందుకు చదివాను? సరిగ్గా అదే అనుభవంలో ‘సాయిలీలామృతం’ చదవమనే సంఘటనే ఎందుకు ఉండాలి? “మన ప్రతి ఆలోచనను బాబా గమనిస్తూనే ఉంటారు” అనేదానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? “నేను అడగకుండానే సమాధానం ఇచ్చేశావా తండ్రీ!” అనుకుని కృతజ్ఞతతో బాబాకు నమస్కరించుకున్నాను. ఈ ఆలోచనకు కూడా బాబా వెంటనే సమాధానం ఇచ్చారు

నేను ఆ అనుభవం చదివి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాక బ్లాగులో పాత(2018) అనుభవాలు కొన్ని చదివాను. వాటిలో ఒక అనుభవం మన బ్లాగ్ నిర్వహించే సాయిది. ఆ అనుభవం టైటిల్ ఏమిటో తెలుసా? “సాయి మనం అడిగితేనే ఇస్తారా? అడగకుండా కూడా ఇస్తారా?” అని. బ్లాగ్ నిర్వహణలో వచ్చిన సమస్యలకి బాబాని అడిగితే బాబా సాయం చేసిన అనుభవం, అలాగే బాబాని అడగకుండానే ఆయన చూపిన కరుణ గురించి చెప్పే అనుభవం అది. సందర్భానుసారంగా వచ్చిన ఆ బాబా లీల చదివి నేను ఎంత సంతోషించానో మీరు ఉహించగలరు. “మీరు అడగకపోయినా నేను మీ సందేహాలను నివృత్తి చేస్తాను” అని బాబా ఎంత అందంగా చెప్పారో కదా! ఇదంతా వెంటనే మీ అందరితో పంచుకోవాలని అనిపించింది, పంచుకున్నాను. సాయి సర్వాంతర్యామి! సర్వజీవ హృదయనివాసి! మనం అడిగేవాటికి, అడగనివాటికి కూడా సమాధానమిచ్చే ప్రేమమూర్తి!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!

“నేను ఉండగా నీకు భయమెందుకు? అంతా నేను చూసుకుంటాను”

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిరాం! నేను చాలా సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా పెద్దబ్బాయి కెనడాలో ఉంటున్నాడు. తనకు వివాహమై 5 సంవత్సరాలు అవుతోంది. కానీ వాళ్ళు సంతానం కోసం ప్రయత్నించటం లేదు. నేను 2019, నవంబరు నెలలో కెనడాకి వచ్చాను. “పిల్లల కోసం ప్రయత్నించడం లేదా?” అని నా కోడలిని అడిగితే, ‘ఆ ప్రయత్నంలోనే ఉన్నామ’ని తను బదులిచ్చింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! వీళ్ళకి సంతానాన్ని ప్రసాదించండి” అని ప్రార్థించి, బాబా చరిత్ర పారాయణ చేశాను. బాబా కృపవల్ల 2020, ఏప్రిల్ నెలలో నా కోడలు గర్భవతి అయిందనే శుభవార్త తెలిసింది. అందరం ఎంతో ఆనందించాము. ఆగస్టు 18న స్కానింగ్‌కి అపాయింట్‌మెంట్ ఉందని వాళ్ళిద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళారు. స్కానింగులో, ‘కడుపులో ఉన్న బిడ్డకు సమస్య ఉన్నట్లు అనిపిస్తోంద’ని డాక్టర్లు చెప్పారట. నా కోడలు ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తననలా చూసి కంగారుపడి ఏమైందని అడిగితే, డాక్టర్లు చెప్పిన విషయం చెప్పి, “రెండు వారాల తరువాత మళ్ళీ స్కానింగ్ చేశాక ఏమి చెయ్యాలో చెప్తామన్నారు” అని చెప్పింది. నేను ఈ విషయం బాబాకు చెప్పుకుని ఏడ్చాను. “బాబా! నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. ఇలా జరిగిందేమిటి బాబా? మీరే మా దిక్కు బాబా. అంతా మంచిగా జరిపించండి” అని ప్రార్థించి, సాయి చరిత్ర పారాయణ, సాయి నామస్మరణ ప్రారంభించాను. బాబా దయవల్ల ‘రెండు వారాల తరువాత చేస్తామన్న స్కానింగ్ ఒక వారంలోనే చేస్తామ’ని హాస్పిటల్ నించి మా అబ్బాయికి మెసేజ్ వచ్చింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే రిజల్ట్ మంచిగా ఇవ్వాలి బాబా!” అని కన్నీళ్ళతో బాబాను ప్రార్థించాను. తరువాత ఫేస్‌బుక్ చూస్తే అందులో, “నేను ఉండగా నీకు భయమెందుకు? అంతా నేను చూసుకుంటాను” అనే బాబా సందేశం ఉంది. అది చూసి నేను చాలా సంతోషించాను. ఆగస్టు 24 ఉదయం 9 గంటలకు స్కానింగ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆరోజు ఉదయం మా అబ్బాయి నాతో, “మాకు రావడానికి సాయంత్రం అవుతుంది, లంచ్ ప్యాక్ చేసి ఇవ్వు” అని చెప్పాడు. అందువల్ల నేను వంట చేసి, బాక్సులో సర్ది, దాన్ని కవరులో పెట్టడానికి ఒక కవర్ తీశాను. ఆశ్చర్యంగా అందులో బాబా ఊదీ దొరికింది! అది చూసి నాకు చాలా సంతోషంగానూ, పాజిటివ్‌గానూ అనిపించింది. తరువాత వాళ్ళిద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళారు. వెళ్ళిన ఒక గంటలోనే మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, “అమ్మా! లోపల బేబీకి ఏ సమస్యా లేదు, అంతా బాగుంది” అని చెప్పాడు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహమే! ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


9 comments:

  1. om sai ram om sai ram baba is thers to protcet us.i am seeing mere sai serial.it is very nice.new stories they are showing.all must watch these episodes

    ReplyDelete
  2. Om Sairam,tq sai for making my faith strong,love u baba,I know u will definitely give me success i.e worth waiting baba,pls help me to write my neet exam well sai

    ReplyDelete
  3. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  4. Baba's leelalu always wonderful .ome srisairam

    ReplyDelete
  5. Baba ma mother health tondarga cure avali thandri

    ReplyDelete
  6. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo