1. శ్రీసాయి అనుగ్రహం
2. క్షణాల్లో మన మీద దయ చూపే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీసాయిబాబా
3. బాబా కృపతో పొందిన ధన సహాయం
శ్రీసాయి అనుగ్రహం
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మా తమ్ముడు నైట్ షిఫ్ట్స్ ఉద్యోగం చేస్తున్నందున తనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందువల్ల నేను, "బాబా! తమ్ముడికి మార్నింగ్ షిఫ్టులు వచ్చేలా అనుగ్రహించండి. తనకి మార్నింగ్ షిఫ్టులు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. అయితే షిఫ్ట్స్ మారలేదు కానీ, ప్రమోషన్ వచ్చింది. "సంతోషం బాబా. కానీ నైట్ షిఫ్టులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది తండ్రి. తనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దయచేసి తమ్ముడికి మార్నింగ్ షిప్టులు వచ్చేలా దీవించండి తండ్రి. అలాగే తనకి సంతానాన్ని ప్రసాదించు తండ్రి".
2022, జూలై మొదటివారంలో మా తమ్ముడికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే, అడ్మిట్ చేసుకుని అన్ని టెస్టులు చేసారు. రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చాయి కానీ, మరో రెండు టెస్టులు చేయాలని సిస్టు స్కాన్ చేసారు. అందులో అల్సర్ ఉందన్నట్లు అనుమానంగా చెప్పారు. తరువాత కోలనోస్కోపీ చేసి సిస్టు కట్ చేసి బయాప్సీకి పంపించి, నాలుగురోజుల్లో రిపోర్టు వస్తుందని చెప్పారు. అపుడు నేను, "బాబా! మీ దయతో రిపోర్ట్ నార్మల్ అని రావాలి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల బయాప్సీ రిపోర్టులో ఏమీ లేదని వచ్చింది. కానీ ఆ హాస్పిటల్లో సరిగా చికిత్స చేయట్లేదని వేరే హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ డాక్టరు రిపోర్టులన్నీ చూసి సమస్యేమీ లేదు. కానీ కడుపులో ఇన్ఫెక్షన్ ఉంద'ని చెప్పి పదిహేను రోజులకి మందులిచ్చి మళ్ళీ రమ్మన్నారు. "బాబా! మీకు శతకోటి నమస్కారాలు మా తమ్ముడి మీద దయ చూపించు తండ్రి. తనకి ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయి కడుపులో ఏ ప్రాబ్లెమ్ లేదని చెప్పాలి తండ్రి. అలాగే మా తమ్ముడికి డే షిఫ్ట్ వచ్చేలా చేయండి బాబా".
2022, ఆగస్టులో మా మరదలికి జ్వరం బాగా ఎక్కువగా వచ్చింది. డాక్టర్ దగరకి తీసుకెళ్తే డెంగు, టైఫాయిడ్ టెస్టులు చేసారు. రిపోర్టులో తనకి టైఫాయిడ్ అని వచ్చింది. ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిందని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. మరుసటిరోజుకు ప్లేట్లెట్ల కౌంట్ మరింత తగ్గింది. దాంతో నాకు భయమేసి, "బాబా! ప్లేట్లెట్ల కౌంట్ పెరిగేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల రెండు రోజుల్లో ప్లేట్లెట్ల కౌంట్ పెరిగింది. కానీ లివర్‌లో కొన్ని ఎంజైమ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయని టాబ్లెట్లు రాసిచ్చారు. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల ఆ సమస్య సమసిపోవాలి తండ్రి. తనకి తొందరగా పుత్ర సంతానం ప్రసాదించు తండ్రి".
ఒకసారి మా బాబుకి జ్వరమొచ్చి రెండు రోజుల్లో తగ్గి మళ్ళీ వచ్చింది. "బాబా! జ్వరం తగ్గినట్లే తగ్గి వెంటనే మళ్ళీ వచ్చింది. కరోనా టైం కాబట్టి భయంగా ఉంది, జ్వరం తొందరగా తగ్గిపోవాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల తొందరగానే తగ్గిపోయింది.
మా బాబుకి థైరాయిడ్ సమస్య ఉంది. తను హైట్, వెయిట్ పెరగడం లేదు. అందువల్ల కొన్ని టెస్టులు వ్రాసారు. నేను, "బాబా! ఏ సమస్యా ఉండకూడదు. మీ దయతో రిపోర్టులు నార్మల్ వచ్చేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి. కానీ డి విటమిన్ తక్కువగా ఉందని సిరప్ రాసి ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
క్షణాల్లో మన మీద దయ చూపే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీసాయిబాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, సమర్థ సద్గురువు అయిన శ్రీసాయినాథ్ మహరాజ్‌కి అనంతకోటి నమస్కారాలు చేస్తూ, గుడిలాంటి ఈ 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు'లో మరో అనుభవం పంచుకుంటున్నాను. నాపేరు మల్లీశ్వరి. మాది హైదరాబాద్. 2022, సెప్టెంబర్ 8న సెలవుదినమని మా అమ్మాయి ఇంట్లో ఉండగా, తన సహోద్యోగి ప్రశాంత్ ఫోన్ చేసి అపార్ట్‌మెంట్ తాళాలు కనపడట్లేదు, ఎక్కడో పోయాయి" అని చెప్పాడు. విషయమేమిటంటే, వాళ్ళు ఒక ఆర్కిటెక్ కంపెనీలో పని చేస్తున్నారు. ఒక అపార్ట్‌మెంట్ వాళ్ళు ఆర్కిటిక్ వర్క్ కోసం తాళాలు వీళ్లకు ఇచ్చారు. ఆ అపార్ట్‌మెంట్‌లో వర్క్ జరుగుతుంది. వీళ్ళు సాధారణంగా ఆ అపార్ట్‌మెంట్ తాళాలు అక్కడ వాచ్‌మన్‌కి గాని, సెక్యూరిటీ గార్డుకి గాని ఇచ్చి వస్తారు. అయితే వాళ్ళల్లో ఎవరి దగ్గర ఆ తాళాలు లేవని ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ సమయంలో వర్షం పడుతుండటం వల్ల మా అమ్మాయి 'ఈ వర్షంలో అంత దూరం ఎలా వెళ్లాలని కంగారుపడుతుంటే నేను బాబాను తలచుకుని, "తాళాలు దొరకాలని అనుకోమ్మా," అని అన్నాను. తను సరే అంది. నేను కూడా బాబాను పది నిమిషాలు ప్రార్థించి, "ఆ తాళాలు దొరికేటట్లు చేయండి తండ్రి" అని చెప్పుకున్నాను. పది నిమిషాల తర్వాత వాచ్‌మన్ దగ్గర తాళాలు ఉన్నాయని ఫోన్ వచ్చింది. క్షణాల్లో మన మీద దయ చూపే కలియుగ ప్రత్యక్ష దైవం, స్మృతిమాత్ర ప్రసన్నడు అయిన సాయితండ్రి పాదారవిందాలకు అనంతకోటి వందనాలు.
బాబా కృపతో పొందిన ధన సహాయం
అందరికి నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు చేసిన సహాయం గురించి మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నాకు డబ్బులు అవసరమై నా స్నేహితులని అడగాలని అనుకున్నాను. కానీ నేను అడిగితే, వాళ్ళు ఇస్తారనే నమ్మకం లేక సాయిని తలచుకుని, "బాబా! నా స్నేహితులు నాకు డబ్బులిస్తే, మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత నేను నా స్నేహితురాలిని డబ్బులు అడిగాను. తను రెండురోజులల్లో నాకు డబ్బులిచ్చింది. ఆనందంతో నా సాయిగోవిందునికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. సాయిబంధువులందరికీ బాబా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.

