1. సదా చల్లగా కాపాడుతున్న బాబా
2. దయతో కుటుంబంలో అందరినీ స్వస్థులను చేసిన బాబా
3. శ్రీసాయి దయ
సదా చల్లగా కాపాడుతున్న బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, సకల దేవతా స్వరూపుడైన శ్రీసాయినాథుని పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు. ఈ బ్లాగ్ ద్వారా మా అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవడంతోపాటు శ్రీసాయిబాబావారి అమృతతుల్యమైన దయాదాక్షిణ్యాలను మేమందరమూ చవిచూస్తున్నాము. ఈ బ్లాగ్ చిరకాలం ఇలానే కొనసాగాలని శ్రీసాయిబాబాను మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను. నా పేరు ఉమ. మాది కృష్ణాజిల్లాలోని ఘంటసాల గ్రామం. బాబాని వేడుకుంటే ఏ పనైనా జరుగుతుందని నా నమ్మకం. అందుకే నాకు ఏ అవసరమొచ్చినా బాబాను వేడుకుంటాను. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదిస్తున్నారు. ఆయన మమ్మల్ని ఎల్లవేళలా అన్ని విధాలుగా కాపాడుతున్నారని ఈమధ్య జరిగిన ఒక అనుభవంతో మరోసారి నిర్ధారణ అయింది. ఆ అనుభవాన్నే ముందుగా పంచుకుంటున్నాను. బాబా దయతో 2022, సెప్టెంబర్ రెండో వారంలో మా తోడికోడలికి సుఖప్రసవమై తల్లి, బిడ్డ క్షేమంగా ఉండగా సెప్టెంబర్ 10, శనివారం సాయంత్రం తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మేమందరం పుట్టిన బిడ్డను ఒక అపార్ట్‌మెంట్‍లో ఉన్న మా తోడికోడలు ఇంటికని తీసుకుని వెళ్ళాము. మా తోడికోడలి వాళ్ళ ఫ్లాట్ మూడో అంతస్తులో ఉన్నందున అందరం లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ కొంచెం పైకి వెళ్ళాక మొదటి అంతస్తుకు, రెండవ అంతస్తుకు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయింది. పుట్టిన బిడ్డతో సహా అందరం అందులో ఇరుక్కుపోయాము. వాచ్‌మన్ ఎంత ప్రయత్నించినా లిఫ్ట్ అస్సలు కదలలేదు, ఎంత మాత్రమూ పనిచేయలేదు. పోనీ దిగిపోదామంటే అది అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. ఏం చేయాలో పాలుపోక అందరికీ చాలా భయమేసింది. ఆ సమయంలో నేను మనసులో బాబాను, "బాబా! మేము ఇందులోనుండి క్షేమంగా బయటపడేలా దయచూపండి. మా అందరినీ కాపాడితే, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తరువాత కాసేపటివరకు కూడా ఆ లిఫ్ట్ కదలకపోవడంతో మావారు, మా మరిది, వాచ్‌మన్ ఒక ఎత్తయిన స్టూల్, దాని ప్రక్కన ఒక కుర్చీ వేసి లోపల ఉన్న అందరినీ జాగ్రత్తగా బయటకి తీసుకొచ్చారు. అందరమూ కాస్త భయపడ్డప్పటికీ బాబా దయవలన క్షేమంగా మా ఫ్లాటుకి చేరుకున్నాము. ఈవిధంగా బాబా మా అందరినీ సదా చల్లగా కాపాడుతున్నారు. నేను అనుకున్నట్లు మీ అందరితో నా అనుభవాన్ని పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా!"
ఇప్పుడు 2022, సెప్టెంబర్ 19, సోమవారంనాడు జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటాను. అప్పుడు మా పాప 9వ తరగతి చదువుతుండేది. తను చదువుతున్న స్కూలువాళ్ళు పాప ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్‌ను పాపకిచ్చి స్కూలుకి పంపించమని అన్నారు. అయితే ఎంత వెతికినా ఆ సర్టిఫికెట్ కనపడలేదు. దాంతో మా అందరికీ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, బర్త్ సర్టిఫికెట్ ఏ విషయంలో అయినా చాలా ముఖ్యమైనది. అలాంటిది, ఒరిజినలే కనపడకపోయేసరికి మాకు ఏం చేయాలో తోచలేదు. నేను వెంటనే నా మనసులో శ్రీసాయిబాబాను తలచుకుని, "బాబా! పాప బర్త్ సర్టిఫికెట్ వెంటనే కనపడేలా అనుగ్రహించండి. అది కనపడినంతనే నేను నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆశ్చర్యం! అప్పటిదాకా ఎంత వెతికినా కనపడని సర్టిఫికెట్ ఐదు నిమిషాలలో కనపడింది. పాప ఒరిజినల్ సర్టిఫికెట్‌తోపాటు మా బాబు సర్టిఫికెట్ కూడా కనిపించింది. నాకు ఎంతో సంతోషమేసింది.
మా పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా నేను మందుగా బాబా ఊదీని, అది కూడా శిరిడీ ఊదీని ఉపయోగిస్తాను. బాబా దయతో ఆ సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడూ బాబాను 'ఎవరో ఒకరి ద్వారా శిరిడీ నుండి ఊదీ ప్రసాదం నాకు చేర్చమ'ని వేడుకుంటూ ఉంటాను. ఇకపోతే, సెప్టెంబర్ నెల మూడోవారంలో మా పాపకి కడుపునొప్పి వచ్చి చాలా బాధపడింది. అప్పుడు నేను బాబా ఊదీని పాప నోటిలో వేసి, కొంచెం ఊదీని పాప పొట్టపై వ్రాశాను. సాయంత్రానికి పాపకి కడుపునొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. నేను ఏమైనా తప్పు చేసినా లేక మరచిపోయినా క్షమించు తండ్రీ. నా దగ్గర ఉన్న ఊదీ అయిపోవస్తోంది. దయతో నాకు మీ ఊదీ ప్రసాదం త్వరగా అందేలా చేయండి బాబా. నన్ను, నా కుటుంబాన్ని, మా అమ్మవాళ్ల కుటుంబాన్ని సదా చల్లగా సంరక్షించండి బాబా. అలాగే అన్నయ్య, వదినలకు మంచి బిడ్డను ప్రసాదించు తండ్రీ. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించండి బాబా".
దయతో కుటుంబంలో అందరినీ స్వస్థులను చేసిన బాబా
అందరికీ నమస్తే. నేను ఒక సాయిభక్తురాలిని. 2022, సెప్టెంబర్ 7న నాకు, నా కుటుంబమంతటికి ఫుడ్ పాయిజన్ అయి మేము చాలా ఇబ్బందిపడ్డాం. మా అమ్మగారయితే మంచం మీదనుంచే లేవలేకపోయారు. అందరికీ వాంతులు, విరేచనాలు అవుతుంటే సచ్చరిత్రలో అవే లక్షణాలతో బాధపడిన కాకామహాజని అనుభవం గుర్తుకు వచ్చింది. ఆ కష్టసమయంలో నేను సాయినే నమ్ముకుని నిరంతరం ఆయన నామస్మరణ చేశాను. గుర్తు వచ్చినప్పుడల్లా ఊదీ నీళ్లలో వేసుకుని అందరమూ త్రాగాము. అలా రెండు రోజులు గడిచాయి. కానీ సమస్య ఎంతకీ తగ్గకపోవడం వలన డాక్టర్ దగ్గరకు వెళ్లాలనుకున్నాము. వెళ్లేముందు నేను మహామృత్యుంజయమంత్రం పఠించి, "బాబా! డాక్టర్ అంతా మామూలు అయిపోతుందని చెప్పేలా చూడండి. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను. మీ గుడిలో 11 ప్రదక్షిణలు చేస్తాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మమ్మల్ని పరీక్షించిన డాక్టర్, "ఏమీ పరవాలేదు, తగ్గిపోతుంది" అని మందులిచ్చారు. మేము అమ్మకి సెలైన్ ఎక్కించవలసివస్తుందేమో అనుకున్నాము కానీ, బాబా దయవల్ల ఇంజెక్షన్ తో సరిపోయింది. మేము ఇంటికి వచ్చిన తరువాత బ్లాగులో, 'మృత్యుంజయమంత్రం పఠించు, అన్నీ సర్దుకుంటాయి' అని చూసి ఆశ్చర్యపోయాను. అదే బాబా అంటే! ఆయన మన మనసుకి అన్నీ స్ఫురింపచేస్తారు. బాబా దయవల్ల రెండురోజుల్లో మేమంతా ఆరోగ్యవంతులమయ్యాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీసాయి దయ
ముందుగా శ్రీసాయినాథునికి నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను బెంగళూరువాసిని. ఈమధ్య నా చెవిదిద్దులు ఎక్కడో పెట్టి మరచిపోయాను. మూడు, నాలుగు రోజులు ఎంత వెతికినా కనపడలేదు. అప్పుడు, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని 108 సార్లు జపించాను. వెంటనే ఒక డబ్బాలో ఆ చెవిదిద్దులు కనిపించాయి. అంతా బాబా దయ. ఆ చల్లని తండ్రి ఆశీస్సులతో ఇటీవల మా మనవడి పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి కుటుంబమంతా ఆనందంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. నా కోరిక ఒకటి మీ దయవలన నెరవేరుతుందని అనుకుంటున్నాను తండ్రీ. అలాగే, నాకున్న ఒక పెద్ద సమస్యను మీరే తీర్చగలరు. నేను మీ మీదనే ఆధారపడి భారమంతా మీపై వేశాను. కాపాడండి బాబా. అయినా మాకేది మంచిదో మీకు తెలుసు బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om Sai ram please bless my family
ReplyDeleteOm sairam na kapuram nilabettu sai, Nannu na barthani kalupu sai Nenu na anubhavam blog lo panchukuntanu om sairam naku aa adhrustani prasadinchandi sai pls 😢
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సమర్థ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ReplyDelete