1. మొర విని తక్షణమే సహాయం అందించిన బాబా
2. ఎంత చిన్న సమస్యనైనా పరిష్కరించే బాబా
3. ఆటంకం లేకుండా ఆదుకున్న బాబా
మొర విని తక్షణమే సహాయం అందించిన బాబా
సాయిబంధువులకు నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా దయవల్ల మా తమ్ముడు సందీప్‍కి దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అయితే మా తమ్ముడు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయించుకోలేదు. అది వేసుకుంటేనే దుబాయ్ వెళ్ళడానికి అనుమతిస్తారని అన్నారు. అందువల్ల మా తమ్ముడు బూస్టర్ డోస్ కోసం ప్రతి ఒక్క వ్యాక్సిన్ సెంటర్‌కి వెళ్ళాడు. అయితే దాదాపు వ్యాక్సిన్ సెంటర్లు మూసేసి ఉన్నాయి. ఎక్కడైనా తెరచి ఉన్నా వ్యాక్సిన్లు లేవని వేయలేదు. అప్పుడు నేను, "బాబా! దయతో తమ్ముడికి వ్యాక్సిన్ వేసేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా నా బాధ విన్నారు. సరిగా అదే సమయంలో మాకు తెలిసిన మామయ్య ఫోన్ చేసి, "మీరు ఏం టెన్షన్ పడకండి. బూస్టర్ డోస్ వేసుకోకపోయినా పర్లేదు. మూడు వేల రూపాయలు కడితే, బూస్టర్ డోస్ వేసినట్టు ఫార్మ్ ఇస్తారు" అని చెప్పారు.
తరువాత మొదటిసారి తమ్ముడు దుబాయ్ వెళ్తుంటే, నేను తనని బస్సు ఎక్కించడానికి తనతోపాటు బస్టాండ్ వరకు వెళ్లాను. టికెట్ తీసుకుందామని కౌంటరులో ఉన్న అతనిని టికెట్ అడిగితే, లేవని చెప్పారు. దాంతో నేను ఇప్పుడు తమ్ముడు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి ఎలా చేరుకుంటాడని బాబా నామస్మరణ చేశాను. హఠాత్తుగా నా చూపు టికెట్ ఇచ్చే చోట ఉన్న గోడ మీదకి మళ్లింది. అక్కడ ఒక పెద్ద సాయిబాబా ఫోటో, ఆ ఫోటో మీద "నీ ప్రయాణం హ్యాపీగా జరుగుతుంది" అన్న సాయి వచనం ఉన్నాయి. నేను సాయికి నమస్కారం చేసుకుని, "బాబా! దయతో నా తమ్ముడికి బస్సు టికెట్ ఇప్పించు తండ్రీ. అదే జరిగితే, గురువారం మీ ధుని చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తాను" అని అనుకున్నాను. మన సాయిబాబా పిలిస్తే పలికే తండ్రి కదా! మరునిమిషంలో మొదట టికెట్ లేదని చెప్పిన అదే వ్యక్తి, "ఒక టికెట్ ఉంది" అని అన్నాడు. అలా ఆ సాయినాథుడు కృపతో చేసిన సహాయం వల్ల నా తమ్ముడు సంతోషంగా దుబాయ్ వెళ్ళాడు. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు తెలుసు, 'మా తమ్ముడు ఎన్నో సంవత్సరాలుగా అమ్మానాన్నలతో మాట్లాడటం లేదు' అని. తనకి మంచి బుద్ధిని ప్రసాదించి అమ్మానాన్నల మీద ప్రేమ కలిగేలా సహాయం చేయండి బాబా". 'తమ్ముడి మనసు మారి అమ్మానాన్నలతో మాట్లాడేలా చేయమని బాబాను ప్రార్థించమ'ని ప్రతి ఒక్క సాయిభక్తునికి విన్నవించుకుంటున్నాను.
మా నాన్న సౌదీలో ఉంటున్నారు. ఒకసారి ఆయనకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చి ఐదు రోజులైనా తగ్గలేదు. హాస్పిటల్‍కి వెళ్తే, డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చి, "రెండు రోజుల తర్వాత రండి. స్కానింగ్ చేద్దాం" అని చెప్పారు. ఆ విషయం తెలిసి నేను, "బాబా! నాన్న రిపోర్టులు నార్మల్ రావాలి" అని బాబాను ప్రార్థించి కొంచెం ఊదీ నా చేతిలో పట్టుకుని బాబా ముందు కూర్చుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరించి ఊదీని బాబా పాదాలపై వేశాను. బాబా దయతో నాన్న ఫోన్ చేసి, "రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయ"ని చెప్పారు. నేను ఆనందంతో బాబా గుడికి వెళ్లి ధుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి, 11 కొబ్బరికాయలు ధునిలో వేశాను. "థాంక్యూ సో మచ్ సాయిబాబా. నాన్నకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా".
ఒకసారి మా నాన్నకి కొద్దిరోజులు అరికాలు మంటలు, నొప్పులు ఉంటే హాస్పిటల్‍లో చూపించుకుని టాబ్లెట్లు వాడారు. ఆ టాబ్లెట్లతో కొద్దిగా తగ్గింది కానీ, పూర్తిగా తగ్గలేదు. అప్పుడు నేను చేతిలో ఊదీ పట్టుకుని, బాబా ముందు కూర్చుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని తొమ్మిదిసార్లు పఠించి ఆ ఊదీని నాన్నకి బదులు నేను నా నుదుటన పెట్టుకుని, నోట్లో వేసుకుని, "బాబా! ఈ గురువారం లోపు నాన్నకి పూర్తిగా అరికాలి బాధలు తగ్గిపోవాలి" అని బాబాను ప్రార్థించాను. నాన్నకి ఇప్పుడు అరికాలిమంట బాధలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇదంతా సాయిబాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా!"
ఎంత చిన్న సమస్యనైనా పరిష్కరించే బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా శ్రీసాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు సంగీత. మాది నిజామాబాద్. ఒకసారి మా క్రెడిట్ కార్డు కనిపించలేదు. అదివరకు ఒకసారి నేను క్రెడిట్ కార్డు పోగొట్టి ఉన్నాను. అందువల్ల టెన్షన్ పడి, "బాబా! మీ దయవల్ల క్రెడిట్ కార్డు దొరకాలి" అని బాబాకి చెప్పుకున్నాను. వెంటనే కార్డు దొరికింది. "థాంక్యూ బాబా".
ఇంకొకరోజు మా పాప తన చెప్పుల హీల్స్‌తో నా కాలి బొటనవేలు తొక్కింది. ఆ రాత్రంతా నేను చాలా నొప్పితో బాధపడ్డాను. అస్సలు భరించలేకపోయాను. అప్పుడు, "బాబా! మీ దయతో నొప్పి తగ్గిపోవాలి" అని బాబాను వేడుకున్నాను. ఒక గంటలో నొప్పి తగ్గి నిద్రపట్టింది. "థాంక్యూ బాబా".
మరోసారి మా ఇంట్లో అందరికీ జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. ముఖ్యంగా మా పాప ప్రతి పది నిమిషాలకు ఆగకుండా దగ్గుతూ ఉంటే, "బాబా! మీ దయవల్ల పాపకి, అలాగే మా అందరికీ దగ్గు తగ్గిపోవాలి" అని అనుకున్నాను. అలా అనుకోగానే తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".
ఆటంకం లేకుండా ఆదుకున్న బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. మేముండే చోట వినాయకచవితి ఉత్సవాలలో తొమ్మిది రోజులయ్యాక అన్నప్రసాద వితరణ చేస్తుంటే వర్షం మొదలైంది. నేను వర్షం వల్ల భోజనాలకి ఇబ్బంది అవుతుందని "బాబా! మీ దయతో వర్షం ఆగిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. అలా బాబాకి చెప్పుకున్న తరువాత ఒక్క నిమిషంలోనే వర్షం ఆగిపోయింది. భక్తుల భోజనాలు పూర్తయ్యేంతవరకు మళ్ళీ వర్షం పడలేదు. అలాగే నేను, "వండిన భోజన పదార్థాలు తక్కువ కాకుండా అందరికీ సరిపోయేలా చూడండి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. ఆ తండ్రి దయవల్ల భోజన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా ఇంకా మిగిలాయి. "ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా".
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha