1. పోస్టుని కల్పించి ప్రమోట్ చేసిన బాబా
2. శ్రీసాయినాథుడు దయామయుడు
3. ఉద్యోగం ప్రసాదించిన బాబా
పోస్టుని కల్పించి ప్రమోట్ చేసిన బాబా
సాయి కుటుంబసభ్యులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును ఎంతో అందంగా నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు కిషోర్. నేనొక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాను. ఒకరోజు మా ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయంలో ప్రమోషన్లు ఇవ్వనున్నారని, అర్హులైనవారిని దరఖాస్తు చేసుకోమన్నారు. కెమిస్ట్రీకి సంబంధించి ఐదుగురం దరఖాస్తు చేసుకున్నాము. కానీ ఉన్నవి రెండే ఖాళీలు. దురదృష్టం కొద్దీ నాకు కాల్ లెటర్(ఇ-మెయిల్) రాలేదు. దాంతో నేను అర్హుడ్ని కాననుకుని ఆశవదిలేసుకున్నాను. అదే సమయంలో మా కాలేజీవాళ్ళు కెమిస్ట్రీకి సంబంధించి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆ విషయంగా ఒక అధికారి(సాయిభక్తుడు) నన్ను పిలిచి, "వర్క్‌షాప్‌లో ప్రసంగించడానికి ఒక పెద్ద ప్రొఫెసర్ హైదరాబాద్ నుండి వస్తున్నారు. ఆయన మంచిచెడ్డలు నువ్వు చూసుకో" అని చెప్పారు. అలాగేనని నేను ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇంతలో ఏం జరిగిందో తెలియదుకానీ, విశ్వవిద్యాలయం అర్హతను సవరిస్తూ నాకు కాల్ లెటర్ పంపి ఇంటర్వ్యూకి పిలిచారు. బాబా ఏదో చేస్తున్నారనిపించి అప్పటిదాకా నాలో లేని ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. కానీ రెండు విషయాలు నాకు బాగా తెలుసు. 1) ఉన్నవి రెండే ఖాళీలు. 2) ఇంటర్వ్యూకి హాజరయ్యేవాళ్లలో ముగ్గురు నాకన్నా ఉత్తములు. కాబట్టి నేను, "బాబా! ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడటం లేదు. ఒకవేళ మీ కృపతో వస్తే, వెంటనే శిరీడీ వస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత ఇంటర్వ్యూ జరిగేరోజు రానే వచ్చింది. నాకన్నా ముందు నలుగురికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ సమయంలో నేను నిశ్చింతగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుకున్నాను. అంతలో 'కిషోర్' అని పిలిచారు. నేను లోపలికి వెళ్లి ఒక్కసారిగా ఖంగుతిన్నాను. ఎందుకంటే, అక్కడ ఇంటర్వ్యూలు చేస్తున్న ఉన్నతాధికారి మరెవరో కాదు, అంతకుముందు నేను మంచిచెడ్డలు చూసుకున్న ప్రొఫెసర్‌గారే! సరే, ఇంటర్వ్యూ పూర్తయింది. నేను మాత్రం అనుకున్నంత గొప్పగా ఏమీ చేయలేదు. కానీ అసిస్టెంట్ నుంచి అసోసియేట్‍గా ప్రమోట్ చేస్తూ వెలువడిన జాబితాలో నాది మూడో పేరు. ఉన్నవి రెండే ఖాళీలైతే, నేను మూడో వ్యక్తిని అవడమేమిటని చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత తెలిసింది ఏమిటంటే, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రొఫెసర్‌గారు, 'నన్ను ఖచ్చితంగా తీసుకోమ'ని చెప్పారట. అలా ఇంటర్వ్యూకే అర్హత లేని నాకోసం ఒక పోస్టుని కల్పించి ప్రమోట్ చేశారంటే ఇది కేవలం బాబా దయ. ఆయన అనుగ్రహానికి నిదర్శనం. ఆ ఆనందంలో వెంటనే బాబాకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి నేను నా కుటుంబంతో శిరిడీ వెళ్ళాను. బాబా దర్శనం మహాద్భుతంగా జరిగింది. మా కుటుంబసభ్యులందరూ అమితానందభరితులయ్యారు.
ఇకపోతే, అసోసియేట్‍గా ప్రమోట్ అయినవాళ్ళు ఒక ప్రాజెక్టు ప్రపోజల్ ప్రభుత్వ ఏజెన్సీకి పంపించాల్సి ఉంటుంది. అయితే నేను పంపించాలనుకునే సమయానికి ఆఖరి తేదీ దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను బాబాను, "ఆఖరి తేదీని పొడిగించమ"ని ప్రార్థించాను ఆ కరుణామయుడు నేను కోరుకున్నట్లే అనుగ్రహించారు. "వేలవేల కృతజ్ఞతలు సాయితండ్రీ".
శ్రీసాయినాథుడు దయామయుడు
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! శ్రీసాయిబాబాకు శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకునే అవకాశమిస్తున్న మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం? నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నేను తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. కానీ ఆ మొక్కు తీర్చుకునే అవకాశం నాకు చాలారోజుల వరకు రాలేదు. చివరికి 2022, సెప్టెంబర్ 10న తిరుపతి వెళ్లడానికి నేను అనుకోకుండా టికెట్లు బుక్ చేసుకున్నాను. కానీ ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నాకు జలుబు, స్వల్ప జ్వరం వచ్చాయి. దాంతో ఈసారి కూడా నా మొక్కు చెల్లించుకోలేమోనని నేను చాలా భయపడ్డాను. వెంటనే బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! నా ప్రయాణానికి, మొక్కు తీర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా ఎంతో దయతో నా మొక్కు తీర్చుకునేలా అనుగ్రహించారు. నేను క్షేమంగా తిరుపతి వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, తలనీలాలు సమర్పించుకొని తిరిగి వచ్చాను. తర్వాత రెండురోజులకు నాకు కాలునొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. అప్పుడు, "బాబా! రేపటికి కాలునొప్పి తగ్గితే, ఈ అనుభవాన్ని కూడా 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. నాకు సర్వస్వమూ అయిన నా తండ్రి సాయినాథుడు దయామయుడు. ఆయన నా కాలునొప్పి తగ్గించి నాకు స్వస్థత చేకూర్చారు. ఈ విధంగా అన్ని విషయాలలోనూ నాకు తోడునీడై నా జీవితాన్ని నడిపిస్తున్న శ్రీసాయినాథునికి శతకోటి పాదాభివందనాలు.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
ఉద్యోగం ప్రసాదించిన బాబా
అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ. నేను సాయిభక్తుడిని. ఇటీవల నేను జీతంలో పెరుగుదల కోసం ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారాను. కానీ అక్కడ పనితీరు నా మానసిక స్థితికి సరిపోలేదు. అందువల్ల నెల పదిహేను రోజులు పనిచేశాక 2022, జూలై 14న ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా బాధపడ్డాను. నెలరోజుల తరువాత వాట్సాప్ గ్రూపులో నాకు వచ్చే బాబా భక్తుల అనుభవాలు చదివి, "బాబా! నాకున్న సమస్యలను అధిగమించడానికి నాకు ఒక మంచి ఉద్యోగం ప్రసాదించండి" అని బాబాను ప్రార్థించాను. బాబా వెంటనే చక్కటి ఉద్యోగాన్ని నాకోసం ఏర్పాటు చేశారు. నేను 2022, సెప్టెంబర్ 19న ఆ ఉద్యోగంలో చేరాను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Ome sri samartha sadguru sai nath maharaj ki jai🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteBaba Nannu vamsi ni kalupu baba na bartha Nannu kapuraniki thiskellela chudu sai nene na anubhanni blog lo panchukuntanu sai
ReplyDeleteMogalicherla dattatreya swamy dhagariki velandi okasari
Delete