సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1346వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకుంటే సదా అండగా ఉంటారు బాబా
2. జ్వరం నుండి తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా
3. ప్రమోషన్ అనుగ్రహించిన సాయి

నమ్ముకుంటే సదా అండగా ఉంటారు బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను నా గత అనుభవంలో బాబా మాకు పండంటి బిడ్డను ప్రసాదించారని పంచుకున్నాను. బాబు పుట్టిన రెండవరోజు జాండిస్ టెస్ట్ చేస్తే, 5.1 ఉందని వచ్చింది. నాల్గవరోజు మళ్ళీ జాండిస్ మరియు థైరాయిడ్ టెస్ట్ చేయించమంటే హాస్పిటల్‌కి వెళ్లి ఆ రెండు టెస్టులు చేయించాం. నేను, "రిపోర్టులు నార్మల్ రావాలి బాబా. అలా వస్తే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. అయితే రిపోర్టులో థైరాయిడ్ కొద్దిగా ఉందని(సీరియస్ కాదు) మరియు జాండిస్ 7.6 ఉంది(8 కన్నా ఎక్కువ ఉంటే సీరియస్) అని వచ్చింది. "బాబా! మీ దయవల్ల మళ్ళీ టెస్ట్ చేసినప్పటికీ రెండూ కంట్రోల్ అయి తగ్గిపోవాలి. మీ దయవల్ల తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని అనుకున్నాను. తరువాత ఒకరోజు బాబు కళ్ళు పచ్చగా అనిపిస్తే, బాబుని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. బాబా దయవల్ల డాక్టర్, "బాబు కళ్ళు నార్మల్‌గానే ఉన్నాయి" అని అన్నారు. ఆపై మళ్ళీ జాండీస్ టెస్ట్ కోసం వెళ్ళవలసిన అవసరం రాలేదు.


తరువాత 15 రోజులు అవుతుండగా బాబు 3-4 రోజులు రాత్రిపూట నిద్ర పోలేదు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, "బాబు మంచిగా నిద్రపోవాలి" అని చెప్పుకున్నాను. అయితే ఆ రాత్రి కూడా బాబు నిద్రపోలేదు. దాంతో మరుసటిరోజు నేను, "బాబా! ఈరోజు రాత్రి బాబు మంచిగా నిద్రపోతే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ రోజు రాత్రి బాబు చక్కగా నిద్రపోయాడు. ఆ సమస్య తీరిందనుకుంటే బాబుకి నీళ్ల విరోచనాలు మొదలయ్యాయి. మందులు వాడుతున్నప్పటికీ రెండురోజులైనా తగ్గలేదు. దాంతో మేము భయపడి బాబాని ప్రార్థించి బాబుని డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్ళాము. బాబా దయవల్ల డాక్టరు చూసి, "ఇది మామూలే. సమస్య అయితే ఏమీ లేదు" అని అన్నారు. అయితే తర్వాత బాబుకి జ్వరం కూడా మొదలైంది. అప్పుడు నేను, "బాబా! మా బాబుకి విరోచనాలు, జ్వరం తొందరగా తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల విరోచనాలు, జ్వరం తగ్గుముఖం పట్టాయి. ఆ బాబాని నమ్ముకుంటే మనకి సదా అండగా ఉంటారనేదానికి ఇదే నిదర్శనం. మనస్ఫూర్తిగా కోరుకోవాలేగాని ఆయన ఇవ్వనిదంటూ ఏమి ఉండదు. "ధన్యవాదాలు బాబా”.


మా బాబు హైదరాబాద్‌లోని మా వదిన వాళ్ళింట్లో పుట్టాడు. ఒక నెల రోజుల తరువాత విజయనగరంలోని నా భార్య పుట్టింటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తే, సరిగ్గా అదే సమయంలో దసరా సెలవులు వచ్చాయి. అందువల్ల 20 రోజుల ముందు ట్రైన్‌లో బెర్తుల అవైలబిలిటి చూస్తే, ఏ ట్రైన్‌లోనూ బెర్తులు అవైలబుల్ లేవు. చివరకి కాచిగూడ-విశాఖపట్నం ట్రైన్‌లో 2ఏసీ, అదికూడా ఆర్ఏసీ ఉంటే బుక్ చేసాం. అయితే రోజులు గడుస్తున్నా ఆర్ఏసీ స్టేటస్‌లో మార్పు లేదు. చివరకి ప్రయాణం చేయాల్సిన రోజు వచ్చినా ఆర్ఏసీ స్టేటస్ అలానే ఉంది. అప్పుడు నేను బాబా మీద నమ్మకంతో, "బాబా! టికెట్లు కంఫర్మ్ అయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రయాణం జరిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో టికెట్లు కంఫర్మ్ అయ్యాయి. అవ్వకపోయుంటే నెల బిడ్డతో ప్రయాణం చాలా ఇబ్బంది అయ్యేది. బాబా దయవల్ల మా ప్రయాణం హ్యాపీగా సాగింది. బాబాని నమ్ముకుని బ్లాగులో పంచుకుంటామనుకుంటే బాబా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించు తండ్రి. నా భార్య, బిడ్డలపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం లేకుండా చూడు తండ్రి. నిన్నే నమ్ముకున్నాం బాబా. ఈసారి వచ్చే ప్రమోషన్ జాబితాలో నా పేరు ఉండేలా కరుణించి, ప్రమోషన్‌తోపాటు ప్రస్తుతం ఉన్న చోటే పోస్టింగ్ ఇచ్చేలా, అలాగే నా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేలా చూడు తండ్రి. నా అనుభవాన్ని మీ భక్తులందరితో పంచుకుంటాను. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


జ్వరం నుండి తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు పుష్పలత. ముందుగా, సాయిభక్తులందరికీ నమస్కారం. సాయితో మాకున్న అనుబంధాన్ని అందరితో పంచుకునే సదావకాశాన్ని ఇస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా ప్రతిరోజు బ్లాగులో భక్తుల అనుభవాలు చదవటంతో పార్రంభిస్తాను. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మీ ముందుకు వచ్చాను. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఈమధ్య మా పెద్దమ్మాయి సాయిదీపశ్రీకి తరచుగా జ్వరం వస్తుండేది. ఆ క్రమంలో ఒకరోజు హఠాత్తుగా విపరీతమైన జ్వరమొస్తే, మేము వెంటనే డాక్టరుని సంప్రదించాము. ఆవిడ ఫీవర్ అనాలసిస్ టెస్ట్ చేయించారు. ఆ సమయంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉండటం, అంతకుముందే మా అమ్మాయికి కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల నేను టెస్ట్ రిపోర్టు వచ్చేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని నిండు మనస్సుతో ఉచ్ఛరించాను. ఒక గంట తరువాత వచ్చిన రిపోర్టులో మా అమ్మాయికి 'డబుల్ టైఫాయిడ్' అని వచ్చింది. యితే బాబా దయవలన హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండానే డాక్టర్ ఇచ్చిన మందులతో అమ్మాయి తొందరగా కోలుకుంది. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాన్ని కొంచెం ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. స్వతహాగా చాలా కష్టపడి చదివే తనకి త్వరలో ఒక మంచి ఇంటర్న్‌షిప్‌ని, క్యాంపస్ ఇంటర్వూలలో ఒక మంచి ఉద్యోగాన్ని, అలాగే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే మనోనిబ్బరాన్ని ప్రసాదించమని మనఃస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తండ్రీ.  మా కుటుంబానికి మరియు అందరికీ సదా మీ ఆశీస్సులు ఉండాలి బాబా".


ప్రమోషన్ అనుగ్రహించిన సాయి


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి బృందానికి ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తుడిని. నేను ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. గత సంవత్సరంలో ప్రమోషన్ కోసం ప్రయత్నించి విఫలమైన నేను చాలా నిరాశకి గురయ్యాను. ఈ సంవత్సరం నా భార్య ద్వారా ఈ బ్లాగ్ గురించి తెలిసి, "బాబా! నాకు ప్రమోషన్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించి 'శ్రీసాయిలీలామృతం' సప్తాహపారాయణ ప్రారంభించాను. ఆరవరోజున బాబా నేను కోరుకున్న ప్రమోషన్‌ను నాకు అనుగ్రహించారు. "ధన్యవాదాలు బాబా. మీ దయ సదా అందరిపై ఉండాలి తండ్రీ".



7 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Akilanda koti bramhanda naika rajadhi raja yogi raja sachithananda samardhu Sairam maha raj ki jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo