సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1353వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరుణ చూపిన బాబా
2. సాయి స్మరణతో దివ్య ఔషధంలా పనిచేసిన మట్టి 
3. పదివేల రూపాయలతో సొంతింటిని ప్రసాదించిన బాబా

కరుణ చూపిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. మా పొలంలో మోటారు బోరు తరచూ రిపేరు వస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ చిన్నచిన్న రిపేర్లే అయ్యేవి. కానీ ఈసారి బోరుకి పెద్ద రిపేరు వచ్చింది. ఎంతవుతుంది అంటే, చెక్ చేస్తేగాని తెలియదన్నారు. అప్పుడు నేను, "బాబా! ఈ కష్ట సమయంలో మోటార్ చిన్న రిపేరుతో అయిపోయేలా చూడు తండ్రి. అలా జరిగితే నా అనుభవం మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా నన్ను కరుణించారు. తక్కువ ఖర్చుతో రిపేర్ అయిపోయింది. ఇంకోరోజు మా అమ్మ నాకు ఫోన్ చేసి, "ఇన్వర్టర్ ఏదో శబ్ధం చేస్తుంది. కరెంట్ ఉందికానీ మనకి పవర్ రావడం లేదు" అని చెప్పింది. తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తే, అమ్మ ఫోన్ రింగ్ అవ్వలేదు. నాకు  కొంచెం కంగారుగా అనిపించి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఏ సమస్యా లేకుండా అంతా సవ్యంగా ఉండాలి. ఇన్వర్టర్‍కి పెద్ద సమస్య ఉండకూడదు. అలా అయితే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఏటువంటి సమస్యా లేదు. "ధన్యవాదాలు బాబా".


నేను చాలా రోజులు మా భూమి కౌలును మార్చే విషయంలో చాలా ఇబ్బందిపడ్డాను. మాకు కావాల్సిన వాళ్లే పని అవ్వకుండా అడ్డుపడుతుండేవారు. సహాయం చేసే వాళ్లు ఎవరూ లేక ఒంటరినైపోయిన నాకు సమస్య పెద్దదిగా కనిపించింది. అప్పుడు నేను, "బాబా! ఒకపక్క ఉద్యోగం, మరోపక్క ఇంటి పునాది నిర్మాణం, మరోపక్క ఈ పొలం కౌలు మార్చాల్సిన సమస్య. ఎలాగైనా మీరు నాకు తోడుగా ఉండి అన్నీ సక్రమంగా జరిగేలా చేయాలి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల పునాది నిర్మాణం పూర్తయింది. పొలం కౌలును కూడా చాలా కష్టం మీద మార్చేసాము.  "థాంక్యూ బాబా. నేను ఇంకా కొన్ని సమస్యల గురించి మీతో చెప్పుకున్నాను. నాకు ఎప్పుడూ తోడుగా ఉండి అన్నీ సవ్యంగా జరిగేలా ఆశీర్వదించండి తండ్రి. త్వరలో కరుణిస్తావని ఆశిస్తున్నాను బాబా. తండ్రి లేని నాకు తండ్రి స్థానంలో ఉండి నువ్వే నన్ను నడిపించాలి బాబా. ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే ధైర్యంగా ఉంటున్నాను బాబా. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి బాబా".


సాయి స్మరణతో దివ్య ఔషధంలా పనిచేసిన మట్టి 


సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపులకు నమస్కారం. నా పేరు విజయ్‍చంద్ర. మాది ఏలూరు. లోగడ శ్రీసాయి నాపై చూపిన దయను మీతో పంచుకున్నాను. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రిందట జరగిన యధార్థ సాయి లీలను పంచుకుంటున్నాను. అప్పట్లో నేను ఏలూరులో వెంకటరాయ డయాగ్నొస్టిక్ సెంటరులో మార్కెటింగ్ విభాగంలొ పనిచేస్తుండేవాడిని. ఒకసారి నేను హెల్త్ క్యాంప్‍లో భాగంగా పక్కనే ఉన్న చటపర్రు అనే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి నాతోపాటు నలుగురు కుర్రాళ్ళను తీసుకుని వెళ్ళాను. అంతా సజావుగా జరుగుతుండగా రాంబాబు అనే అబ్బాయి ఫ్లెక్సీ కట్టడానికి గోడపైకి ఎక్కే ప్రయత్నంలో జారి పడిపోయాడు. అతను కడుపు పట్టుకుని విలవిలలాడిపోతుంటే మేమందరం ఏం చేయాలో అర్థంకాక కంగారుపడ్డాం. అతనికి ఏమైనా జరగరానిది జరిగితే నేనే భాద్యత వహించాల్సి వస్తుంది. అయితే ఏదైనా కష్టమొస్తే ఎల్లవేళలా ఆదుకోవటానికి పిలిస్తే పలికే దైవమైన మన సాయిమాత ఉన్నారు కదా! నాకు వెంటనే సాయి సచ్చరిత్రలో ఒక సందర్భం నందు నానాసాహెబ్ చందోర్కర్ బాబాను తలుచుకుని నేల మీద మట్టి తీసి తన భార్య నుదుటన పెట్టడం, అదే సమయంలో వేరే ప్రాంతంలో ఉన్న ఒక అమ్మాయి జ్వరం తగ్గిపోవడం గుర్తుకొచ్చి నేను కూడా మట్టి చేతిలోకి తీసుకుని సాయిని స్మరించి, ఆ మట్టిని ఆ అబ్బాయికి నొప్పి ఉన్న చోట రాశాను. మహా మహిమాన్వితుడు, మన సర్వస్వం అయిన సమర్థ సద్గురు శ్రీసాయి తమ లీలను చూపారు. ఒక్క నిమిషం వ్యవధిలో అతను, "సార్! ఎవరో చేత్తో తీసేసినట్టు నొప్పి పోయింది" అని అన్నాడు. నా తనువు, మనస్సు ఒక్కసారిగా పులకరించి పోగా నాకు మధురమైన అనుభూతి కలిగింది. ఇంత మంచి లీల చూపిన శ్రీసాయి సద్గురుని ఏవిధంగా పూజించాలి, సేవించాలి? ఆయన నామస్మరణ, పారాయణే మనకు సర్వదా రక్ష! "ధన్యవాదాలు బాబా".


పదివేల రూపాయలతో సొంతింటిని ప్రసాదించిన బాబా


నేను ఒక సాయి భక్తుడిని. మాది హైదరాబాద్. నేను ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిని, నేను నోట్ల రద్దు సమయంలో సొంత ఇంటికోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. 3-4 ఇల్లులు చూస్తే, వాటిలో చివరిది మేము ఖాయం చేసుకున్నాము. ఆ సమయంలో నా వద్ద ఉన్న పెట్టుబడి కేవలం పదివేల రూపాయలు మాత్రమే. అయినా బాబా మీద భారం వేసి ఆ పదివేల రూపాయలతోనే అగ్రిమెంట్ చేసుకున్నాను. తర్వాత లోన్ ప్రాసెస్ మొదలుపెట్టాను. ఆ క్రమంలో ప్రతి గురువారం శుభవార్త వస్తూ నెలరోజుల్లో లోన్ శాంక్షన్ అయింది. మిగిలిన మొత్తం కూడా బాబా దయతో సునాయాసంగా సమకూరింది. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకుని గృహప్రవేశం చేసాము. ఇది నా జీవితంలో జరిగిన అతిపెద్ద బాబా అనుగ్రహం. నాకు ఎప్పుడూ ఏం కావాలో అది ఇచ్చి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న బాబాకి కోటికోటి ప్రణామాలు. "బాబా! నా జీవితాన్ని సదా మీ సేవలో వినియోగపడేలా ఆశీర్వదించండి..  మీ పాదదాసుడు".




5 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Sai please bless my daughter
    Om Sai Ram

    ReplyDelete
  5. Sai Ninne nammukoni brathukuthunna sai mi midha baram vesi yeduruchusthunna sai na bartha manasu manchi ga marchu sai thanu Nannu kapuraniki thiskellela chudu sai.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo