1. బాబా అనుగ్రహం
2. బాబా దయుంటే అంతా సుఖాంతం
3. ఊదీతో నడుమునొప్పి నుండి ఉపశమనం
బాబా అనుగ్రహం
ముందుగా శ్రీసాయినాథునికి పాదాభివందనాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక బాబా భక్తురాలిని. ఒకరోజు నా ఫోను కింద పడిపోయి స్క్రీన్ గార్డు పగిలిపోయింది. దాంతోపాటు మొబైల్ స్క్రీన్ కూడా పగిలినట్టు కనిపిస్తుండేసరికి నేను భయపడి, "బాబా! మొబైల్ స్క్రీన్ పగలకుండా ఉండేలా చూడండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల స్క్రీన్ గార్డ్ మాత్రమే పగిలింది. మొబైల్ స్క్రీన్‍కి ఏమీ కాలేదు. "థాంక్యూ సో మచ్ బాబా". ఇలా సాయి ప్రసాదించిన అనుభవాలు లెక్కలేనన్ని. నేను బయటకు వెళ్లినప్పుడల్లా బాబాను తలుచుకుంటూ ఉంటాను. బాబా ఏదో ఒక వాహనం మీద ప్రత్యక్షమవుతూ ఉంటారు. ప్రతి గురువారం ఆఫీసుకు వెళ్లి, వచ్చే లోపు అదివరకెప్పుడూ చూడని చోట ఫోటో రూపంలో బాబా దర్శనమిస్తారు. "ధన్యవాదాలు బాబా. కానీ మీరు ఇంతవరకు నాకు స్వప్న దర్శనం ఇవ్వలేదు. ఈ బ్లాగు సాక్షిగా మీరు నాకు స్వప్న దర్శనం ఇవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా".
ఒకసారి నాకెందుకో రెండు రోజులపాటు మలవిసర్జన కాలేదు. రెండో రోజు విరోచనం కావడానికి డెల్కోఫ్లెక్స్ టాబ్లెట్లు రెండు వేసుకున్నాను. అయినప్పటికీ మూడోరోజు ఉదయం కూడా మల విసర్జన కాలేదు. పైగా ఆ రాత్రి తెల్లవారుఝామున 4 గంటలకి కడుపునొప్పి మొదలైంది. ఆ సమయంలో ఏం చేయడానికి నాకు తోచక, "బాబా! నా ఇబ్బందిని త్వరగా తొలగిపోయేలా, విరోచనం కూడా అయ్యేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత కడుపునొప్పి భరించలేక మా అక్కకి ఫోన్ చేసి, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళమన్నాను. అక్క బాగా ఆలోచించి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా మెడికల్ షాపు నుండి అత్యవసర పరిస్థితుల్లో విరోచనం అవ్వడానికి వాడే మెడిసిన్ తీసుకొచ్చింది. ఆ మెడిసిన్‍తో వెంటనే నాకు విరోచనం అయి గంటలో కడుపునొప్పి కూడా తగ్గిపోయింది. బాబానే అక్కకి ఆలోచననిచ్చి హాస్పిటల్‍కి వెళ్లి ఇబ్బంది పడకుండా నన్ను కాపాడారు. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం మాపై ఎప్పుడూ ఇలానే ఉండాలి తండ్రి.
నాకు పెళ్లి నిశ్చయమయ్యాక మా అమ్మ నన్ను ఉద్యోగం మానేయమని చెప్పింది. సరేనని, నేను 2022, ఆగస్టులో నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. కానీ రెండు నెలల నోటీసు పీరియడ్ ఉన్నందువల్ల అది పూర్తి చేసాక 2022 అక్టోబర్ 15న నన్ను ఉద్యోగం నుండి రిలీవ్ చేస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో మా అమ్మ, "పెళ్లి పనులకు సమయం సరిపోదు. తమ్ముడు యు.ఎస్.ఏ నుండి వస్తున్నాడు. నువ్వు కూడా అక్టోబర్ 1 నుండి ఉద్యోగానికి వెళ్లడం మానేయి" అని చెప్పింది. నేను అలా చేయనని చెప్పినా అమ్మ వినలేదు. దాంతో నేను అమ్మకోసం మా సార్ ని, "అక్టోబర్ 1 కల్లా నన్ను రిలీవ్ చేయండి" అని అడిగాను. అందుకు మా సార్ దయతో, 'వేరే అమ్మాయి పని పూర్తయి, తను నా స్థానాన్ని భర్తీ చేస్తే అక్టోబర్ 1న నిన్ను రిలీవ్ చేస్తాను' అన్నారు. నేను, "బాబా! అమ్మ పెళ్లి పనులు అవ్వవేమోనని టెన్షన్ పడుతుంది. తన కోరిక ప్రకారం మా సార్ నన్ను అక్టోబర్ ఒకటిన రిలీవ్ చేసేలా అనుగ్రహించండి. అలాగే నా పనిలో ఆలస్యానికి, ఉద్యోగం లోంచి వెళ్లేముందు మా సార్ తో నేను మాట పడకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ అమ్మాయి చేసే పనిని బెంగుళూరు బ్రాంచ్ వాళ్ళు 'మేము చేస్తామ'ని చెప్పటంతో ఆమె నా స్థానాన్ని భర్తీ చేసింది. దాంతో అమ్మ అడిగిన సమయానికి నన్ను రిలీవ్ చేసారు. మా సార్తో నేను మాట పడకుండా కూడా అనుగ్రహించారు బాబా. "శతకోటి ధన్యవాదాలు బాబా. నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి. అలాగే నా వివాహం దగ్గరుండి జరిపించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బాబా దయుంటే అంతా సుఖాంతం
సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో ఉంటున్నాము. ఇటీవల మేము నయాగారా జలపాతం సందర్శించడానికి వెళ్ళాము. నిజానికి ఈ ట్రిప్ మేము మా ఫ్రెండ్స్ తో కలిసి గత సంవత్సరంలో ప్లాన్ చేసుకున్నది. కానీ అప్పుడు నా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ని రద్దు చేసుకోవాలనుకున్నారు. అయితే ఎయిర్ లైన్స్ వాళ్ళు మా టికెట్ల డబ్బులు వెనక్కి ఇవ్వకుండా, ఒక సంవత్సరం లోపు ఎప్పుడైనా ట్రిప్ కి వెళ్లే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందామని ఫ్రెండ్స్ అందరూ ఈ సంవత్సరం ట్రిప్‍కి వెళ్ళడానికి ప్లాను చేసారు. 'గత సంవత్సరం నావల్లే ట్రిప్ క్యాన్సిల్ అయింది' అన్న మానసిక ఆందోళనలో ఉన్న నేను, "ఈసారి నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదు" అని బాబాతో చెప్పుకున్నాను. అలాగే నాకున్న ఫ్లైట్ ఫోబియా విషయంలో కూడా, "బాబా! మా ఫ్లైట్ జర్నీ సాఫీగా సాగి, మేము సురక్షితంగా తిరిగి మా ఇళ్లకు చేరుకుంటే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. తరువాత మేము బోట్‍లో నయాగరా జలపాతం దగ్గరకి వెళ్తున్నప్పుడు నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఆ సమయంలో మేము వెనక్కి రాలేము. ఒకవేళ వచ్చినా మళ్ళీ వెళ్లాలంటే మరల టిక్కెట్లు తీసుకోవాలి. ఆ స్థితిలో నేను, "బాబా! నా ఆరోగ్యం బాగుండాలి. నా వల్ల ఎలాంటి సమస్య రాకుండా ట్రిప్ అంతా పూర్తయి మేము సురక్షితంగా మా ఇళ్లకు చేరుకోవాలి. అలా జరిగితే మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఇది చిన్న విషయమే కావచ్చు కానీ, నా వల్ల ట్రిప్ లో ఇబ్బందులు వస్తే, అందరూ బాధపడతారు. అందుకే అంతలా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా ట్రిప్పు బాగా జరిగింది. "థాంక్యూ బాబా".
ఈమధ్య గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నాకు విపరీతమైన వీపు నొప్పి వచ్చింది. అప్పుడు నేను బాబా ఊదీ నీళ్లలో వేసుకుని త్రాగి, "బాబా! నొప్పి తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో తీవ్రమైన నొప్పి నుంచి నాకు ఉపశమనం లభించింది. "థాంక్యూ సో మచ్ బాబా. మానసికంగా బాధపడుతున్న నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ధైర్యానిస్తున్నావు తండ్రి".
ఊదీతో నడుమునొప్పి నుండి ఉపశమనం
నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఒకరోజు నడుము నొప్పి విపరీతంగా వచ్చింది. మావారికి చెప్తే, 'తగ్గుతుందిలే' అని చాలా తేలికగా అన్నారు. కానీ నాకు భయమేసింది. ఎందుకంటే, నా పరిస్థితి ఇలా ఉన్నా పట్టించుకోకుండా మా అత్తగారు నన్ను ఇంకా ఇబ్బందిపెడతారు. పైగా పిల్లల్ని చూసుకోవాలి, రోజువారీ పనులు చేసుకోవాలి. అందుచేత నేను ఆ రాత్రి బాబా ఊదీ నడుముకి రాసుకుని, 'నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ప్రొద్దున లేచేసరికి నొప్పి కొంచం తగ్గింది. నా పనులు నేను చేసుకోగలిగాను. "ధన్యవాదాలు బాబా. మీ దయతో పూర్తిగా తగ్గుతుందని నమ్ముతున్నాను. మీరు లేని నా జీవితం చుక్కాని లేని నావ లాంటింది బాబా. ఎన్నోసార్లు మిమ్మల్ని పట్టించుకోకుండా మానవ సంబంధాలు ముఖ్యం అనుకుని వాళ్ళని సంతృప్తిపరిచాను. కానీ వాళ్ళకి డబ్బు ఇస్తేనే, పని చేస్తేనే మనిషిగా కనపడతాను. ఎంత చేసినా నా మీద ప్రేమ కలగదు ఆ వ్యక్తికి. మీరు అలా కాదు. నేను పూజ చేయకపోయినా, వద్దు అనుకుని మిమ్మల్ని పట్టించుకోకపోయినా నన్ను ప్రతి నిమిషం కాపాడుతున్నారు. దయచేసి నేను మనుషుల మీద పెంచుకుంటున్న అతి ప్రేమను తగ్గించి నాకు మానసిక ప్రశాంతనివ్వండి బాబా".
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteSai nannu vamsi ni kalupu sai na kapuram nilabettu sai na bartha manasu manchi ga marchi sai thanu nannu kapuraniki thiskellela chudu sai pls baba nenu chala bhadallo unnanu sai nenu yenni avamanalu yedukuntunnano niku thelusu sai. Na kapuram nilabettu sai nenu na anubhavanni sai blog lo pamchukuntanu sai om sairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm sri sainadhayanamaha
ReplyDeleteBaba a carpenter manasu marchi ma money vesala chudu baba
ReplyDelete