సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1340వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాధను చెప్పుకున్నంతనే, 'నేను ఉన్నాను' అని అభయమిచ్చిన బాబా
2. సాయినాథుని దయతో సమసిపోయిన రెండు సమస్యలు

బాధను చెప్పుకున్నంతనే, 'నేను ఉన్నాను' అని అభయమిచ్చిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా శ్రీసాయి భక్తులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాసబాబు. నేను సాయి భక్తుడిని. ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా చాలామంది సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా దయవలన నేను ఇదివరకు ఈ బ్లాగులో నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మా బాబు విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. తనకి  మొదటి సంవత్సరంలో 26 వేల రూపాయల స్కాలర్ షిప్ వచ్చింది. అయితే మా బాబు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఒక సబ్జెక్ట్, సెకండ్ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. అందువల్ల రెండవ సంవత్సరం స్కాలర్ షిప్ ఇవ్వము, మొత్తం ఫీజు కట్టమన్నారు. నేను వేరే దారిలేక ఆ ఫీజు కట్టి, "బాబా! స్కాలర్ షిప్ ఇప్పించండి. అది రాకుంటే ఇప్పుడు కట్టినట్లు  ప్రతి సంవత్సరం  52,000 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తుంది. అంటే మొత్తం లక్ష యాభైవేల రూపాయలు కట్టాలి" అని చిన్నపిల్లాడిలా బాబా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా కరుణ చూపారు. వారి ఆశీర్వాదంతో 2022, సెప్టెంబర్ 14న 26,000 రూపాయల స్కాలర్ షిప్ డబ్బులు నా అకౌంటులో పడ్డాయి. "చాలా సంతోషం బాబా. బాబు మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టాను తండ్రి. దయతో బాబు మనసు మార్చి చదువు మీద శ్రద్ధ పెట్టేటట్లు, అలాగే తనకి చదివేది గుర్తు ఉండేటట్లు అనుగ్రహించి పరీక్షలు మంచిగా వ్రాసేలా చూడు సాయి. నేను తన గురించి మిమ్మల్ని చాలాసార్లు ప్రార్థించి విసిగిస్తున్నాను. నాకు బాబు గురించి చాలా బాధగా ఉంది. నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసు తండ్రి. నాకు మీరు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. మీ దయతో బాబు ఆ రెండు సెమిస్టర్ల పరీక్షలు వ్రాసి పాస్ అయితే మళ్లీ నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను సాయి. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి తండ్రి".


బాబా దయవలన నాకు గవర్నమెంట్ వారి రాజీవ్ గృహకల్ప స్కీమ్‌లో ఇల్లు వచ్చింది. ఈమధ్య ఆ ఇల్లు ఎక్స్టెన్షన్ చేసుకోమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఎక్స్టెన్షన్ కోసం సదరు ఉద్యోగస్తులు 70,000 రూపాయలు తీసుకున్నారు. తరువాత బ్లాక్‌లో ఉన్న 16 ఫ్లాట్స్ వాళ్ళు 20 వేల రూపాయలే ఇచ్చారని నాకు తెలిసింది. అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువగా తీసుకున్నారు. నేను చాలా టెన్షన్ పడి, "బాబా! నా డబ్బు నాకు వెనక్కి ఇప్పుంచు తండ్రి" అని వేడుకున్నాను. బాబా నా బాధను అర్థం చేసుకుని ఆ రాత్రి  30 వేల రూపాయలు నా అకౌంట్లో పడేలా చేశారు. బాధను చెప్పుకున్నంతనే, 'నేను ఉన్నాను' అని అభయం ఇచ్చారు నా తండ్రి బాబా. "చాలా సంతోషం సాయి. ధన్యవాదాలు తండ్రి. మూడు నెలలుగా ఆ ఇల్లు ఖాళీగా ఉంది. దయతో ఆ ఇల్లు ఖాళీగా ఉండకుండా చూడు స్వామి".


ఈమధ్య నేను HDFC బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకున్నాను. అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ కోసం మా ఇంటికి వచ్చారు. అయితే నేను ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్సుకి సంబంధించి ప్రూఫ్ లేదునందున లోన్ రిజెక్ట్ అయింది. నిజానికి నేను ఉంటున్న అడ్రస్ తాలూకా ఐడి ప్రూఫ్ లేదని ముందే HDFC బ్యాంకు ఏజెంట్‌కి చెప్పాను. అతను, "నేను మానేజ్ చేస్తాను" అన్నాడు కానీ, చేయలేదు. అందువలనే లోన్ రిజెక్ట్ అయింది. దాంతో నా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందని నాకు చాలా భయమేసి బాబాని తలుచుకుని, "బాబా! లోన్ శాంక్షన్ అయి, డబ్బులు క్రెడిట్ అయితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను. అలాగే 11 రూపాయల దక్షిణ, టెంకాయ నైవేద్యం సమర్పించుకుంటాను" అని బాబాకి నమస్కరించుకున్నాను. తర్వాత వేరే HDFC బ్యాంకు ఏజెంట్‌తో మాట్లాడాను. బాబా దయవలన వెరిఫికేషన్‌కి మా ఇంటికి రాకుండానే లోన్ శాంక్షన్ అయి, డబ్బులు నా అకౌంట్లో పడ్డాయి. "నమస్కారాలు బాబా. మీరు పిలిస్తే పలికే దైవం తండ్రి".


సాయినాథుని దయతో సమసిపోయిన రెండు సమస్యలు


సాయి భక్తులందరికీ నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకు ముందు సాయి నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. ఈమధ్య మా బాబు ఒంటి నిండా ఎలర్జీతో చాలా ఇబ్బందిపడ్డాడు. హాస్పిటల్‌కి వెళ్లి మందులు వాడినప్పటికీ దురదలు తగ్గలేదు. బాబు చాలా బాధపడుతూ ఏడుస్తుంటే నేను చూడలేక, "బాబా! మీ దయవలన బాబుకి దురదలు తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను తండ్రి" అని బాబాను ప్రార్థించి కొద్దిగా ఊదీ తీసుకుని బాబు ఒళ్లంతా రాశాను. బాబా దయవల్ల మరుసటిరోజుకు దురదలు తగ్గిపోయాయి. "ధన్యవాదాలు సాయిదేవా".


మా చెల్లివాళ్ళు గొడవలు పడుతూ మా మరిది అసలు సంబంధమే లేని నన్ను టార్గెట్ చేసి, వాళ్ళ గొడవలోకి లాగుతుంటే నాకు చాలా బాధేసి, "బాబా! జరిగేదంతా మీకు తెలుసు. అతను చెప్పేది మా నాన్న నమ్మితే గనక నేను ఆయనతో ఫ్రీగా ఉండలేను బాబా. మీరే నన్ను కాపాడాలి. నాన్న ఎప్పటిలా నాతో మాట్లాడితే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన ప్రస్తుతానికి నాన్న మామూలుగానే మాట్లాడుతున్నారు. "ధన్యవాదాలు సాయినాథా! మీకు మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాలు బ్లాగులో పంచుకుంటున్నాను తండ్రి. మా మరిది మనసు మార్చి మంచిగా ప్రవర్తించేలా చేసి అతని వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడు తండ్రి. ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేస్తే మళ్ళీ నా అనుభవాన్ని సాయి బంధువులతో  పంచుకుంటాను. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



1 comment:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo