ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
2. ప్రాజెక్ట్ నుండి తప్పించి టెన్షన్ తొలగించిన బాబా
3. దయతో అబ్బాయిని ఇంటికి చేర్చిన బాబా
బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నడుపుతున్న సాయికి ధన్యవాదాలు. ఈ బ్లాగులో సాయిభక్తులు తమ అనుభవాలు పంచుకోవడం వల్ల వాటిని చదివిన మాకు బాబాపై నమ్మకం మరింత పెరుగుతోంది. నా పేరు విజయ. మాది పూణే. మాకు, మా కుటుంబానికి తల్లి, తండ్రి అన్నీ బాబానే. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 'ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ'ని ముందుగా బాబాకి చెప్పుకుంటున్నాను. మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నప్పుడు 'IMUN(International Model United Nations)' అనే ఒక ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన డిబేట్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే తను సర్టిఫికెట్ కోసం ఇంటర్న్‌షిప్ చెయ్యాలని అనుకున్నాడు. దానికోసం తను ఒక 11మందిని జాయిన్ చేయిస్తే, ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు తనను అంబాసిడర్‌గా ప్రకటించి సర్టిఫికెట్(ప్రశంసాపత్రం) ఇస్తారు. ఆ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌గా తనకి ఉయోగపడుతుంది. అయితే, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేయించడానికి మా అబ్బాయికి పదిమంది మాత్రమే దొరికారు. పదకొండో వ్యక్తి దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో మా అబ్బాయికి 11 మంది దొరకాలి. అలా దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా ఎంతో దయతో మా అబ్బాయికి 13 మంది దొరికేలా చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా".
ఈమధ్య మా అబ్బాయి ఒక విషయంగా మా మాట వినకపోతుంటే నేను బాబా దగ్గర చాలా బాధపడి, "బాబా! మేము చెప్పేది మా అబ్బాయి ప్రశాంతంగా అర్థం చేసుకునేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయచూపారు. అదేరోజు సాయంత్రం మా అబ్బాయి తన అభిప్రాయాన్ని మార్చుకుని మేము చెప్పేది శాంతంగా విన్నాడు.
బాబా దయవల్ల మా అబ్బాయికి ఒక మంచి కాలేజీలో బి.టెక్ అడ్మిషన్ దొరికింది. కాలేజీవాళ్ళు, 'ఫలానా తేదీలోగా హాస్టల్ బుక్ చేసుకోమ'ని ప్రకటించారు. కానీ క్లోజింగ్ డేట్ రాకుండానే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. మాకు ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు నేను, "బాబా! బాబుని అంత దూరం పంపుతున్నాము. తనకి కాలేజీ హాస్టల్లో రూమ్ దొరికేలా అనుగ్రహించండి బాబా, ప్లీజ్. ఈరోజు సాయంత్రానికి బాబుకి హాస్టల్ గది దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అదేరోజు సాయంత్రం మావారు కాలేజీ డైరెక్టర్‌తో మాట్లాడితే, బాబా దయవల్ల ఆయన మా అబ్బాయికి రూమ్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు. మరుసటిరోజు ఆయన రూమ్ ఎలాట్ చేయడం, మావారు ఫీజు చెల్లించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇది కేవలం నా సాయితండ్రి చేసిన సహాయం మాత్రమే. బాబాకి మాటిచ్చినట్లు నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. మాకు దూరంగా వెళ్తున్న మా అబ్బాయికి, మాకు మీరు ఎప్పుడూ తోడుగా ఉండండి బాబా. అలాగే, మమ్మల్ని మీ మార్గంలో నడిచేలా ఆశీర్వదించండి బాబా. నన్ను, నా కుటుంబాన్ని, మీ భక్తులందరినీ సదా చల్లగా చూడండి బాబా".
ప్రాజెక్ట్ నుండి తప్పించి టెన్షన్ తొలగించిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. నేను 2015వ సంవత్సరంలో 'ఎంసీఏ' పూర్తిచేశాను. తరువాత నేను నాన్-ఐటీ ఉద్యోగంలో చేరాను. కానీ ఐటీ ఉద్యోగం చేయాలన్న కోరికతో కొన్ని కోర్సులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రతిసారీ మధ్యలోనే ఆపేసేదాన్ని. 2020లో నాకు పెళ్లయ్యాక నా భర్త మద్దతునివ్వడంతో నేను మళ్ళీ ఒక కోర్సు నేర్చుకోవడం మొదలుపెట్టాను. మధ్యలో నేను గర్భవతినని తెలిసింది. అయినా ఈసారి మధ్యలో ఆపేయొద్దని బాబాపై భారం వేసి కోర్సు పూర్తిచేశాను. బాబా దయవల్ల నాకు నేను కోరుకున్న ఐటీ ఉద్యోగం వచ్చింది. మూడు నెలలకి నన్ను ప్రాజెక్టులో వేశారు. అయితే అప్పుడు నేను ఆరో నెల గర్భవతిగా ఉన్నాను. నాకు అదివరకు ఐటీ వర్క్ అనుభవం లేనందున, వర్క్ చేయడానికి రాక మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని. దాంతో నాకు టెన్షన్ ఎక్కువై నిద్రపోయేదాన్ని కాదు. ప్రతిరోజూ రాత్రి బాబాని తలచుకుని, "బాబా! ఎలా అయినా నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కంపెనీవాళ్లే నన్ను ఈ ప్రాజెక్టు నుండి తీసేలా చేయండి" అని ప్రార్థించి కన్నీళ్లు పెట్టుకునేదాన్ని. ఏదైనా విషయంలో బాబా దగ్గర చీటీలు వేయడం నాకలవాటు. అలా ప్రస్తుత సమస్య విషయంలో చీటీలు వేసినప్పుడల్లా, 'వాళ్లే ప్రాజెక్టు నుండి తీసేస్తారు. నీ ఉద్యోగానికి ఏం కాదు' అని వచ్చేది. అంతలో నాకు ఏడవ నెల వచ్చింది. ఇంట్లోవాళ్ళు, "చాలా జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్ వద్దు" అనేవారు. కానీ బాబా చీటీల ద్వారా చెప్పినట్లు జరిగేది కాదు. ఇలా ఉండగా హఠాత్తుగా మా మేనేజర్ ఫోన్ చేసి, "నిన్ను ప్రాజెక్ట్ నుండి తీసేస్తున్నాము. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో!" అని అన్నారు. చివరికి బాబా నా ఆరోగ్యాన్ని, నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడారని నేను ఆశ్చర్యానందాలకు లోనయ్యాను. "ధన్యవాదాలు బాబా! ఇప్పుడు నాకు తొమ్మిదో నెల తండ్రీ. నాకు సుఖప్రసవమై నేను, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. అలానే కాన్పు అనంతరం నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాలి. మీరు తోడుగా ఉండి వర్క్ నేర్పించి నా ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయించాలి బాబా".
దయతో అబ్బాయిని ఇంటికి చేర్చిన బాబా
సద‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీసాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర‌్వహిస‌్తున‌్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక‌్తుడిని. నా పేరు చంద్రశేఖర్. మాది పాతర‌్లగడ‌్డ (కాకినాడ రూరల్). నేను మొదటిసారి ఈ బ్లాగులో సాయిబాబా నాకు చేసిన ఒక మేలును పంచుకుంటున‌్నాను. ఈమధ్య, అనగా 2022, సెప‌్టెంబరు 6వ తేదీన మా తమ్ముడి కొడుకు తను పనిచేసే కంపెనీ దగ‌్గర ఏదో తప‌్పు చేశాడని తెలిసి మా తమ్ముడు తనకి ఫోన్ చేసి తిట్టాడు. ఆ అబ్బాయి తండ్రి తిట‌్టాడని చెప‌్పి ఆరోజు సాయంత్రం ఇంటికి రాకుండా ఎక‌్కడికో వెళ‌్లిపోయాడు. నాకు విషయం తెలిసి నేను, "బాబా! అబ్బాయి ఎక‌్కడ ఉన‌్నా ఇంటికి తిరిగి వచ‌్చేలా చేయి తండ్రీ. వాడు ఇంటికి తిరిగి వస‌్తే, మీ అనుగ్రహాన్ని నేను మీ బ‌్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక‌్కుకున‌్నాను. బాబా దయవలన అబ్బాయి మరుసటిరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. "బాబా! మాకు ఎంతో మేలు చేశావు తండ్రీ. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కృపతో నాకున్న రెండు కోర‌్కెలు నెరవేరితే, మళ్లీ మీ బ‌్లాగులో పంచుకుంటాను బాబా".
సద‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha