1. క్లిష్ట పరిస్థితుల్లో బాబా సహాయం
2. బాబాకి మాటిస్తే నిర్లక్ష్యం కూడదు
క్లిష్ట పరిస్థితుల్లో బాబా సహాయం
అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇదివరకు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని పంచుకుంటున్నాను. నా భర్త వ్యాపార నిమిత్తం యు.ఏ.ఈలో ఉంటున్నారు. ఆయన 2022, ఏప్రిల్ నెల వేసవి సెలవుల్లో నన్ను, మా పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్లాలనుకుని మా అందరి వీసాల కోసం అప్లై చేసి, ఏప్రిల్ 25వ తేదీకి ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల మా పిల్లల వీసాలు ఆలస్యమయ్యాయి. ఏప్రిల్ 21 వచ్చినా రాలేదు. నేనూ, పిల్లలూ వీసాలు రాలేదని ఆందోళన చెందాము. బుధవారంనాడు నేను, "బాబా! రేపు మీ రోజున వీసాలు వచ్చినట్లైతే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను. అలాగే 'సాయి చాలీసా' రెండుసార్లు పఠిస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మధ్యాహ్నానికి మా పిల్లలిద్దరి వీసాలు వచ్చాయి. మేము సంతోషంగా, సురక్షితంగా మా టూర్ పూర్తిచేసుకొని వచ్చాము.
2022, జూలై 18న మా పిల్లల మొదటి టర్మ్ స్కూలు ఫీజులు కట్టాల్సి ఉండగా నా భర్త పంపే డబ్బుల కోసం నేను ఎదురుచూశాను. కానీ కొన్ని కారణాల వల్ల డబ్బులు రావడం ఆలస్యమైంది. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అదేరోజు ఉదయం నాకు డబ్బులు అందాయి. అదే నెలలో మా అబ్బాయికి రాత్రుళ్ళు జ్వరం వస్తుండేది. అది తన పరీక్షల సమయమైనందున నేను ఆందోళన చెందాను. అంతలో స్కూలువాళ్ళు, 'ఎవరైనా పిల్లలకి ఆరోగ్య సమస్యలుంటే, స్కూలుకి పంపవద్ద'ని తెలియజేశారు. అప్పుడు నేను ఊదీనీళ్లు బాబుకి ఇచ్చి, "బాబా! మీ దయతో బాబు కోలుకుంటే, తనని మీ గుడికి తీసుకొస్తాను" అని బాబాకి మాటిచ్చాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి బాబు నార్మల్ అయి స్కూలుకి వెళ్ళాడు.
ఒకరోజు స్కూలు నుండి 'స్పోర్ట్స్ యూనిఫార్మ్ బుక్ చేసుకోమ'ని, 'బుక్ చేసుకున్నవాళ్ళకి రెండు వారాల తరువాత యూనిఫార్మ్స్ అందుతాయ'ని మెసేజ్ వస్తే, నేను డబ్బులు కట్టాను. రెండువారాల తరువాత స్కూలు మేనేజ్మెంట్, 'రసీదు తీసుకొచ్చి, యూనిఫార్మ్స్ తీసుకుని వెళ్ళండి' అని నాకు మెసేజ్ పంపారు. అయితే నేను ఆ రసీదు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా దొరకకపోయేసరికి రసీదు లేకుండానే నేను స్కూలుకి వెళ్ళాను. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు, "రసీదు లేకపోతే మేము ఏం చేయలేము" అని అన్నారు. దాంతో నేను తిరిగి ఇంటికి వస్తూ, "బాబా! ఆ రసీదు దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, ఆ రసీదు గురించే ఆలోచిస్తుండగా దాన్ని నేను ఏ చోట పెట్టానో బాబా నాకు స్ఫురింపజేశారు. నేను ఇల్లు చేరుకున్న వెంటనే ఆ చోట చూస్తే, ఆ రసీదు అక్కడే ఉంది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. "థాంక్యూ సో మచ్ బాబా. నిజంగా క్లిష్టమైన పరిస్థితిలో మీరు నాకు సహాయం చేస్తూ ఎల్లవేళలా నాతో ఉంటున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. మీరే మా ధైర్యం. మీరే మా బలం. భక్తులకు మీరు సర్వం".
బాబాకి మాటిస్తే నిర్లక్ష్యం కూడదు
ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తుడిని. నా పేరు శ్రీనివాసబాబు. మాది హైదరాబాదు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో మూడు అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకప్పుడు నా కుడికాలి మడమ కిందభాగం సూదులతో పొడుస్తున్నట్లు బాగా నొప్పిగా ఉంటుండేది. పొద్దున్నే మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలంటే భయంతో వణికిపోయేవాడిని. అతికష్టం మీద గోడను పట్టుకుని అడుగులు వేసేవాడిని. ఏ జన్మలో ఏ పాపం చేశానో! ఈ జన్మలో అయినా ఆ పాపాన్ని కడిగేసుకోవాలని చాలారోజులు ఓర్పుతో ఆ బాధను భరించాను. కానీ చివరికి నా వల్లకాక, "బాబా! మీరు చెప్పారని చాలా బాధను భరించాను. ఇంక నావల్ల కావడం లేదు. దయచేసి నొప్పిని తగ్గించండి. నొప్పి తగ్గినట్లయితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన అప్పటినుంచి నొప్పి లేదు. కానీ నేను నా అనుభవాన్ని పంచుకోవడం మర్చిపోయాను. 2022, ఆగస్టు 31 రాత్రి మళ్ళీ నొప్పి వచ్చింది. నేను వెంటనే, "నా తప్పును మన్నించు బాబా" అని వేడుకున్నాను. బాబా మళ్ళీ దయచూపారు. నొప్పి తొందరగానే తగ్గింది. "ధన్యవాదాలు బాబా. మరలా ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని వెంటనే పంచుకుంటున్నాను స్వామీ. నన్ను క్షమించు తండ్రీ". దయచేసి బాబాకి మాటిస్తే మీ అనుభవాలను వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో మర్చిపోకుండా పంచుకోండి.
నాకు ఒక ఇల్లు ఉంది. అది రెండు నెలల నుంచి ఖాళీగా ఉంటే, "బాబా! మా ఇంటిలోకి ఎవరైనా అద్దెకు వచ్చేటట్లు చూడు స్వామీ. మీ అనుగ్రహంతో ఎవరైనా ఆ ఇంటిలోకి వస్తే, వెంటనే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అదేరోజు రాత్రి ఒకరు ఫోన్ చేసి, "సెప్టెంబర్ మొదటి వారంలో ఇంట్లో దిగుతామ"ని చెప్పారు. బాబాను నమ్మినవాళ్లకి మోసం జరగదనే ఉద్దేశంతో ముందుగానే నేను నా అనుభవాన్ని పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
మా అమ్మగారి నోట్లో పళ్ళన్నీ ఊడిపోయాయి. డాక్టరు పై పళ్ళు, కింద పళ్ళు పెట్టాలి అన్నారు. మా అమ్మ నాకు ఫోన్ చేసి విషయం చెప్పి, "అవి సెట్ అవుతాయో లేదో! వాటిని రోజూ తీసి పెడుతుండాలి. నాకు చాలా భయంగా ఉంది" అని చెప్పింది. నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! అమ్మకి అంతా మంచిగా ఉంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. మొదటి మూడు రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ బాబా దయవల్ల ఇప్పుడు అంతా మంచిగా ఉంది. "ధన్యవాదాలు బాబా. నాకు చాలా సమస్యలున్నాయి తండ్రీ. కరుణతో వాటినుంచి నన్ను బయటపడేయండి స్వామీ. ఎల్లప్పుడూ మీ నామాన్ని జపిస్తూ, మీ సచ్చరిత్ర పారాయణ చేస్తున్న నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించు సాయీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయి రామ్ సాయి అంటే పాపా లోనీ పోతాయి. ఈ రోజు నా భర్త పిక్ నిక్ కి వెళ్ళారు దగ్గర వుండి కాపాడుతూ ఉండు తండ్రి.జాగత తీసుకుని రండి.మా మానవుడికి జ్వరం వచ్చింది తొలగించు స్వామీ.చినవాడు చల్లగ చూడాలి సాయి అనుగ్రహం వల్ల అన్ని మనకు లభించే తీరుతాయి.ఇంక నీ ఆశీస్సులు వుంటే మరొక జన్మ లో నువ్వు నాతో వుండాలి
ReplyDelete.
Om sai ram 🙏
ReplyDelete