1. బాబా దయ ఉంటే చాలు
2. పక్కనే ఉండి అనుకున్నవి నెరవేరుస్తారు బాబా
బాబా దయ ఉంటే చాలు
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు అంజలి. ఈమధ్య మా ఆఫీసులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు కనిపించలేదు. ఆఫీసు అంతా వెతికాం కానీ, అవి మాకు ఎక్కడా కనపడలేదు. ఆ డాక్యుమెంట్లను వేరేవాళ్ళకు ఇచ్చినట్లు నాకు గుర్తు ఉంది. కానీ వాళ్ళు, "మాకు ఇవ్వలేద"ని అన్నారు. అవి కనపడకుండాపోతే నాకు చాలా సమస్య అవుతుంది. అందువల్ల నేను బాగా ఆందోళన చెందాను. వెంటనే బాబానే శరణువేడి, "బాబా! ఆ డాక్యుమెంట్లు కనిపిస్తే, మీ అనుగ్రహాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న కొద్దిసేపటికి మా తమ్ముడు ప్రసాద్‌కి ఆ డాక్యుమెంట్లు కనపడ్డాయి. అలా బాబా నా టెన్షన్ తీర్చారు. నిజం! ఇది బాబా చేసిన అద్భుతం. ఆయన దయ ఉంటే చాలు, ఏవైనా దొరుకుతాయి.
ఆగస్టులో నేను నా ఆరోగ్యం బాగలేక ఆయుర్వేద హాస్పిటల్‌కి వెళ్లాలనుకున్నాను. అయితే నేను హాస్పిటల్‌కి వెళ్లేలోపు, 'నీ ఆరోగ్యానికి ఏమీ కాదు. నీకు రక్షగా నేను ఉన్నాను. ఏదైనా నన్ను దాటుకుని నిన్ను చేరాల్సిందే' అని ఫోన్లో నాకు మెసేజెస్ కనిపిస్తూ ఉండేవి. అలా బాబా నా ఆరోగ్యం గురించి సూచనలిస్తుంటే నేను మాత్రం, 'నా ఆరోగ్యానికి ఏమైంది? కేవలం కొద్దిపాటి జ్వరమే కదా! ఎందుకిలా మెసేజెస్ వస్తున్నాయి?' అని అనుకునేదాన్ని. కానీ తరువాత నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్, "మీరు ఎక్కువ టెన్షన్ అండ్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అందువల్ల మీకు గర్భసంచి సమస్య వచ్చింది. వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండండి" అని చెప్పారు. మావారు పక్కనే ఉన్నారు. ఆయన కొంచెం కోపిష్ఠి. చిన్న విషయానికి కూడా ఊరికే కోప్పడుతుంటారు. ఆయన కోప్పడినప్పుడల్లా నేను టెన్షన్‌కి గురవుతూ ఉంటాను. అయితే డాక్టరు చెప్పింది విన్నప్పటినుండి మావారిలో చాలా మార్పు వచ్చింది. ఆయన ఊరికే నాపై కోప్పడ్డం మానేశారు. అంతా బాబా దయ. ఆయన వల్లే అది సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా. నాకున్న గర్భసంచి సమస్యని త్వరగా తగ్గించండి బాబా. "ధన్యవాదాలు బాబా. దయచేసి నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిగా చేయండి బాబా. మీ దయ నా మీద నా కుటుంబం మీద, అలాగే అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
ఈమధ్య తమ్ముడు ప్రసాద్ కుమారుడికి ఆరోగ్యం బాగాలేదు. జ్వరమొచ్చి తనను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబుకి జ్వరం తగ్గి నార్మల్ అయితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబుకి తొందరగానే తగ్గిపోయింది. ఇప్పుడు తను బాగున్నాడు. అలాగే తమ్ముడు ప్రసాద్‌కి లంగ్స్‌లో నెమ్ము పూర్తిగా తగ్గటం లేదని, "బాబా! ఎలాగైనా తనకి నెమ్ము పూర్తిగా తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల హోమియో మెడిసిన్ తీసుకున్నాక తమ్ముడికి కొంచెం మెరుగై దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. ఏమైనా తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించు బాబా".
నేను నా గత అనుభవంలో ఇంట్లో గొడవల వల్ల తమ్ముడు బాగా డిస్టర్బ్ అయి మహాపారాయణ గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యాడని చెప్పాను. అప్పుడు నేను బాబా దయవల్ల తమ్ముడు ప్రసాద్ సచ్చరిత్ర పారాయణ గ్రూపులో తిరిగి జాయినై పారాయణ చేస్తే, బ్లాగులో పంచుకుంటాననుకున్నాను. తరువాత సెప్టెంబర్ 8, గురువారంనాడు తమ్ముడు పారాయణ చేస్తే నేను చాలా సంతోషించాను. కానీ ఆ తరువాత తమ్ముడు నాతో, "బాబా పారాయణ నిత్యమూ చదవనక్కర్లేదు, ఆయన చరిత్ర తెలుసుకుంటే చాలు" అని వాదించాడు. దాంతో తను మరుసటి వారం పారాయణ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఇక తనని పారాయణ చేయమని ఒత్తిడి చేయవద్దని, ఏదైనా బాబానే చూసుకుంటారని అనుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడు మరుసటి వారం పారాయణ చేశాడు. నేను చాలా చాలా ఆనందించాను. అప్పటినుండి తమ్ముడు మహాపారాయణ కొనసాగిస్తున్నాడు. "ధన్యవాదాలు బాబా. తమ్ముడు ఎప్పుడూ మీ పాదాలు వదలకుండా చూడండి బాబా. అతన్ని, అతని కుటుంబాన్ని మీరే కాపాడాలి బాబా. మీరు బహుమతిగా నాకిచ్చిన తమ్ముడు సదా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి బాబా. మీ దయవల్ల మా అక్కాతమ్ముళ్ల అనుబంధం కలకాలం ఇలాగే ఉండాలి బాబా".
పక్కనే ఉండి అనుకున్నవి నెరవేరుస్తారు బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయితండ్రికి నా శతకోటి వందనాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈమధ్య తినేటప్పుడు నా దంతాలు కొంచెం ఇబ్బందిపెడుతుంటే, 2022, ఆగస్టు నెలలో నేను ఒక డెంటల్ హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టర్ నా దంతాలు పరిశీలించి, "రెండు, మూడు చోట్ల సిమెంట్ పెట్టాలి" అని అన్నారు. నేను, "ఎంత డబ్బులు తీసుకుంటారు?" అని అడిగితే, "ఒక్కో పన్నుకి ఒక్కోసారి పెట్టి విడివిడిగా ఛార్జ్ చేస్తాము" అన్నారు. నాకు అంత సమయం లేనందున, "ఒక్క పన్నుకి చేయండి చాలు" అని చెప్పాను. డాక్టరు, "అన్నిటికీ చేయించుకోండి" అని అన్నారు. నేను, "మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. పైగా నాకు సమయం సరిపోదు" అని చెప్పాను. అలా చెప్పడమైతే చెప్పానుగానీ, మొత్తం అన్నీ పెట్టించేసుకుందామా, లేదా అని ఆలోచనలో పడ్డాను. డాక్టరు పన్ను శుభ్రం చేస్తున్నారు. నేను బాబాని తలచుకుని, "పైన పెట్టిన తర్వాత కింద పన్నుకి కూడా పెడితే బాగుండును బాబా. అలా జరిగితే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. అలా అనుకున్నానో, లేదో డాక్టరు రెండు పళ్ళకి సిమెంట్ పెట్టేసి, "నేను రెండు పళ్ళకి సిమెంట్ పెట్టాను. కానీ, మీరు ఒక పన్నుకి బిల్లు కట్టండి, చాలు" అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు బాబా మన పక్కనే ఉండి మన మనసులో అనుకున్నవి చేసేస్తారు, మనతోనే ఉన్నాను అని ధైర్యాన్ని ఇస్తారు. "ధన్యవాదాలు సాయీ. మీరు ఎప్పుడూ నా పయనంలో నాకు తోడుగా ఉండి సమస్యలను పరిష్కారించండి బాబా".
Om Sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఈ రోజు అనుభవాలు చాలా బాగున్నాయి.సాయి అనుగ్రహం వల్ల మనకు ఏ ఆపద రాదు.సాయే రక్షించారు.అతనిని నమ్ముకోవడం వలన మనకి ఆపదలు రావు
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha