సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1331వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన మంచి
2. ఆరోగ్య సమస్యలను తీర్చిన బాబా
3. వైరల్ ఫీవర్ నుండి ఉపశమనమిచ్చిన బాబా

బాబా చేసిన మంచి


ప్రియమైన సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మనఃపూర్వక కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకోడానికి మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి పెళ్లి నిశ్చయమైన తరువాత బాబా మాయందు దయ ఉంచి 'ఆ సంబంధం మాకు తగినది కాద'ని ఎన్నో దృష్టాంతాల రూపంలో తెలియజేశారు. దాంతో ఆ పెళ్లి ఆగిపోయింది. బాబా మమ్మల్ని పెద్ద గండం నుండి కాపాడారు. కానీ అప్పుడు జరిగిన గొడవ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాము. నేను బాబాను, "ఈ టెన్షన్ ఏమిటి బాబా? అన్నీ సర్దుకునేలా మీరే చూసుకోవాలి" అని వేడుకున్నాను. బాబా దయతో ఆ టెన్షన్స్ నుంచి మమ్మల్ని కాపాడారు. అంతేకాదు, నా మనసెరిగి హైదరాబాద్‍లో ఉండే మా దగ్గరి బంధువుల అమ్మాయితో మా బాబుకి సంబంధం కుదిర్చారు. విశేషమేమిటంటే, ఆ అమ్మాయి పేరు 'సాయిదివ్య'. వాళ్లకు బాబా అంటే చాలా ఇష్టం. 2022, ఆగస్టు 14న నిశ్చితార్థం అనుకున్నాము. బాబు యు.ఎస్ నుండి ఆగస్టు 11న బయలుదేరాడు. తనని రిసీవ్ చేసుకోవడానికి మేము ఎయిర్‌పోర్టుకి వెళ్ళాము. అందరూ బయటకు వస్తున్నారు కానీ, మా బాబు రాలేదు. మేము కంగారుపడి మా బాబుకి ఫోన్ చేసి, "ఇంకా రాలేదేంటి?" అని అడిగితే, "నేను రెండు సూట్‌కేసుల లగేజ్ తీసుకొస్తే, ఒక సూట్‌కేసే వచ్చింది. రెండోది యు.ఎస్. ఎయిర్‌పోర్ట్ వాళ్ళు వేయలేద"ని చెప్పాడు. 14న నిశ్చితార్థం. బాబు డ్రెస్సులన్నీ యు.ఎస్.లో ఉండిపోయిన సూట్‌కేసులోనే ఉండిపోయాయి. అందువలన బాబు బయటకు వచ్చి ఆనందంగా లేడు, చాలా బాధపడ్డాడు. నేను మావారికి, బాబుకి కనపడకుండా పక్కకి తిరిగి 'వాడికి ఎందుకిలా జరుగుతోంది?' అని కన్నీళ్లు పెట్టుకుని, "ఏమిటయ్యా బాబా? నాకేంటి ఈ టెన్షన్? వాడు చాలా బాధపడుతున్నాడు. మరలా షాపింగ్ చేసే సమయం లేదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బాబా. ఆ లగేజ్ వచ్చేలా చూడండి. నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని మనసులోనే బాబాను వేడుకున్నాను. అప్పుడు ఎయిర్‌పోర్టు వాళ్ళు మా బాబుని పిలిచి, "యు.ఎస్ కాల్ చేశాము. ఇప్పుడే ఫ్లైట్‍లో లగేజ్ వేస్తున్నాము. రేపు తెల్లవారుఝామున తీసుకోండని చెప్పారు" అని అన్నారు. మేమింక ఆరోజు వెయిట్ చేసి, మరుసటిరోజు తెల్లవారుఝామున నాలుగున్నరకి మరల ఎయిర్‌పోర్టు వాళ్ళకి కాల్ చేస్తే, "మీ లగేజ్ వచ్చింది, వచ్చి తీసుకెళ్లండి" అని అన్నారు. నా ఆనందానికి అంతులేదు. మనసులో, "బాబా! ఇలా కూడా ఆడిస్తారా?" అని అనుకొని ఎయిర్‌పోర్టుకి వెళ్లి లగేజీ తీసుకుని, ఆరోజు మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నాము. అలా బాబా క్షణక్షణం నాకు పరీక్షలు పెడుతూ, ఆడిస్తూ, గెలిపిస్తూ ఉంటారు. బాబా దయవలన ఆగస్టు 14న మా బాబు నిశ్చితార్థం చాలా బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే డిసెంబర్లో బాబు వివాహం దగ్గర ఉండి మంచిగా జరిపించండి. మమ్మల్ని, బంధువులందరినీ ఆశీర్వదించండి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఆరోగ్య సమస్యలను తీర్చిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. నేను ఈ బ్లాగులో ఎన్నో అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. ఇటీవల ఒకసారి మా పాపకి పాదాలనొప్పి వచ్చింది. నేను బాబాను ప్రార్థించి, పాప పాదాలకి జెల్ రాశాను. బాబా దయవల్ల మరుసటిరోజు పాపకి నొప్పి తగ్గింది. ఆ మరుసటిరోజు రాత్రి పాప చెవినొప్పితో బాధపడింది. నేను పాప చెవికి ఊదీ రాసి, బాబాను ప్రార్థించాను. బాబా దయతో ఉదయానికి చెవినొప్పి తగ్గింది. కానీ మా పాపకి అప్పుడప్పుడు పాదాలనొప్పి, చెవినొప్పి వస్తుంటాయి. తనకి ఏదైనా సమస్యేమోనని నా భయం. "బాబా! తనకున్న ఆ రెండు బాధలను శాశ్వతంగా నయమయ్యేలా చేయండి. తను మీ వరప్రసాదం. తన బాధ్యత అంతా మీదే బాబా. మా అమ్మ రెండు సమస్యలతో మానసికంగా నలిగిపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా తన మనోవేదనను తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను తండ్రీ. ఆ సమస్యలు తీరితే, నా అనుభవాన్ని మళ్లీ బ్లాగులో పంచుకుంటాను బాబా".


మా చెల్లివాళ్ళ పాపకి, బాబుకి జ్వరం వచ్చి వారంరోజులైనా తగ్గలేదు. అప్పుడు మా చెల్లెలి పిల్లలిద్దరికీ ఊదీ పెట్టి, "బాబా! పిల్లలకి నయమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను.  బాబా దయవల్ల పిల్లలిద్దరికీ రెండు రోజుల్లో పూర్తిగా తగ్గింది. "ధన్యవాదాలు బాబా". 


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


వైరల్ ఫీవర్ నుండి ఉపశమనమిచ్చిన బాబా  


సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2022, ఆగస్టులో నేను ఒక ఫంక్షన్‍కి బస్సులో వెళ్ళొచ్చాను. ఆ రాత్రి నేను 103 డిగ్రీల జ్వరంతో బాధపడ్డాను. మరుసటిరోజు కూడా జ్వరం అలానే ఉండటంతో డాక్టరు దగ్గరకి వెళ్తే, ఇంజక్షన్ చేశారు. అయినా జ్వరం తగ్గలేదు. మరుసటిరోజు నేను ఇంకో డాక్టరు దగ్గరకి వెళ్లాను. ఆ డాక్టరు, "ఇది ఎలాంటి జ్వరమో తెలియడం లేదు. టెస్టులు చేద్దామ"ని అన్నారు. నాకు కరోనా ఏమోనని చాలా భయమేసి, "సాయితండ్రీ! రిపోర్టులో 'ఏమీ లేదు, మామూలు జ్వరమే' అని వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. సాయి మహిమ వల్ల అరగంట తరువాత వచ్చిన రిపోర్టు చూసిన డాక్టరు, "ఇది కేవలం వైరల్ ఫీవరే. ఇబ్బంది ఏమీ లేదు. తగ్గిపోతుంది" అని చెప్పారు. ఆ సాయినాథుని దయవల్ల వారంరోజుల్లో నాకు జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇలా సాయితండ్రి నన్ను చాలాసార్లు ఎన్నో సమస్యల నుండి రక్షించారు. "సాయినాథా! అందరినీ చల్లగా చూడు తండ్రీ".


సర్వేజనా సుఖినోభవంతు!!!


5 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  5. 🙏తండ్రి సాయినాధ కరుణించు తండ్రి 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo