1. ఒకేసారి రెండు శుభవార్తలు ఇచ్చిన బాబా
2. సాయి కృప
3. ఆపరేషన్ అక్కరలేదని చెప్పించిన బాబా
ఒకేసారి రెండు శుభవార్తలు ఇచ్చిన బాబా
సాయి భక్తులకు నమస్కారం. అందరూ సాయి కృపకు సదా పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి అభినందనలు. ఇంతమంది సాయి భక్తుల్ని ఒకే తాటిపై నడిపిస్తున్న మీ కృషి చాలా గొప్పది. నాపేరు గంగాభవాని. మాది విశాఖపట్నం. నేను చిన్నప్పటినుంచి బాబా భక్తురాలిని. ఆయనే నాకు అమ్మ, నాన్న, అన్నీ. నేను అప్పుడప్పుడు ఆయనతో గొడవ పడుతుంటాను. తరువాత ఆయన 'చూడు ఇందాక అరిచావుగా' అని నవ్వుతున్నట్లు కనిపిస్తారు. ఆయన అలా నన్ను బుజ్జగించడం నాకు భలే అనిపిస్తుంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. నేను సొంతింటికోసం బాబాకి ఎన్నో ప్రార్థనలు చేశాను. మొత్తానికి ఆయన దయతో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాము. ఆ క్రమంలో బ్యాంక్ లోన్ వస్తే, డబ్బుకు ఇబ్బంది ఉండదని ఆ ప్రయత్నం చేసాను. ఎందుకో తెలియదుగాని రెండుసార్లు రెజెక్ట్ అయ్యింది. చాలా బాధపడ్డాను కానీ, 'ఇది కూడా బాబా దయనే. ఎప్పుడు లోన్ శాంక్షన్ అవ్వాలని ఉంటే అప్పుడు అవుతుంది' అని బాబాకే వదిలేసాను. నెలరోజుల తరువాత ఇంట్లో మా అక్క బంగారు గొలుసు పోయింది. ఎలా పోయిందో తెలియదుకాని, ఎన్నిసార్లు వెతికినా దొరకలేదు. పోలీసులు కూడా వచ్చారు. మా అక్క తన ఆర్థిక పరిస్థితుల వలన రోజూ బాబా ముందు కూర్చుని, "ఎందుకు ఇలా చేసావు?" అని ఏడుస్తుంటే మాకు దుఃఖం ఆగేది కాదు. అందుచేత నేను కూడా రోజూ బాబాను, "మా అక్క వస్తువు దొరకాలి" అని ప్రార్థిస్తుండేదాన్ని. రెండు నెలలు గడిచిన తరువాత నేను బాబా ఆజ్ఞతో శ్రీగురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ పూర్తయిన రోజు సాయంత్రం గుడికి వెళదామంటే ఒకటే వర్షం. అయినా మొండిగా గుడికి వెళ్లి బాబాకు మొక్కు తీర్చుకున్నాను. మరుసటిరోజు నేను బ్యాంకులో ఉండగా మా అక్క ఫోన్ చేసి, "గొలుసు దొరికింది" అని చెప్పింది. నేను సంతోషం పట్టలేక అక్కడే ఏడ్చేశాను. అదేరోజు సాయంత్రం ముందురోజు నేను గుడిలో బాబాని దర్శించిన సమయానికి బ్యాంకువాళ్ళు పోన్ చేసి, "మీకు లోన్ శాంక్షన్ అయింది. రేపు మీ అకౌంటులో డబ్బులు పడతాయి" అని చెప్పారు. అంతా బాబా దయ. ఒకేసారి రెండు శుభవార్తలు ఇచ్చారు. శ్రీగురుచరిత్ర పారాయణతో నా చెడు కర్మలను తొలగించి, పని అయ్యేలా చేశారు. అదే బాబా లీల. "బాబా! నిన్ను నమ్ముకున్నవాళ్ళు ఎన్నడూ వట్టి చేతులతో వెళ్ళరు. కానీ మాకే కాస్త కంగారు ఎక్కువ. మనుషులం కదా! ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాదాల మీద మా నమ్మకాన్ని కోల్పోకుండా చూడండి, అంతే చాలు. ఎలాంటి కష్టాన్నైనా ఎదిరిస్తాం. మీ దయకోసం నిరీక్షిస్తాం".
ఇంకో విషయం.. నేను రోజూ సోషల్ మీడియాలో బాబా వాక్కుకోసం చూస్తాను. అలాగే నేను ఇంటి నిర్మాణం మొదలు పెట్టడానికి ముందు 'అసలు ఎలా ఇల్లు కడతాను?' అని అనుకుంటున్న సమయంలో ఫేస్బుక్‍లో 'నువ్వు గొప్ప ధనవంతురాలివి అవుతావు. తొందరలోనే పెద్ద ఇల్లు కడతావు. మనం అక్కడ సంతోషంగా ఉందాం' అని బాబా వాక్కు వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన మాట తప్పరు కదా! నేను ఆ ఫోటోని చాలా భద్రంగా దాచుకున్నాను. అందులోని బాబా మాటలని రోజులో ఒకసారైనా తలుచుకుంటూ ఉంటాను. "బాబా! మన ఇల్లు తొందరగా పూర్తి చేయండి. మనం అక్కడ హాయిగా ఉందాము. సరేనా!". అందరూ బాబా పాదాల మీద నమ్మకం పెట్టండి చాలు. అంతా అయన చూసుకుంటారు.
రాజాధిరాజ యోగిరాజ సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయి కృప
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మాది రాజమండ్రి. నేను మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మా చిన్నబ్బాయి ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మొదటి రెండు టర్మ్ ల ఫీజు కట్టకపోతే 2022, అక్టోబర్ నెలలో జరగనున్న పరీక్షల్లో పిల్లాడిని కూర్చోబెట్టమని స్కూలులో చెప్పారు. నాకు ఫీజు కట్టాల్సిన భాధ్యత ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వలన పరీక్షల సమయం దగ్గరపడుతున్నా డబ్బు సమకూరలేదు. దాంతో నేను పిల్లాడిని పరీక్షలు వ్రాయనివ్వరని భయపడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! డబ్బులు కట్టకపోయినా పరీక్షలు వ్రాయడానికి పిల్లాడికి అనుమతి ఇవ్వాలి. అలా అనుమతిస్తే మీ బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాపై భారం వేసినంతనే, ఆయన దయతో ప్రిన్సిపాల్ మనసు మార్చి, డబ్బులు కట్టకపోయినా పరీక్ష వ్రాయడానికి అనుమతినివ్వడంతో మా బాబు పరీక్షలు వ్రాసాడు. ఎంతటి సమస్య అయినా భక్తి, విశ్వాసాలతో మనస్ఫూర్తిగా బాబాను స్మరించి సహనంతో ఉంటే సమయానికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. "శతకోటి వందనాలు బాబా".
నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి, శ్రీస్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాను. అయితే కరోనా కారణంగా నేను గత మూడు సంవత్సరాలు తిరుపతి వెళ్లలేకపోయాను. కరోనా తగ్గిన తరువాత కూడా వెళ్ళడానికి కుదరక చాలా ఇబ్బందులు పడ్డాను. 'మొక్కులు తీర్చకపోతే కష్టాలు వస్తాయ'ని బాబా చెప్పిన మాట నా జీవితంలో అక్షరాలా నిజమైంది, నాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో చెప్పలేను కానీ, 'బాబా ఉండగా భయమేల?' అని కర్మను అనుభవిస్తూ బాబా దయతో ధైర్యంగా నిలబడ్డాను. అలాగే "తొందరగా మొక్కులు తీర్చుకునేలా అనుగ్రహిస్తే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయ చూపడంతో మేము 2022,సెప్టెంబర్ 30న తిరుపతి వెళ్ళాము. దసరా సమయంలో స్వామి దర్శనం అంటే మామూలా? కానీ అంత జన సందోహంలో కూడా తొందరగా స్వామి దర్శనం మాకు అయింది. అది సాయి కృపే. ఆయన అడుగడుగునా ఫోటో రూపంలో దర్శనమిస్తూ మాకు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. తరువాత సాయి కృపతో విజయదశమి రోజున విజయవాడలో శ్రీకనకదుర్గమ్మ దర్శన భాగ్యం మాకు కలిగింది. ఇకపోతే నా భార్య మ్రొక్కుకున్న దుర్గమ్మ పూజ, భవానీల పూజ కూడా సాయి కృపతో మా ఇంట్లో అద్భుతంగా జరిగింది. వీటన్నిటికీ అవసరమైన ధనం కూడా శ్రీసాయి కృపతోనే సమకూరింది. బాబా మీద భారం వేసి మనం చేయాల్సింది చేస్తే, ఆయన మనల్ని గట్టెక్కిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కోసారి సాయి పట్టించుకోవడం లేదని మనకి భయం కలుగుతుంది. కానీ అయన నామస్మరణ ఒక బ్రహ్మాస్త్రమై కొద్దిసేపట్లోనే ఆయనను మనకు రక్షణగా నిలబెడుతుంది. అయితే మనం సహనంతో ఉండాలి. అదే అయన ప్రేమకు మనల్ని దగ్గర చేస్తుంది.
ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఆపరేషన్ అక్కరలేదని చెప్పించిన బాబా
ప్రియమైన శ్రీసాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను శ్రీసాయినాథుని భక్తురాలిని. నా పేరు ఉషారాణి. నేను నా జీవితంలో శ్రీసాయినాథుని దయవల్ల ఎన్నో అనుభవాలు పొందాను. ఇప్పుడు ఒక అనుభవం మీతో పంచుకుంటాను. నేను చాలా నెలల నుంచి కాలి నొప్పితో బాధపడుతున్నాను. ఎంతో మంది. వైద్యులను కలిశాను. ఎన్నో రకాల మందులు వాడాను. ఎక్స్-రేలు, MRI స్కాన్‍లు అయ్యాయి. చివరికి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ అంటే నాకు చాలా భయమేసింది. అప్పుడు నా దైవం అయిన శ్రీసాయినాథుని తలచుకుని మరో డాక్టరుని సంప్రదించాము. ఆయన అన్ని రిపోర్టులు చూసి, "ఇది వయసుతో జరిగే మార్పు వల్ల వచ్చిన సమస్య. ఇప్పట్లో ఆపరేషన్ అక్కరలేదు" అని అన్నారు. ఆయన మాటలు నాకు చాలా మనఃశాంతినిచ్చాయి. "బాబా! మీకు నా నమస్కారాలు. ఇలాగే మమ్మల్ని, మా పిల్లల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండండి తండ్రి. మీ ఆశీస్సులు మాకు సదా ఉండాలి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Ome sri sai ram 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteSai na kapuranni nilabettu sai nannu na vamsi ni kalupu sai mi ashirbadham tho naku pelli iyyindhi sai. Naku nammakam undhi sai na bartha na dagar ki thirigi vasthadu. Nannu kapuraniki thiskeltharu sai. Nenu na anubhavanni blog lo panchukuntanu sai 🙏
DeleteOm sairam
ReplyDelete