ఈ భాగంలో అనుభవాలు:
- నేనుండగా నీకు భయమేల?
- బాబా కృపతో సాధారణ ప్రసవం
నేనుండగా నీకు భయమేల?
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రేవతి. నేను టీచర్ని. ఈ బ్లాగులోని అనుభవాలు చదువుతుంటే నాకు మరో సచ్చరిత్ర చదివిన అనుభూతి కలుగుతోంది. బాబా నాకు ఎన్నో మంచి అనుభవాలను ప్రసాదించారు. కరోనా సమయంలో విద్యార్థులను పాఠశాలకు రావద్దని, కేవలం ఉపాధ్యాయులను మాత్రమే వారానికి ఒకసారి పాఠశాలకు హాజరుకమ్మని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాల మేరకు మొదటిసారి పాఠశాలకు వెళ్ళినరోజు రాత్రి నాకు విపరీతమైన చలితో కూడిన జ్వరం వచ్చింది. అసలే కరోనా విజృంభిస్తున్న వేళ నాకు జ్వరం రావటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాను. బాబాను ప్రార్థిస్తూ ఊదీని నీళ్ళలో కలిపి త్రాగాను. బాబా అనుగ్రహంతో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది.
కరోనా సమయంలోనే ఒకరోజు నేను అనుకోకుండా యూట్యూబ్ లో సాయి సందేశాన్ని చూశాను. దానిలో, “నీవు అనవసరంగా ఆందోళన చెందకు, నేనుండగా నీకు భయమేల?” అని బాబా అన్నారు. అదేరోజు రాత్రి మాకు తెలిసిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. అంతేకాదు, నా భర్తకు, ఆడపడుచుకి కూడా జలుబు, జ్వరం వచ్చాయి. అయితే, “భయపడకు, నేనున్నాను” అని బాబా నాకు ముందే చెప్పి ఉండటం వలన నేను పెద్దగా ఆందోళన చెందలేదు. బాబా దయవల్ల మావారికి, ఆడపడుచుకి రెండు రోజుల్లో జ్వరం, జలుబు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే మాకు తెలిసినవారికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాను కదా, వారందరికీ ఆ తరువాత నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. ప్రతిదానికీ ఆందోళనపడే నేను బాబా ముందే అభయం ఇవ్వటం వల్ల ఆ పరిస్థితిలో ధైర్యంగా ఉన్నాను. “థాంక్యూ బాబా! థాంక్యూ సో మచ్! మా కుటుంబం కరోనా బారినపడకుండా కాపాడారు”.
ఒకసారి మా ఇంటి తాళంచెవులు నా హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచాను. ఆ తరువాత వాటికోసం వెతికితే బ్యాగులో కనిపించలేదు. మావారు, నేను బ్యాగ్ పూర్తిగా ఖాళీ చేసి వెతికాము. కానీ తాళంచెవులు దొరకలేదు. అప్పుడు నేను, “బాబా! తాళంచెవులు దొరికేలా దయ చూపండి” అని వేడుకున్నాను. మరుసటిరోజు బ్యాగ్ ఖాళీ చేస్తుంటే నా బ్యాగులోని బాబా ఫోటో ప్రక్కనే మా ఇంటి తాళంచెవులు ఉన్నాయి. ఇంతకుముందు అక్కడ వెతికినా దొరకని తాళంచెవులు అప్పుడు దొరికాయి. ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలా బాబా ఎన్నో విధాలుగా నాకు సహాయం చేస్తున్నారు. బాబా కరుణ ప్రజలందరిపై ఇలాగే ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
బాబా కృపతో సాధారణ ప్రసవం
నా పేరు విజయ్. మాది నెల్లూరు. బాబా దయతో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఆ తరువాత నాకు వివాహమైంది. కొంతకాలానికి నా భార్య గర్భం ధరించింది. నెలలు నిండాక నా భార్యను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. తనకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడమని డాక్టరుకు చెప్పాము. నా భార్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని తనకు నొప్పులు రావటానికి రెండు రోజులు మందులు ఇచ్చారు. కానీ, నా భార్యకు నొప్పులు రాలేదు. ఆరోజు సాయంత్రం డాక్టర్ వచ్చి, “ఈమెకు నార్మల్ డెలివరీ అయ్యేలా లేదు. అందువల్ల రేపు ఉదయం ఆపరేషన్ చేయాలి” అని చెప్పి వెళ్ళింది. నాకు చాలా బాధవేసింది. రాత్రి 8 గంటల సమయంలో బాబాను తలచుకుంటూ శిరిడీ నుండి తెచ్చుకున్న ఊదీని ఒక చిన్నగ్లాసు నీళ్లలో కలిపి నా భార్యకు త్రాగించి, నేను బాబా స్తవనమంజరి చదువుతూ కూర్చున్నాను. ఆశ్చర్యం! రాత్రి 10 గంటల నుంచి నొప్పులు ప్రారంభమై వేకువఝామున 4.30కి సాధారణ ప్రసవమై నా భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా బాబా లీల. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
Ok sai ram
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం!
ReplyDelete🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷Om sri Sairam🌷🌷🌷
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteBaba Kalyan ki marriage chai.thsndrmeku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl i
ReplyDeleteOm r sainathaya namaha 🙏🙏
ReplyDelete