సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 504వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా వరప్రసాదం మా పాప
  2. ఋతుస్రావ సమస్యను పరిష్కరించిన బాబా

ఈరోజు అనుభవాలలోకి వెళ్లే ముందుగా అందరికోసం ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.

నిన్న సాయిభక్తుడు మధు కామెంట్ సెక్షన్ లో..

"ఓం సాయిరాం. ప్రతిరోజూ నేను అనుభవాలు చదువుతూ నా అనుభవాలను కూడా ఈ బ్లాగ్ లో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఎలా పంచుకోవాలో దయచేసి తెలియజేయగలరు" అని కామెంట్ పెట్టారు. 

నిజానికి బ్లాగులో కామెంట్ సెక్షన్ కిందనే అందరికీ కనిపించేలా అనుభవాలు ఎలా పంచుకోవాలో తెలియజేశాం. కానీ అది అందరి దృష్టిలో పడటం లేదని అర్థం అయ్యింది. అందుకే ఆ వివరాలను ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఇస్తున్నాము.

బాబా మీకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటే మీ అనుభవాలను...

1. వీలయితే తెలుగులో టైపు చేయండి.

2. లేకుంటే ఇంగ్లీషులో అంటే *'sai bandhuvulaku namaskaram'* ఇలా టైపు చేయండి.

3. లేకుంటే స్పష్టంగా పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి పంపండి.

4. తెలుగు వ్రాయడం రాని వారు ఇంగ్లీషులో టైపు చేసి పంపొచ్చు.

అలా సిద్ధం చేసిన మీ అనుభవాలను క్రింద ఇవ్వబడిన మెయిల్ఐడి/వాట్సాప్/టెలిగ్రామ్ నెంబరుకి పంపించండి.

saimaharajsannidhi@gmail.com

+917842156057

మరొక భక్తుడు క్వశ్చన్ & ఆన్సర్ సైట్ గురించి అడిగారు. ఆ సైట్ లింక్ కింద్ ఇస్తున్నాము.


బాబా వరప్రసాదం మా పాప

మహాపారాయణ గ్రూపు 697 లోని సభ్యురాలైన ఒరిస్సాకి చెందిన సాయిభక్తురాలు రాజ్యలక్ష్మి తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! నా పేరు రాజ్యలక్ష్మి. నాపై, నా కుటుంబంపై బాబా కురిపించిన ఆశీస్సులకు సంబంధించిన అనుభవాన్ని నేనీరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు 2009లో వివాహమైంది. 2013 నుండి మేము పిల్లలకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఆ విషయంగా మేము భారతదేశం నలుమూలలా వున్న ఎంతోమంది వైద్యులతోపాటు విదేశాలలోని వైద్యులను కూడా సంప్రదించాము. ఎన్నో పరీక్షలు, శస్త్రచికిత్సలు మొదలైనవి జరిగాయి. ఐ.వి.ఎఫ్, ఐ.యు.ఐ విధానాలను కూడా ప్రయత్నించాము. అసలు ఒకటేమిటి, మాకు సాధ్యమైన ప్రతిదీ ప్రయత్నించి చూశాము. కానీ గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న ప్రతికూల సమాధానమే మాకు అంతటా లభించింది. ఈ సమస్యతో మేము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొన్నాము. చివరికి, 'దైవనిర్ణయం ఇదే కావచ్చు'ననిపించి, అంతా ఆ భగవంతునికే విడిచిపెట్టి మేము మా ప్రయత్నాలను విరమించుకున్నాము. 

రోజులు గడిచిపోయాయి. గత సంవత్సరం జూలైలో నేను మహాపారాయణ గ్రూపులో చేరి బాబా దర్శనం కోసం విజయదశమి రోజు శిరిడీ వెళ్లాను. నిజంగా బాబా అద్భుతమైన దర్శనాన్ని అనుగ్రహించారు. నేను పొందిన అనుభూతిని మాటల్లో వ్యక్తపరచలేను. శిరిడీ నుండి వచ్చిన నెలరోజుల తరువాత నేను గర్భవతినని తెలిసింది. బాబా మాకు ప్రసాదించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎటువంటి మందులూ వాడకుండా నేను గర్భవతినయ్యానంటే అస్సలు నమ్మలేకపోయాను. గత 3 సంవత్సరాలుగా నేను వాడుతున్న ఏకైక ఔషధం బాబా ఊదీయే! అయితే నా భర్త తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడే ఈ శుభవార్త మాకు తెలిసింది. ఈ రెండు విషయాలను ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియక మానసికంగా మేము ఆందోళనచెందాము. అటువంటి స్థితిలో ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా దర్శనమిచ్చి, "చింతించకు! నేను మీతో ఉన్నాను" అని చెప్పారు. దాంతో నా నమ్మకం, విశ్వాసం పెరిగాయి. నేను ఒత్తిడికి గురైనప్పుడల్లా బాబాను అడిగేదాన్ని, వారినుండి నాకు సమాధానం లభించేది. చివరకు మా జీవితాలలో ఎప్పటికీ మరువలేని అద్భుతమైన రోజు వచ్చింది. 2020, జులై 10న నేను కాన్పుకి ఆసుపత్రిలో చేరాను. మరుసటిరోజు జులై 11 ఉదయాన నేను బాబా వరప్రసాదమైన మా పాపకి జన్మనిచ్చాను. మా పాప పూర్తిగా బాబా ఆశీర్వాదమని నా నమ్మకం. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

ఋతుస్రావ సమస్యను పరిష్కరించిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను దాదాపు అన్నిరకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతూ, వాటికై వాడే మందుల మీదే బ్రతుకుతుండేదాన్ని. అయితే ఎప్పుడూ నాకు ఋతుక్రమ సమస్య  రాలేదు. అదొక్కటే అన్ని ఆరోగ్యసమస్యల మధ్య ఒక మంచి విషయం. అయితే నా దురదృష్టం కొద్దీ ఆ సమస్య కూడా గత నెలలో వచ్చింది. 30 రోజులపాటు ఆగకుండా ఋతుస్రావం అవుతూ ఉండేది. ఏ సమస్యైతే లేదని సంతోషించానో ఇప్పుడు దాన్ని కూడా ఎదుర్కోవలసి రావడంతో నేను చాలా ఆందోళనకి గురయ్యాను. ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవడానికి సరిపడా డబ్బులు కూడా నా దగ్గర లేవు. అట్టి స్థితిలో కేవలం బాబా మాత్రమే నాకు నయం చేయగలరని నమ్మి, "బాబా! నా ఈ సమస్యని పరిష్కరించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. బహిష్టు సమయంలో బాబాను తాకరాదని చాలామంది అంటారు. కానీ బాబా అటువంటి నియమాలు తన భక్తులకు విధించలేదు. బాబా మననుంచి స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే ఆశిస్తారు. దానితోపాటు మనం శ్రద్ధను కూడా కలిగి ఉండాలి. ఒక్క వారంలో బాబా నా సమస్యను పరిష్కరిస్తారనే పూర్తి విశ్వాసంతో నేను సచ్చరిత్ర చదివాను. బాబా తమ అనుగ్రహాన్ని నాపై కురిపించారు. బాబా దయవల్ల నా ఋతుస్రావ సమస్య సమసిపోయింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".



6 comments:

  1. నీడ నిచ్చు తరువు నీవుగానుండిన
    సంచరించు బాటసారి నేను
    తాళలేని తప్త తాపత్రయమ్మున
    నిన్నె చేరువాడ నీడకొరకు..
    నన్ను అనుగ్రించుమయ్యా శిరిడి సాయేశా 🙏🌺🙏

    ReplyDelete
  2. Om Sri Sai Ram thaatha 🙏🙏
    BHAVYA sree

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  4. ఓం సాయిరాం,🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo