ఈ భాగంలో అనుభవాలు:
- మా బాబుపై బాబా కురిపించిన అనుగ్రహం
- వైద్యులలో ధన్వంతరి సమర్థ సద్గురు సాయినాథుడు
మా బాబుపై బాబా కురిపించిన అనుగ్రహం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. రెండవసారి ఈ బ్లాగులో నా అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
మా బాబు పుట్టినపుడు వాడి లెఫ్ట్ టెస్టికిల్ కడుపులోనే ఉండిపోయింది. మాములుగా అయితే బిడ్డ కడుపులో ఉన్నపుడే అది క్రిందకు వచ్చేయాలి. అలా రాకపోతే బిడ్డ పుట్టిన మూడవ నెల లోపు దానంతటదే క్రిందకు వచ్చేస్తుంది. కానీ మా బాబుకి అలా రావడానికి కేవలం అయిదు శాతం మాత్రమే అవకాశముందన్నారు డాక్టర్లు. ఒకవేళ టెస్టికిల్ దానంతటదే క్రిందకు రాకపోతే సంవత్సరం లోపు ఆపరేషన్ చెయ్యవలసి వస్తుందన్నారు. మాకు చాలా భయం వేసింది. మేము బాబాని నమ్ముకుని, బాబుకు ఆపరేషన్ అవసరం లేకుండా చేయమని బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ బాబుకి బాబా ఊదీ రాసేవాళ్ళం. బాబా అద్భుతం చేశారు. కొంతకాలానికి బాబుకి ఆపరేషన్ అవసరం లేకుండా టెస్టికిల్ దానంతటదే క్రిందకు వచ్చేసింది. మా బాధనంతా బాబా తీసేశారు. “బాబా! నీకు కోటి కోటి ధన్యవాదాలు తండ్రీ!”
ఈమధ్యనే మా బాబుకి జ్వరం వచ్చింది. మందులు వాడినా జ్వరం తగ్గలేదు. బాబుకి జ్వరం తగ్గించమని బాబాను ఆర్తిగా వేడుకున్నాము. ఆరోజు రాత్రి నిద్రలో బాబు ఎందుకో గట్టిగా ఏడ్చాడు. అప్పటినుండి జ్వరం తగ్గడం ప్రారంభమై త్వరలోనే పూర్తిగా తగ్గిపోయింది. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా! ఎల్లప్పుడూ మాకు తోడునీడగా ఉండు బాబా!”
వైద్యులలో ధన్వంతరి సమర్థ సద్గురు సాయినాథుడు
సాయిభక్తురాలు శ్రీమతి ఇందిర తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు ఇందిర. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ప్రత్యేక ధన్యవాదములు. బాబా తన ప్రతినిధిగా వీరిని ఏర్పాటుచేసి భక్తులకు తనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతున్నారు. “నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!” ఇక నా అనుభవానికి వస్తే…
ఇది ఈ బ్లాగులో నేను పంచుకుంటున్న రెండవ అనుభవం. రెండు సంవత్సరాల క్రితం నా భర్త బైక్ యాక్సిడెంట్ వల్ల ప్రక్కటెముకలు, కాలు ఫ్రాక్చర్ అయి ఆరు నెలల పాటు పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ప్రతి నిమిషం బాబానే నాకు అండగా ఉన్నారు. తర్వాత నా భర్త పూర్తిగా కోలుకున్నారు. కానీ ఈమధ్య ఆంటే యాక్సిడెంట్ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత సరిగ్గా అదే తారీఖున నా భర్త బైక్ మీద నుండి ప్రక్కకి పడిపోయారు. కాలిమీద బైక్ పడి ఆ బరువుకి తన కాలు వాచింది. రెండేళ్ళ తరువాత అదే తారీఖున మళ్ళీ అలా జరగటంతో నాకు చాలా ఆందోళనగా అనిపించింది. కరోనా వల్ల ఈ సమయంలో హాస్పిటల్స్‌లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, కనీసం మందుల షాపుల్లో మందులు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో నాకు వైద్యులలో ధన్వంతరి అయిన సమర్థ సద్గురు సాయినాథుడే దిక్కుగా కనిపించారు. మావారి కాలినొప్పి తగ్గించమని బాబాను ప్రార్థించి, “ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః” అనే మంత్రం జపిస్తూ నాకు తెలిసిన వైద్యం చేశాను. “తెల్లవారేసరికి నా భర్త కాలినొప్పి తగ్గితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు వాగ్దానం చేశాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి తన కాలినొప్పి కొంచెం తగ్గింది. వాపు మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. రెండురోజులకి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా బాబా దయే, ఆ మహనీయుడి ఆశీర్వాదమే! ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
ReplyDelete🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
దత్త స్వరూపా సాయినాథా ధాక్షిన్యభావా సాయినాథా
జ్ఞాన ప్రదాతా సాయినాథా తత్ప్రణమామి సద్గురుదేవ
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
om sai ram nice leelas .i like sai om sai ram
ReplyDeleteJai Sairam jai gurudatta.
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sai Ram thaatha 🙏
ReplyDeleteBhavya sree
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om sai ram 🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete